Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label classical. Show all posts
Showing posts with label classical. Show all posts

Thursday, May 06, 2010

694.sadAnaMdamu sarwESvarA - సదానందము సర్వేశ్వరా


Audio link : G.Janakiramana(?)
Youtube : Nedunuri Krishnamurthy(Tune) Sung By Malladi Brothers
సదానందము సర్వేశ్వరా
నీ పదారవిందముపై భక్తి

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీ సాకారము
నయమగు శ్రవణానందము వినినను
క్రియగలిగిన నీ కీర్తనము


చెలగి అందరికి జిహ్వానందము
పలుమరుఁ గొను నీ ప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు


ధర పరమానందము నీ దాస్యము
గరిమల శ్రీవేంకటవిభుడా
నరహరి నిత్యానందము నినుఁ దగ -
నరవిరి జేయు సమారాధనము


sadAnaMdamu sarwESvarA
nI padAraviMdamupai bhakti


nayanAnaMdamu narulaku suralaku
jayamagu hari nI sAkAramu
nayamagu SravaNAnaMdamu vininanu
kriyagaligina nI kIrtanamu


chelagi aMdariki jihvAnaMdamu
palumaru@M gonu nI prasAdamu
nalugaDa dEhAnaMdamu budhulaku
balunIpAda praNAmamulu


dhara paramAnaMdamu nI dAsyamu
garimala SrIvEMkaTavibhuDA
narahari nityAnaMdamu ninu@M daga -
naraviri jEyu samArAdhanamu


Malladi Brothers :

Thursday, April 08, 2010

683.muddugAraganide muMgiTa - ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు


Audio link : Singer: Ramya S , in Bhupalam (classical)
ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు
వొద్దికేగి చెలులెల్ల వూరడించరే

వేకువజామున లేచి వేడుక కృష్ణుడు తల్లి
ఆకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి
కాకలతో పసివాడి కన్నులు పులుముకొంటా
యేకరుచు నున్నవాడు యెత్తుకోరే బిడ్డని

బాలులతో వూరనెల్ల బరువులు వెట్టి వెట్టి
చాలుకొని యాడి యాడి జామెక్కగా వచ్చి
కేలుచాచి వెన్నడిగి కిందుపడీ యంతలో
బేలులై వుండగనేల పెట్టరే బిడ్డనికి

మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే
చట్టల పెరుగు వేడీ చాలఁబెట్టరే మీరు
పట్టపు శ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె
అట్టిట్టనక వీని నాదరించరే

Painting by Sri Raja Ravivarma
muddugAraganide muMgiTa niluchunnADu
voddikEgi chelulella vUraDiMcharE

vEkuvajAmuna lEchi vEDuka kRshNuDu talli
AkalayyI nanuchu voyyane maMchamu digi
kAkalatO pasivADi kannulu pulumukoMTA
yEkaruchu nunnavADu yettukOrE biDDani

bAlulatO vUranella baruvulu veTTi veTTi
chAlukoni yADi yADi jAmekkagA vachchi
kEluchAchi vennaDigi kiMdupaDI yaMtalO
bElulai vuMDaganEla peTTArE biDDaniki

maTTAmadyAnnapuvELa malayuchu niMTilOnE
chaTTala perugu vEDI chAla@MbeTTarE mIru
paTTapu SrIvEMkaTAdripai kIlukone nide
aTTiTTanaka vIni nAdariMcharE

Tuesday, November 17, 2009

654.innALLu naMdunaMdu - ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని

Audio link: 
ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని అంగనలపసఁజిక్కి అలయికలే కంటి బంగారు వెంటఁ దగిలి భ్రమ గంటిని ముంగిటి క్షేత్రాలంటి ముంచి వెట్టిసేయగంటి అంగపునన్నే చూచి అంతరాత్మఁ గంటి చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి మట్టిలేని వయసుతో మదము గంతి వట్టి కామములు సేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణుని భక్తి నిన్ను గంటిని వింతచదువులవల్ల వేవేలు మతాలు గంటి సంతకర్మములవల్ల సాము గంటిని యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి innALLu naMdunaMdu nEmigaMTini anniTA SaraNu chochchi hari ninu gaMTini aMganalapasa@Mjikki alayikalE kaMTi baMgAru veMTa@M dagili bhrama gaMTini muMgiTi kshEtrAlaMTi muMchi veTTisEyagaMTi aMgapunannE chUchi aMtarAtma@M gaMTi chuTTAla@M jEri chUchi suddulavAvulu gaMTi maTTilEni vayasutO madamu gaMTi vaTTi kAmamulu sEsi varusa mAyalu gaMTi paTTi nArAyaNuni bhakti ninnu gaMTini viMtachaduvulavalla vEvElu matAlu gaMTi saMtakarmamulavalla sAmu gaMTini yiMtaTa SrIvEMkaTESa yiTu nAjIvabhAvamu chiMtiMchi aMdulOna nISrIpAdAlu gaMTi

Friday, May 15, 2009

613.aMdariki sulabhuDai aMtarAtma - అందరికి సులభుడై అంతరాత్మ




Audio link
అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు

యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర -
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు

వైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము

నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు

aMdariki sulabhuDai aMtarAtma yunnavADu
yiMdunE SEshagirini yiravai vishNuDu

yOgISwarula matinuMDETi dEvuDu kshIra -
sAgaraSAyiyaina sarwESuDu
bhAgavatAdhInuDaina paramapurushuDu
AgamOktavidhulaMdu nalarinanityuDu

vaikuMThamaMdununna vanajanAbhuDu para-
mAkAramaMdununna AdimUriti
AkaDasUryakOTlaMdununna paraMjyOti
dAkona brahmAMDAlu dhariMchina brahmamu

niMDuviswarUpamai nilichinamAdhavuDu
daMDivEdaMtamulu vedakE dhanamu
paMDina karmaphalamu pAlikivachchinarAsi
aMDanE SrIvEMkaTESuDaina lOkabaMdhuDu

Sunday, April 26, 2009

610. virahaMpu vEDAya virula - విరహంపు వేడాయ విరుల మొన వాడాయ



Audio link
విరహంపు వేడాయ విరుల మొన వాడాయ
తరువాతిపనుల కిటు తడవేల ఇకను

పిలువరే నాయకుని ప్రేమంపు చెలిమీద
నలదరే శ్రీగంధ మందాకాను
నిలువరే కొంతవడి నిండురొద లిటు మాని
కలికిమై చెమరించెఁ గంద మికఁ బనులు

చెరుగరే తురుములోఁ జెదరిజారిన నెరులు
కరగెనే చెలినుదుటి కస్తూరి బొట్టు
మరుపరే కప్పురము మగువదప్పులు దీర
నెరపుదము నేరుపులు నిమిషంబుమీద

అంపరే యెదురుగా నతనికి కానుకలు
చెంపలను పన్నీరు చిలుకఁగదరే
యింపులను శ్రీవేంకటేశు డిదె వచ్చి సతి
సొంపులను గూడె నిక లొలయ నేమిటికే
virahaMpu vEDAya virula mona vADAya
taruvAtipanula kiTu taDavEla ikanu

piluvarE nAyakuni prEmaMpu chelimIda
naladarE SrIgaMdha maMdAkAnu
niluvarE koMtavaDi niMDuroda liTu mAni
kalikimai chemariMche@M gaMda mika@M banulu

cherugarE turumulO@M jedarijArina nerulu
karagenE chelinuduTi kastUri boTTu
maruparE kappuramu maguvadappulu dIra
nerapudamu nErupulu nimishaMbumIda

aMparE yedurugA nataniki kAnukalu
cheMpalanu pannIru chiluka@MgadarE
yiMpulanu SrIvEMkaTESu Dide vachchi sati
soMpulanu gUDe nika lolaya nEmiTikE

Get this widget | Track details |

Tuesday, March 24, 2009

601.tammulAla annalAla tallulAla - తమ్ములాల అన్నలాల తల్లులాల



Audio link :
తమ్ములాల అన్నలాల తల్లులాల నే
నెమ్మనపు హరిఁ బాసి నిలువలేనికను

కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో-
యమ్మలాల తొలరె నా యక్కలాల
తమ్మిరేకు కన్నుల యాతనిఁబాసినే
నుమ్మల సొమ్మల చేత నుండలేకినను

చెలులాల కలికి తొయ్యలులాల వో
యెల జవ్వనముల మోహినులాల
చెలువంపు హరిఁదలచిన నాకు నే (?)
నులుకు కన్నీరు ఆపకుండలేనికను

బోటులాల జవ్వనపు మేటులాల వో-
గాటపు తురుముల చీకటులాల
వాటమైన వేంకటేశ్వరుఁ బాసి నే-
నాటదాననై జన్మమందలేకినను
tammulAla annalAla tallulAla nE
nemmanapu hari@M bAsi niluvalEnikanu

kommalAla marukOTa kommalAla vO-
yammalAla tolare nA yakkalAla
tammirEku kannula yAtani@MbAsinE
nummala sommala chEta nuMDalEkinanu

chelulAla kaliki toyyalulAla vO
yela javvanamula mOhinulAla
cheluvaMpu hari@Mdalachina nAku nE (?)
nuluku kannIru ApakuMDalEnikanu

bOTulAla javvanapu mETulAla vO-
gATapu turumula chIkaTulAla
vATamaina vEMkaTESwaru@M bAsi nE-
nATadAnanai janmamaMdalEkinanu

Saturday, January 24, 2009

574.anniTA nErupari hanumaMtuDu - అన్నిటా నేరుపరి హనుమంతుడు




Archive Link :


అన్నిటా నేరుపరి హనుమంతుడు
పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు

ముట్టినప్రతాపపు రాముని సేనలలోన
అట్టె బిరుదు బంటు శ్రీహనుమంతుడు
చుట్టి రా నుండిన యట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైన లావరి చొక్కపు హనుమంతుడు

వదలక కూడగట్టిన వనచర బలములో
నదె యేకంగ వీరుడు హనుమంతుడు
చెదరక కుంభకర్ణు చేతి శూలమందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుడు

త్రిజగములలోపల దేవతా సంఘముల లోన
అజుని పట్టాన నిల్చె హనుమంతుడు
విజయనగరాన శ్రీవేంకటేశు సేవకుడై
భుజబలుడై యున్నాడిప్పుడు హనుమంతుడు


anniTA nErupari hanumaMtuDu
pinnanADE ravinaMTE pedda hanumaMtuDu

muTTinapratApapu rAmuni sEnalalOna
aTTe birudu baMTu SrIhanumaMtuDu
chuTTi rA nuMDina yaTTi sugrIvu pradhAnulalO
gaTTiyaina lAvari chokkapu hanumaMtuDu

vadalaka kUDagaTTina vanachara balamulO
nade yEkaMga vIruDu hanumaMtuDu
chedaraka kuMbhakarNu chEti SUlamaMdarilO
sadarAna viriche bhIshaNa hanumaMtuDu

trijagamulalOpala dEvatA saMghamula lOna
ajuni paTTAna nilche hanumaMtuDu
vijayanagarAna SrIvEMkaTESu sEvakuDai
bhujabaluDai yunnADippuDu hanumaMtuDu

Saturday, September 20, 2008

539. konarO konarO mIru - కొనరో కొనరో మీరు కూరిమి మందు



Audio link :CPadmaja
Audio link :VoletiVenkateswarlu

Ragam : Mohana, Misrachapu talam.
Archive link :


కొనరో కొనరో మీరు కూరిమి మందు
ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు

ధృవుడు గొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు
చవిగా గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పారగ పెద్దలు మున్ను
జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు , జనకుడు
గెలుపుతో కొని బ్రదికిన యా మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు
కలకాలము గొని కడగన్న మందు
అజునకు పరమాయువై యొసగిన మందు
నిజమై లోకమెల్లా నిండిన మందు
త్రిజగములు నెఱుగ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు


konarO konarO mIru kUrimi maMdu
uniki maniki kellA okkaTE maMdu

dhRvuDu gonina maMdu tolli prahlAduDu
chavigA gonina maMdu challani maMdu
bhavarOgamulu vIDi pAraga peddalu munnu
java kaTTukonina nichchalamaina maMdu

nilichi nAraduDu gonina maMdu , janakuDu
geluputO koni bradikina yA maMdu
molachi nAlugu yugamula rAjulu ghanulu
kalakAlamu goni kaDaganna maMdu

ajunaku paramAyuvai yosagina maMdu
nijamai lOkamellA niMDina maMdu
trijagamulu ne~ruga tiruvEMkaTAdripai
dhwajamettE kOnETi darinunna maMdu

Meaning by GB Sankara Rao garu in sujanaranjani
మనం భౌతిక రోగాలు పోవడానికి, ఉపశమనం కలగడానికి అనేక రకాలైన మందులు వేసుకుంటాం! కాని అన్నమయ్య ఇక్కడ జీవుల మనుగడకు శాశ్వతమై ఉన్న మందు ఒక్కటే! అదే శ్రీ వేంకటేశ్వరుడు! దానిని తీసుకొనండి! ధన్యులు కండి అంటూ ప్రహ్లాదుడు, నారదుడు, జనకుడు, బ్రహ్మ మొదలగువారంతా ఈ మందును సేవించి తరించారు కాబట్టి మనమంతా ఈ ఔషధాన్ని స్వీకరిద్దాం! అని విజ్ఞానదాయకమైన బోధను చేశాడు! మరి మనమంతా కలియుగంలో తిరువేంకటేద్రిపై కోనేటి దరినున్న ఆ మందును (శ్రీ వేంకటశ్వరుని) తీసుకుందామా! (ఆశ్రయిద్దామా!)
ఉనికి మనికికి = ఉండుటకు, బ్రదుకుటకును;
జవకట్టికొనిన = పొదిగి కొనిన, స్వాధీనము గావించుకొన్న;
నిచ్చలము = నిశ్చలము

Wednesday, March 12, 2008

419.vIDivO koluvunnADu - వీడివో కొలువున్నాడు

Audio Archive link : 
Janakirama S R in KamaVardhini ragam. (lost)
వీడివో కొలువున్నాడు విట్ఠలేశుడు
మూడుమూర్తుల తేజపు మూలమీతడు

పంతముతో పాండవపక్షపాతి యీతడు
వింతలేని విదురునివిందు యీతడు
మంతుకెక్కినద్రౌపదీ మానరక్షకు( డీతడు
చెంతనే వుద్ధపుపాలి చింతామణి యీతడు

మందగొల్లెతలకెల్లా మంగళసూత్ర మీతడు
కందువ నక్రూరుని భాగ్యం బీతడు
నందగోప యశోదల నవవిధాన మీతడు
అందపు రుక్మినీమనోహరు( డీతడు

దేవకీ వసుదేవుల దివ్యపద వీతడు
భావింప నందరి పరబ్రహ్మ మీతడు
కైవశమై దాసులకు కల్పవృక్ష మీతడు
శ్రీవేంకటాద్రిమీది శ్రీపతి యీతడు

vIDivO koluvunnADu viTThalESuDu
mUDumUrtula tEjapu mUlamItaDu

paMtamutO pAMDavapakshapAti yItaDu
viMtalEni viduruniviMdu yItaDu
maMtukekkinadraupadI mAnarakshaku( DItaDu
cheMtanE vuddhapupAli chiMtAmaNi yItaDu

maMdagolletalakellA maMgaLasUtra mItaDu
kaMduva nakrUruni bhAgyaM bItaDu
naMdagOpa yaSOdala navavidhAna mItaDu
aMdapu rukmiNImanOharu( DItaDu

dEvakI vasudEvula divyapada vItaDu
bhAviMpa naMdari parabrahma mItaDu
kaivaSamai dAsulaku kalpavRksha mItaDu
SrIvEMkaTAdrimIdi SrIpati yItaDu

Tuesday, March 11, 2008

415.sugrIva nArasiMha - సుగ్రీవ నారసింహ సులభుడ


Audio Archive link : Balakrshnaprasad
ప|| సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి | అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||

చ|| సనకాదులొకవంక జయవెట్టుచున్నారు | ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు |
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు | అనుపమాలంకార అవధారు దేవ ||

చ|| గంగాది నదులెల్ల కడిగి నీపాదములు | పొంగుచు సప్తర్షులు పూజించేరు |
సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ | అంగజ కోటిరూప అవధారు దేవ ||

చ|| పరగ నారదాదులు పాడేరు నీచరిత | పరమ యోగీంద్రులు భావించేరు |
సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద | అరుదుగ నున్నాడవు అవధారు దేవ ||


pa|| sugrIva nArasiMha sulaBuDa vaMdariki | agrEsaruDa nIvu avadhAru dEva ||

ca|| sanakAdulokavaMka jayaveTTucunnAru | enasi suralu cEtuletti mokkEru |
munu lirumElanuMDi munukoni nutiMcEru | anupamAlaMkAra avadhAru dEva ||

ca|| gaMgAdi nadulella kaDigi nIpAdamulu | poMgucu saptarShulu pUjiMcEru |
saMgati vAyudEvuDu sari nAlavaTTamiDI | aMgaja kOTirUpa avadhAru dEva ||

ca|| paraga nAradAdulu pADEru nIcarita | parama yOgIMdrulu BAviMcEru |
sirulu miMcinayaTTi SrIvEMkaTAdrimIda | aruduga nunnADavu avadhAru dEva ||

Thursday, January 10, 2008

388.iMtakaMTE Ganamika lEdu - ఇంతకంటే ఘనమిక లేదు

Audio archive link : Sung by Malladibrothers, tuned by Sripadapinakini

Audio link2
ప|| ఇంతకంటే ఘనమిక లేదు | సంతత సౌఖ్యము జనార్దననుడే ||
చ|| భయ నివారణము పరమాత్ముని స్తుతి | జయ కారణ మీశ్వర చింత |
అయుత పుణ్యఫల మచ్యుతుని సేవ | క్రియతో నిజమెరిగిన వారికి ||
చ|| కర్మహరము శ్రీకాంతు దరిసనము | ధర్మరాసి మాధవు శరణు |
అర్మిలి సంపద లనంతుని తగులు | నిర్మలముగ పూనిన దాసులకు ||
చ|| ఆగమోక్తమీ హరికైంకర్యము | భోగము విష్ణుని పూజ ఇది |
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు | బాగులు నేర్చిన ప్రపన్నులకు ||


pa|| iMtakaMTE Ganamika lEdu | saMtata sauKyamu janArdananuDE ||
ca|| Baya nivAraNamu paramAtmuni stuti | jaya kAraNa mISvara ciMta |
ayuta puNyaPala macyutuni sEva | kriyatO nijamerigina vAriki ||
ca|| karmaharamu SrIkAMtu darisanamu | dharmarAsi mAdhavu SaraNu |
armili saMpada lanaMtuni tagulu | nirmalamuga pUnina dAsulaku ||
ca|| AgamOktamI harikaiMkaryamu | BOgamu viShNuni pUja idi |
yOgamu SrIvEMkaTOttamuni koluvu | bAgulu nErcina prapannulaku ||

Wednesday, January 09, 2008

387.Edi nijaMbani eTuvale - ఏది నిజంబని ఎటువలె నమ్ముదు


Audio link from , sung by Malldibrothers, tuned in raga :Saveri by Sripadapinakini
ప|| ఏది నిజంబని ఎటువలె నమ్ముదు | పోదితోడ నన్ను బోధింపవే ||

చ|| నానా రూపులు నరహరి నీవని | పూనిన విధులిటి పొగడెడిని |
మానక హేయము మరి వుపాదేయము | కానవచ్చి యిల గలిగి యున్నవి ||
చ|| సత్తు అసత్తని సర్వము నీవని | చిత్తగించి శ్రుతి చెప్పెడిని |
ఉత్తమ మధ్యమ మొగిగలదని మరి | ఇత్తల శాస్త్రము లేర్పరిచీని ||

చ|| భావాభావము పరమము నీవని | దైవజ్ఞులు నిను తలచెదరు |
శ్రీ వేంకటగిరి చెలగిన నీవే తావుగ మదిలో తగిలితివి ||

pa|| Edi nijaMbani eTuvale nammudu | pOditODa nannu bOdhiMpavE ||
ca|| nAnA rUpulu narahari nIvani | pUnina vidhuliTi pogaDeDini |
mAnaka hEyamu mari vupAdEyamu | kAnavacci yila galigi yunnavi ||
ca|| sattu asattani sarvamu nIvani | cittagiMci Sruti ceppeDini |
uttama madhyama mogigaladani mari | ittala SAstramu lErparicIni ||
ca|| BAvABAvamu paramamu nIvani | daivaj~nulu ninu talacedaru |
SrI vEMkaTagiri celagina nIvE tAvuga madilO tagilitivi ||

Monday, January 07, 2008

385.parusamu sOkaka pasiDaunA - పరుసము సోకక పసిడౌనా

Audio link: Malladi Brothers, Raga Kedaram
ప|| పరుసము సోకక పసిడౌనా | పురుషోత్తముడే బుద్ధిచ్చు గాక ||
చ|| భువి భోగములకు పుట్టిన దేహము | వివరపు మోక్షము వెదకీనా |
ఇవల సకలమును యేలేటి దేవుడు | తవిలి రక్షించుట ధర్మము గాక ||
చ| ఘనమగు సంసార కారణ జీవుడు | తన సుజ़్జానము తలచీనా |
వెనుక మునుప శ్రీ వేంకట పతియే | కనుగొని మమ్మిట గాచుట గాక ||


pa|| parusamu sOkaka pasiDaunA | puruShOttamuDE buddhiccu gAka ||
ca|| Buvi BOgamulaku puTTina dEhamu | vivarapu mOkShamu vedakInA |
ivala sakalamunu yElETi dEvuDu | tavili rakShiMcuTa dharmamu gAka ||
ca| Ganamagu saMsAra kAraNa jIvuDu | tana suj~jAnamu talacInA |
venuka munupa SrI vEMkaTa patiyE | kanugoni mammiTa gAcuTa gAka ||

Friday, January 04, 2008

384.evvAru lErU - ఎవ్వారు లేరూ హితవుచెప్పగ

Audio link : Ragam varali 1.M.Balamuralikrishna2.Nukala Chinasatyanarayana , meaning and rendition
ఎవ్వారు లేరూ హితవుచెప్పగ వట్టి-
నొవ్వుల(బడి నేము నొగిలేమయ్యా

అడవి( బడినవాడు వెడల(జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురితకాననములతరి(బడి
వెడలలేక నేము విసిగేమయ్యా

తెవులువడినవాడు తినబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల( బడి పరమామృతము నోర(
జవిగాక భవములు చవులాయనయ్యా

తనవారి విడిచి యితరమైనవారి-
వెనక( దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము తిరువేంకటాధీశు( గొలువక
మనసులోనివాని మఱచేమయ్యా


evvAru lErU hitavucheppaga vaTTi-
novvula(baDi nEmu nogilEmayyA

aDavi( baDinavADu veDala(jOTulEka
toDari kaMpalakiMdu dUrinaTlu
naDuma duritakAnanamulatari(baDi
veDalalEka nEmu visigEmayyA

tevuluvaDinavADu tinabOyi madhuramu
chavigAka pulusulu chavigOrinaTlu
bhavarOgamula( baDi paramAmRtamu nOra(
javigAka bhavamulu chavulAyanayyA

tanavAri viDichi yitaramainavAri-
venaka( dirigi tA ve~r~rainaTlu
anayamu tiruvEMkaTAdhISu( goluvaka
manasulOnivAni ma~rachEmayyA

Sunday, November 18, 2007

346.viShNuDokkaDE viSwAtmakuDu - విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు


Arvhie Audio link : Mangalampalli Balamuralikrishna
విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
వైష్ణవమే సర్వంబును

పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ
యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే

అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే
viShNuDokkaDE viSwAtmakuDu
vaiShNavamE sarvaMbunu

paramEShThi nEyubrahmAMDasRShThiyu
harunilOni saMhAraSakti
paragaga niMdruniparipAlanamunu
arasichUDa SrIharimahima

yilapaMchabhUtamulalO guNamulu
ala navagrahavihAramulu
talakonu kAlatrayadharMAmbunu
alaraga nArAyaNunimahimalE

aMtaTa galamAyAvilAsamulu
poMta paramapadabhOgamulu
maMtukunekkinamarisamastamunu
yiMtayu SrIvEMkaTESumahimalE

Thursday, November 15, 2007

341.sakala SAMtikaramu sarvESa-సకల శాంతికరము సర్వేశ

Click for Audio by Nedunuri , have a look at the above rare pic of starwalts..
Archive Audio link 
ప||
సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||
అనుప||
ప్రకటమై మాకునబ్బె బతికించు నిదియె సర్వేశ ||

చ|| మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన | నినుదలచినంతనే నీరౌను|
కనుగొన్న పాపములు కడలేనివైనను | ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును ||

చ|| చేతనంటిపాతకాలు సేనగానే చేసినాను |ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు |
ఘాతలజెవుల వినగా నంటిన పాపము | నీతితో నీ కథవింటే నిమిషాసబాయును ||

చ|| కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల | కాయవు నీ ముద్రలచే గ్రక్కున వీడు |
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా | ఆయమైన నీ శరణాగతిచే నణగు ||


pa|| sakala SAMtikaramu sarvESa nIpai Bakti sarvESa ||
anupa|| prakaTamai mAkunabbe batikiMcu nidiye sarvESa ||
ca|| manasulO pApabuddhi mariyeMta dalacina | ninudalacinaMtanE nIraunu|
kanugonna pApamulu kaDalEnivainanu | GanuDaninnu jUcitE kaDaku dolagunu ||
ca|| cEtanaMTipAtakAlu sEnagAnE cEsinAnu |Atala nIku mrokkitE nanniyu bAyu |
GAtalajevula vinagA naMTina pApamu | nItitO nI kathaviMTE nimiShAsabAyunu ||
ca|| kAyamuna jEsETi karmapu pApamulella | kAyavu nI mudralacE grakkuna vIDu |
yEyeDa vEMkaTESa yEyEpAtakamainA | Ayamaina nI SaraNAgaticE naNagu ||

Sunday, August 19, 2007

300.mAdhavunaku maMgaLaM- మాధవునకు మంగళం


Audio link :NedunuriKrishnamurthy
Archive link :
ప|| మాధవునకు మంగళం |
సాధు ప్రియునకు జయ మంగళం ||

చ|| మదన గురునకు మంగళము మా |
మతిలేలె హరికిని మంగళము |
మధురిపు హరునకు మంగళము |
చటువులుమూర్తికి మంగళము ||

చ|| మహిమాధికుణకు మంగళము |
మహామహునకు మంగళము |
మహీధవునకు మంగళము |
సహజ తేజునకు మంగళము ||

చ|| మాయారహితునికి మంగళము |
మాయింటి పతికిని మంగళము |
యీ యెడ శ్రీ వేంకటేశ్వరు దీటు |
ఛాయ శ్రీపతికి మంగళము ||



pa|| mAdhavunaku maMgaLaM | sAdhu priyunaku jaya maMgaLaM ||
ca|| madana gurunaku maMgaLamu mA | matilEle harikini maMgaLamu |
madhuripu harunaku maMgaLamu | caTuvulumUrtiki maMgaLamu ||
ca|| mahimAdhikuNaku maMgaLamu | mahAmahunaku maMgaLamu |
mahIdhavunaku maMgaLamu | sahaja tEjunaku maMgaLamu ||
ca|| mAyArahituniki maMgaLamu | mAyiMTi patikini maMgaLamu |
yI yeDa SrI vEMkaTESvaru dITu | CAya SrIpatiki maMgaLamu ||

Friday, August 17, 2007

294. idigAka sauBAgyamidigAka- ఇదిగాక సౌభాగ్యమిదిగాక


Audio link :GBKP
Audio link :MuraliKrishna
Audio link :
Archive link :

ప|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా ||
చ|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | నితర మోహాపేక్షలిన్నియును విడచె
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||
చ|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి
సరసిజాసన మనోజయమంది యింతలో | సరి లేక మనసు నిశ్చల భావమాయ ||
చ|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |
దేవోత్తముని కౄపాధీనురాలై యిపుడు | లావణ్యవతికి నుల్లంబు తిరుమాయ ||


pa|| idigAka sauBAgyamidigAka tapamu mari | yidigAka vaiBavaM bikanokaTi kaladA ||
ca|| ativa janmamu saPalamai parama yOgivale | nitara mOhApEkShalinniyunu viDace
sati kOrikalu mahASAMtamai yidecUDa | satata vij~nAna vAsana vOle nuMDe ||
ca|| taruNi hRudayamu kRutArthataboMdi viBumIdi | paravaSAnaMda saMpadaku niravAyi
sarasijAsana manOjayamaMdi yiMtalO | sari lEka manasu niScala BAvamAya ||
ca|| SrIvEMkaTESvaruni jiMtiMci paratattva | BAvaMbu nijamu gAbaTTi jeliyAtma |
dEvOttamuni kRupAdhInurAlai yipuDu | lAvaNyavatiki nullaMbu tirumAya ||



అన్నమయ్య ఆధ్యాత్మ, శృంగార రీతులలో సంకీర్తనలు రచించాడు. రాశిలో శృంగార సంకీర్తనలు ఆధ్యాత్మ సంకీర్తనలకు మూడు రెట్లు ఎక్కువ. మధురభక్తి సంప్రదాయంలో ఆత్మార్ధంతో వ్రాసుకున్న ఈ శృంగార సంకీర్తనల పరమార్ధం ఆధ్యాత్మ తత్త్వమే! ఆధ్యాత్మ పద్ధతిలో ఒక యోగి లేక ముని లేక ఋషి నిరంతర భగవత్ చింతనలో ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుణ్ణీ ఆరాధిస్తాడు. చివరకు తపస్సు సిద్ధించి వరుసగా భగవత్ సాలోక్యము, సాయుజ్యము, సామీప్యము, సారూప్యాన్ని పొందుతాడు. (స్థూలంగా భగవంతునిలో ఐక్యమవుతాడు) అలాగే శృంగార సంకీర్తనలో పేర్కొనబడిన నాయిక నిరంతరం అంతరంగ తలపుల తరంగాలలో భగవంతుని నిలుపుకొని తన కోరికల కుసుమములను ఆ భగవంతునికి సమర్పించి, ఆ విధముగా కోరికలు లేని స్థితికి చేరుకుని, నిశ్చల భావంతో పరతత్త్వాన్ని చింతించి చివరకు ఆ భగవంతునిలో ఐక్యమవుతుంది. ఇదీ మధురభక్తి శృంగారం లోని అంతరార్దం. ఈ పాటలోని నిగూఢార్ధం! నిత్యానిత్యవస్తు వివేకః’ ‘ఇహముత్ర ఫల భోగవిరాగః’, ‘శమదమాది సాధన సంపత్తిః’, ‘ముముక్షుత్వం’ అను నాలుగు వేదాంత సోపానాలు అధిరోహించిన ఈ పాటలోని నాయిక గూర్చి పూర్తిగా తెలుసుకొదలచినవారు ‘తాళ్ళపాక పద సాహిత్యం’ (తి.తి.దే. ప్రచురణ) లోని 5వ సంపుటం పీఠికలో కీ.శే. గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు వ్రాసిన విపుల వ్యాఖ్యానాన్ని చదువగలరు.

ఆపేక్ష = కోరిక;
ఉల్లంబు = మనస్సు
తిరము + ఆయ = తిరమాయ = నిశ్చలస్థితికి చేరుకున్నది


Sunday, August 05, 2007

275.sarvOpAyamulu jagati- సర్వోపాయములు జగతి

ప|| సర్వోపాయములు జగతి నాకితడే | వుర్వీధరుడు పురుషోత్తముండితడే ||

చ|| సకలగంగాతీర్థ స్నానఫలములివి స్వామిపుష్కరణి జలమేనాకు |
సకలపుణ్య క్షేత్రవాసయాత్రలివి సరి వేంకటాచల విహారమిదియే |
సకలవేదాధ్యన శాస్త్రపాఠంబులివి శౌరిసంకీర్తనంబిదియే నాకు |
సకలకర్మానుష్ఠానముల యితనికిచ్చట జాతువడికైంకర్యమిదియే ||

చ|| ఉపవాసములివి యితనిప్రసాదంబులొగి భుజింపుటే నాకు దినదినంబు |
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబుల శరణనేటి సేవయొకటే |
ఉపమింప బుణ్యపురుషులదర్శనము నాకు నొగినిచటి బహువృక్ష దర్శనంబు |
యెపుడు బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటయెన్నగల బహుపక్షి కలకలంబు ||

చ|| తలపుగల యోగంబులందు శ్రీవైష్ణవుల దగులుసంవాస సహయోగంబు |
వెలయ నిండుమహోత్సవంబు లిన్నియు నితనివిభవంబులెసగు తిరునాళ్ళు నాకు |
చెలగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశుని శరణాగతి |
అలరునాసంపదలు యితని పట్టపురాణి అలమేలు మంగకడకంటి చూపు ||

pa|| sarvOpAyamulu jagati nAkitaDE | vurvIdharuDu puruShOttamuMDitaDE ||

ca|| sakalagaMgAtIrtha snAnaPalamulivi svAmipuShkaraNi jalamEnAku |
sakalapuNya kShEtravAsayAtralivi sari vEMkaTAcala vihAramidiyE |
sakalavEdAdhyana SAstrapAThaMbulivi SaurisaMkIrtanaMbidiyE nAku |
sakalakarmAnuShThAnamula yitanikiccaTa jAtuvaDikaiMkaryamidiyE ||

ca|| upavAsamulivi yitaniprasAdaMbulogi BujiMpuTE nAku dinadinaMbu |
japarahasyOpadESaMbu litanipAdajalaMbula SaraNanETi sEvayokaTE |
upamiMpa buNyapuruShuladarSanamu nAku noginicaTi bahuvRukSha darSanaMbu |
yepuDu buNyakathASravaNaMbu liccOTayennagala bahupakShi kalakalaMbu ||

ca|| talapugala yOgaMbulaMdu SrIvaiShNavula dagulusaMvAsa sahayOgaMbu |
velaya niMDumahOtsavaMbu linniyu nitaniviBavaMbulesagu tirunALLu nAku |
celagi yiTu dEvatAprArthaniMtayu nAku SrIvEMkaTESuni SaraNAgati |
alarunAsaMpadalu yitani paTTapurANi alamElu maMgakaDakaMTi cUpu ||

Saturday, July 21, 2007

264.virahapu rAjade viDidiki - విరహపు రాజదె విడిదికి


Audio link :NedunuriKrishnamurthy
Archive link :
ప|| విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు ||
చ|| నెలత నుదుటిపై నీలపు కురులనె | తొలుతనె గట్టెను తోరణము |
మొలక చెమటలనె ముత్యపు (మ్రుగ్గులు) | అలరిచె మదనుండిదె చెలిమేన ||
చ|| దట్టముగ చింతా లతనే వడి | బెట్టె చప్పరము పెనుగొనగా |
పట్టిన మై తావులు పరిమళములు | కట్టించెను చెంగట వలరాజు ||
చ|| విందగు వేంకట విభుని ప్రేమచే | పొందగ బెట్టెను బోనాలు
ఇందు వదనికి ఇందిరా విభుని | కందుదేర నలుకలు చవిజేసె ||

pa|| virahapu rAjade viDidiki rAgA | sirula jEsenide siMgAramulu ||
ca|| nelata nuduTipai nIlapu kurulane | tolutane gaTTenu tOraNamu |
molaka cemaTalane mutyapu (mruggulu) | alarice madanuMDide celimEna ||
ca|| daTTamuga ciMtA latanE vaDi | beTTe capparamu penugonagA |
paTTina mai tAvulu parimaLamulu | kaTTiMcenu ceMgaTa valarAju ||
ca|| viMdagu vEMkaTa viBuni prEmacE | poMdaga beTTenu bOnAlu
iMdu vadaniki iMdirA viBuni | kaMdudEra nalukalu cavijEse ||