Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Nimdastuti. Show all posts
Showing posts with label Nimdastuti. Show all posts

Saturday, April 25, 2020

869. nEmu nIku anyulama nIvu mAlO lEvA - నేము నీకన్యులమా నీవు మాలో లేవా


Tuned & Sung by Sri Sathiraju Venumadhav , in Ragam Hamsanandi

Youtube link
Audio Arvhive link
ఉ. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే
జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ! (poem from dasarathi satakam with similar meaning)

నేము నీకన్యులమా నీవు మాలో లేవా
యీ మేరలనే మమ్ము యేలుకొందు గాక

ధర విభీషణుడు మీతల్లి కడవాడా
నిరతి ఘంటా కర్ణుడు నీ తండ్రివాడా
యిరవై ధృవుడు మీ యిల్లాలి కడవాడా
శరణన్న మాటలోనే సరుగఁగాచితివి

మున్నిటి శబరి నీకు ముమ్మనుమరాలా
మిన్నక ఉద్ధవుడు మీ మేనమామా
పన్నిన వుడుత నీకు పాయరాని చుట్టమా
యెన్నగ వీరల నెల్ల నింతలో మెచ్చితివి

అహల్య నీ కూతురా అకౄరుడు గొడుకా
విహరించ నీకు శ్రీ వేంకటేశుడా
వహి ముత్తాతలా నీచే వరములు గొన్నవారు
మహి నిందులకెపో నీ మఱుగు చొచ్చితిని

nEmu nIkanyulamA nIvu mAlO lEvA
yI mEralanE mammu yElukoMdu gAka

dhara vibhIshaNuDu mItalli kaDavADA
nirati ghaMTA karNuDu nI taMDrivADA
yiravai dhRvuDu mI yillAli kaDavADA
SaraNanna mATalOnE saruga@MgAchitivi

munniTi Sabari nIku mummanumarAlA
minnaka uddhavuDu mI mEnamAmA
pannina vuDuta nIku pAyarAni chuTTamA
yennaga vIrala nella niMtalO mechchitivi

ahalya nI kUturA akRUruDu goDukA
vihariMcha nIku SrI vEMkaTESuDA
vahi muttAtalA nIchE varamulu gonnavAru
mahi niMdulakepO nI ma~rugu chochchitini


Saturday, January 03, 2009

564.sEviMturA yitani( jelagi - సేవింతురా యితని( జెలగి పరులిట్లనే


Audio link : composed by Dr.Pasupati
Archive link :
సేవింతురా యితని( జెలగి పరులిట్లనే
కావించె మమ్ము నెక్కడిదై మితడు

పాలచవి యితడెఱుగు పాలబవళించ గో
పాలుడని నే మితని భజియించగా
పాలుపడి తల్లిచనుబాలు సహితంబు నే
కాలమును( బాపె నెక్కడిదైవ మితడు

పుట్టింప( దానె మఱి పురుషోత్తముడు మంచి
పుట్టు వొసగీననుచు పూజించగా
పట్టుకొని మముదెచ్చి బలిమి( బుత్తువు లెల్ల(
గట్టిపెట్టించె నెక్కడిదైవమితడు

కర్మ కర్తారుడని కడలేని పుణ్యముల
కర్మ ఫలములు దనకు( గైకొలుపగా
కర్మగతి(కలి)( దెచ్చి వేంకటవిభుడు మావుభయ-
కర్మములు( జెరిచె నెక్కడిదైవ మితడు
sEviMturA yitani( jelagi paruliTlanE
kAviMche mammu nekkaDidai mitaDu

pAlachavi yitaDe~rugu pAlabavaLiMcha gO
pAluDani nE mitani bhajiyiMchagA
pAlupaDi tallichanubAlu sahitaMbu nE
kAlamunu( bApe nekkaDidaiva mitaDu

puTTiMpa( dAne ma~ri purushOttamuDu maMchi
puTTu vosagInanuchu pUjiMchagA
paTTukoni mamudechchi balimi( buttuvu lella(
gaTTipeTTiMche nekkaDidaivamitaDu

karma kartAruDani kaDalEni puNyamula
karma phalamulu danaku( gaikolupagA
karmagati(kali)( decchi vEMkaTavibhuDu mAvubhaya-
karmamulu( jeriche nekkaDidaiva mitaDu

Sunday, October 05, 2008

544.sAmAnyamA pUrva saMgrahaMbagu - సామాన్యమా పూర్వ సంగ్రహంబగు



Archive link :

ప సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము
నేమమున బెనగొనియె నేడు నీవనక

చ జగతి బ్రాణులకెల్ల సంసారబంధంబు
తగుల బంధించు దురితంపు గర్మమున
మగుడ మారుకుమారు మగువ నీయురముపై
తెగి కట్టిరెవ్వరో దేవుండ వనక

చ పనిలేని జీవులను భవసాగరంబులో
మునుగ లేవగ జేయు మోహదోషమున
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను
వెనకెవ్వరో మొదలి వేలువనక

చ ఉండనీయక జీవనోపాయమున మమ్ము
కొండలను గొబల దతి గొని త్రిప్పుఫలము
కొండలను నెలకొన్న కోనేటి పతి వనగ
నుండవలసెను నీకు నోపలేవనక

pa sAmAnyamA pUrva saMgrahaMbagu Palamu
nEmamuna benagoniye nEDu nIvanaka
ca jagati brANulakella saMsArabaMdhaMbu
tagula baMdhiMcu duritaMpu garmamuna
maguDa mArukumAru maguva nIyuramupai
tegi kaTTirevvarO dEvuMDa vanaka
ca panilEni jIvulanu BavasAgaraMbulO
munuga lEvaga jEyu mOhadOShamuna
panipUni jaladhilO baMDabeTTiri ninnu
venakevvarO modali vEluvanaka
ca uMDanIyaka jIvanOpAyamuna mammu
koMDalanu gobala dati goni trippuPalamu
koMDalanu nelakonna kOnETi pati vanaga
nuMDavalasenu nIku nOpalEvanaka