Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga:Bouli. Show all posts
Showing posts with label Raga:Bouli. Show all posts

Monday, October 12, 2020

891. parama purushuDI bAluDaTa - పరమపురుషుఁ డీబాలుఁడట

YouTube link: Sung by Yoga Kirtana garu, tuned by Smt Veturi Chandralekha garu in BouLi Ragam

పరమపురుషుఁ డీబాలుఁడట
హర విరుంచులు మొక్కేరదివో వాకిటను    

దేవుఁడితఁడు సర్వదేవతల కొడయఁడు
వేవేలు వేదములచే వేద్యుఁడితఁడు
దేవకీదేవికి వసుదేవునికిఁ గొడుకాయ
యీవిధము నోఁచిరి వీరెంత భాగ్యవంతులో

అంతటాఁ దానున్నవాఁడు అరయ స్వతంత్రుఁడు
అంతయు నాదియులేని ఆదిమూరితి
వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి
దొంతరకొడుకైనాఁడు తొల్లి వీరే పుణ్యులో

ఇందిరావల్లభుఁడు ఇహపరనాయకుఁడు
కందువ శ్రీవేంకటాద్రిఁ గాపున్నవాఁడు
మందగొల్లెతలకెల్ల మరఁది దానైనాఁడు
ఇందరు నిందరే వీరి కెన్నటి సంబంధమో

 paramapurushu@M Deebaalu@MDaTa
hara viruMchulu mokkaeradivO vaakiTanu    

daevu@MDita@MDu sarvadaevatala koDaya@MDu
vaevaelu vaedamulachae vaedyu@MDita@MDu
daevakeedaeviki vasudaevuniki@M goDukaaya
yeevidhamu nO@Mchiri veereMta bhaagyavaMtulO

aMtaTaa@M daanunnavaa@MDu araya svataMtru@MDu
aMtayu naadiyulaeni aadimooriti
vaMtuku yaSOdaku navvala naMdagOpuniki
doMtarakoDukainaa@MDu tolli veerae puNyulO

iMdiraavallabhu@MDu ihaparanaayaku@MDu
kaMduva SreevaeMkaTaadri@M gaapunnavaa@MDu
maMdagolletalakella mara@Mdi daanainaa@MDu
iMdaru niMdarae veeri kennaTi saMbaMdhamO

Sunday, April 26, 2020

870. paMchEMdriyamulanE paTTaNasvAmulAla - పంచేంద్రియములనే పట్టణస్వాములాల


Tuned and Sung by Sri Sathiraju Venumadhav in Raga: Bowli
 Audio archive link
పంచేంద్రియములనే పట్టణస్వాములాల
తెంచి బేరమాడుకొని దించరో బరవు    -పల్లవి-

తగిన సంసారసముద్రములోనఁ దిరిగాడి
బిగువుదేహపు టోడబేహారివాఁడ
జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ
దిగితి బూతురేవునఁ దీరుచరో సుంకము    -పంచేం-

అడరి గుణత్రయములనేటి తెడ్డుల చేత
నడుమ నిన్నాళ్ళదాఁకా నడపినాడ
కడుఁజంచలములనే గాలిచాప లెత్తినాఁడ
వెడమాయపు సరకు వెలకియ్యరో    -పంచేం-

ఆతుమయనేటి కంభ మంతరాత్ముఁ డెక్కియుండి
నీతితో మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు
ఆతఁడే శ్రీవేంకటేశుఁ డటు మాకు మీకుఁ గర్త
ఘాతమాని ఇఁక మాకు కడుగుణ మియ్యరో    -పంచేం-



paMchaeMdriyamulanae paTTaNasvaamulaala
teMchi baeramaaDukoni diMcharO baravu    -pallavi-

tagina saMsaarasamudramulOna@M dirigaaDi
biguvudaehapu TODabaehaarivaa@MDa
jagati@M buNyapaapapu sarakulu dechchinaa@MDa
digiti booturaevuna@M deerucharO suMkamu    -paMchaeM-

aDari guNatrayamulanaeTi teDDula chaeta
naDuma ninnaaLLadaa@Mkaa naDapinaaDa
kaDu@MjaMchalamulanae gaalichaapa lettinaa@MDa
veDamaayapu saraku velakiyyarO    -paMchaeM-

aatumayanaeTi kaMbha maMtaraatmu@M DekkiyuMDi
neetitO mammu@Mgaachuka niluchunnaa@MDu
aata@MDae SreevaeMkaTaeSu@M DaTu maaku meeku@M garta
ghaatamaani i@Mka maaku kaDuguNa miyyarO    -paMchaeM-

Tuesday, January 15, 2008

391.SrIpati puranAyaka - శ్రీపతి పురనాయక

Audio link , in raga bouli, sung by Balakrishnaprasad
శ్రీపతి పురనాయక జయ
చింతితాభీష్ట దాయక ||

ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ
సన్నుతామర సుగ్రహా సామవేద పరిగ్రహా

జానకీ ప్రియకారక శివ సాధితాఖిల తారక
మానుషాహిత మారక మామకాఘ నివారక ||

శ్రీవేంకట నాధరూపక సంచిత రఘుకుల దీపక
భావ సంతోష ప్రాపకాఅభంగ మంజుల చాపక ||


SrIpati puranAyaka jaya
chiMtitAbhIShTa dAyaka ||

unnatOnnata vigraha dAsOparisthAnugraha
sannutAmara sugrahA sAmavEda parigrahA

jAnakI priyakAraka Siva sAdhitAkhila tAraka
mAnushAhita mAraka mAmakAgha nivAraka ||

SrIvEMkaTa nAdharUpaka saMchita raghukula dIpaka
bhAva saMtOsha prApakAabhaMga maMjula chApaka ||

Sunday, October 08, 2006

26.Srimannarayana - శ్రీమన్నారాయణ


Audio link : MS Subbalakshmi
Archive Page
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు

కమలాసతీ ముఖకమల కమల హిత
కమలప్రియ కమలేక్షణ


కమలాసనహిత గరుడకమనశ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు
..

పరమయోగిజన భాగధేయ శ్రీ
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణు రూప శ్రీ
తిరువేంకటగిరి దేవ శరణు

SreemannaaraayaNa SreemannaaraayaNa

SreemannaaraayaNa nee Sreepaadamae SaraNu


kamalaasatee mukhakamala kamala hita

kamalapriya kamalaekshaNa

kamalaasanahita garuDakamanaSree

kamalanaabha nee padakamalamae SaraNu

..

paramayOgijana bhaagadhaeya Sree

paramapoorusha paraatpara

paramaatma paramaaNu roopa Sree

tiruvaeMkaTagiri daeva SaraNu



video link : Sri MS Subbalakshmi