Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, May 26, 2010

తెలుగు పదానికి జన్మదినం - telugu padaniki janmadinam

Audio link from Annamayya movie
ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించినందుకు వేటూరి వారికి జోహార్లు..


తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము , నందనానందకారకము


పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా

పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగుహారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా


Wednesday, May 19, 2010

700.nityAtmumDai yumDi nityumDai velugomdu - నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు


Audio link : Priya Sisters

ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు


pa : nityAtmu@mDai yumDi nityu@mDai velu@Mgomdu - satyAtmu@mDai yumDi satyamai tAnumDu
pratyakShamai yumDi brahmamai yumDu sam- stutyu@M DItiruvEmkaTAdrivibhu@MDu

cha : EmUrti lOkambulella nEleDunAta@M- DEmUrti brahmAdulella vedakeDunAta@M-
DEmUrti nijamOkShamiyya@M jAleDunAta@M- DEmUrti lOkaikahitu@MDu
yEmUrti nijamUrti yEmUrtiyunu@M gA@mDu - yEmUrti traimUrtu lEkamainayAta@M-
DEmUrti sarwAtu@M DEmUrti paramAtmu@M- DAmUrti tiruvEmkaTAdrivibhu@MDu

cha : yEdEvudEhamuna ninni yunu janminche - nEdEvudEhamuna ninniyunu naNa@Mge mari
yEdEvuvigraham bIsakala mimtayunu - yEdEvunEtrambu linachamdrulu
yEdEvu@M DIjIvulinnimTilO numDu - nEdEvuchaitanya minniTiki nAdhAra-
mEdEvu@M Davyaktu@M DEdEvu@M Dadwamdwum@M- DAdEvu@M DIvEmkaTAdrivibhu@MDu

cha : yEvElpupAdayuga milayunAkASambu - yEvElpupAdakESAmtam banamtambu
yEvElpuniSwAsa mImahAmArutamu - yEvElpunijadAsu lIpuNyulu
yEvElpu sarwESu@M DEvElpu paramESu@M- DEvElpu bhuvanaikahitamanObhAvaku@MDu
yEvElpu kaDusUkShma mEvElpu kaDughanamu - AvElpu tiruvEmkaTAdrivibhu@MDu


Meaning :

Audio :

priya sisters

Sunday, May 16, 2010

699.nE nokkaDa lEkuMDitE nIkRpaku - నే నొక్కడ లేకుండితే నీకృపకు పాత్ర మేది


నే నొక్కడ లేకుండితే నీకృపకు పాత్ర మేది పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు అతి మూఢులలోన నగ్రేసరుడ నేను ప్రతిలేనిఘనగర్వపర్వతమను తతి బంచేంద్రియములధనవంతుడను నేను వెతకి నావంటివాని విడువగ జెల్లునా మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను యిహమున గర్మవహికెక్కితి నేను బహుయోనికూపసంపద దేలేవాడ నేను వహించుక నావంటివాని దేనోపేవా భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడువెంతురు భువి నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు nE nokkaDa lEkuMDitE nIkRpaku pAtra mEdi pUni nAvallanE kIrti boMdEvu nIvu ati mUDhulalOna nagrEsaruDa nEnu pratilEnighanagarvaparvatamanu tati baMchEMdriyamuladhanavaMtuDanu nEnu vetaki nAvaMTivAni viDuvaga jellunA mahilO saMsaarapusAmrAjyamElEvADa nEnu yihamuna garmavahikekkiti nEnu bahuyOnikUpasaMpada dElEvADa nEnu vahiMchuka nAvaMTivAni dEnOpEvA bhAviMchi nAvaMTinIchu baTTi kAchinappuDugA yEvaMka nIkIrti gaDuveMturu bhuvi nAvalla nIku buNyamu nIvallanE bradukudu SrIvEMkaTESuDa yiMta chEre jummI mElu

Friday, May 14, 2010

698.talachichUDa paratatwaMbitaDu - తలచిచూడ పరతత్వంబితడు

Audio link : Priya Sisters
తలచిచూడ పరతత్వంబితడు
వలసినవారికి వరదుడితడు

సిరికి మగడమృతసింధువునకు నల్లుడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
పరగి శివునకు బావ యితడు

అల దేవేంద్రుని యనుజుడితడు
మలసి చంద్రుని మఱదితడు
కులమున నదితికి కొడుకూ నితడు
తలపు సురాసురలతాతయు నితడు

ప్రాణుల కెల్లా బంధుడితడు
వాణికి మామగు వావి యితడు
జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
మాణికపు మన్మథుడితడు


talachichUDa paratatwaMbitaDu
valasinavAriki varaduDitaDu

siriki magaDamRtasiMdhuvunaku nalluDu
sarusa pArwatiki sayidODu
garimela brahmaku@M ganna taMDri yitaDu
paragi Sivunaku bAva yitaDu

ala dEvEMdruni yanujuDitaDu
malasi chaMdruni ma~raditaDu
kulamuna naditiki koDukU nitaDu
talapu surAsuralatAtayu nitaDu

prANula kellA baMdhuDitaDu
vANiki mAmagu vAvi yitaDu
jANa SrIvEMkaTAchala ramaNuDitaDu
mANikapu manmathuDitaDu

Thursday, May 13, 2010

697.jnAnayajnamIgati mOkshasAdhanamu - జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము

ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు || చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి | కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు || చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి | చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు || చ|| తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి | కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి | యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె | యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు || pa|| j~nAnayaj~namIgati mOkshasAdhanamu | nAnaarthamulu ninnE naDape mAguruDu || cha|| alari dEhamanETi yAgaSAlalOna | baluvai yaj~nAnapupaSuvu baMdhiMchi | kalasi vairAgyapukattula gOsikOsi | velayu j~nAnAgnilO vEliche mAguruDu || cha|| mokkuchu vaishNavulanEmunisabha gUDapeTTi | chokkuchu SrIpAdatIrtha sOmapAnamu niMchi | chakkagaa saMkIrtanasAmagAnamu chEsi | yikkuvatO yaj~namu sEyiMchebO mAguruDu || cha|| tadiyyaguru prasaadapu purODaaSamichchi | kodadIra dvayamanukuMDalaMbulu veTTi | yedalO SrIvEMkaTaeSu niTu pratyakshamuchEse | yidivO svarUpadIksha yichchenu maa guruDu ||

Tuesday, May 11, 2010

696.rAnu mIkaDaku O ramaNulAra - రాను మీకడకు ఓ రమణులార



Audio link : Sri Mangalampalli Balamuralikrishna
దాస్య భక్తి కి పరాకాష్ఠ ఈ కీర్తన.. రాను మీకడకు ఓ రమణులార, పూవుఁ బానుపు హరికినేఁ బఱవవలయును నేడు చెలగి దేవుడు నేడు సిరితో నేటికి నో పొలయలుకలవలపులు నటియించి తలపోత విరహవేదనలనున్నాడు ఈ చలిమందు లతనికి చాతవలయు నేడు రమణుడిప్పుడు యిందిరాదేవియెదుటను తమకించి యెవ్వతెనో తలంచెనట కమల కోపింప గాకల నారగింపడు ఈ హిమజల అతనికి యీయవలయును నేడు వెలదిబాసి తిరువేంకటేశ్వరుడు కలికియై కౌగిటఁ గలసెనట తిలకము గరగేటి తిరుమేనిచెమట యీ వెలినుండి పలుమారు విసరవలయు నేడు rAnu mIkaDaku O ramaNulAra, pUvu@M bAnupu harikinE@M ba~ravavalayunu nEDu chelagi dEvuDu nEDu siritO nETiki nO polayalukalavalapulu naTiyiMchi talapOta virahavEdanalanunnADu I chalimaMdu lataniki chAtavalayu nEDu ramaNuDippuDu yiMdirAdEviyeduTanu tamakiMchi yevvatenO talamchenaTa kamala kOpiMpa gAkala nAragiMpaDu I himajala ataniki yIyavalayunu nEDu veladibAsi tiruvEMkaTESwaruDu kalikiyai kaugiTa@M galasenaTa tilakamu garagETi tirumEnichemaTa yI velinuMDi palumAru visaravalayu nEDu

Sunday, May 09, 2010

695.talachina talapulu talakooDe - తలచిన తలపులు దలకూడె

తలచిన తలపులుఁ దలకూడె వెలుపలె లోపలె వెరగికనేలే వలచిన వలపులు వడ్డికి బారీ తలుపుఁదెరవవే తరుణి యిక పిలువక వచ్చెను ప్రియుడు వాకిటికి నిలువుల బిగువులు నీ కిక నేలే ముసి ముసి నగవులు మోవులనుండగ ముసుగిడనేలే ముదిత యిక రసములు గురిసీ రమణుడు నీతో దొసగుల సుద్దులు తుదనికనేలే కరగిన చెమటలు కాగిట నున్నవి నిరతి మరగేలే నెలత యిక యిరవుగ శ్రీ వెంకటేశుడు గూడెను ధరలో గొంటివి తడబాటేలే talachina talapulu@M dalakooDe velupale lOpale veragikanaelae valachina valapulu vaDDiki baaree talupu@Mderavavae taruNi yika piluvaka vachchenu priyuDu vaakiTiki niluvula biguvulu nee kika naelae musi musi nagavulu mOvulanuMDaga musugiDanaelae mudita yika rasamulu gurisee ramaNuDu neetO dosagula suddulu tudanikanaelae karagina chemaTalu kaagiTa nunnavi nirati maragaelae nelata yika yiravuga Sree veMkaTaeSuDu gooDenu dharalO goMTivi taDabaaTaelae

Thursday, May 06, 2010

694.sadAnaMdamu sarwESvarA - సదానందము సర్వేశ్వరా


Audio link : G.Janakiramana(?)
Youtube : Nedunuri Krishnamurthy(Tune) Sung By Malladi Brothers
సదానందము సర్వేశ్వరా
నీ పదారవిందముపై భక్తి

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీ సాకారము
నయమగు శ్రవణానందము వినినను
క్రియగలిగిన నీ కీర్తనము


చెలగి అందరికి జిహ్వానందము
పలుమరుఁ గొను నీ ప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు


ధర పరమానందము నీ దాస్యము
గరిమల శ్రీవేంకటవిభుడా
నరహరి నిత్యానందము నినుఁ దగ -
నరవిరి జేయు సమారాధనము


sadAnaMdamu sarwESvarA
nI padAraviMdamupai bhakti


nayanAnaMdamu narulaku suralaku
jayamagu hari nI sAkAramu
nayamagu SravaNAnaMdamu vininanu
kriyagaligina nI kIrtanamu


chelagi aMdariki jihvAnaMdamu
palumaru@M gonu nI prasAdamu
nalugaDa dEhAnaMdamu budhulaku
balunIpAda praNAmamulu


dhara paramAnaMdamu nI dAsyamu
garimala SrIvEMkaTavibhuDA
narahari nityAnaMdamu ninu@M daga -
naraviri jEyu samArAdhanamu


Malladi Brothers :

Saturday, May 01, 2010

693.rachchalu sEyaka rAvayyA - రచ్చలు సేయక రావయ్యా


రచ్చలు సేయక రావయ్యా యిచ్చ యెఱగ నిది యేలయ్యా జంకెన చూపులు సరసపుమాటలు లంకెలఁబెట్టీ లలితాంగి మంకులవొట్లు మాయల అలుకలు యింకా నీపెతో నేలయ్యా దొంతులయాసలు దోమటిబాసలు సంతము సేసీ జవరాలు పంతపు బిగువులు పాయపుమదములు యెంతకెంత మరి యేలయ్యా చనవులసవిగెలు చాయలసన్నలు పెనవులఁ బెట్టీ ప్రియురాలు యెనసితి శ్రీవేంకటేశ యీపె నిదె యినుమడిపరవశ మేలయ్యా rachchalu sEyaka rAvayyA yichcha ye~raga nidi yElayyA jaMkena chUpulu sarasapumATalu laMkela@MbeTTI lalitAMgi maMkulavoTlu mAyala alukalu yiMkA nIpetO nElayyA doMtulayAsalu dOmaTibAsalu saMtamu sEsI javarAlu paMtapu biguvulu pAyapumadamulu yeMtakeMta mari yElayyA chanavulasavigelu chAyalasannalu penavula@M beTTI priyurAlu yenasiti SrIvEMkaTESa yIpe nide yinumaDiparavaSa mElayyA