Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-475 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, October 31, 2007

330.dEvadEvOttama tE namO-దేవదేవోత్తమ తే నమో


Archive Audio link : Pasupati
ప|| దేవదేవోత్తమ తే నమో నమో |
రావణదమన శ్రీరఘురామ ||

చ|| రవికులాంబుధిసోమ రామలక్ష్మణాగ్రజ
భువి భరత శతృఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన
ధవళాబ్జనయన సీతారమణా ||

చ|| దనుజ సంహారక దశరథ నందన |
జనక భూపాలక జామాత |
వినమిత సుగ్రీవ విభీషణ సమేత |
మునిజన వినుత సుముఖ చరిత్ర ||

చ|| అనిలజ వరద అహల్యశాప మోచన |
సనకాది సేవిత చరణాంబుజ |
ఘనతర వేంకట శ్రీగిరి నివాస |
అనుపమోదార విహార గంభీర ||
pa|| dEvadEvOttama tE namO namO |
rAvaNadamana SrIraGurAma ||

ca|| ravikulAMbudhisOma rAmalakshmaNAgraja
bhuvi bharata SatRghna pUrvaja
savana pAlaka kausalyAnaMda vardhana
dhavaLAbjanayana sItAramaNA ||

ca|| danuja saMhAraka daSaratha naMdana |
janaka BUpAlaka jAmAta |
vinamita sugrIva viBIShaNa samEta |
munijana vinuta sumuKa caritra ||

ca|| anilaja varada ahalyaSApa mOcana |
sanakAdi sEvita caraNAMbuja |
Ganatara vEMkaTa SrIgiri nivAsa |
anupamOdAra vihAra gaMBIra ||

Tuesday, October 30, 2007

329.callanai kAyagadO-చల్లనై కాయగదో చందమామ

One of the best composition in light music.....click for audio
Archive Audio link
ప|| చల్లనై కాయగదో చందమామ | వెల్లిగా తిరి వేంకటేశు నెదుట ||
అప|| మొల్లమిగ నమృతంపు వెల్లిగొలుపుచు లోక- | మెల్ల నిను కొనియాడగా ||

చ|| పొందైన హితులు నాప్తులు రసికులు కవులు |అందముగ నును మాటలాడ నేర్చిన ఘనులు|
చిందులకు నాడేటి సీమంతి మణులు | చెలగి ఇరుగడ కొలువగాను |
వంది మాగధులు కైవారింప తన దివ్య | మందిరో పాంత మార్గమున కోనేటి |
ముందుటను కడు మంద మంద ప్రయాణముల | ఇందిరాపతి మెరయగాను ||

చ|| ఏకాంత సుఖగోష్ఠి నేప్రొద్దు మానవా- | నీకంబు లెడ గలిసి నిలిచి సేవింప గాం- |
తా కదంబములు హస్తముల కంకణ ఝణ- | త్కారములు నిగుడ చామరము లిడగ |
జోకైన మణిగణ స్తోమాంకితంబులై | సొంపుపొందు నాలవట్టములు కరములు దాల్చి |
యేకాంతు లిరువంక నెదిరి కొలువగ సకల | లోకేశ్వరుడు మెరయగాను ||

చ|| బంగారు ప్రతిమలకు వ్రతులైన దివిజ లో- | కాంగనలు ఘన విమానాంగణంబున నుండి |
చెంగలువలును మంచి చేమంతి రేకులును | చెలగి యిరుగడ చల్లగాను |
మంగళాత్మకము లగు మహిత వేదాంత వే- | దాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరు- |
వేంగళేశుండు కడు వేడుకల తోడ తిరు- | వీధులను విహరింపగాను ||

callanai kAyagadO (Raagam: ) (Taalam: )
pa|| callanai kAyagadO caMdamAma | velligA tiri vEMkaTESu neduTa ||
apa|| mollamiga namRutaMpu velligolupucu lOka- | mella ninu koniyADagA ||

ca|| poMdaina hitulu nAptulu rasikulu kavulu | aMdamuga nunu mATalADa nErcina Ganulu |
ciMdulaku nADETi sImaMti maNulu | celagi irugaDa koluvagAnu |
vaMdi mAgadhulu kaivAriMpa tana divya | maMdirO pAMta mArgamuna kOnETi |
muMduTanu kaDu maMda maMda prayANamula | iMdirApati merayagAnu ||

ca|| EkAMta suKagOShThi nEproddu mAnavA- | nIkaMbu leDa galisi nilici sEviMpa gAM- |
tA kadaMbamulu hastamula kaMkaNa JaNa- | tkAramulu niguDa cAmaramu liDaga |
jOkaina maNigaNa stOmAMkitaMbulai | soMpupoMdu nAlavaTTamulu karamulu dAlci |
yEkAMtu liruvaMka nediri koluvaga sakala | lOkESvaruDu merayagAnu ||

ca|| baMgAru pratimalaku vratulaina divija lO- | kAMganalu Gana vimAnAMgaNaMbuna nuMDi |
ceMgaluvalunu maMci cEmaMti rEkulunu | celagi yirugaDa callagAnu |
maMgaLAtmakamu lagu mahita vEdAMta vE- | dAMga vidyalaku priyamaMdi cEkonucu tiru- |
vEMgaLESuMDu kaDu vEDukala tODa tiru- | vIdhulanu vihariMpagAnu ||Monday, October 29, 2007

328.nityAnaMda dharaNIdhara -నిత్యానంద ధరణీధర ధరారమణ

Archive Audio link : G Balakrishnaprasad
ప|| నిత్యానంద ధరణీధర ధరారమణ | కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష ||
చ|| అరవిందనాభ జగదాధార భవదూర | పురుషోత్తమ నమో భువనేశ |
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార- | కరణ కమలాధీశ కరిరాజవరద ||
చ|| భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద | సాగరనిజావాస సకలాధిప |
నాగారిగమన నానావర్ణనిజదేహ | భాగీరథీజనక పరమ పరమాత్మ ||
చ|| పావన పరాత్పర శుభప్రద పరాతీత | కైవల్యకాంత శౄంగారరమణ |
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో | దేవతారాధ్య సుస్థిరకౄపాభరణ ||
pa|| nityAnaMda dharaNIdhara dharAramaNa | kAtyAyanIstOtra kAma kamalAkSha ||
ca|| araviMdanABa jagadAdhAra BavadUra | puruShOttama namO BuvanESa |
karuNAsamagra rAkShasalOka saMhAra- | karaNa kamalAdhISa karirAjavarada ||
ca|| BOgIMdraSayana paripUrNa pUrNAnaMda | sAgaranijAvAsa sakalAdhipa |
nAgArigamana nAnAvarNanijadEha | BAgIrathIjanaka parama paramAtma ||
ca|| pAvana parAtpara SuBaprada parAtIta | kaivalyakAMta SRuMgAraramaNa |
SrIvEMkaTESa dAkShiNyaguNanidhi namO | dEvatArAdhya susthirakRupABaraNa ||

327.nIdAsula BaMgamulu nIvujUturA- నీదాసుల భంగములు నీవుజూతురా

Archive Audio link : 
ప|| నీదాసుల భంగములు నీవుజూతురా |
ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ||
చ|| పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు |
బేలలై సురలు మొరవెట్టిన యట్టు |
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు |
ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద ||
చ|| ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు |
బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు |
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి |
ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద ||
చ|| ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు |
పెనగి గజము మొరవెట్టిన యట్టు |
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి |
విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద ||


pa|| nIdAsula BaMgamulu nIvujUturA |
Edani jUcEvu nIku neccariMcavalenA ||

ca|| pAla samudramu mIda pavvaLiMccinaTTi nIku |
bElalai suralu moraveTTina yaTTu |

vELatO mAmanuvulu vinnaviMcitimi nIku |
Ela niddiriMcEvu mammiTTE rakShiMcarAda ||

ca|| dvArakA nagaramulO taga nettamADE nIku | birAna draupadi moraveTTina yaTTu |
GOrapu rAjasaBala kuMdi vinnaviMcitimi | ErIti parAku nIku niMka rakShiMcarAda ||
ca|| enasi vaikuMThamulO niMdira gUDunna nIku | penagi gajamu moraveTTina yaTTu |
canuvutO mAkOrike sAre vinnaviMcitimi | vini SrIvEMkaTESuMDa vEga rakShiMcarAda ||
click here to listen to the classical version : Hyderabad Brothers

Sunday, October 28, 2007

326.satyaBAma sarasapu nagavu -సత్యభామ సరసపు నగవు

ఐవి. సీతాపతిగారి వ్యాఖ్యానం menaing provided by telugubhatki.com
Archive Audio link : Asha Bhosle
ప|| సత్యభామ సరసపు నగవు | నిత్యము హరి మదినే నెలవు ||
చ|| రుకుమిణి దేవికి రూపయవ్వనికి | సకల విభవముల సౌఖ్యతలు |
చికురాంబరమున జెదరిన యలకలు | వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||
చ|| తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై | నడపులమురిపెపు నగుమోము |
తడయక వారిధి దచ్చిన హరికిని | బడలికవాపను పరమంబాయ ||
చ|| అనుదినమునును నీ యలుమేలుమంగ | కనుగవ జంకెన గర్వములు |
దినదినంబులును తిరువేంకటపతి | చనువుల సొబగుల సంపదలాయ ||

pa|| satyaBAma sarasapu nagavu | nityamu hari madinE nelavu ||
ca|| rukumiNi dEviki rUpayavvaniki | sakala viBavamula sauKyatalu |
cikurAMbaramuna jedarina yalakalu | vikacAbja muKamu veyi vElAye ||
ca|| toDavula SrIsati tolimerugulamai | naDapulamuripepu nagumOmu |
taDayaka vAridhi daccina harikini | baDalikavApanu paramaMbAya ||
ca|| anudinamununu nI yalumElumaMga | kanugava jaMkena garvamulu |
dinadinaMbulunu tiruvEMkaTapati | canuvula sobagula saMpadalAya ||

Thursday, October 25, 2007

325.nAkunjeppare valapu-నాకు(జెప్పరె వలపు


అన్నమయ్య, ఈ విరహ గీతం లో జంటపదాలని ఎంత అద్భుతాంగా వాడారో చూడండి. "ఎగ్గో సిగ్గో" "పొగయో వగయో".... అద్భుతం...!
ఈ కీర్తనని శ్రీరంగం గోపాలరత్నంగారి గాత్రంలొ వినండి

Archive Audio link నాకు(జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవ(గరాదు నుయ్యో కొండో

పొలతి మరునికి వెరవ పులియో యెలువో
వులుకుతుమ్మిదమోత వురుమో మెరుమో
తిలకింప చందనము తేలో పామో
యెలమి కోవిలకూత యేదోపోదో(రేకు : యేటోపోటో )

పొదలిన చలిగాలి పొగయో వగయో
వదలిన కన్నీరు వాగో వంతో
వుదరమున పన్నీరు వుడుకో మిడుకో
యెదుట తలవంచుకొనుట ఎగ్గో సిగ్గో

అసమశరునిపై పరపుటదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదోపాదో(రేకు : ఆటోపాటో)
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో


nAku(jeppare valapu nalupO telupO
nUki pOva(garAdu nuyyO koMDO

polati maruniki verava puliyO yeluvO
vulukutummidamOta vurumO merumO
tilakiMpa chaMdanamu tElO pAmO
yelami kOvilakUta yEdOpOdO

podalina chaligAli pogayO vagayO
vadalina kannIru vAgO vaMtO
vudaramuna pannIru vuDukO miDukO
yeduTa talavaMchukonuTa eggO siggO

asamaSarunipai parapuTadanO padanO
pasagalavAnimOvi paMchadArO tEnO
asamagati vAnirAka AdOpAdO
rasiku vEMkaTESu poMdu rAjyamO lakshmO


Explanation by Kalaprapoorna Dr. Balantrapu Rajanikanta Rao garu


324.javvAdi mettinadi tana- జవ్వాది మెత్తినది తన


Archive Audio link : Mangalampalli Balamuralikrishna
ప|| జవ్వాది మెత్తినది తన | జవ్వనమే జన్నె వట్టినది ||
చ|| ముద్దుల మాటలది చెక్కు- | టద్దముల కాంతి నలరినది |
గద్దరి చూపులది తన | వొద్ది చెలియమీద నొరగున్నది ||
చ|| పుత్తడి బోలినది తన | చిత్తము నీ సొమ్ము చేసినది |
గుత్తపు గుబ్బలది అల | చిత్తజును లెక్కసేయనిది ||
చ|| ఎమ్మెలు యెరుగనిది తన | కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది |
కమ్ముకొనగా వెంకటరాయా నీ | నీకమ్మని కౌగిట గలసున్నది ||


pa|| javvAdi mettinadi tana | javvanamE janne vaTTinadi ||
ca|| muddula mATaladi cekku- | Taddamula kAMti nalarinadi |
gaddari cUpuladi tana | voddi celiyamIda noragunnadi ||
ca|| puttaDi bOlinadi tana | cittamu nI sommu cEsinadi |
guttapu gubbaladi ala | cittajunu lekkasEyanidi ||
ca|| emmelu yeruganidi tana | kemmOvi jirunavvu geralunnadi |
kammukonagA veMkaTarAyA nI | nIkammani kaugiTa galasunnadi ||

Tuesday, October 23, 2007

323.sItASOkaviGAtaka- సీతాశోకవిఘాతక


Archive Audio link :  Nukala China Satyanarayana
ప|| సీతాశోకవిఘాతక వో-|
పాతాళలంకాపతివిభాళా ||

చ|| హనుమంతరాయ అంజనీతనయ వో- |
వనధిలంఘనగాత్ర వాయుపుత్రా |
యినకులాధిపనిజహిత జగన్నుత- |
వనజోదరసేవక సత్వధనికా


చ||ప్రళయాంతికరూప బలదీప రవిఫల- |
గిళనప్రతాప సుగ్రీవప్రియా
కుళికదానవసంకులవిదారణ |
భళిభళి జగత్పతిబలుబంటా |చ||పంకజాసనుదివ్యపదవైభవ వో- |
లంకిణీప్రాణవిలంఘన |
వేంకటేశ్వరుసేవావీర మహాధీర |
కింకరరాయ సుఖీభవా ||
pa|| sItASOkaviGAtaka vO-| pAtALalaMkApativiBALA ||
ca|| hanumamtarAya aMjanItanaya vO- | vanadhilaMGanagAtra vAyuputrA |
yinakulAdhipanijahita jagannuta- | vanajOdarasEvaka satvadhanikA
ca||praLayAMtikarUpa baladIpa raviPala- | giLanapratApa sugrIvapriyA
kuLikadAnavasaMkulavidAraNa | BaLiBaLi jagatpatibalubaMTA |
ca||paMkajAsanudivyapadavaiBava vO- | laMkiNIprANavilaMGana |
vEMkaTESvarusEvAvIra mahAdhIra | kiMkararAya suKIBavA ||

Click here to listen to this kriti - Explanation of the kriti, raga and kriti rendition by Sri.Nukala China Satyanarayana

322.alamaelumaMgaa hariyaMtaraMgaa-అలమేలుమంగా హరియంతరంగా

Lyrics taken from "annamAcArya vAggEya varadAyini" :
But caranaM 2 and 3 in the lyrics are a bit different from what Smt. Janaki sings in the audio link given below
Archive Audio link
Audio link : MS Subbalakshmi
ప : అలమేలుమంగా హరియంతరంగా
కలితనాట్య రంగా కరుణాపాంగా

చ : అలినీలవేణి అంబుజపాణి
వెలయగ జగదేక విభునిరాణి

చ : స్మి(శి)తచంద్రవదనా సింగార సదనా
చతుర దాడిమ బీజచయ సనా(రదనా)

చ : హితవైన శ్రీవేంకటేశుడిదే ననుగూడె(డునిన్నిదేకూడె)
ప(త)తి తలపోతల సమ(తన)కూడె కూడె


pa : alamaelumaMgaa hariyaMtaraMgaa
kalitanaaTya raMgaa karuNaapaaMgaa

cha : alineelavaeNi aMbujapaaNi
velayaga jagadaeka vibhuniraaNi

cha : smi(Si)tachaMdravadanaa siMgaara sadanaa
chatura daaDima beejachaya sanaa(radanaa)

cha : hitavaina SreevaeMkaTaeSuDidae nanugooDe(DuninnidaekooDe)
pa(ta)ti talapOtala sama(tana)kooDe kooDe


Wednesday, October 17, 2007

321.vADevO prahlAdavaraduDu-వాడెవో ప్రహ్లాదవరదుడు


Archive Audio link :  G Balakrishnaprasad
ప|| వాడెవో ప్రహ్లాదవరదుడు | వాడెవో భక్తవత్సలుడు ||
చ|| కోరదవడలతో కోటిసూర్యతేజముతో | హారకేయూర భూషణాంబరాలతో |
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను | మేరమీరిన సిరుల మేడతో నున్నాడు ||
చ|| తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ | చల్లని గందముల వాసనలతోడ |
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా | వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు ||
చ|| సంకుచక్రములతోడ జంట పూదండలతోడ | పొంకపు నానావిధ భోగములతో |
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు | అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు ||


pa|| vADevO prahlAdavaraduDu | vADevO BaktavatsaluDu ||
ca|| kOradavaDalatO kOTisUryatEjamutO | hArakEyUra BUShaNAMbarAlatO |
cEri brahmAdu lellAnu sEvalu sEyagAnu | mEramIrina sirula mEDatO nunnADu ||
ca|| tellanimEnitODa tIgenavvulatODa | callani gaMdamula vAsanalatODa |
pellugA nAradAdulu pErukoni nutiMcagA | vellaviri koluvai vEDuka nunnADu ||
ca|| saMkucakramulatODa jaMTa pUdaMDalatODa | poMkapu nAnAvidha BOgamulatO |
aMkapu SrIvEMkaTAdri nahObalamunaMdu | aMkela nEpoddU nelavai tAnunnADu ||

Tuesday, October 16, 2007

320kaDavarAdu hari ghanamAya-కడవరాదు హరి ఘనమాయ

book:3, kriti:496
Ragam : mukhari , composer : G.Balakrishnaprasad
Archive Audio linkకడవరాదు హరి ఘనమాయ | తెగి
విడువగరాదు వేసరరాదు.

చూపుల యెదిటికి సోద్యంబైనది
పాపపుణ్యములప్రపంచము
తీపులు పుట్టించు దినదినరుచులై
పూపలసంసారభోగములు

మనసులోపలికి మర్మంబైనది
జననమరణములశరీరము
వెనవెనక తిరుగు వెడ లంపటమై
కనకపుటాసలకర్మములు

తగుమోక్షమునకు( దాపయైనదిదె
నగి హరి తలచిన నాలుకిది
వెగటు దీరె శ్రీవేంకటపతియై
యగపడె నిపుడు పురాకృతము


kaDavarAdu hari ghanamAya | tegi
viDuvagarAdu vEsararAdu.

chUpula yediTiki sOdyMbainadi
pApapuNyamulaprapaMcamu
tIpulu puTTiMchu dinadinaruchulai
pUpalasaMsArabhOgamulu

manasulOpaliki marmaMbainadi
jananamaraNamulaSarIramu
venavenaka tirugu veDa laMpaTamai
kanakapuTAsalakarmamulu

tagumOkshamunaku( dApayainadide
nagi hari talachina nAlukidi
vegaTu dIre SrIvEMkaTapatiyai
yagapaDe nipuDu purAkRtamu

Monday, October 15, 2007

319.koluvuDI Bakti koMDalakOnETi- కొలువుడీ భక్తి కొండలకోనేట


Ragam : kalyani , composer : G.Balakrishnaprasad
ప|| కొలువుడీ భక్తి కొండలకోనేటి- | నిలయుని శ్రీనిధి యైనవాని ||
చ|| ఆదిదేవుని నభవుని సామ- | వేదనాద వినోదుని నెర- |
వాది జితప్రియు నిర్మలతత్త్వ- | వాదులజీవనమైన వాని ||
చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ- | భావాతీత స్వభావుని |
శ్రీవేంకటగిరి దేవుడైన పర- | దేవుని భూదేవతత్పరుని ||


pa|| koluvuDI Bakti koMDalakOnETi- | nilayuni SrInidhi yainavAni ||
ca|| AdidEvuni naBavuni sAma- | vEdanAda vinOduni nera- |
vAdi jitapriyu nirmalatattva- | vAdulajIvanamaina vAni ||
ca|| dEvadEvuDaina divyuni sarva- | BAvAtIta svaBAvuni |
SrIvEMkaTagiri dEvuDaina para- | dEvuni BUdEvatatparuni ||

Saturday, October 13, 2007

318.ade laMkasAdhimche -అదె లంకసాధించె నవనిభారము

book:4, kriti:514 , Ragam:Kiravani
Archive Audio link : G Balakrishnaprasadఅదె లంకసాధించె నవనిభారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితడు ||

రవివంశ తిలకుడు రాముడితడు
భువిపుట్టె దశరథ పుత్రుడితడు |
భు(భ)వుడెంచె తారక బ్రహ్మమీతడు
పవనజుకిచ్చినాడు బ్రహ్మపట్టమితడు ||

బలువుడు సీతాపతి యితడు
తలకొన్న వాలిమర్దనుడీతడు |
విలసిల్లె ఏకంగ వీరుడితడు
చలమరి కోదండ దీక్షాగురుడితడు ||

శరణాగత వజ్ర పంజరుడితడు
సరిలేని అసురభంజకుడీతడు |
వరదుడు శ్రీవేంకటేశ్వరుడితడు
అరయ విజయ నగరాధీశుడితడు ||ade laMkasAdhimche navanibhAramu diMche
viditamai pratApamu velayiMce nitaDu ||

ravivaMSa tilakuDu rAmuDitaDu
bhuvipuTTe daSaratha putruDitaDu |
bhu(bha)vuDeMche tAraka brahmamItaDu
pavanajukichchinADu brahmapaTTamitaDu ||

baluvuDu sItApati yitaDu
talakonna vAlimardanuDItaDu |
vilasille EkaMga vIruDitaDu
chalamari kOdaMDa dIkshAguruDitaDu ||

SaraNAgata vajra paMjaruDitaDu
sarilEni asurabhaMjakuDItaDu |
varaduDu SrIvEMkaTESwaruDitaDu
araya vijaya nagarAdhISuDitaDu ||

317.alamElumaMganu nEnaitE-అలమేలుమంగను నేనైతే

book:18, kriti:31 : 
Archive Audio link 
అలమేలుమంగను నేనైతేనయితి(గాక
నిలుచుండి నన్ను(జూచి నీకేల లో(గను

చేరి విన్నవించవే సిగ్గువడ నీకేటికి
చీరుమూరుగా వలచినదానవు
వేరులే కప్పటనుండి వేళగాచుకుందానవు
నేరుపుతో నన్నుజూచి నీవేల లోగేవు

గట్టిగాను నవ్వవే కడుదాచనేటికి
తొట్టినట్టితమకముతోడిదానవు
నట్టున నందుకు(గానే కోరి లాచి(నాచి)వుందానవు
నెట్టన నేనుండ(గాను నీవేల లో(గేవు

యెనసి కౌగిలించవే( యేకర(గ నీకేటికి
పనివడి యట్టే యాసపడదానవు
మునుపె నన్ను( గూడె నిమ్ముల శ్రీవేంకటేశుడు
నిను నాతడే కూడీ నీవేల లో(గేవు

alamElumaMganu nEnaitEnayiti(gAka
niluchuMDi nannu(jUchi nIkEla lO(ganu

chEri vinnaviMchavE sigguvaDa nIkETiki
chIrumUrugA valachinadAnavu
vErulE kappaTanuMDi vELagAchukuMdAnavu
nEruputO nannujUchi nIvEla lOgEvu

gaTTigAnu navvavE kaDudAchanETiki
toTTinaTTitamakamutODidAnavu
naTTuna naMduku(gAnE kOri lAchi(nAchi)vuMdAnavu
neTTana nEnuMDa(gAnu nIvEla lO(gEvu

yenasi kaugiliMchavE( yEkara(ga nIkETiki
panivaDi yaTTE yAsapaDadAnavu
munupe nannu( gUDe nimmula SrIvEMkaTESuDu
ninu nAtaDE kUDI nIvEla lO(gEvu

Thursday, October 11, 2007

316.bhakti koladi vaaDE-భక్తి కొలది వాడే పరమాత్ముడు

Archive Audio link : Mangalampalli Balamuralikrishna   , NC Sridevi
భక్తి కొలది వాడే పరమాత్ముడు
భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు

పట్టిన వారిచే బిడ్డా పరమాత్ముడు
బట్ట బయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
ఎట్ట ఎదుటనే ఉన్నాడిదె పరమాత్ముడు

పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు
బచ్చన వాసిన రూపు పరమాత్ముడు
బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముడు
యిచ్చ కొలది వాడువో యీ పరమాత్ముడూ

పలుకులలోని తేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు


bhakti koladi vaaDE paramaatmuDu
bhukti mukti taanE ichchu bhuvi paramaatmuDu

paTTina vaarichE biDDA paramaatmuDu
baTTa bayaTi dhanamu paramaatmuDu
paTTapagaTi velugu paramaatmuDu
eTTa eduTanE unnaaDide paramaatmuDu

pachchi paalalOni venna paramaatmuDu
bachchana vaasina rUpu paramaatmuDu
bachchu chEti voragallu paramaatmuDu
yichcha koladi vaaDuvO yI paramaatmuDU

palukulalOni tETa paramaatmuDu
faliyinchunindariki paramaatmuDu
balimi SrIvEnkaTaadri paramaatmuDu
yelami jeevula praaNamee paramaatmuDu

Audio download link , sung by NC Sridevi

Wednesday, October 10, 2007

315.chUDarevvaru dInisOdyaMbu- చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి

Archive Audio link : Sattiraju Venumadhav & Nithyasri Mahadevan
ప|| చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి | చూడజూడగ గాని సుఖమెరుగ రాదు ||
చ|| ఎడతెగనిమమత వేయగరానిపెను మోపు | కడలేని ఆశ చీకటి దవ్వుకొనుట |
నిడివైనకనుచూపు నీడనుండిన ఎండ | వడి చెడని తమకంబు వట్టితాపంబు ||
చ|| బుద్ధి మానిన చింత పోని యూరికి దెరువు | పొద్దు వోవని వలపు పొట్ట పొంకంబు |
ఎద్దుబట్టిన శివంబెరుక మాలిన ప్రియము- | లొద్దిక విహారంబు లుబ్బు గవణంబు ||
చ|| తీపు లోపలి తీపు తిరు వేంకటేశ్వరుని | చూపు పొడగనని చూపులో చూపు |
ఆపదలువాయు నెయ్యపు దలపులీ తలపు | రూపైన రుచిలోని రుచి వివేకంబు ||


pa|| cUDarevvaru dInisOdyaMbu parikiMci | cUDajUDaga gAni suKameruga rAdu ||
ca|| eDateganimamata vEyagarAnipenu mOpu | kaDalEni ASa cIkaTi davvukonuTa |
niDivainakanucUpu nIDanuMDina eMDa | vaDi ceDani tamakaMbu vaTTitApaMbu ||
ca|| buddhi mAnina ciMta pOni yUriki deruvu | poddu vOvani valapu poTTa poMkaMbu |
eddubaTTina SivaMberuka mAlina priyamu- | loddika vihAraMbu lubbu gavaNaMbu ||
ca|| tIpu lOpali tIpu tiru vEMkaTESvaruni | cUpu poDaganani cUpulO cUpu |
ApadaluvAyu neyyapu dalapulI talapu | rUpaina rucilOni ruci vivEkaMbu ||

Monday, October 08, 2007

314.kOrikalu konasaage-కోరికలు కొనసాగె గోవిందరాజు


Ragam : lalita , composer : G.Balakrishnaprasad
కోరికలు కొనసాగె గోవిందరాజా
మేరమీరి ఇట్లానే మెరసితివా ||

బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ
యీలీలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా
ఆలకించి విని పాట లవధరించితివా ||

కొంచక మధురలోన గుబ్జయింట నీలాగుల
మంచాలపై బవళించి మరిగితివా
చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన
ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా ||

పదియారువేల ఇంతుల పాలిండ్లు తలగడలై
పొదల నిటువలెనే భోగించితివా
యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన
నిదిరించక శ్రీభూమి నీళల్ గూడితివా ||


kOrikalu konasaage gOviMdaraaju
maerameera iTlaanae merasitivaa ||

baaluDavai raepallelO baaludaagaevaeLa
yeeleelanae pavaLiMchi yiravaitivaa
gOlavai toTTelalOna gollata loochipaaDagaa
aalakiMchi vini paaTa lavadhariMchitivaa ||

koMchaka madhuralOna gubjayiMTa neelaagula
maMchaalapai bavaLiMchi marigitivaa
chaMchula dvaarakalOna satyabhaama toDameeda
muMchi yeereeti noragi muchchaTalaaDitivaa ||

padiyaaruvaeliMtula paaliMDlu talagaDalai
podala niTuvalenae bhOgiMchitivaa
yeduTa Sree vaeMkaTaeSa iTTe tirupatilOna
nidiriMchaka Sreebhoomi neeLal^ gooDitivaa ||

Tuesday, October 02, 2007

313.valachi vachchiti nEnu -వలచి వచ్చితి నేను

Archive Audio link
వలచి వచ్చితి నేను వానికి గాను
నెలవై మీ గొల్లవాడనే తానుండునంట ||

చెందమ్మి కన్నులవాడు చేతిపిల్లగోవివాడు
ఇందువచ్చె కంటిరా ఏమిరే అమ్మా
మందల పసువుల వాడు మకరాంకములవాడు
ఎందు నున్నాడు చెప్పరే ఏలదాచేరమ్మ ||

నెమలిపించెమువాడు నీలమేఘకాంతివాడు
రమణుడాతడు మొక్కేణు రమ్మనరమ్మా
జమళి చేతులవాడు సంకుచక్రములవాడు
అమర మీపాల చిక్కునట చూపరమ్మా ||

పచ్చపైడిదట్టివాడు పక్షివాహనపువాడు
ఇచ్చినాడు నాకుంగరము ఇదివో అమ్మా
చెచ్చెర కోనేటివాడు శ్రీవేంకటేశ్వరుడు
వచ్చినన్ను కూడినాడు వాడు ఓయమ్మా ||

valachi vachchiti nEnu vAniki gAnu
nelavai mI gollavADanE tAnuMDunaMTa ||

cheMdammi kannulavADu chEtipillagOvivADu
iMduvachche kaMTirA EmirE ammA
maMdala pasuvula vADu makarAMkamulavADu
eMdu nunnADu chepparE EladAchEramma ||

nemalipiMchemuvADu nIlamEghakAMtivADu
ramaNuDAtaDu mokkENu rammanarammA
jamaLi chEtulavADu saMkuchakramulavADu
amara mIpAla chikkunaTa chUparammA ||

pachchapaiDidaTTivADu pakshivAhanapuvADu
ichchinADu nAkuMgaramu idivO ammA
chechchera kOnETivADu SrIvEMkaTESwaruDu
vachchinannu kUDinADu vADu OyammA ||