Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [G_Annamayya]. Show all posts
Showing posts with label [G_Annamayya]. Show all posts

Wednesday, March 25, 2020

865. gaMdhamu pUsaevEle kammani mEna - గంధము పూసేవేలే కమ్మని మేన

Audio Archive link: Smt P Suseela
youtube link: Smt P Suseela


గంధము పూసేవేలే కమ్మని మేన యీ –
గంధము నీ మేనితావికంటె నెక్కుడా


అద్దము చూచేవేలే అప్పటప్పటికిని
అద్దము నీ మోముకంటే నపురూపమా
ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –
గద్దరి కన్నులకంటె కమలము ఘనమా


బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
బంగారు  నీ దనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా


సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీ కొప్పుసరి వచ్చీనా
యివలఁ జవులు నీకునేలే వేంకటపతి –
సవరని కెమ్మోవి చవికంటేనా

gaMdhamu poosaevaelae kammani maena yee –
gaMdhamu nee maenitaavikaMTe nekkuDaa


addamu choochaevaelae appaTappaTikini
addamu nee mOmukaMTae napuroopamaa
oddika taamaravirivottaevu kannula nee –
gaddari kannulakaMTe kamalamu ghanamaa


baMgaaru veTTaevaelae paDa@Mti nee meyiniMDaa
baMgaaru  nee danukaaMti prativachcheenaa
uMgaraalae@MTikinae voDikapuvaeLLa
veMgalimaNulu nee vaeligOra@M bOlunaa


savara mae@MTikinae jaDiyu nee nerulaku
savaramu nee koppusari vachcheenaa
yivala@M javulu neekunaelae vaeMkaTapati –
savarani kemmOvi chavikaMTaenaa

Friday, July 18, 2014

824. ghanuDAtaDA yitaDu kalaSApuramukADa - ఘనుడాతడా యితడు కలశాపురముకాడ


Archive Audio link
YouTube link :
ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
హనుమంతుడితడా అంజనాతనయుడు

పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె

అడరి దానవుల హనుమంతుడు
బెడిదంపుఁ బెనుతోక బిరబిరఁ దిప్పి మొత్తె
అడగ మాల్యవంతు హనుమంతుడు

దాకాల మోకాల దాటించె కొందరి

ఆకాశవీధి నుండి హనుమంతుడు
పైకొని భుజములఁ బడఁదాకెఁ గొందరి
ఆకడ జలధిలోన హనుమంతుడు

అరుపుల నూరుపుల అందరిఁ బారగఁదోలె

ఔరా సంజీవికొండ హనుమంతుడు
మేరతో శ్రీవేంకటాద్రిమీది దేవుని బంటు
ఆరితేరిన బిరుదు హనుమంతుడు


ghanuDAtaDA yitaDu kalaSApuramukADa
hanumaMtuDitaDA aMjanAtanayuDu

peDachEta lOchEta berasi koMdari@M goTTe
aDari dAnavula hanumaMtuDu
beDidaMpu@M benutOka birabira@M dippi motte
aDaga mAlyavaMtu hanumaMtuDu

dAkAla mOkAla dATiMche koMdari
AkASavIdhi nuMDi hanumaMtuDu
paikoni bhujamula@M baDa@MdAke@M goMdari
AkaDa jaladhilOna hanumaMtuDu

arupula nUrupula aMdari@M bAraga@MdOle
aurA saMjIvikoMDa hanumaMtuDu
mEratO SrIvEMkaTAdrimIdi dEvuni baMTu
AritErina birudu hanumaMtuDu

Wednesday, December 19, 2012

787.గోనెలె కొత్తలు కోడెలెప్పటివి - gOnele kottalu kODeleppaTivi

Audio link : P Ranganath

గోనెలె కొత్తలు కోడెలెప్పటివి
నానినలోహము నయమయ్యీనా

మున్నిటిజగమే మున్నిటిలోకమే
యెన్నగ బుట్టుగులివె వేరు
నన్ను నెవ్వ రున్నతి బోధించిన
నిన్న నేటనే నేనెఱిగేనా

చిత్తము నాటిదే చింతలు నాటివే
యిత్తల భోగములివె వేరు 
సత్తగు శాస్త్రము చాయ చూపినా 
కొత్తగ నే నిక గుణినయ్యేనా 

జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడే 
యీవల భావనలివే వేరు 
ధావతి కర్మము తప్పఁ దీసినా 
దైవము గావక తలగీనా 
     
gOnele kottalu kODeleppaTivi
naaninalOhamu nayamayyInaa

munniTijagamE munniTilOkamE
yennaga buTTugulive vEru
nannu nevva runnati bOdhimchina
ninna nETanE nEne~rigEnaa

chittamu naaTidE chimtalu naaTivE
yittala bhOgamulive vEru 
sattagu Saastramu chaaya chUpinaa 
kottaga nE nika guNinayyEnaa 

jeevaantaraatmuDu SrI vEnkaTESuDE 
yIvala bhaavanalivE vEru 
dhaavati karmamu tappa@M deesinaa 
daivamu gaavaka talageenaa 
     



Wednesday, March 16, 2011

741.gOvindA hari gOvindA gOvindA bhaja gOvindA - గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా

గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
అనుచు లోకములెల్ల అదజయవెట్టేరు
నిను కొలిచితి కావవే నీరజాక్షుడా

అదివో కోనేటి లోన అదివో సర్వతీర్థములు
అదివో పడిమేడల హరి నగరు
పొదిలి పరుషలెల్ల పొదిగి సేవించేరు
ఇందివో వరములిచ్చే ఇందిరా నాథుడు

అదివో వేదఘోషము అదివో సురలామూక
అదివో విశ్వరూపము అద్భుతమందే
గుదిగొని పుణ్యములు కోట్ల సంఖ్యలు చేరే
ఇదివో దయతలచే ఈశ్వరేశ్వరుడు
అనుచు లోకములెల్ల అదజయవెట్టేరు
నిను కొలిచితి కావవే నీరజాక్షుడా

అదివో శ్రీవేంకటేశుడు అక్కున అలమేల్మంగ
అదివో నిత్యసూరులు ఆలువారులు
నిదుల శేషాచలము నిక్కి పైపొడచూపే
ఇదివో కొలువై వున్నాడు హృదయాంతరాత్ముడు 


gOvindA hari gOvindA gOvindA bhaja gOvindA 
anucu lOkamulella adajayaveTTEru 
ninu koliciti kAvavE nIrajAkshuDA 

adivO kOnETi lOna adivO sarvatIrthamulu 
adivO paDimEDala hari nagaru 
podili parushalella podigi sEvimcEru 
indivO varamuliccE indirA nAthuDu 


adivO vEdaghOshamu adivO suralAmUka 
adivO viSWarUpamu adbhutamandE 
gudigoni puNyamulu kOTla sankhyalu cErE 
idivO dayatalacE ISwarESwaruDu 
anucu lOkamulella adajayaveTTEru 
ninu koliciti kAvavE nIrajAkshuDA 

adivO SrIvEnkaTESuDu akkuna alamElmanga 
adivO nityasUrulu AluvArulu 
nidula SEshAcalamu nikki paipoDacUpE 
idivO koluvai vunnADu hRdayAntarAtmuDu
youtube Video : Priya Sisters

Tuesday, November 23, 2010

722.gurrAla gaTTanitEru - గుఱ్ఱాలఁ గట్టనితేరు


Audio link : Sri S.Venumadhav, from Album, AnnamayyaPadamandakini, To buy this album with 108 kirtanas in 108 ragas, mail to : <seetaramasarma@gmail.com>, Mahidhara SitaramaSarma garu, sujanaranjani గుఱ్ఱాలఁ గట్టనితేరు కొంకకెందైనాఁబారీ విఱ్ఱవీగుచుఁ దీసీని వేడుకతో జీవుడు సరి పిఱుదే రెండుజంటబండికండ్లు సరవితోఁబాదాలు చాపునొగలు గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు దొరయై దేహరథము తోలీబో జీవుడు పంచమహాభూతములు పంచవన్నె కోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేద్రియరథము పఱపీబో జీవుడు పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్నపానాలు దొబ్బుతెడ్లు యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ కాపాడి నరరథము గడపీబో జీవుడు gu~r~rAla@M gaTTanitEru koMkakeMdainA@MbArI vi~r~ravIguchu@M dIsIni vEDukatO jIvuDu sari pi~rudE reMDujaMTabaMDikaMDlu saravitO@MbAdAlu chApunogalu garima@MjUpulu reMDu gaTTina paggamulu dorayai dEharathamu tOlIbO jIvuDu paMchamahAbhUtamulu paMchavanne kOkalu paMchala chEtulu reMDu baluTekkelu miMchaina SirasE mIdanunna Sikharamu paMchEdriyarathamu pa~rapIbO jIvuDu pApapuNyamulu reMDu pakkanunna chIlalu tOpulayannapAnAlu dobbuteDlu yEpuna SrIvEMkaTESu Dekki vIdhula nEgaga kApADi nararathamu gaDapIbO jIvuDu

Saturday, August 30, 2008

526.golletala niMtasEsI gOviMduDU - గొల్లెతల నింతసేసీ గోవిందుడూ



Audio Download link , tuned and sung by Chakrapani 
Archive link :
గొల్లెతల నింతసేసీ గోవిందుడూ
కొల్లకాడు రేపల్లె గోవిందుడు

పలుకుల భ్రమయించె భావముల గరగించె
కొలని కరత నవ్వె గోవిందుడు
యెలయించి యప్పటి మా యింటిలోనే పవ్వళించె
కొలదిమీరినవాడు గోవిందుడు

వూరక పువ్వుల వేసె నొకటొకటేసేసె
కూరిమి దప్పక చూచె గోవిందుడు
చేరి మావారుండ వారు చెప్పరాదు తనదూరు
కోరి యశోద నీబిడ్డ గోవిందుడు

సమ్మతించ జేయి వేసె చన్నులతోనే రాసె
కుమ్మరించె వలపులు గోవిందుడు
దొమ్మిసేసి మమ్ముగూడె దొరవలె నదె వాడె
కొమ్మరో శ్రీవేంకటాద్రి గోవిందుడు

golletala niMtasEsI gOviMduDU
kollakADu rEpalle gOviMduDu

palukula bhramayiMche bhAvamula garagiMche
kolani karata navve gOviMduDu
yelayiMchi yappaTi mA yiMTilOnE pavvaLiMche
koladimIrinavADu gOviMduDu

vUraka puvvula vEse nokaTokaTEsEse
kUrimi dappaka chUche gOviMduDu
chEri mAvAruMDa vAru chepparAdu tanadUru
kOri yaSOda nIbiDDa gOviMduDu

sammatiMcha jEyi vEse channulatOnE rAse
kummariMche valapulu gOviMduDu
dommisEsi mammugUDe doravale nade vADe
kommarO SrIvEMkaTAdri gOviMduDu



Tuesday, August 05, 2008

519.garuDa dhwajambekke kamalAkshu - గరుడ ధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి



Audio link : Dwaram Lakshmi : Ragam Kalyani
Archive link :

గరుడ ధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చె పైపై సేవించను

పాడిరి సో
బాన నదె భారతియ గిరుజయు
ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరగ శ్రీవిభుని పెండ్లికిని

కురిసె పువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభి మోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమై మించిన దేదదేవుని పెండ్లికిని

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల
పోసిరదె తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగ తాను
సేసలు వెట్టిన యట్టి సింగారపు పెండ్లికి


garuDa dhwajambekke kamalAkshu peMDliki
parusha ladivO vachche paipai sEviMchanu

pADiri sObAna nade bhAratiya girujayu
ADiri raMbhAdulaina achcharalella
kUDiri dEvatalella guMpulai SrIvEMkaTAdri
vEDukalu mIraga SrIvibhuni peMDlikini

kurise puvvulavAna kuppalai yeMdu chUchina
morase dEvaduMdubhi mOtalellanu
berase saMpadalella peMTalai SrIvEMkaTAdri
tiramai miMchina dEdadEvuni peMDlikini

vEsiri kAnukalella vEvElu kopperala
pOsirade talabAlu puNyasatulu
Asala SrIvEMkaTESuDalamElumaMga tAnu
sEsalu veTTina yaTTi siMgArapu peMDliki

Friday, March 28, 2008

449.gOviMdA mElkonavayyA - గోవిందా మేల్కొనవయ్యా

Click here to listen to this kriti

గోవిందా మేల్కొనవయ్యా
కావించి భోగము కడమా నీకు


కమలజ చల్లని కాగిట తగిలి
సమరతి పాయగ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపగ
విమలపు శయనము విడువగలేవు

భూసతి తోడుత పొందులు మరిగి - వేసర విదె నీ వేడుకలావాసవ ముఖ్యులు వాకిట నుండగ - పాసివుండ నని పవళించేవు
నీళామనసిజ లీలలు తగిలి -
నాలితోడ మానగలేవువేళాయెను శ్రీవేంకటనాథుడ - పాలించి దాసుల బ్రతికించగను
-
gOviMdA mElkonavayyA
kAviMchi bhOgamu kaDamA nIku

kamalaja challani kAgiTa tagili
samarati pAyaga jAlavU
kamalabhavAdulu kaDu nutiyiMpaga
vimalapu Sayanamu viDuvagalEvu

bhUsati tODuta poMdulu marigi
vEsara vide nI vEDukalA
vAsava mukhyulu vAkiTa nuMDaga
pAsivuMDa nani pavaLiMchEvu

nILAmanasija lIlalu tagili
nAlitODa mAnagalEvu
vELAyenu SrIvEMkaTanAthuDa
pAliMchi dAsula bratikiMchaganu

Tuesday, March 18, 2008

435.gOviMda naMda naMdana - గోవింద నంద నందన గోపాలకృష్ణ

Click here to listen to this kirtana
గోవింద నంద నందన గోపాలకృష్ణ నీ
భావము మాకు జిక్కె గోపాలకృష్ణ

కొంగువట్టె వదేమోయి గోపాలకృష్ణ మా
పంగెన కోవుదువా గోపాలకృష్ణ
దొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ
బంగారు కాశతోది గోపాలకృష్ణ

కొమ్మలచీర లంటిన గోపాలకృష్ణ
పమ్మి నిన్ను తిట్టము గోపాలకృష్ణ
కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ
బమ్మెర పోకిందుల గోపాలకృష్ణ

కొసరకు మంత నీవు గోపాలకృష్ణ (నీ)
పస నే నెరగనా గోపాలకృష్ణ
పొసగ శ్రీవేంకటాద్రి బొందితి నన్ను
పసి మెక్కె మొగము గోపాలకృష్ణ


gOviMda naMda naMdana gOpAlakRshNa nI
bhAvamu mAku jikke gOpAlakRshNa

koMguvaTTe vadEmOyi gOpAlakRshNa mA
paMgena kOvuduvA gOpAlakRshNa
doMgatanAla navvEvu gOpAlakRshNa
baMgAru kASatOdi gOpAlakRshNa

kommalachIra laMTina gOpAlakRshNa
pammi ninnu tiTTamu gOpAlakRshNa
kummariMchE vEla siggu gOpAlakRshNa
bammera pOkiMdula gOpAlakRshNa

kosaraku maMta nIvu gOpAlakRshNa (nI)
pasa nE neraganA gOpAlakRshNa
posaga SrIvEMkaTAdri boMditi nannu
pasi mekke mogamu gOpAlakRshNa

Saturday, January 19, 2008

396.gOviMda gOviMdayani koluvarE - గోవింద గోవిందయని కొలువరే

Audio link : sung by Priya Sis, in Brindavani ragam
గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు
.......గోవింద గోవిందా ......

పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు
.........గోవింద గోవిందా ......

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు
..........గోవింద గోవిందా ......


gOviMda gOviMdayani koluvarE
gOviMdAyani koluvarE

hariyachyutAyani pADarE
purushOttamAyani pogaDarE
paramapurushAyani palukarE
sirivarayanuchunu chelagarE janulu

gOviMda gOviMdA ......

pAMDavavaradA ani pADarE
aMDajavAhanu koniyADarE
koMDalarAyaninE kOrarE
daMDitO mAdhavuninE talacharO janulu

gOviMda gOviMdA ......

dEvuDu SrIvibhuDani teliyarE
SObhalayanaMtuni chUDarE
SrIvEMkaTanAthuni chErarE
pAvanamaiyepuDunu batukarE janulu

gOviMda gOviMdA ......

(Please let me know if they are any mistakes in the lyrics)

Monday, December 10, 2007

367.GOra vidAraNa nArasiMha - ఘోర విదారణ నారసింహ

Click here to listen to this kriti , sung by Balakrishnaprasad, in ragamalika
ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||
చ|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడిపొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||
చ|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||
చ|| గుటగుట రవములు కుత్తిక గులుకుచు | గిటగిట బండ్లు గీటుచును |
తటతట బెదవులు దవడల వణకగ | ఇటువలె నీవపుడెట్లుండితివో ||
చ|| గోళ్ళ మెరుగుల కొంకుల పెదపెద | వేళ్ళ దిక్కులు వెదుకుచును |
నీళ్ళ తీగలు విగుడగ నోరను- | చ్చిళ్ళు గమ్మగ నెట్లుండితివో ||
చ|| హిరణ్యకశిపుని నేపడచి భయం- | కర రూపముతో గడుమెరసి |
తిరు వేంకట గిరి దేవుడ నీవిక | యిరవు కొన్న నాడెట్లుండితివో ||


pa|| GOra vidAraNa nArasiMhanI | nI rUpamutO neTluMDitivO ||
ca|| uDikeDi kOpapuTUrpula goMDalu | poDipoDiyai naBamuna kegaya |
beDidapu ravamuna piDugulu dorugaga | yeDaneDa nIvapuTeTluMDitivO ||
ca|| kAlAnalamulu gakkuna yana | jvAlala nippulu callucunu |
PAlAkShamutO brahmANDa kOTla | kElikavai nEveTuluMDitivO ||
ca|| guTaguTa ravamulu kuttika gulukucu | giTagiTa baMDlu gITucunu |
taTataTa bedavulu davaDala vaNakaga | iTuvale nIvapuDeTluMDitivO ||
ca|| gOLLa merugula koMkula pedapeda | vELLa dikkulu vedukucunu |
nILLa tIgalu viguDaga nOranu- | cciLLu gammaga neTluMDitivO ||
ca|| hiraNyakaSipuni nEpaDaci BayaM- | kara rUpamutO gaDumerasi |
tiru vEMkaTa giri dEvuDa nIvika | yiravu konna nADeTluMDitivO ||

Wednesday, August 15, 2007

291.gaDDapAra miMgitE -గడ్డపార మింగితే నాకలి దీరీనా


Audio link :Shobharaju
Archive link :
ప|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక ||

చ|| చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి | వంచుకొనేమన్న నవి వసమయ్యీనా |
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు | పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక ||

చ|| మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి | యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా ||
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు | బంటుజేసి ఆసలనే పారదోసుగాక ||

చ|| పట్టరాని విషములపాము దెచ్చి తలకింద | బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా |
వెట్టసంసారమిది వేంకటేశు గొలువని- | వట్టిమనుజుల పెడవాడ బెట్టుగాక ||


pa|| gaDDapAra miMgitE nAkali dIrInA yI- | voDDinaBavamu dannuvoDa kammugAka ||

ca|| ciMcuka minnulabArE ciMkalanu baMDigaTTi | vaMcukonEmanna navi vasamayyInA |
yeMcarAni yiMdriyamu levvariki nEla cikku | poMci poMci valapula boMDabeTTugAka ||

ca|| maMTamaMDEyaggi decci masipAta mUTagaTTi | yiMTilOpala dAcukonna nitavayyInA ||
daMTamamakAra miTTE tannunEla sAganiccu | baMTujEsi AsalanE pAradOsugAka ||

ca|| paTTarAni viShamulapAmu decci talakiMda | beTTukonnA nadi maMdapili vuMDInA |
veTTasaMsAramidi vEMkaTESu goluvani- | vaTTimanujula peDavADa beTTugAka ||

Friday, May 11, 2007

211.garuDa gamana-గరుడ గమన గరుడధ్వజ


Audio link :RajKumar
Audio link :PriyaSisters
Archive link :
ప|| గరుడ గమన గరుడధ్వజ | నరహరి నమోనమో నమో ||
చ|| కమలాపతి కమలనాభా | కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల | నమోనమో హరి నమో నమో ||
చ|| జలధి బంధన జలధిశయన | జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర | హలధర నమో హరి నమో ||
చ|| ఘనదివ్యరూప ఘనమహిమాంక | ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం | నమో నమోహరి నమో నమో ||


pa|| garuDa gamana garuDadhvaja | narahari namOnamO namO ||
ca|| kamalApati kamalanABA | kamalaja janmakAraNika |
kamalanayana kamalAptakula | namOnamO hari namO namO ||
ca|| jaladhi baMdhana jaladhiSayana | jalanidhi madhya jaMtukala |
jaladhijAmAta jaladhigaMBIra | haladhara namO hari namO ||
ca|| GanadivyarUpa GanamahimAMka | GanaGanA GanakAya varNa |
anaGa SrIvEMkaTAdhipatEhaM | namO namOhari namO namO ||
 

Wednesday, March 21, 2007

158.gOViMdAdi nmOchChAraNa-గోవిందాది న్మోచ్ఛారణ



Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Tuned by Balakrishnaprasad in mukhari
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము
సత్యము సత్యము సకలసురలలో
నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల
అత్యంతము శరణనరో యితని
చాటెడి చాటెడి సకలవేదములు
పాటించినహరి పరమమని
కూటస్ఠు(డితడు గోపవధూపతి
కోటికి యీతని గొలువరో జనులు
నిలుచున్నా(డిదె నే(డును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుం(డీతదు
కలడు గలడితని(గని మనరో

in english:

gOViMdAdi nAmOchChAraNa kollalu dorakenu manakipuDu
AvalanIvala nOra(gummaluga nADuda mItani pADudamu

satyamu satyamu sakalasuralalO
nityuDu SrIhari nirmaluDu
pratyakshamidE prANulalOpala
atyaMtamu SaraNanarO yitani

chATeDi chATeDi sakalavEdamulu
pATiMchinahari paramamani
kUTasThu(DitaDu gOpavadhUpati
kOTiki yItani goluvarO janulu

niluchunnA(Dide nE(Dunu neduTanu
kaligina SrIvEMkaTavibhuDu
valasinavAriki varaduM(DItadu
kalaDu galaDitani(gani manarO

Sunday, February 25, 2007

136.garuDAdri vEdAdri - గరుడాద్రి వేదాద్రి


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :

ప|| గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె | సిరులొసగీ చూడరో చింతామణి ఈపె ||
చ|| పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె | లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె |
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె | ఈలీలా లోకములేలే ఇందిర ఈపె ||
చ|| ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె | మనసిజుగనిన రమాసతి ఈపె |
అనిశము పాయని మహాహరిప్రియ ఈపె | ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె ||
చ|| రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె | మచ్చికగల అలమేల్మంగ ఈపె |
ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు | నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె ||

in english:
pa|| garuDAdri vEdAdri kalimi Ipe | sirulosagI cUDarO ciMtAmaNi Ipe ||
ca|| pAlajaladhipuTTina padmAlaya Ipe | lAlita SrInArasiMha lakShmi Ipe |
mElimi lOkamAtayai miMcina maguva Ipe | IlIlA lOkamulElE iMdira Ipe ||
ca|| GanasaMpadalosagu kamalAkAMta Ipe | manasijuganina ramAsati Ipe |
aniSamu pAyani mahAharipriya Ipe | dhanadhAnyarUpapu SrItaruNi Ipe ||
ca|| raccala velasinaTTi ramAvanita Ipe | maccikagala alamElmaMga Ipe |
iccaTa vEMkaTAdri nI ahObalamunaMdu | niccalU tAvukonina nidhAnamu Ipe ||

135.Gummani yeDi Sruti - ఘుమ్మని యెడి శ్రుతి



Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Ragam : purvikalyani , adi talam , composer : Nedunuri Krishnamurty

ప|| ఘుమ్మని యెడి శ్రుతి గూడగాను | కమ్మని నేతుల కాగగచెలగె ||
చ|| నీలవర్ణుడని నీరజాక్షుడని | బాలుని నతివలు పాడేరో |
పాలుపిదుకుచును బానల కాగుల | సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగి ||
చ|| మంధరధరుడని మాధవుడని గో | విందుని పాడేరు వెలదులిదే |
నందవ్రజమునను నలుగడనావుల | మందల పేయల మంచి రసముల ||
చ|| వేంకట పతియని వేదనిలయుడని | పంకజనాభుని పాడేరో |
అంకుల చేతను అలరు రవంబుల | బింకపు మాటల బౄందావనమున ||


in english:
pa|| Gummani yeDi Sruti gUDagAnu | kammani nEtula kAgagacelage ||
ca|| nIlavarNuDani nIrajAkShuDani | bAluni nativalu pADErO |
pAlupidukucunu bAnala kAgula | sOli perugu traccucu celarEgi ||
ca|| maMdharadharuDani mAdhavuDani gO | viMduni pADEru veladulidE |
naMdavrajamunanu nalugaDanAvula | maMdala pEyala maMci rasamula ||
ca|| vEMkaTa patiyani vEdanilayuDani | paMkajanABuni pADErO |
aMkula cEtanu alaru ravaMbula | biMkapu mATala bRuMdAvanamuna ||


Thursday, February 15, 2007

122.gAlinE pOya galakAlamu - గాలినే పోయ గలకాలము


Audio link : Shobharaju
Archive link :
ప గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు
చ అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము
ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు
చ కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము
తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు
చ శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము
తిరువేంకటగిరి దేవుడైనహరి దరిచేరా గొంతయు బొద్దులేదు


In English:
~~~~~~~~~~~
pa gAlinE pOya galakAlamu tAlimiki goMtayu boddulEdu
ca aDusu coranE paTTe naTuniTu gALLu guDugukonanE paTTe galakAlamu
oDaliki jIvuni koDayaDainahari daDavagA goMtayu boddulEdu
ca kalaci ciMdanE paTTe gaDavaga niMcaga baTTe kaluShadEhapubAdha galakAlamu
talapOsi tanapAli daivamaina hari dalacagA goMtayu boddulEdu
ca Siramu muDuvabaTTe cikkudiyyaga baTTe garimala gapaTAla galakAlamu
tiruvEMkaTagiri dEvuDainahari daricErA goMtayu boddulEdu

Monday, December 25, 2006

109.gatulanni khilamaina kaliyugamaMdunu- గతులన్ని ఖిలమైన కలియుగమందును



గతులన్ని ఖిలమైన కలియుగమందును

గతి ఈతడే చూపె ఘన గురుదైవము


ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి

మీతని వల్లనే కంటి మీ తిరుమణి

ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము

ఈతడే రామానుజులు ఇహపర దైవము


వెలయించె నీతడేకా వేదపు రహస్యములు

చలిమి నీతడే చూపె శరణాగతి

నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము

మలసి రామానుజులు మాటలాడే దైవము


నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు

దయతో మోక్షము చూపె తగనీతడు

నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను

దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి


in English:

gatulanni khilamaina kaliyugamaMdunu

kati iitaDE chuupe ghana gurudaivamu


iitani karuNanEkaa ilavaishNavula maiti

miitani vallanE kaMTi mii tirumaNi

iitaDE upadESamichchenu ashTAkshari maMtramu

iitaDE raamaanujulu ihapara daivamu


velayiMche niitaDEkaa vEdapu rahasyamulu

chalimi niitadE chuupe Saranaagati

nilipinaaDiitaDE kaa nijamudraa dhaaraNamu

malasi raamaanujulu maaTalADE daivamu


niyamamulu iitaDEkaa nilipe prapannulaku

dayatO mOkShamu chUpe taganiitaDu

nayamai SriiVEMkaTESu nagamekke vaakiTanu

dayachuuchi mammuniTTE tallidaMDri daivamu

Sunday, November 26, 2006

87.Govinda Shrita Gokula Brunda -


గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద

జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ
గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ

జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడ తురంగా కారోత్తుంగా శరధి భంగా ఫణిశయనాంగా
కరుణాపాంగా కమల సంగా వర శ్రీ వేంకట గిరిపతి రంగా

gOviMdaaSrita gOkula bRMdaa paavana jayajaya paramaanaMda jagadabhiraama sahasranaama suguNadhaama saMstutanaama gaganaSyaama ghanaripu bheema agaNita raghuvaMSaaMbudhi sOma jananuta charaNaa SaraNyu SaraNaa danuja haraNa lalita svaraNaa anagha charaNaayata bhoobharaNaa dinakara sannibha divyaabharaNaa garuDa turaMgaa kaarOttuMgaa Saradhi bhaMgaa phaNiSayanaaMgaa karuNaapaaMgaa kamala saMgaa vara Sree vaeMkaTa giripati raMgaa

Saturday, October 28, 2006

51.Guruterigina Donga - గుఱుతెఱిగిన దొంగ కూగూగు



There is a particular variety of song in folk literature which ends with the word "koogoogu". in Kannada language Koogu means calling somebody. Koogoogu is a compound word which means, when we call a person, he tries to hide himself, tries to slip away."Do buchi" is another word which is also used to mean almost the same thing.
Annamayya composed one song in this category describing the butter thief and the one who stole the hearts and clothes of the cowherdesses while they were taking bath in the river.
(from book: Flowers At His Feet)

Audio link : Balakrishnaprasad
Archive link :
గుఱుతెఱిగిన దొంగ కూగూగు

వీడెగుఱిలోనె దాగీనీ కూగూగు

నెలతల దోచీనీ నీళ్ళాడగానే
కొలని దరిని దొంగ కూగూగు
బలువైన వుట్ల పాలారగించీనీ
కొలది మీఱిన దొంగ కూగూగు

చల్లలమ్మఁగ చనుకట్టు దొడకీని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు

తావుకొన్న దొంగ దగిలి పట్టుఁడిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుఁడో యేమో
కోవుదుడగు దొంగ కూగూగు 

Click here for meaning in telugu

Guruthu: Sign
Erigina: Knowing
Donga:thief
Kugugu: Koogoogu is a compound word which means, when we call a person, he tries to hide himself, tries to slip away."Do buchi" is another word which is also used to mean almost the same thing.(from the prev post)
veede:he is
gudi lona:in the temple
dhaagenu:has hidden

So the meaning is:
the poet is saying that he knows the thief who has hidden inside the temple

nelatala docheni neelladagane
kolani darini donga kuguugu
palumaru vutla paalaraginchi
koladi meerina donga gugugu

Nelathalu:Ladies
Dochenu:has stolen
Nelladagaane: when they are bathing
Kaolani:lake
dharini:near
kugugu:[As sravan told] Dobuchi
palumaaru: many times
paalu:milk
aaraginchi: consume
koladhi:measure
meerina:has crossed
dhonga:thief
kugugu

Meaning:He is the one who has stolen the clothes of gopikas when they are bathing.This thief has stolen the milk lot many times...

chalallamaga chanukottu dadikini
golletalanu donga kuugugu
illillu tappaka indari paalinlu
kollaaladina donga kugugu

challalu: butter milk
ammaga:when they are selling
chanukottu: pamita(donno in english,sb can help)
dhodakini:caught hold of
golle:gopika
thalanu:head
donga:thief
illillu: evry house
thappaka: without leaving
indari:these many people
paala+indlu:probably house where they store theit mailk and other milk products
kollalaadina donga:one who has stolen

Meaning:
he has stolen the buttermilk from gopikas who were carrying the buttermilk pots on their head.He has stolen from butter from each and evry one's storage house.