Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga:Bahudari. Show all posts
Showing posts with label Raga:Bahudari. Show all posts

Saturday, July 20, 2019

859. aemanavachchunu chelluchunnavive - ఏమనవచ్చును చెల్లుచున్నవివె

Tuned and Sung by Sri Sathiraju Venumadhav : Audio link

ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు    -పల్లవి-


కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే    -ఏమ-
 

శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే    -ఏమ-
 

శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే    -ఏమ-



aemanavachchunu chelluchunnavive yeeSvara neemaayalu gonni
Sreemaadhava nee chittamu kola@Mdi@Mka cheppeDidae@MTiki jeevulaku    -pallavi-
kalidOshaniruharaNa kaivalyaakara hari
tala@Mchinavaaridi naerupu mimu@M dala@Mchanivaaridi naerami
kalushameDali sooryOdayamainaa kaanavukonnijaMtuvulu
telisinavaaralu kaMduru yeetera@Mgalu reMTiki dinamokaTae    -aema-
SaraNaagatarakshaNachatura sarvaaMtaraatmaka yachyuta
sari ninnu@M golichinavaaridi puNyamu chalamuna maanuTae paapamu
sarugana@M gaachaeTi challani chaMdru@MDu jaarachOrulaku@M gaDu vae@MDi
araya@Mga@M galuvalakunu hitu@MDu aMduku niMduku guri yita@MDae    -aema-
SreevaeMkaTagirinilaya SreesateeSa purushOttama
mivoddanuMDitae vaikuMThamu mimmu neDasitae narakamu
bhaavamulOpala neevae vuMDa@Mga bhakti laedu koMdarikaitae
SreevaishNuvulaku nityamu yee chiMtalu reMTiki nee mahimae    -aema-

Friday, August 01, 2008

516.iMduku dhruvAdulu iTu sAkshi - ఇందుకు ధ్రువాదులు ఇటు సాక్షి


Audio link : Dwaram Lakshmi : Raga BahudAri
Archive link :

ఇందుకు ధ్రువాదులు ఇటు సాక్షి
చెంది నమ్మవో జీవుడ నీవు

కొండలవంటివి ఘోరపాపములు
ఖండించును హరి ఘననామజపము
నిండించును మతి నిత్యానందము
పండించునపుడే పరమపదంబు

జలధులవంటివి జననబంధములు
తొలగించును హరితూరినభక్తిది
వెలిగించును ఘనవిజ్ఞానంబులు
చెలగించును బహు సిరిసంపదలు

తోవరాని బహు దుఃఖములణచును
శ్రీవేంకటపతి జేరిన శరణము
పావనంబుగా( బచరించు గుణము
కైవశమగు లోకములెల్లాను

iMduku dhruvAdulu iTu sAkshi
cheMdi nammavO jIvuDa nIvu

koMDalavaMTivi ghOrapApamulu
khaMDiMchunu hari ghananAmajapamu
niMDiMchunu mati nityAnaMdamu
paMDiMchunapuDE paramapadaMbu

jaladhulavaMTivi jananabaMdhamulu
tolagiMchunu haritUrinabhaktidi
veligiMchunu ghanavij~nAnaMbulu
chelagiMchunu bahu sirisaMpadalu

tOvarAni bahu du@hkhamulaNachunu
SrIvEMkaTapati jErina SaraNamu
pAvanaMbugA( bachariMchu guNamu
kaivaSamagu lOkamulellAnu

Sunday, May 13, 2007

212. itara dEvatala kidigaladA - ఇతర దేవతల కిదిగలదా


Audio link : MBalaMuraliKrishna
Audio link :MalladiBrothers
Archive link :
ప|| ఇతర దేవతల కిదిగలదా | ప్రతివేరి నీ ప్రభావమునకు ||
చ|| రతిరాజ జనక రవి చంద్ర నయన | అతిశయ శ్రీ వత్సాంకుడవు |
పతగేంద్ర గమన పద్మావతి పతి | మతి నిను తలచిన మనోహరము ||
చ|| ఘన కిరీటధర కనకాంబర పా- | వన క్షీరాంబుధి వాసుడవు |
వనజ చక్రధర వసుధ వల్లభ | నిను పేరుకొనిన నిర్మలము ||
చ|| దేవ పితామహ త్రివిక్రమ హరి- | జీవాంతరాత్మక చిన్మయుడా |
శ్రీ వేంకటేశ్వర శ్రీకర గుణనిధి | నీవార మనుటే నిజ సుఖము ||
pa|| itara dEvatala kidigaladA | prativEri nI praBAvamunaku ||
ca|| ratirAja janaka ravi caMdra nayana | atiSaya SrI vatsAMkuDavu |
patagEMdra gamana padmAvati pati | mati ninu talacina manOharamu ||
ca|| Gana kirITadhara kanakAMbara pA- | vana kShIrAMbudhi vAsuDavu |
vanaja cakradhara vasudha vallaBa | ninu pErukonina nirmalamu ||
ca|| dEva pitAmaha trivikrama hari- | jIvAMtarAtmaka cinmayuDA |
SrI vEMkaTESvara SrIkara guNanidhi | nIvAra manuTE nija suKamu ||