Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-475 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, January 29, 2009

577.peTTanikOTimMdariki peMDlikoDuku - పెట్టనికోటిమందరికి పెండ్లికొడుకుAudio Archive link
Audio download link : SPSailaja
పెట్టనికోటిమందరికి పెండ్లికొడుకు బొమ్మ
బెట్టె నసురులకెల్ల పెండ్లికొడుకు

పెల్లగించి భూమెత్తీ పెండ్లికొడుకు వాడె
పిల్లగోవి రాగాల పెండ్లికొడుకు
పెల్లైన యీవుల పెండ్లికొడుకు
పిల్లదీపు పెన్నుద్ది పెండ్లికొడుకు

పెంచెపు శిరసుపాగ పెండ్లికొడుకు గుం-
పించిన కోపగించీ పెండ్లికొడుకు
పెంచకప్పుడే పెరిగె పెండ్లికొడుకు వల-
పించె చక్కనిసిరి పెండ్లికొడుకు

యింటిపెరుగులదొంగ పెండ్లికొడుకు భూమి
బెంటి పోతుల( గూరిచె పెండ్లికొడుకు
గెంటులేని వేంకటగిరిమీదను వాడె
పెం(అం)ట వెట్టుకున్నవాడు పెండ్లికొడుకు


peTTanikOTimMdariki peMDlikoDuku bomma
beTTe nasurulakella peMDlikoDuku

pellagiMchi bhUmettI peMDlikoDuku vADe
pillagOvi rAgAla peMDlikoDuku
pel&laina yIvula peMDlikoDuku
pilladIpu pennuddi peMDlikoDuku

peMchepu SirasupAga peMDlikoDuku guM-
piMchina kOpagiMchI peMDlikoDuku
peMchakappuDE perige peMDlikoDuku vala-
piMche chakkanisiri peMDlikoDuku

yiMTiperuguladoMga peMDlikoDuku bhUmi
beMTi pOtula( gUriche peMDlikoDuku
geMTulEni vEMkaTagirimIdanu vADe
peM(aM)Ta veTTukunnavADu peMDlikoDuku

Monday, January 26, 2009

576.itarula naDugamu yitaDE - ఇతరుల నడుగము యితడే మాదాత

Archive link :
ఇతరుల నడుగము యితడే మాదాత
యితనియీవి వొరులియ్యగగలరా

దేవదేవుడాదిమపురుషుడు హరి
శ్రీవత్సాంకుడు చిన్మయుడు
యీవల నావల యిలవేలుపతడు
భావజగురుడు మాపాలిటవాడు

జగదేకగురుడు శాశ్వతుడచ్యుతు
డగజకు వరదుడు అనంతుడు
తగి మమునెలిన దైవము యేలిక
నిగమమూర్తి మానిజబంధువుడు

కలిదోషహరుడు కైవల్యవిభుడు
అలరిన శ్రీవేంకటాధిపుడు
చలిమి బలిమి మా జననియు జనకుడు
అలమి యితడు మాయంతర్యామి


itarula naDugamu yitaDE mAdAta
yitaniyIvi voruliyyagagalarA

dEvadEvuDAdimapurushuDu hari
SrIvatsAMkuDu chinmayuDu
yIvala nAvala yilavElupataDu
bhAvajaguruDu mApAliTavADu

jagadEkaguruDu SASwatuDachyutu
Dagajaku varaduDu anaMtuDu
tagi mamunelina daivamu yElika
nigamamUrti mAnijabaMdhuvuDu

kalidOshaharuDu kaivalyavibhuDu
alarina SrIvEMkaTAdhipuDu
chalimi balimi mA jananiyu janakuDu
alami yitaDu mAyaMtaryAmi

Saturday, January 24, 2009

575.anniTA bhAgyavaMtuDavoudu - అన్నిటా భాగ్యవంతుడవౌదు వయ్యా

 Archive link 

అన్నిటా భాగ్యవంతుడవౌదు వయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకునిపుడు

పడతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుదకన్ను చూపులు నించిన తట్టుపునుగు
తొడిబడ సులభాన దొరకె నీకిపుడు

కామిని కెమ్మోవి కాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటిమాటలవిందు ధూపదీపనైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీకిపుడు

అలమేలుమంగ నవ్వులంగపు పువ్వు దండలు
కలసి వురాన నీకే కట్టిన తాళి
చలపట్టి యీకెరతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీవేంకటేశ నీకు నిపుడు
anniTA bhAgyavaMtuDavoudu vayyA
panninaMdukallA vachchu bhAma nIkunipuDu

paDati mOharasamu pannITi majjanamu
kaDalEni yApesiggu kappurakApu
niDudakannu chUpulu niMchina taTTupunugu
toDibaDa sulabhAna dorake nIkipuDu

kAmini kemmOvi kAMti kaTTukonE chaMdragAvi
Amukonna mOhakaLalAbharaNAlu
dOmaTimATalaviMdu dhUpadIpanaivEdyAlu
kAmiMchinaTuvalene kalige nIkipuDu

alamElumaMga navvulaMgapu puvvu daMDalu
kalasi vurAna nIkE kaTTina tALi
chalapaTTi yIkerati sakalasaMpadalu
yilanabbe SrIvEMkaTESa nIku nipuDu

574.anniTA nErupari hanumaMtuDu - అన్నిటా నేరుపరి హనుమంతుడు
Archive Link :


అన్నిటా నేరుపరి హనుమంతుడు
పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు

ముట్టినప్రతాపపు రాముని సేనలలోన
అట్టె బిరుదు బంటు శ్రీహనుమంతుడు
చుట్టి రా నుండిన యట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైన లావరి చొక్కపు హనుమంతుడు

వదలక కూడగట్టిన వనచర బలములో
నదె యేకంగ వీరుడు హనుమంతుడు
చెదరక కుంభకర్ణు చేతి శూలమందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుడు

త్రిజగములలోపల దేవతా సంఘముల లోన
అజుని పట్టాన నిల్చె హనుమంతుడు
విజయనగరాన శ్రీవేంకటేశు సేవకుడై
భుజబలుడై యున్నాడిప్పుడు హనుమంతుడు


anniTA nErupari hanumaMtuDu
pinnanADE ravinaMTE pedda hanumaMtuDu

muTTinapratApapu rAmuni sEnalalOna
aTTe birudu baMTu SrIhanumaMtuDu
chuTTi rA nuMDina yaTTi sugrIvu pradhAnulalO
gaTTiyaina lAvari chokkapu hanumaMtuDu

vadalaka kUDagaTTina vanachara balamulO
nade yEkaMga vIruDu hanumaMtuDu
chedaraka kuMbhakarNu chEti SUlamaMdarilO
sadarAna viriche bhIshaNa hanumaMtuDu

trijagamulalOpala dEvatA saMghamula lOna
ajuni paTTAna nilche hanumaMtuDu
vijayanagarAna SrIvEMkaTESu sEvakuDai
bhujabaluDai yunnADippuDu hanumaMtuDu

Thursday, January 22, 2009

573.ElarADammA yiMtirO - ఏలరాడమ్మా యింతిరో


Archive Link :
ఏలరాడమ్మా యింతిరో వా( -
డేల రాడమ్మ నన్నేలినవాడు

పచ్చని పులుగుల బండిమీద నుండు-
పచ్చవింటి పిన్నబాలుని తండ్రి
పచ్చని చాయల పాయని బంగారు
పచ్చడము గట్టి(న) బాగైనవాడు

తెల్లని పులుగపై తిరుగ మరిగినట్టి
తెల్లని సతి పాలి దేవర తండ్రి
తెల్లని పరపుపై తేలిపొరలు వెట్టు-
తెల్లని కన్నుల తెలివైన వాడు

కొండవింటి వాని గుత్తగొనిన యట్టి -
కొండుక పాయపు కూతురు తండ్రి
కొండలరాయడు కోనేటి తిమ్మయ్య
కొండ తలనెత్తి గుఱుతైనవాడు


ElarADammA yiMtirO vA( -
DEla rADamma nannElinavADu

pachchani pulugula baMDimIda nuMDu-
pachchaviMTi pinnabAluni taMDri
pachchani chAyala pAyani baMgAru
pachchaDamu gaTTi(na) bAgainavADu

tellani pulugapai tiruga mariginaTTi
tellani sati pAli dEvara taMDri
tellani parapupai tEliporalu veTTu-
tellani kannula telivaina vADu

koMDaviMTi vAni guttagonina yaTTi -
koMDuka pAyapu kUturu taMDri
koMDalarAyaDu kOnETi timmayya
koMDa talanetti gu~rutainavADu

Tuesday, January 13, 2009

572.vishNu dEvu pAdamulE - విష్ణు దేవు పాదములేవిష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా

గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు

హరిపాదములే మాకు నన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు

అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున గొలిచితి మానరో భవములు


vishNu dEvu pAdamulE vidyabudhdhI mAku
vaishNavulamaiti miMka vadalavO karmamA

gOviMdunipAdamulE kOri yihaparamulu
SrIvibhunipAdamulE chEruvEdaSAstramulu
dEvadEvupAdamulE dikkunu desayu mAku
bhAvamulO nilipiti pAyarO pApamulu

haripAdamulE mAku nannapAnabhOgamulu
paramAtmu pAdamulE pADI paMTA mAku
muraharu pAdamulE muMdara venakA mAku
SaraNaMTi meMdainA chanarO du@hkhamulu

anaMtuni pAdamulE Ayushya bhaushyamulu
danujAri pAdamulE dhanadhAnya dharmamulu
yenalEni SrIvEMkaTESu DitanipAdAlE
manasuna golichiti mAnarO bhavamulu

571.cheli nIvu modalanE - చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లిచెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదీరె(దేరీ?) ఇదివో నీ భావము

చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు

పెదవి మీద కెంపులబేంట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పది(బదిగా నీనోము ఫలియించె నిపుడు

తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు
cheli nIvu modalanE siggari peMDli kUturavu
ilaniMta pachchidIre(dErI?) idivO nI bhAvamu

chekkulaveMTA gAre chemaTa tuDuchukOvE
chakkaveTTukonavE nI jArina koppu
akkumIda penagonna hArAlu chikku dIyavE
ikkuvala nI kOrike lIDErenipuDu

pedavi mIda keMpulabEMTlu rAluchukOvE
chedarina muMgurulu chEta duvvavE
vadalina payyeda chivvana bigiMchukonavE
padi(badigA nInOmu phaliyiMche nipuDu

tilakamu karagenu diddukOvE nosalanu
kalasina gurutulu gappukonavE
yelami SrIvEMkaTESu( DEle nalamElumaMgavu
talachina talapulu talakUDe nipuDu

Thursday, January 08, 2009

570.abburaMpu SiSuvu - అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు

అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

పుట్టు శంఖు చక్రముల( బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల( గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

వే(గైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెను(బాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి


abburaMpu SiSuvu AkumIdi SiSuvu
dobbuDu rOla SiSuvu tpruvvi tpruvvi tpruvvi

puTTu SaMkhu chakramula( buTTina yA SiSuvu
puTTaka tOllE mArupuTTuvaina Sisuvu
voTTuka pAluvennalu nOlalADu SiSuvu
toTTelalOna SiSuvu tpruvvi tpruvvi tpruvvi

niMDina baMDi tannina chinni SiSuvu
aMDavAri madamella naNachina SiSuvu
koMDalaMtESasurula( goTTina yA SiSuvu
duMDagaMpu SiSuvu tpruvvi tpruvvi tpruvvi

vE(gaina vEMkaTagiri velasina SiSuvu
kaugiTi yiMdira dolagani SiSuvu
Agi pAlajaladhilO naMdamaina penu(bAmu
tUgumaMchamu SiSuvu tpruvvi tpruvvi tpruvvi

Tuesday, January 06, 2009

569.mAdhava bhUdhava madana - మాధవ భూధవ మదన జనకRagam : Abhogi, composer : G.Balakrishnaprasad
Audio link :
Archive link :


మాధవ భూధవ మదన జనక
సాధురక్షణ చతుర శరణు శరణు

నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ-
నారసింహా కృష్ణ నాగశయన
వారాహ వామన వాసుదేవ మురారి
శౌరి జయజయతు శరణు శరణు

పుండరీకేక్షణ భువనపూర్ణగుణ
అండజగమన నిత్య హరి ముకుంద
పండరి రమణ రామ బలరామ పరమ పురుష
చండ భార్గవ రామ శరణు శరణు

దేవదేవోత్తమ దివ్యావతార నిజ-
భావ భావనాతీత పద్మనాభ
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ
సావయవ సారూప్య శరణు శరణు
mAdhava bhUdhava madana janaka
sAdhurakshaNa chatura SaraNu SaraNu

nArAyaNAchyutAnaMta gOviMda SrI-
nArasiMhA kRShNa nAgaSayana
vArAha vAmana vAsudEva murAri
Sauri jayajayatu SaraNu SaraNu

puMDarIkEkshaNa bhuvanapUrNaguNa
aMDajagamana nitya hari mukuMda
paMDari ramaNa rAma balarAma parama purusha
chaMDa bhArgava rAma SaraNu SaraNu

dEvadEvOttama divyAvatAra nija-
bhAva bhAvanAtIta padmanAbha
SrIvEMkaTAchala SRMgAramUrti nava
sAvayava sArUpya SaraNu SaraNu

Monday, January 05, 2009

568.dikkunIvE jIvulaku dEva siMhamA - దిక్కునీవే జీవులకు దేవ సింహమా
Audio link : Balakrishnaprasad
Archive link :
దిక్కునీవే జీవులకు దేవ సింహమా
తెక్కుల గద్దియమీది దేవసింహమా

సురలెల్లా గొలువగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతి ప్రహ్లాదుడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా

భుజములుప్పొంగగాను పూచిన శంఖుచక్రాల
త్రిజగములు నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి
ద్విజముని సంఘముల దేవసింహమా

ముప్పిరి దాసులకెల్లా ముందు ముందే యొసగేటి
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవెంకటాద్రి మీద
తెప్పల దేలేటి యట్టి దేవసింహమా
dikkunIvE jIvulaku dEva siMhamA
tekkula gaddiyamIdi dEvasiMhamA

suralellA goluvaga sUryachaMdrulakannula
tiramaina mahimala dEvasiMhamA
nirati prahlAduDu nIyeduTa nilichitE
teradIsiti mAyaku dEvasiMhamA

bhujamuluppoMgagAnu pUchina SaMkhuchakrAla
trijagamulu nElETi dEvasiMhamA
gajabhajiMpuchu vachchi kAchuka nutiMchETi
dvijamuni saMghamula dEvasiMhamA

muppiri dAsulakellA muMdu muMdE yosagETi
tipparAni varamula dEvasiMhamA
chippala nahObalAna SrIveMkaTAdri mIda
teppala dElETi yaTTi dEvasiMhamA

Sunday, January 04, 2009

567.bhaktasulabhuDunu parataMtruDu - భక్తసులభుడును పరతంత్రుడు హరిRagam : Malayamarutam, composer : G.Balakrishnaprasad
Audio link:
Archive link :


భక్తసులభుడును పరతంత్రుడు హరి
యుక్తిసాధ్యమిదె యొకరికీ గాడు

నినుపగు లోకములు నిండినవిష్ణుడు
మనుజుడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగిన మంత్రము
కొననాలికలలో గుదురై నిలిచె

యెలమి దేవతల నేలిన దేవుడు
నలుగడ నధముని నను నేలె
బలుపగు లక్ష్మీ పతియగు శ్రీహరి
యిల మాయింటను యిదివో నిలిచె

పొడవుకు పొడవగు పురుషోత్తముడిదె
బుడిబుడి మాచేత పూజగొనె
విడువ కిదివో శ్రీవేంకటేశ్వరుడు
బడివాయడు మాపాలిట నిలిచి
bhaktasulabhuDunu parataMtruDu hari
yuktisAdhyamide yokarikI gADu

ninupagu lOkamulu niMDinavishNuDu
manujuDa nAlO manikiyayye
munukoni vEdamula muDigina maMtramu
konanAlikalalO gudurai niliche

yelami dEvatala nElina dEvuDu
nalugaDa nadhamuni nanu nEle
balupagu lakshmI patiyagu SrIhari
yila mAyiMTanu yidivO niliche

poDavuku poDavagu purushOttamuDide
buDibuDi mAchEta pUjagone
viDuva kidivO SrIvEMkaTESwaruDu
baDivAyaDu mApAliTa nilichi

Saturday, January 03, 2009

566.kESava dAsinaiti gelichiti - కేశవ దాసినైతి గెలిచితి నన్నిటానుRagam : sindhu bhairavi , composer : Gopalakrishna
Audio link : Nitya Santoshini
Archive link :

కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరా లికనేలా వెదక

నిచ్చలు కోరికలియ్య నీ నామమే చాలు
తెచ్చి పునీతు(జేయ నీ తీర్థమే చాలు
పచ్చి పాపాలణచ నీ ప్రసాదమే చాలు
యెచ్చుకొందు వుపాయాలు ఇకనేల వెదక

ఘనుని( జేయగని నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిసి(పి?) కావగ తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇకనేల వెదక

నెలవైన సుఖమియ్య నీధ్యానమే చాలు
నిలదాపు దండకు నీయర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు గలవు
యెలమి నితరములు యికనేల వెదక
kESava dAsinaiti gelichiti nanniTAnu
yI SarIrapu nErA likanElA vedaka

nichchalu kOrikaliyya nI nAmamE chAlu
techchi punItu(jEya nI tIrthamE chAlu
pachchi pApAlaNacha nI prasAdamE chAlu
yechchukoMdu vupAyAlu ikanEla vedaka

ghanuni( jEyagani nI kaiMkaryamE chAlu
monasi rakshiMchanu nI mudralE chAlu
manisi(pi?) kAvaga tirumaNi lAMChanamE chAlu
yenasenu dikkudesa ikanEla vedaka

nelavaina sukhamiyya nIdhyAnamE chAlu
niladApu daMDaku nIyarchanE chAlu
yilapai SrIvEMkaTESa yinniTA mAku galavu
yelami nitaramulu yikanEla vedaka


565.marachitimaMTE marilEdu - మఱచితిమంటే మరిలేదుRagam : Bhupalam , Composer & Singer : G.Balakrishnaprasad


మఱచితిమంటే మరిలేదు
తఱితో( దలచవో దైవము మనసా

పుట్టుచు నున్నది పోవుచునున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరి నామము
గుట్టున( దలచవో కొనకొని మనసా

పొద్దు వొడచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దిన దినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలచెనొనరవొ (తలచవొ వొనరగ) మనసా

లోపల వెలుపల లో(గొనివున్నది
శ్రీపతి మహిమల సృష్టియిదే
యేపున శ్రీవేంకటేశ్వరుడితడే
దాపని నమ్ముచు( దలచవో మనసా

ma~rachitimaMTE marilEdu
ta~ritO( dalachavO daivamu manasA

puTTuchu nunnadi pOvuchununnadi
paTTapu jIvula prapaMchamu
naTTanaDumanE narahari nAmamu
guTTuna( dalachavO konakoni manasA

poddu voDachunade poddu guMkunade
tiddina jagamula dina dinamu
addapu nIDala yaMtaryAmini
voddane talachenonaravo (talachavo vonaraga) manasA

lOpala velupala lO(gonivunnadi
SrIpati mahimala sRshTiyidE
yEpuna SrIvEMkaTESwaruDitaDE
dApani nammuchu( dalachavO manasA

564.sEviMturA yitani( jelagi - సేవింతురా యితని( జెలగి పరులిట్లనే


Audio link : composed by Dr.Pasupati
Archive link :
సేవింతురా యితని( జెలగి పరులిట్లనే
కావించె మమ్ము నెక్కడిదై మితడు

పాలచవి యితడెఱుగు పాలబవళించ గో
పాలుడని నే మితని భజియించగా
పాలుపడి తల్లిచనుబాలు సహితంబు నే
కాలమును( బాపె నెక్కడిదైవ మితడు

పుట్టింప( దానె మఱి పురుషోత్తముడు మంచి
పుట్టు వొసగీననుచు పూజించగా
పట్టుకొని మముదెచ్చి బలిమి( బుత్తువు లెల్ల(
గట్టిపెట్టించె నెక్కడిదైవమితడు

కర్మ కర్తారుడని కడలేని పుణ్యముల
కర్మ ఫలములు దనకు( గైకొలుపగా
కర్మగతి(కలి)( దెచ్చి వేంకటవిభుడు మావుభయ-
కర్మములు( జెరిచె నెక్కడిదైవ మితడు
sEviMturA yitani( jelagi paruliTlanE
kAviMche mammu nekkaDidai mitaDu

pAlachavi yitaDe~rugu pAlabavaLiMcha gO
pAluDani nE mitani bhajiyiMchagA
pAlupaDi tallichanubAlu sahitaMbu nE
kAlamunu( bApe nekkaDidaiva mitaDu

puTTiMpa( dAne ma~ri purushOttamuDu maMchi
puTTu vosagInanuchu pUjiMchagA
paTTukoni mamudechchi balimi( buttuvu lella(
gaTTipeTTiMche nekkaDidaivamitaDu

karma kartAruDani kaDalEni puNyamula
karma phalamulu danaku( gaikolupagA
karmagati(kali)( decchi vEMkaTavibhuDu mAvubhaya-
karmamulu( jeriche nekkaDidaiva mitaDu

Friday, January 02, 2009

563.A rUpamunakE hari nEnu - ఆ రూపమునకే హరి నేను మొక్కెదనుRaga : Sudhdhasaveri , composer : Balakrishnaprasad
Audio link :
Archive link :

ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
చేరి బిభీషణుని శరణాగతుడని చేకొని సరిగాచితివి

ఫాలలోచనుడు బ్రహ్మయు నింద్రుడు
సోలి నగ్నియును సూర్యచంద్రులును
నీలోనుండగ నెరి గనె కిరీటి
మూల భూతివగు మూర్తివి గాన

అనంత శిరసుల ననంతపదముల
ననంతనయనము లనంతకరముల
ఘన నీరూపము కనుగొనె కిరీటి
అనంతమూరితి వన్నిట గాన

జగములిన్నియును సకల మునీంద్రులు
నగు శ్రీవేంకటనాధుడ నిన్నే
పొగడగ కిరీటి పొడగనె నీరూపు
అగణిత మహిముడ వన్నిట గాన
A rUpamunakE hari nEnu mokkedanu
chEri bibhIshaNuni SaraNAgatuDani chEkoni sarigAchitivi

phAlalOchanuDu brahmayu niMdruDu
sOli nagniyunu sUryachaMdrulunu
nIlOnuMDaga neri gane kirITi
mUla bhUtivagu mUrtivi gAna

anaMta Sirasula nanaMtapadamula
nanaMtanayanamu lanaMtakaramula
ghana nIrUpamu kanugone kirITi
anaMtamUriti vanniTa gAna

jagamulinniyunu sakala munImdrulu
nagu SrIvEMkaTanAdhuDa ninnE
pogaDaga kirITi poDagane nIrUpu
agaNita mahimuDa vanniTa gAna

562.avadhAru dEva harikula - అవధారు దేవ హరికుల రామAudio link :
Archive link :

అవధారు దేవ హరికుల రామ
వివిధమై నీబంటు వెలయుచున్నాడు

అదె కలశాపుర హనుమంత రాయడు
కదనము లోన రక్కసుల గొట్టి
యెదుట నిందరి లోన నేకాంగవీరుడై
కొదలేక ప్రతాపించి కొలువైవున్నాడు

చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన
వల్లెగా వేసుకొన్న వాలముతోడ
పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని
కొల్లున మంటపములో కొలువై వున్నాడు

పెక్కు పండ్ల గొలలు పిడికిట( బట్టుకొని
చక్కగా పెరిగి పెద్దజంగ చాచి
యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ
గుక్కక నీపై భక్తి( గొలువై విన్నాడు
avadhAru dEva harikula rAma
vividhamai nIbaMTu velayuchunnADu

ade kalaSApura hanumaMta rAyaDu
kadanamu lOna rakkasula goTTi
yeduTa niMdari lOna nEkAMgavIruDai
kodalEka pratApiMchi koluvaivunnADu

challani vanAla nIDa sAguDu koMDalalOna
vallegA vEsukonna vAlamutODa
palladAna valakElu paMtamuna nettukoni
kolluna maMTapamulO koluvai vunnADu

pekku paMDla golalu piDikiTa( baTTukoni
chakkagA perigi peddajaMga chAchi
yikkuva SrIvEMkaTAdri niravaina sarwESa
gukkaka nIpai bhakti( goluvai vinnADu

561.chUDavamma kRShNuDu - చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ


Audio link :NC Sridevi
Archive link :

చూడవమ్మ కృష్ణుడు నీసుతుడోయమ్మ
ఆడీ వీధులవేంట యశోదమ్మ

కోలలు చాచి వుట్లు గొట్టగా పాలుపెరుగు
కాలువలు గట్టి పారెగదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మ

చక్కిలాలకుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోటికోలల దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరున గారె యశోదమ్మా

అల్లంతనుండి తనకందరాని తెంకాయలు
వల్లెతాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుడలమేల్మంగపతి శ్రీవేంకటేశుడు
అల్లిబిల్లై యున్నాడమ్మ యశోదమ్మ
chUDavamma kRShNuDu nIsutuDOyamma
ADI vIdhulavEMTa yaSOdamma

kOlalu chAchi vuTlu goTTagA pAluperugu
kAluvalu gaTTi pAregadavammA
mElamulADI vaddaMTE mikkili golletalatO
AlakiMchi vinavamma yaSOdamma

chakkilAlakuMDalellA chalAna doMDlu voDichi
dikkana dOTikOlala dIsInammA
chikkani tEne chADe chivvana rAta vEsitE
akkaDa jOruna gAre yaSOdammA

allaMtanuMDi tanakaMdarAni teMkAyalu
valletALLu vEsi vaMchInammA
balliduDalamElmaMgapati SrIvEMkaTESuDu
allibillai yunnADamma yaSOdamma

560.chUDudiMdariki sulabhuDu hari - చూడుదిందరికి సులభుడు హరిRagam : Bhairavi, Composer&Singer : G.Balakrishnaprasad
Audio link :GBKP
Archive link :

Kirtana on Annamacharya's guru , Adivan Satagopayati,
to know more about Satagopayati , click here..

చూడుడిందరికి సులభుడు హరి
తోడు నీడయగు దొరముని యితడు

కైవల్యమునకు కనకపు తాపల-
త్రోవై శ్రుతులకు తుదిపదమై
పావన మొకరూపంబై విరజకు
నావై నున్నాడిదె యితడు

కాపాడగ లోకములకు సుజ్ఞాన
దీపమై జగతికి తేజమై
పాపాలడపగ భవపయోధులకు
తేపై యున్నాడిదే యితడు

కరుణానిధి రంగపతికి కాంచీ-
వరునకు వేంకటగిరిపతికి
నిరతి నహోబలనృకేసరికి త-
త్పరుడగు శఠగోపముని యితడూ
chUDudiMdariki sulabhuDu hari
tODu nIDayagu doramuni yitaDu

kaivalyamunaku kanakapu tApala-
trOvai Srutulaku tudipadamai
pAvana mokarUpaMbai virajaku
nAvai nunnADide yitaDu

kApADaga lOkamulaku suj~nAna
dIpamai jagatiki tEjamai
pApAlaDapaga bhavapayOdhulaku
tEpai yunnADidE yitaDu

karuNAnidhi raMgapatiki kAMchI-
varunaku vEMkaTagiripatiki
nirati nahObalanRkEsariki ta-
tparuDagu SaThagOpamuni yitaDU

Thursday, January 01, 2009

559.adinE neraganA aMtalO - అదినే నెఱగనా అంతలోClick here to download to this kirtana composed and sung by Mangalampalli BalamuraliKrishna

Archive link :


అదినే నెఱగనా అంతలో భ్రమతు(గాక
మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే

యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము

నానాదేశ వార్తలు నడుమ చింతా మూలము
పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము
ఆనినకృషివాణిజ్యాలన్నియు( దీరని వెట్టి
మానని యాచార మాత్మకు( బడ్దపాటు

పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలగు నాచార్య సేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండు విధాలు
నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి
adinE ne~raganA aMtalO bhramatu(gAka
madanajanaka nAku maMchibudhdhi yiyyavE

yeMta lOkAnubhavamu aMtayu vrithA nashTi
koMtaina brahmachiMta kOTilAbhamu
viMtaina janulatODi vinOdamu nishphalamu
cheMta sajjana saMgati chErina yAdAyamu

nAnAdESa vArtalu naDuma chiMtA mUlamu
pUnina purANa gOshThi puNyamUlamu
AninakRshivANijyAlanniyu( dIrani veTTi
mAnani yAchAra mAtmaku( baDdapATu

palu chuTTarikamulu baTTabayalu taguLLu
chelagu nAchArya sEva jIvanmukti
balimi SrIvEMkaTESa paraga reMDu vidhAlu
nilukaDayinavADavu nIvE yinniTiki