Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label raga:kApi. Show all posts
Showing posts with label raga:kApi. Show all posts

Saturday, August 20, 2022

914. mA iMTiki rAvOyi mAdhavA - మా ఇంటికి రావోయి మాధవా

 Tuned and sung by Sri Parupalli Ranganath

మా ఇంటికి రావోయి మాధవా మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా౹ మత్తు చల్లేవు వలపు మాధవా మచ్చికలెల్ల జేసితివి మాధవ మచ్చెము నీపై నదే మాధవా ఇంక మచ్చరపు చూపులేల మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మరుగేల ఇక నీకు మాధవ మరి నాకు దక్కితివి మాధవ మరచేవా నీ చేతలు మాధవ మాటు మరతుమంటేమనేవు మాధవ౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ మట్టులేని శ్రీవేంకట మాధవ కట్టు మట్టుతో మము కూడితి మాధవ మట్టేవు మా కాళ్ళు పట్టి మాధవా మా మట్టె లియ్యంగదవోయి మాధవా౹౹ మా ఇంటికి రావోయి మాధవ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ ౹౹


maa iMTiki raavOyi maadhavaa maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhavaa౹ mattu challaevu valapu maadhavaa machchikalella jaesitivi maadhava machchemu neepai nadae maadhavaa iMka machcharapu choopulaela maadhava౹౹ maa iMTiki raavOyi maadhavaa nee maayalella kaMTimide maadhavaa nee maayalella kaMTimide maadhava marugaela ika neeku maadhava mari naaku dakkitivi maadhava marachaevaa nee chaetalu maadhava maaTu maratumaMTaemanaevu maadhava౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava maTTulaeni SreevaeMkaTa maadhava kaTTu maTTutO mamu kooDiti maadhava maTTaevu maa kaaLLu paTTi maadhavaa maa maTTe liyyaMgadavOyi maadhavaa౹౹ maa iMTiki raavOyi maadhava maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava nee maayalella kaMTimide maadhava ౹౹

Monday, March 28, 2011

742.rammanavE mAni rachanalu - రమ్మనవే మాని రచనలు

Audio link : Ravu Balasaraswati
రమ్మనవే మాని రచనలు
నెమ్మదిఁ గూడిన నేడే రేపు

నల్లని మేనికేలే నడురేయి తన
తెల్లని కన్నులకేలే తెల్లవాఱను
కల్లజంపులుసేసి కాకల తా(నే)
బల్లిదుండై తే పగలేరేయి

సిగ్గుల మోముకేలే చిరునవ్వు తన
నిగ్గుల చూపులకేలే నెరసులు
దగ్గఱి యింకా నేలే తమకము తా
వెగ్గలము వలచిన వెలియే లోను

తావులమేనికేలే తాపము తన
కావులకన్నుల కేలే కసరులు
శ్రీవేంకటపతి చెలువుండిట్లే
కావలె నంటే కడయే నడుము

rammanavE mAni rachanalu
nemmadi@M gUDina nEDE rEpu


nallani mEnikElE naDurEyi tana
tellani kannulakElE tellavA~ranu
kallajaMpulusEsi kAkala tA(nE)
balliduMDai tE pagalErEyi

siggula mOmukElE chirunavvu tana
niggula chUpulakElE nerasulu
dagga~ri yiMkA nElE tamakamu tA
veggalamu valachina veliyE lOnu

tAvulamEnikElE tApamu tana
kAvulakannula kElE kasarulu
SrIvEMkaTapati cheluvuMDiTlE
kAvale naMTE kaDayE naDumu

Thursday, December 31, 2009

664.evvarivADAgAnu yEmaMduniMduku - ఎవ్వరివాడాగాను యేమందునిందుకు

Tune and sung by Sri Srirangam Gopalaratnam
ఎవ్వరివాడాగాను యేమందునిందుకు నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు కుదువవెట్టితి నే గురి గానక వెదకి కామునికి విషయములకు నే అదివో నావయసెల్ల నాహివెట్టితిని ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా evvarivADAgAnu yEmaMduniMduku navvuchu nAlOnihari nannugAvavE kOpularAjulanella kolichi konnALLu nEnu chUpuDu@MbUTa veTTiti sogisi nEnu yEpuna saMsAramuna idigAka kammaTAnu dApuga torlu@MbUTa tagiliMchukoMTini modala karmamulaku mOsapOyi yI braduku kuduvaveTTiti nE guri gAnaka vedaki kAmuniki vishayamulaku nE adivO nAvayasella nAhiveTTitini ippuDE SrIvEMkaTESa yIDErchi nAmanasu kappina guruDu nIku krayamichchenu voppiMchiriMdaru baluvuDu chEpaTTenanuchu appulellabAsi nI sommaitinEnayyA

Monday, August 04, 2008

518. sEviMchuDI mrokkuDI SrIpati - సేవించుడీ మ్రొక్కుడీ శ్రీపతి యితడు



Audio link : Dwaram Thyagaraju : Ragam Kapi
Archive link :
సేవించుడీ మ్రొక్కుడీ శ్రీపతి యితడు
భావించుడీ మదిలోస పట్టుడీ యీరూపు

అదివో గంగ పుట్టినిల్లు అహల్యా శాపవిమోచనము
యెదుట నీతని పాదములవె వున్నవి
సదరాన నూర్వశికి జన్మభూమి భూకాంతకు
కుదురై కూచుండే నెలవు కోమలంపు (దొడలు

అలరగా గమలమును అందునే పితామహుని
కలిగించిన నాభిబిలమదివో
అలమేలుమంగకు నటు కౌస్తుభమునకు
నెలవై సొమ్ములచేత నిండుకొన్న వురమూ

వరము లిచ్చే హస్తము వరుస కటి హస్తము
అరుదయిన శంఖచక్ర హస్తాలవిగో
సరి మకర పత్రాలు శశిసూర్యనేత్రములు
శిరసుపై కిరీట మదే శ్రీవేంకటపతికి


sEviMchuDI mrokkuDI SrIpati yitaDu
bhAviMchuDI madilOsa paTTuDI yIrUpu

adivO gaMga puTTinillu ahalyA SApavimOchanamu
yeduTa nItani pAdamulave vunnavi
sadarAna nUrvaSiki janmabhUmi bhUkAMtaku
kudurai kUchuMDE nelavu kOmalaMpu (doDalu

alaragA gamalamunu aMdunE pitAmahuni
kaligiMchina nAbhibilamadivO
alamElumaMgaku naTu kaustubhamunaku
nelavai sommulachEta niMDukonna vuramU

varamu lichchE hastamu varusa kaTi hastamu
arudayina SaMkhachakra hastAlavigO
sari makara patrAlu SaSisUryanEtramulu
Sirasupai kirITa madE SrIvEMkaTapatiki



Monday, March 31, 2008

450.chepparAdI yiMti sirulu - చెప్పరాదీ యింతి సిరులు


click here to listen to this kirtnana sung by Balakrishnaprasad , Raga : KApi , composer : G.Balakrishnaprasad 
చెప్పరాదీ యింతి సిరులు - దీని
వొప్పులిన్నియు జూడ వొరపులో గాని

ముదిత జఘనముమీది మొలనూలి గంటలవి
కదలు రవమెట్లుండె కంటిరే చెలులు
మదనుడుండెడి హేమమందిరము దిరిగిరా
గదిసి మ్రోసెడి పారిఘంటలో గాని

కొమ్మపయ్యెద లోని కుచములరుచి వెలికి
చిమ్ముటది యెట్లుండె చెప్పరే చెలులు
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి
కమ్ముకొని చెంగావి కప్పిరో గాని

నెలత కంఠమునందు నీలమణిహారములు
అలరుటెట్లుండు కొనియాడరే చెలులు
ఆ లలితాంగి ప్రాణావల్లభుడు వేంకట విభుడు
నెలకొన్న కౌగిటనె నిలిచెనో గాని


chepparAdI yiMti sirulu - dIni
voppulinniyu jUDa vorapulO gAni

mudita jaghanamumIdi molanUli gaMTalavi
kadalu ravameTluMDe kaMTirE chelulu
madanuDuMDeDi hEmamaMdiramu dirigirA
gadisi mrOseDi pArighaMTalO gAni

kommapayyeda lOni kuchamularuchi veliki
chimmuTadi yeTluMDe chepparE chelulu
yimmaina marudhanamulella rAsulu vOsi
kammukoni cheMgAvi kappirO gAni

nelata kaMThamunaMdu nIlamaNihAramulu
alaruTeTlunDu koniyADarE chelulu
A lalitAMgi prANAvallabhuDu vEMkaTa vibhuDu
nelakonna kaugiTane nilichenO gAni

Saturday, December 08, 2007

364.rAjapu nIkedurEdi rAmachaMdra - రాజపు నీకెదురేది రామచంద్ర


Click for Audio : Tuned and sung by Chakrapani , in raga:kApi
రాజపు నీకెదురేది రామచంద్ర
రాజీవనయనుడ రామచంద్ర

వెట్టిగాదు నీవలపు వింటి నారికి( దెచ్చితివి
ఱట్టుసేయ పనిలేదు యిట్టె రామచంద్ర
గు(గ)ట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి-
వెట్టు మఱవగవచ్చు నివి రామచంద్ర

బతి(లి)మితోడుత( బైడిపతిమె గైకొటివి
రతికెక్క నీచలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీదుకట్టితివి నాకై
యితరు లేమనగల రిక రామచంద్ర

నావంటిసీతను నాగేటికొన( దెచ్చితి
రావాడితమకముతో రామచంద్ర
యోవేళ శ్రీవేంకటాద్రి నిరవై నన్ను( గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర


rAjapu nIkedurEdi rAmachaMdra
rAjIvanayanuDa rAmachaMdra

veTTigAdu nIValapu viMTi nAriki( dechchitivi
~raTTusEya panilEdu yiTTe rAmachaMdra
gu(ga)TTutODa jalanidhipai goMDalu muDivEsiti-
veTTu ma~ravagavachchu nivi rAmachaMdra

bati(li)mitODuta( baiDipatime gaikoTivi
ratikekka nIchalamu rAmachaMdra
mitimIri javvanamu mIdukaTTitivi nAkai
yitaru lEmanagala rika rAmachaMdra

nAvaMTisItanu nAgETikona( dechchiti
rAvADitamakamutO rAmachaMdra
yOvELa SrIvEMkaTAdri niravai nannu( gUDiti
chEvadEra gaMDikOTa SrIrAmachaMdra

Click here to listen to this kriti , tuned and sung by Chakrapani , in raga:kApi

Tuesday, September 26, 2006

9.Madhava keshava madhusudana - మాధవ కేశవ మధుసూదన


Audio link : BKP
Archive Page
మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్
....

వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో
...
పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజ

నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే
...
మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి

విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి


maadhava kaeSava madhusoodana - vishNuSreedharaa padanakham^ chiMtayaami yooyam^
....
vaamana gOviMda vaasudaeva pradyumna - raamaraama kRshNa naaraayaNaachyuta
daamOdaraanirudhdha daiva puMDareekaaksha - naamatrayaadheeSa namOnamO
...
purushOtta ma puMDareekaaksha - divyahari saMkarshaNa adhOkshaja
narasiMha hRsheekaeSa nagadhara trivikrama - SaraNaagata raksha jayajaya saevae
...
magita janaardana matsyakoorma varaahaa - sahaja bhaargava budhdha jayaturaga kalki
vihita vij~naana SreevaeMkaTaeSa SubhakaraM - ahamiha tavapada daasyaM aniSaM bhajaami
Audio link ,BKP , kapi ragam
BKP :

Monday, September 25, 2006

2.Jo Achyutananda Jo Jo Mukunda - జో అచ్యుతానంద జోజో ముకుందా


Archive Page link
Audio link : Vedavathi Prabhakar
Audio link : M.S.Subbalakshmi
Audio link : BKP
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో
...
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
...
పాలవారాశిలో పవళించినావు,

బాలుగా మునులుకు అభయమిచ్చినావు,
మేలుగా వసుదేవుకుదయించినావు,
బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
...

అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టే తినెనని యత్త యడుగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకు బోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీకొడుకు మాయిండ్లలోను
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెరిచె నేమందుమమ్మ

ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతుల బట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
....
గోవర్థనంబెల్ల గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న కంసు పడకొట్టి
నీవుమధురాపురము నేల చేబట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
....
అంగజునిగన్న మాయన్నయిటు రారా

బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
....
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా

శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో

jO achyutaanaMda jOjO mukuMdaa
raave paramaanaMnada , raama gOviMdaa jOjO jOjO
...
paalavaaraaSilO pavaLiMchinaavu,
baalugaa munuluku abhayamichchinaavu,
maelugaa vasudaevukudayiMchinaavu,
baaluDai uMDi gOpaaluDainaavoo jOjO jOjO
...
naMduniMTanujaeri nayamumeeraMgaa
chaMdravadanalu neeku saevachaeyaMgaa
aMdamuga vaariMDla aaDuchuMDaMgaa
maMdalaku doMga maa mudduraMgaa jOjO jOjO
....
aTTugaTTina mIgaDaTTe tinnADE
paTTi kODalu mUtipai rAsinADE
aTTE tinenani yatta yaDuga vinnADE

gaTTigA nidi doMga koTTumannADE
gollavAriMDlaku gobbunaku bOyi
kollalugA trAvi kuMDalanu nEyi
chellunA maganAMDra jeligi yISAyI
chillatanamulu sEya jellunaTavOyi

rEpalle satulella gOpaMbutOnu
gOpamma mIkoDuku mAyiMDlalOnu
mApugAnE vachchi mA mAnamulanu
nI pApaDE cheriche nEmaMdumamma

okaniyAlini dechchi nokani kaDabeTTi
jagaDamulu kalipiMchi satipatula baTTi
pagalu nalujAmulunu bAluDai naTTi
maganAMDra chEpaTTi madanuDai naTTi
.....
gOvarthanaMbella goDugugaaga paTTi
kaavarammuna nunna kaMsu paDakoTTi
neevumadhuraapuramu naela chaebaTTi
TheevitO naelina daevakee paTTi
....
aMgajuniganna maayannayiTu raaraa
baMgaaruginnelO paalupOsaeraa
doMganeevani satulu poMguchunnaraa
muMgiTaanaaDaraa mohanaakaaraa jOjO jOjO
....
aMgugaa taaLLaapaakanayya chaalaa
SRMgaara rachanagaa cheppenee jOla
saMgatiga sakala saMpadalu neevaelaa
maMgaLamu tirupaTla madanagOpaalaa jOjO jOjO
Click to listen:
By,

MS . Subbalakshmi in Kapi


:Sri. Balakrishnaprasad:
:Sri.Mangalampalli Balamuralikrishna:
:Smt.VedavathiPrabhakar :
:Sri.Unnikrishnan :

:BombaySisters :


priya sisters



Vedavathi Prabhakar :


M.S.Subbalakshmi : 

BKP :