శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, November 14, 2009

652.maruni nagaridaMDa mAyilleragavA - మరుని నగరిదండ మాయిల్లెరగవా

Audio link 1 : B.Vasamta
Audio link 2 : G.Nageswara Nayudu, M.Suseela
మరుని నగరిదండ మాయిల్లెరగవా
విరుల తావులు వెల్ల విరిసేటి చోటు

మఱగు మూక చింతల మాయిల్లెరగవా
గురుతైన బంగారు కొడల సంది
మఱపుఁ దెలివి యిక్క మాయిల్లెరగవా
వెరవక మదనుడు వేటాడేచోటు

మదనుని వేదసంత మాయిల్లెరగవా
చెదరియు జెదరని చిమ్మఁ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెరగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు

మరులుమ్మెత్తల తోట మాయిల్లెరగవా
తిరువేంకటగిరి దేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెరగవా
నిరతము నీసిరులు నించేటి చోటు


maruni nagaridaMDa mAyilleragavA
virula tAvulu vella virisETi chOTu

ma~ragu mUka chiMtala mAyilleragavA
gurutaina baMgAru koDala saMdi
ma~rapu@M delivi yikka mAyilleragavA
veravaka madanuDu vETADEchOTu

madanuni vEdasaMta mAyilleragavA
chedariyu jedarani chimma@M jIkaTi
madilOna nIvuMDETi mAyilleragavA
kodalEka mamatalu koluvuMDEchOTu

marulummettala tOTa mAyilleragavA
tiruvEMkaTagiri dEVuDa nIvu
marumudrala vAkili mAyilleragavA
niratamu nIsirulu niMchETi chOTu

Get this widget | Track details | eSnips Social DNA

Friday, November 13, 2009

651.hariyE erugunu aMdari batukulu - హరియే ఎరుగును అందరి బతుకులు

Audio link : Sri Balakrishnaprsad
హరియే ఎరుగును అందరి బతుకులు
యిరవై ఈతని యెరుగుటే మేలు

వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజ కీటముల మరెవ్వడెరుగు

ఆసఁదొల్లి మును లనంతకోట్లు
చేసిరి తపములు సేనలుగా
యేసిరులందిరి యెరగ రెవ్వరును
వేసపునరులకు విధి యేదో


కలవనేకములు కర్మ మార్గములు
పలుదేవతలిటు పాటించిరి
బలిమి శ్రీ వేంకట పతికి మొరయిడి
వెలసిరి తుదనిదె వెరవిందరికి

hariyE erugunu aMdari batukulu
yiravai Itani yeruguTE mElu

venakaTi brahmalu vEvEla saMkhyalu
yenasi brahmAMDamu lEliraTa
penagoni vArala pErulu marachiri
manuja kITamula marevvaDerugu

Asa@Mdolli munu lanaMtakOTlu
chEsiri tapamulu sEnalugA
yEsirulaMdiri yeraga revvarunu
vEsapunarulaku vidhi yEdO

kalavanEkamulu karma maargamulu
paludEvataliTu paaTinchirib
balimi SrI vEnkaTa patiki morayiDi
velasiri tudanide veravindariki

Get this widget | Track details | eSnips Social DNA

Video : Priya Sisters

Tuesday, November 10, 2009

650.niMDu manasE nIpUja - నిండు మనసే నీపూజ

Audio link, tuned and sung by Sri Mangalampalli Balamuralikrishna
నిండు మనసే నీపూజ
అండగోరకుండుటదియు నీపూజ

యిందు హరిగలడందు లేడనేటి
నిందకు బాయుటే నీపూజ
కొందరు చుట్టాలు కొందరు పగనే
అందదుకు మానుటదియే నీపూజ

తిట్టులు గొన్నని దీవెనె గొంతని
నెటుకోనిదే నీపూజ
పెట్టిన బంగారు పెంకును నినుమును
అట్టే సరియనుటదియు నీపూజ

సర్వము నీవని స్వతంత్రముడిగి
నిర్వహించుటే నీపూజ
పర్వి శ్రీవేంకటపతి నీ దాసుల
పూర్వమనియెడి బుద్ధి నీపూజ


niMDu manasE nIpUja
aMDagOrakuMDuTadiyu nIpUja

yiMdu harigalaDaMdu lEDanETi
niMdaku bAyuTE nIpUja
koMdaru chuTTAlu koMdaru paganE
aMdaduku mAnuTadiyE nIpUja

tiTTulu gonnani dIvene goMtani
neTukOnidE nIpUja
peTTina baMgAru peMkunu ninumunu
aTTE sariyanuTadiyu nIpUja

sarwamu nIvani swataMtramuDigi
nirwahiMchuTE nIpUja
parvi SrIvEMkaTapati nI dAsula
pUrvamaniyeDi buddhi nIpUja

Sunday, November 08, 2009

649.tanalOnuMDina hari tagoluvaDI - తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి

Audio link
తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి
యెనలేక శరణంటే నితడే రక్షించును

కోరి ముదిమి మానుపుకొనేయాస మందులంటా
వూరకే చేదులుదిన నొడబడును
ఆరూఢి మంత్రసిధ్ధుడనయ్యేననే యాసలను
ఘోరపు పాట్లకు గక్కున నొడబడును

యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనేయాసలను
వొట్టి జీవహింసలకు నొడబడును
దిట్టతనమున తా నదృశ్యము సాధించేయాస
జట్టిగ భూతాల పూజించగ నొడబడును

చాపలపు సిరులకై శక్తి గొలిచేయాసను
వోపి నిందలకునెల్లా నొడబడును
యేపున శ్రీవేంకటేశు డేలి చేపట్టినదాకా
ఆపరానియాస నెందుకైనా నొడబడును


tanalOnuMDina hari@M dAgoluvaDI dEhi
yenalEka SaraNaMTE nitaDE rakshiMchunu

kOri mudimi mAnupukonEyAsa maMdulaMTA
vUrakE chEduludina noDabaDunu
ArUDhi maMtrasidhdhuDanayyEnanE yAsalanu
ghOrapu pATlaku gakkuna noDabaDunu

yiTTe yakshiNi@M baMpu sEyiMchukonEyAsalanu
voTTi jIvahiMsalaku noDabaDunu
diTTatanamuna tA nadRSyamu sAdhiMchEyAsa
jaTTiga bhUtAla pUjiMchaga noDabaDunu

chApalapu sirulakai Sakti golichEyAsanu
vOpi niMdalakunellA noDabaDunu
yEpuna SrIvEMkaTESu DEli chEpaTTinadAkA
AparAniyAsa neMdukainA noDabaDunu

Get this widget | Track details | eSnips Social DNA

Thursday, November 05, 2009

648.sakala jIvulakella saMjIvi - సకల జీవులకెల్ల సంజీవి

Audio link , Balakrishnaprasad
అ : సకల జీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

చ : మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది
పోడిమి నల్లని కాంతి బొదలినది
పేడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాడే శేషగిరిమీద నాటుకొన్న మందు

చ : పడిగెలు వేయింటి పాము గాచుకున్నది
కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది
కడలేని యంజనాద్రి గారుడపు మందు

చ : బలు శంఖు జక్రముల బదనికెలున్నది
తలచిన వారికెల్ల తత్త్వమైనది
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది
వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు


a : sakala jIvulakella saMjIvi yImaMdu
vekalulai yiMdaru sEviMcarO yImaMdu

ca : mUDu lOkamu lokkaTa muMci periginadi
pODimi nallani kAMti bodalinadi
pEDuka kommulu nAlgu penaci cEyivArinadi
nADE SEShagirimIda nATukonna maMdu

ca : paDigelu vEyiMTi pAmu gAcukunnadi
kaDu vEdaSAstramula gabbu vEsEdi
yeDayaka vokakAMta yekkuka vuMDinadi
kaDalEni yaMjanAdri gAruDapu maMdu

ca : balu SaMKu jakramula badanikelunnadi
talacina vArikella tattvamainadi
alarina brahmarudrAdula buTTiMcinadi
velugu tODuta SrIvEMkaTAdri maMdu

Get this widget | Track details | eSnips Social DNA

Monday, November 02, 2009

647.Emani vinnaviMchEmu yiTTE - ఏమని విన్నవించేము యిట్టే

Audio link :
ఏమని విన్నవించేము యిట్టే కనుగొనవయ్య
మోమున చేతులలోన మొక్కులున్నవి

నెలతమనసులోన నిండువలపులున్నవి
సెలవినవ్వులలోన సిగ్గులున్నవి
తలిరుమోవిమీద తరితీపులున్నవి
కలువకన్నులలోన కాంక్షలున్నవి

అంగనమాటల లోన నడియాసలున్నవి
రంగగుచన్నులపై కరగు లున్నవి
అంగపు సేవలలో ప్రియములెల్లా నున్నవి
సింగారంపుగొప్పుమీద సేసలున్నవి

కప్పి యలమేలుమంగకాగిట నీమేనున్నది
చిప్పిలఁ జెక్కుల మీద చిహ్నలున్నవి
యిప్పుడె శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
నెప్పున నీకెవేల నీ వుంగరమున్నది

Emani vinnaviMchEmu yiTTE kanugonavayya
mOmuna chEtulalOna mokkulunnavi

nelatamanasulOna niMDuvalapulunnavi
selavinavvulalOna siggulunnavi
talirumOvimIda taritIpulunnavi
kaluvakannulalOna kAMkshalunnavi

aMganamATala lOna naDiyAsalunnavi
raMgaguchannulapai karagu lunnavi
aMgapu sEvalalO priyamulellA nunnavi
siMgAraMpugoppumIda sEsalunnavi

kappi yalamElumaMgakAgiTa nImEnunnadi
chippila@M jekkula mIda chihnalunnavi
yippuDe SrIvEMkaTESa yiddarunu@M gUDitiri
neppuna nIkevEla nI vuMgaramunnadi


Get this widget | Track details | eSnips Social DNA

Friday, October 30, 2009

646.chali gAli vEDEla challIne - చలి గాలి వేడేల చల్లీనే

Audio link : Vani Jayaram
చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు
మలయజము తానేల మండీనే

పాపంపు మననేల పారీనే నలుగడల
చూపేల నలువంక జూచీనే
తాపంపు మేనేల తడవీనే పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణిగీనే
రాయడికి నలులేల రసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే

ఏకాంతమునేల యెదురైతినే తనకు
లోకాధి పతికేల లోనైతినే
చేకొనిదే మన్నించె శేషాద్రి వల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే


chali gAli vEDEla challIne kappurapu-
malayajamu tAnEla mandEnE

pApapu manasEla pAreene nalugadala
choopela naluvanka joocheenE
tApaMpu mEnEla taDaveenE poovinti-
toopEla cIttaMbu doorenE

vAYetti cilukela vadareene palumaru
kOyilalu daamEla goNageenE
raayadiki nalulEla raaseene maa tonu
kaayajujudu tAnEla kasareenE

EkaMtamunela yeduraitine tanaku
lOkAdhipatikEla LonaitinE
cEkonide manninchi SeshAdri Vallabhudu
paikonide mammeela pAlinchenE

Get this widget | Track details | eSnips Social DNA

Saturday, October 24, 2009

645.talapOsi talapOsi tamakiMchI nAmanasu - తలపోసి తలపోసి తమకించీ నామనసు

తలపోసి తలపోసి తమకించీ నామనసు
చెలులాల ఆతడేమి సేసీనొకో

యెలయించినవాడు ఇంటికి రాడొకొ
చెలుల నంపితి మాట చేకొనెనొకొ
కలువల వేసినాడు కరుణించకుండునొకొ
సొలసి చూచినవాడు చుట్టమై చిక్కడొకొ

మచ్చిక చల్లినవాడు మంతనములాడడొకొ
ఇచ్చగించినాడు చనవియ్యడొకొ
కచ్చుపెట్టినవ్వేవాడు కప్పురవిడె మీడొకొ
వచ్చినవాడికను నావద్దనే వుండీనొకొ

వేడుకసేసినవాడు వీడుజోడై చొక్కడొకొ
వాడికచూపినవాడు వసమౌనొకొ
యీడనె శ్రీవేంకటేశుడిన్నిటాను నన్ను నేలె
కూడినవాడు నాబత్తి గొబ్బన మెచ్చునొకొ

talapOsi talapOsi tamakiMchI nAmanasu
chelulAla AtaDEmi sEsInokO

yelayiMchinavADu iMTiki rADoko
chelula naMpiti mATa chEkonenoko
kaluvala vEsinADu karuNiMchakuMDunoko
solasi chUchinavADu chuTTamai chikkaDoko

machchika challinavADu maMtanamulADaDoko
ichchagiMchinADu chanaviyyaDoko
kachchupeTTinavvEvADu kappuraviDe mIDoko
vachchinavADikanu nAvaddanE vuMDInoko

vEDukasEsinavADu vIDujODai chokkaDoko
vADikachUpinavADu vasamaunoko
yIDane SrIvEMkaTESuDinniTAnu nannu nEle
kUDinavADu nAbatti gobbana mechchunoko

Thursday, October 22, 2009

644.evvaDerugunu mIyettulu - ఎవ్వడెరుగును మీయెత్తులు

listen to this kirtana sung by Srirangam Gopalaratnam garu in mohana
ఎవ్వడెరుగును మీయెత్తులు
మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య

సొలపుల నిన్నాపె చూచీనీ
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱగులు
బలిమిని యెట్టయినా బతుకరయ్యా

విరులనాపె నిన్ను వేసీనీ
కెరలి బొమ్మల జంకించేవు
సరిగానము మీ చందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా

పెనగి ఆపె నిన్ను పిలిచీనీ
యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్య

evvaDerugunu mIyettulu
muvvaMka merase mI mu~ripemayya

solapula ninnApe chUchInI
nalugaDa nIvEla navvEvu
teliyavu mAku mI te~ragulu
balimini yeTTayinA bratukarayyA

virulanApe ninnu vEsInI
kerali bommala jaMkiMchEvu
sarigAnamu mI chaMdamulu
paripari vidhamula bradukarayyA

penagi Ape ninnu pilichInI
yenasitivi SrIvEMkaTESwaruDA
nanu nElitiviTu nayamunanu
panivaDi yiTlAnE bradukarayya

Priya Sisters


Monday, October 12, 2009

643.talachinavanniyu tanakorakE - తలచినవన్నియు తనకొరకే వెలి

Audio link : SriRanajni ragam, rendered by Sri Nukala Chinasatyanarayana garu

తలచినవన్నియు తనకొరకే వెలి
దెలియుట తనలోఁ దెలియుట కొరకే

ఉదయమందుట భవమౌడుగుటకొరకే
చదువుట మేలువిచారించుకొరకే
బ్రదుకుట పురుషార్థపరుడౌటకొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుగుటకొరకే

తగులుట విడివడఁదలచుట కొరకే
నొగులుట కర్మమనుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలగుటా కొరకే
బెగడుట దురితము పెడబాయు కొరకే

యీవల జేయుట ఆవలి కొరకే
ఆవలనుండుట యీవలి కొరకే
యీవలనావల నెనయ తిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుటకొరకే


talachinavanniyu tanakorakE veli
deliyuTa tanalO@M deliyuTa korakE

udayamaMduTa bhavamauDuguTakorakE
chaduvuTa mEluvichAriMchukorakE
bradukuTa purushArthaparuDauTakorakE
yediri@M ganuTa tanne~ruguTakorakE

taguluTa viDivaDa@MdalachuTa korakE
noguluTa karmamanubhaviMchu korakE
chigurauTa kommayi chelaguTA korakE
begaDuTa duritamu peDabAyu korakE

yIvala jEyuTa Avali korakE
AvalanuMDuTa yIvali korakE
yIvalanAvala nenaya tiruguTella
SrIvEMkaTESwaru@M jEruTakorakE

Get this widget Track details eSnips Social DNA