శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, October 11, 2006

31.EduTanunnadu veede ee baludu - ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు















Raga : BhujamgiNi , Composer :  Nedunuri Krishnamurty
ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మదిదెలియమమ్మ ఏమరులోగాని

పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన విన సంగతాయిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని

వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట

నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది
ఆదిమూల మితడట ఆడికెల చాతలట

కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట

కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట

కలదమ్మ తనకెంత కరునో గాని

eduTanunnaaDu veeDe ee baaluDu
madideliyamamma aemarulOgaani

parama purushuDaTa pasulagaachenaTa
saravuleMchina vina saMgataayidi
hariye taanaTa muddulaMdariki jaesenaTa
yiravaaya namma suddulaeTivOgaani

vaedaala koDayaDaTa vennalu doMgilenaTa
naadaanni vinnavaariki nammikaayidi
aadimoola mitaDaTa aaDikela chaatalaTa
kaadamma yee sudduleTTikatalO gaani

ala brahma taMDriyaTa yaSOdaku biDDaDaTa
koladokariki cheppa kooDunaa yidi
telisi Sree vaeMkaTaadri daevuDai nilichenaTa
kaladamma tanakeMta karunO gaani

To listen :-

EdutanunnaduVeede ee Baludu By Balakrishnaprasad garu
Hosted by eSnips