Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label jajara. Show all posts
Showing posts with label jajara. Show all posts

Tuesday, December 21, 2010

730.pulakala molakala punnamatODanE kUDe - పులకల మొలకల పున్నమతోడనే కూడె



Audio link : Sri Balakrishnaprasad
పులకల మొలకల పున్నమతోడనే కూడె
అలివేణి నీపతితో ఆడవే వసంతము

మాటలు తీగెలు వారె మక్కువలు చిగిరించె
మూటలకొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను
వాటపుజవ్వనాలకు వసంతకాలము వచ్చె
ఆటదానవు పతితో ఆడవే వసంతము


చెమటరసములూరి సిగ్గులుపూవకపూచె
తిమురు తరితీపుల తేనెలుబ్బెను
క్రమమున తమకము గద్దియ మదనుండెక్కె
అమర నీ పతితోడ ఆడవే వసంతము

కడుగోరికాకులు కాయముకాయలు గాచె
బడినే కెమ్మోవినీ పండువందెను
ఎడలేక శ్రీవేంకటేశుడిట్టే నిన్ను గూడే
అదరి నీపతితోడీ ఆడవే వసంతము

pulakala molakala punnamatODanE kUDe
alivENi nIpatitO ADavE vasaMtamu

maaTalu tIgelu vaare makkuvalu cigiriMce
mUTalakoddI navvulu moggalettenu
vaaTapujavvanaalaku vasaMtakaalamu vacce
ATadaanavu patitO ADavE vasaMtamu

cemaTarasamulUri siggulupUvakapUce
timuru taritIpula tEnelubbenu
kramamuna tamakamu gaddiya madanuMDekke
amara nI patitODa ADavE vasaMtamu

kaDugOrikaakulu kaayamukaayalu gaace
baDinE kemmOvinI paMDuvaMdenu
eDalEka SrIvEMkaTESuDiTTE ninnu gUDE
adari nIpatitODI aaDavE vasaMtamu

Monday, November 16, 2009

653.vADala vADala veMTa vasaMtamu - వాడల వాడల వెంట వసంతము



Audio link 1: Priya Sisters 
Audio link 2: S.Janaki garu 
వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ కలికి నవ్వులె నీకు కప్పుర ర వసంతము వలచూపు కలువల వసంతము కులికి మాటాడినదె కుంకుమ వసంతము చలమున చల్లె నీపై జాజర జాజర జాజ కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహము నీటి వసంతము బూమెల సరసముల పుప్పొడి వసంతము సామజ గురుడ నీపై జాజర జాజర జాజ అంగన అధరమిచ్చే అమృత వసంతము సంగడి శ్రీవేంకటేశ సతిగూడితి ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ vADala vADala veMTa vasaMtamu jADatO challEru nIpai jAjara jAjara jAja kaliki navvule nIku kappura vasaMtamu valachUpu kaluvala vasaMtamu kuliki mATADinade kuMkuma vasaMtamu chalamuna challe nIpai jAjara jAjara jAja kAmini jaMkena nIku kastUri vasaMtamu vAmula mOhamu nITi vasaMtamu bUmela sarasamula puppoDi vasaMtamu sAmaja guruDa nIpai jAjara jAjara jAja aMgana adharamichchE amRta vasaMtamu saMgaDi SrIvEMkaTESa satigUDiti muMgiTi rati chemaTa muttEla vasaMtamu saMgatAyeniddariki jAjara jAjara jAja

Video : PriyaSisters

Sunday, December 09, 2007

366.vEDuka vasaMtamu - వేడుక వసంతము వేళనిదే

Audio link : Tuned by Chakrapani
వేడుక వసంతము వేళనిదే
వాడలవాడలవెంట వనిత లాడేరు

కేలు(గేలు( జుట్టుపట్టి -
కెందామర మోములెత్తి
కోల(గోల దాక(జేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి -
జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు




పాలిండ్లు గడల(గ బరువైనతురుముల
చీలుచు సోలుచు( గొంతవెనకకును
మేలిమిపిఱుదులతో మెరయుచు మురియుచు
కోలల( బెడమరలి కోలాటమాడేరు

కది శొండురుమోములు కన్నుల( దేలించి చూచి
పదతాళగతులకు పడతులెల్లా
అదివో శ్రీవేంకటేశు( డలమేలుమంగతోడ
ముదమంది చూడగాను ముందట నాడేడు


vEDuka vasaMtamu vELanidE
vADalavADalaveMTa vanita lADEru

kElu(gElu( juTTupaTTi keMdAmara mOmuletti
kOla(gOla dAka(jEsi guMpuvAyaka
chAlukoni yiddarEsi jaMTalai satulu gUDi
vOli vErokatekOla noDDutA nADEru

pAliMDlu gaDala(ga baruvainaturumula
chIluchu sOluchu( goMtavenakakunu
mElimipi~rudulatO merayuchu muriyuchu
kOlala( beDamarali kOlATamADEru

kadi SoMDurumOmulu kannula( dEliMchi chUchi
padatALagatulaku paDatulellA
adivO SrIvEMkaTESu( DalamElumaMgatODa
mudamaMdi chUDagAnu muMdaTa nADEDu

Monday, July 09, 2007

253.cAlu cAlu nI jAjara- చాలు చాలు నీ జాజర



Audio link :PSuseela
Audio link :GBKP
Archive link :
Raga : Mukhari, Composer : G.Balakrishnaprasad
ప|| చాలు చాలు నీ జాజర నన్ను | జాలి బరచేనీ జాజర ||
చ|| వలపు వేదనల వాడెమ యీ- | తలనొప్పుల చే దలకేను |
పులకల మేనితో బొరలేను కడు | జలిగొని చల్లకు జాజర ||
చ|| ఒల్లని నినుగొని వుడికేను నీ- | చిల్లర చేతుల జిమిడేను |
కల్లగంద వొడిగా గేనుపై | జల్లకు చల్లకు జాజర ||
చ|| తివిరి వేంకటాధిప నేను నీ- | కవుగిట కబ్బితిగడు నేను |
రవరవ చమట గరగినేడు యిదె | చవులాయెను నీ జాజర ||

pa|| cAlu cAlu nI jAjara nannu | jAli baracEnI jAjara ||
ca|| valapu vEdanala vADema yI- | talanoppula cE dalakEnu |
pulakala mEnitO boralEnu kaDu | jaligoni callaku jAjara ||
ca|| ollani ninugoni vuDikEnu nI- | cillara cEtula jimiDEnu |
kallagaMda voDigA gEnupai | jallaku callaku jAjara ||
ca|| tiviri vEMkaTAdhipa nEnu nI- | kavugiTa kabbitigaDu nEnu |
ravarava camaTa garaginEDu yide | cavulAyenu nI jAjara ||

Tuesday, June 05, 2007

226.podale niMDu kaLala-పొదలె నిండు కళల


Audio link :GBKP
Archive link :

పొదలె నిండు కళల పున్నమి నేడు
అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా

జలజాక్షి మోమునను చంద్రోదయమాయ
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్ల కలువలు వికసించె
అలరి యీకెతో జాజ రాడుదువు రావయ్యా

యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల
మొనరి మోవి చిగురు లుప్పతిల్లెను
గొనకొన్న తురుమున కూడె తుమ్మిదమూక
అనుమానించక జాజ రాడుదువు రావయ్యా

కుంకుమ చెమట చను కొప్పెరల నిండుకొనె
కొంకక గోళ్ళే బుఱ్ఱటకొమ్ము లాయెను
లంకెలై శ్రీవేంకటేశ లలనతో కూడితివి
అంకెల నేపొద్దూ జాజ రాడుదువు రావయ్యా
podale niMDu kaLala punnami nEDu
adanu dappaka jAja rADuduvu rAvayyA

jalajAkshi mOmunanu chaMdrOdayamAya
nelakonna navvula vennela gAsenu
kaliki kannula nalla kaluvalu vikasiMche
alari yIketO jAja rADuduvu rAvayyA

yenasi javvanamuna nEteMche vasaMtakAla
monari mOvi chiguru luppatillenu
gonakonna turumuna kUDe tummidamUka
anumAniMchaka jAja rADuduvu rAvayyA

kuMkuma chemaTa chanu kopperala niMDukone
koMkaka gOLLE bu~r~raTakommu lAyenu
laMkelai SrIvEMkaTESa lalanatO kUDitivi
aMkela nEpoddU jAja rADuduvu rAvayyA

Wednesday, November 01, 2006

54.Jagadapu Chanavula Jajara - జగడపు జనవుల జాజర


Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
జగడపు జనవుల జాజర |
సగివల మంచపు జాజర ||

మొల్లలు దురుముల ముడిచిన బరువున |
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన బుప్పొడి జాగర బతిపై |
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం- |
గారము నెరపెటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ బడతులు |
సారెకు జల్లేరు జాజర ||

బింకపు గూటమి పెనగేటి చమటల |
పంకపు పూతలపరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు |
సంకుమదంబుల జాజర ||



jagaDapu janavula jaajara |
sagivala maMchapu jaajara ||

mollalu durumula muDichina baruvuna |
mollapu sarasapu muripemuna |
jallana buppoDi jaagara batipai |
challae rativalu jaajara ||

bhaarapu kuchamula paipaigaDu siM- |
gaaramu nerapeTi gaMdhavoDi |
chaeruva patipai chiMdaga baDatulu |
saareku jallaeru jaajara ||

biMkapu gooTami penagaeTi chamaTala |
paMkapu pootala parimaLamu |
vaeMkaTapatipai veladulu niMchaeru |
saMkumadaMbula jaajara ||