Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [E_Annamayya]. Show all posts
Showing posts with label [E_Annamayya]. Show all posts

Saturday, July 18, 2026

924. eTula buTTiMchitO neeveruguduvu - ఎటుల బుట్టించితో నీవెరుఁగుదువు

Youtube link ": Malladi Brothers 

ఎటులఁ బుట్టించితో నీవెరుఁగుదువు

ఘటన నన్నియు నీ సంకల్ప మే‌ అయ్యా ॥పల్లవి॥


చచ్చేవారిఁజూచి చావుకు వెరతుగాఁన

రొచ్చులసంసారముప రోతుఁగాని

కచ్చుపెట్టి ఆదియె కాలాఁజేతాఁబెనఁగఁగ

మచ్చికసేయుదుఁగాని మానలేనయ్యా ॥ఎటు॥


బడలేవారిఁ జూచి బడల నోపఁగాన

విడువనిసంపదపై విసిగేఁగాని

పెడవాయ కదియె పెరుగుచురాఁగాను

బడిఁ దిరుగుదుఁగాని పాయలేనయ్యా ॥ఎటు॥


ములిగేవారిఁ జూచి ములుగ నోడుదుఁగాన

శిలుగుఁగోరికలఁ గోసితిఁ గాని

కలిమితో శ్రీవెంకటనాథ నీభక్తి

వెలయఁ గోరుదుఁగాని విడువలేనయ్యా ॥ఎటు॥


eTula@M buTTiMchitO neeveru@Mguduvu

ghaTana nanniyu nee saMkalpa mae‌ ayyaa


chachchaevaari@Mjoochi chaavuku veratugaa@Mna

rochchulasaMsaaramupa rOtu@Mgaani

kachchupeTTi aadiye kaalaa@Mjaetaa@Mbena@Mga@Mga

machchikasaeyudu@Mgaani maanalaenayyaa


baDalaevaari@M joochi baDala nOpa@Mgaana

viDuvanisaMpadapai visigae@Mgaani

peDavaaya kadiye peruguchuraa@Mgaanu

baDi@M dirugudu@Mgaani paayalaenayyaa


muligaevaari@M joochi muluga nODudu@Mgaana

Silugu@MgOrikala@M gOsiti@M gaani

kalimitO SreeveMkaTanaatha neebhakti

velaya@M gOrudu@Mgaani viDuvalaenayyaa

Saturday, February 08, 2025

923. eMtavADavayya nIvu yekkaDekkaDa - ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ

 Youtube Link : Sri NC Sridevi

ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ

పొంత నీ జాణతనాలు పొగడేము నేము


మాటలనే తేనెలూరీ మంతనాన నోరూరీ

యేట వెట్టే నీ మహిమ లెక్కడ

తేటలు నీచేత విని దేహమెల్లాఁ జెమరించె

మూటలుగా నవ్వితిమి మొక్కేము నీకు


చూపులనే వాఁడి రేఁగీ సొలపుల నాసరేఁగీ

యేపున నీయెమ్మె లివి యెక్కడెక్కడ

తీపుల నీపాలఁ జిక్కి తిద్దుపడె గుణమెల్ల

మోపుగా వలచితిమి మొక్కేము నీకు


కందువల దమి వుట్టె కాఁగిట బీరము వుట్టీ

ఇందులోని నీ నేరుపు లెక్కడెక్కడ

పొ౧దితి శ్రీ వేంకటేశ భోగము రతులకెక్కె

ముందర నింకొకమాఁటు మొక్కేము నీకు


eMtavaa@MDavayya neevu yekkaDekkaDa

poMta nee jaaNatanaalu pogaDaemu naemu


maaTalanae taenelooree maMtanaana nOrooree

yaeTa veTTae nee mahima lekkaDa

taeTalu neechaeta vini daehamellaa@M jemariMche

mooTalugaa navvitimi mokkaemu neeku


choopulanae vaa@MDi rae@Mgee solapula naasarae@Mgee

yaepuna neeyemme livi yekkaDekkaDa

teepula neepaala@M jikki tiddupaDe guNamella

mOpugaa valachitimi mokkaemu neeku


kaMduvala dami vuTTe kaa@MgiTa beeramu vuTTee

iMdulOni nee naerupu lekkaDekkaDa

po~1diti Sree vaeMkaTaeSa bhOgamu ratulakekke

muMdara niMkokamaa@MTu mokkaemu neeku

Friday, December 02, 2022

917. EmI neragani nannu niMta sEsiti - ఏమీ నెఱఁగని నన్ను నింత సేసితి

 


ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువ సేసి

పామరుల దొడ్డఁ జేసె భాష్యకారులు


గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి

అతని కరుణచేత నన్నియుఁ గని

గతిలేకపోయిన కలియుగమున వచ్చి

ప్రతిపాలించఁగలిగె భాష్యకారులు


లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి

ఆకుమీఁదఁ దేలిన యతని కృప

కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే

పైకొనఁగఁ గరుణించె భాష్యకారులు


పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁ బరమిచ్చిన-

వేంకటేశు కృపతోడ వెలయఁ దానే

తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన

పంకమెల్లఁ బోఁ గడిగె భాష్యకారులు


aemee ne~ra@Mgani mammu nekkuva saesi
paamarula doDDa@M jaese bhaashyakaarulu

gatachannavaedaalu kamalajunaku nichchi
atani karuNachaeta nanniyu@M gani
gatilaekapOyina kaliyugamuna vachchi
pratipaaliMcha@Mgalige bhaashyakaarulu

lOkamella velli@MbO@Mgaa lOnanae surala@M gaachi
aakumee@Mda@M daelina yatani kRpa
kaakarimatamulella gaali@Mbuchchi para miTTae
paikona@Mga@M garuNiMche bhaashyakaarulu

paMkajapu@M jaeyi chaa@Mchi paadapu@M baramichchina-
vaeMkaTaeSu kRpatODa velaya@M daanae
teMkinae voDayavarai tirumaMtradvayaana
paMkamella@M bO@M gaDige bhaashyakaarulu

Video by Sri Malladi Brothers, Tune by Sri Malladi Suribabu raga:VarALi
source : https://www.youtube.com/@tallapaka-annamacharya
link : https://www.youtube.com/watch?v=_kIE55yxpSo

Thursday, September 30, 2021

907. ఎదురేది యింక మాకు యెందు చూచినను - eduraedi yiMka maaku yeMdu choochinanu

 Archive link : Sri Sathiraju Venumadhav

Youtube link: Sri G BalakrishnaPrasad

Muchukunda - Wikipedia 

 ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు    -పల్లవి-

గోపికానాథ గోవర్ధనధరా
శ్రీపుండరీకాక్ష జితమన్మథా
పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా
నీపాదములే మాకు నిధినిధానములు    -ఎదు-

పురుషోత్తమా హరీ భువనపరిపాలకా
కరిరాజవరద శ్రీకాంతాధిప
మురహరా సురవరా ముచుకుందరక్షకా
ధరణి నీపాదములె తల్లియును దండ్రి    -ఎదు-

దేవకీనందనా దేవేంద్రవందితా
కైవల్యనిలయ సంకర్షణాఖ్య
శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా
కావ నీపాదములె గతి యిహముఁ బరము    -ఎదు-

 eduraedi yiMka maaku yeMdu choochinanu nee-
padamu livi reMDu saMpadalu saukhyamulu    -pallavi-

gOpikaanaatha gOvardhanadharaa
SreepuMDareekaaksha jitamanmathaa
paapahara sarvaeSa paramapurushaachyutaa
neepaadamulae maaku nidhinidhaanamulu    -edu-

purushOttamaa haree bhuvanaparipaalakaa
kariraajavarada SreekaaMtaadhipa
muraharaa suravaraa muchukuMdarakshakaa
dharaNi neepaadamule talliyunu daMDri    -edu-

daevakeenaMdanaa daevaeMdravaMditaa
kaivalyanilaya saMkarshaNaakhya
SreevaeMkaTaeSvaraa jeevaaMtaraatmakaa
kaava neepaadamule gati yihamu@M baramu    -edu-

Wednesday, December 23, 2020

899. eTTu dhariMchenO yiMdAkAnu - ఎట్టు దరించెనో యిందాఁకాను

Video link : From Sri Tadepalli Patanjali's FB page

Sung by Malladi Brothers, tuned by Sri Malladi Suribabu, in Raga : Nalinakanti 

ఎట్టు దరించెనో యిందాఁకాను
దట్టమై యిప్పుడే తమకించీని    

కన్నులకలికి కాఁకలు చల్లీ
మన్నన చూపుల మగనిపయి
వెన్నెల నవ్వులు వెదలువెట్టీ
పన్నినమోహానఁ బ్రాణేశుమీఁద    

చిలుకలకొలికి చేతులు చాఁచీ
వెలయు సిగ్గుల విభునిపై
చలివేఁడివూర్పు సారెకుఁజల్లీ
కలిమి మెరసి కాంతునిమీఁద    

అలిమేలుమంగ ఆయాలు మోపీ
యెలమి శ్రీవేంకటేశునిపై
నిలువున ముద్దు నేఁడే గునిసీ
యిలఁ దనపతి యీతనిఁ గూడి    


eTTu dariMchenO yiMdaa@Mkaanu
daTTamai yippuDae tamakiMcheeni   

kannulakaliki kaa@Mkalu challee
mannana choopula maganipayi
vennela navvulu vedaluveTTee
panninamOhaana@M braaNaeSumee@Mda   

chilukalakoliki chaetulu chaa@Mchee
velayu siggula vibhunipai
chalivae@MDivoorpu saareku@Mjallee
kalimi merasi kaaMtunimee@Mda   

alimaelumaMga aayaalu mOpee
yelami SreevaeMkaTaeSunipai
niluvuna muddu nae@MDae gunisee
yila@M danapati yeetani@M gooDi   


897. ennaDu delisE mechcharikepuDO - ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో

Video link: From Sri Tadepalli Patanjali's FB page

ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో
ఇన్నియుఁ గన్నవె యెఱిఁగీ నెఱఁగ

నిన్నటియాఁకలి నేఁడూ నున్నది
కన్నదినంబే కడచనెను
పన్ని నిదుర మాపటికి నున్నదదె
యెన్నఁగ రాతిరి యెందో పోయ    

కాయపు సుఖములు గంపల నున్నవి
పాయమే కైవాలి పండెనదే
యీయెడ సంసార మింటనే వున్నది
చేయును నోరును చెనటై నిలిచె    

విడువని జన్మములు వెంటనే వచ్చీ
తడవేటి మోక్షము దవ్వాయ
యెడపక శ్రీవేంకటేశ నీ మఱఁగు
బడిఁ జొచ్చితి నా భారము నీది

enna@MDu delisae mechcharikepuDO
inniyu@M gannave ye~ri@Mgee ne~ra@Mga

ninnaTiyaa@Mkali nae@MDoo nunnadi
kannadinaMbae kaDachanenu
panni nidura maapaTiki nunnadade
yenna@Mga raatiri yeMdO pOya   

kaayapu sukhamulu gaMpala nunnavi
paayamae kaivaali paMDenadae
yeeyeDa saMsaara miMTanae vunnadi
chaeyunu nOrunu chenaTai niliche   

viDuvani janmamulu veMTanae vachchee
taDavaeTi mOkshamu davvaaya
yeDapaka SreevaeMkaTaeSa nee ma~ra@Mgu
baDi@M jochchiti naa bhaaramu needi



Sunday, June 28, 2020

889. ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా - Edi mAku gati yika neeSvaraeSvaraa


Audio archive link: Tuned and sung by Sri Sathiraju Venumadhav in ragam Dharmavati
ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా
యీ దెస మము గరుణ నీడేర్చవయ్యా

పొంచిమున్ను భోగించిన భోగములు దలఁచి
అంచెల నాలుబిడ్డల నటు దలఁచి
కంచపుటాహరములు కన్నవెల్లాను దలఁచి
యెంచి నిన్నుఁ దలఁచక యిట్లున్నారమయ్యా   

కన్నులఁజూచినందెల్లా కడునాసలఁ దగిలి
విన్న వినుకులకెల్లా వేడ్కఁదగిలి
పన్నిన సుఖములకుఁ బైకొని వెనుతగిలి
వున్నతి నిన్నుఁ దగులుకున్నారమయ్యా   

చెంది గృహారామ క్షేత్రములు మరిగి
పొందగు సంసారమిప్పుడు మరిగి
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి
కందువ మరిగీ మరుగకున్నారమయ్యా 
  


aedi maaku gati yi@Mka neeSvaraeSvaraa
yee desa mamu garuNa neeDaerchavayyaa

poMchimunnu bhOgiMchina bhOgamulu dala@Mchi
aMchela naalubiDDala naTu dala@Mchi
kaMchapuTaaharamulu kannavellaanu dala@Mchi
yeMchi ninnu@M dala@Mchaka yiTlunnaaramayyaa   

kannula@MjoochinaMdellaa kaDunaasala@M dagili
vinna vinukulakellaa vaeDka@Mdagili
pannina sukhamulaku@M baikoni venutagili
vunnati ninnu@M dagulukunnaaramayyaa   

cheMdi gRhaaraama kshaetramulu marigi
poMdagu saMsaaramippuDu marigi
aMdapu Sree vaeMkaTaeSa alamaelmaMgapativi
kaMduva marigee marugakunnaaramayyaa   

Saturday, May 09, 2020

874. Ela mammu taDavEvu yiMkAnayya - ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య

 Youtube link
Annamayya pataku pattabhishekam, tuned by Sri Ramachari, Singer Sri Mruduravali

ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య
యేలితివి నాఁడెనాఁడె యెరుఁగుదుమయ్యా

చిత్తములో చింతలెక్కి చిగురులు గోసేవారు
అత్తి నిన్ను వెదకేరు అదిగోవయ్య
వౌత్తిలి నవ్వులు నవ్వి వొడుళ్ళు నించేవారు
బత్తులు సేసేరు నీకుఁ బైకొనవయ్యా   

మించులమాటల మంద మిరియాలు చల్లేవారు
అంచుల నిన్నుఁబిలిచేరాలకించవయ్య
పొంచి నీతో జాళెలేక బొమ్మరాలు వేసేవారు
ముంచి చేతులు చాఁచేరు మొగిఁజూడవయ్యా   

తోడనెసరెత్తి లేళ్ళఁ దోలేటియట్టివారు
యీడనే విందులు చెప్పేరియ్యకోవయ్య
కూడితి శ్రీవెంకటేశ గొబ్బున నిదె నేఁడు
వాడికెగా కొంతగొంత వారిమెచ్చవయ్యా   


aela mammu@M daDavaevu yiMkaanayya
yaelitivi naa@MDenaa@MDe yeru@Mgudumayyaa

chittamulO chiMtalekki chigurulu gOsaevaaru
atti ninnu vedakaeru adigOvayya
vauttili navvulu navvi voDuLLu niMchaevaaru
battulu saesaeru neeku@M baikonavayyaa   

miMchulamaaTala maMda miriyaalu challaevaaru
aMchula ninnu@MbilichaeraalakiMchavayya
poMchi neetO jaaLelaeka bommaraalu vaesaevaaru
muMchi chaetulu chaa@Mchaeru mogi@MjooDavayyaa   

tODanesaretti laeLLa@M dOlaeTiyaTTivaaru
yeeDanae viMdulu cheppaeriyyakOvayya
kooDiti SreeveMkaTaeSa gobbuna nide nae@MDu
vaaDikegaa koMtagoMta vaarimechchavayyaa   

Saturday, April 18, 2020

867. E poddu chuchina dEviDiTAnE yAragiMchu - ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు

Youtube link
Audio archive link: tuned and sung by Sri Sathiraju Venumadhav,  in Raga: Janjhuti


ఉ. నించిన పంచదారలును నేతుఁలు దేనెలు గమ్మ గాఁగఁ దా
లించినకూరలున్‌ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్పఁగ నారగింతు నీ
మించిన వేయుచేతులును మేలములాడుచు వేంకటేశ్వరా!

 
ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు
రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను    ॥పల్లవి॥

మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు
సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు
ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను
బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను    =ఏపొ=

పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు
వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు
బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను
అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను    =ఏపొ=

పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును
వండి యలమేలుమంగ వడ్డించఁగా
అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ
దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను    =ఏపొ=



ae poddu choochina daevu@M DiTaanae yaaragiMchu
roopulatO@M badivaelu ruchulainaTluMDenu    pallavi

maerumaMdaraalavale merayu niDDenalu
sooriyachaMdrulavaMTi chuTTu@MbaLLaelu
aaraniraajaannaalu aMdupai vaDDiMcha@Mgaanu
bOrana chukkalu raasi vOsinaTluMDenu    =aepo=

palu jaladhulavaMTi pai@MDiveMDiginnelu
veli@MgoMDalaMtalaesi vennamuddalu
balasina chilupaalu paMchadaara guppa@Mgaanu
alaru vennelarasa maMdichchinaTluMDenu    =aepo=

paMDina paMTalavaMTi pachchaLLu@M gooralunu
vaMDi yalamaelumaMga vaDDiMcha@Mgaa
aMDanae SreevaeMkaTaeSu@M DaaragiMchee migula@Mga
daMDigaa daasulakellaa daa@MchinaTluMDenu    =aepo=

Wednesday, March 04, 2020

863. ItaDakhilaMbunaku nIsharuMDai - ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల



Audio link: Smt Vani Jayaram
Explanation:  Kiran Mangalampalli
ఈతఁ డఖిలంబునకు నీశ్వరుఁడై సకల-
భూతములలోనఁ దాఁ బొదలు వాఁడితఁడు    ॥పల్లవి॥


గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద
చూపట్టుకమ్మఁ గస్తూరిపూఁత యితఁడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితఁడు    ॥ఈతఁడ॥


జలధికన్యాపాంగ లలితేక్షణములలో
కలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడు
జలజాసనుని వదన జలదిమద్యము నందు
అలర వెలువడిన పరమామృతం బితఁడు    ॥ఈతఁడ॥


పరివోని సురత సంపదల నింపులచేత
వరవధూతతికి పరమమైన యితఁడు
తిరువేంకటాచలధిపుఁడు దానె యుండి
పరిపాలనము సేయ భారకుండితఁడు    ॥ఈతఁడ॥


eeta@M DakhilaMbunaku neeSvaru@MDai sakala-
bhootamulalOna@M daa@M bodalu vaa@MDita@MDu    -pallavi


gOpaaMganala me~ru@Mgu gubbachannulamee@Mda
choopaTTukamma@M gastooripoo@Mta yita@MDu
taapasOttamula chiMtaasaudhamulalOna
deepiMchu suj~naanadeepa mita@MDu    -eeta@MDa-


jaladhikanyaapaaMga lalitaekshaNamulalO
kalasi velu@Mguchu nunna kajjalaM bita@MDu
jalajaasanuni vadana jaladimadyamu naMdu
alara veluvaDina paramaamRtaM bita@MDu    -eeta@MDa-


parivOni surata saMpadala niMpulachaeta
varavadhootatiki paramamaina yita@MDu
tiruvaeMkaTaachaladhipu@MDu daane yuMDi
paripaalanamu saeya bhaarakuMDita@MDu    -eeta@MDa-


భావము :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

     తేనెలూరే అన్నమాచార్య కీర్తనను ఆస్వాదించండి. ఈ పొడవునకు పొడవైన పురుషోత్తముడు సృష్టికంతటికీ ఈశ్వరుడు. ప్రతి ప్రాణిలోనూ తానే ఆత్మ రూపంలో వ్యవహరిస్తుంటాడు. ఆయన భక్తులైన మనందరికోసం ఎన్నో అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి మనందరినీ అలరించాడు. నేడు ఈ మహానుభావుడే తిరువెంకటనాథుడై జగములను పరిపాలిస్తున్నాడు. మనందరి బరువు తానే భరిస్తూ భారకుడని పేరు పొందాడు.

     ఈతడే అఖిలంబునకు ( సమస్తమునకు ) ఈశ్వరుడై ( అధినాథుడై ) వ్యవహరించుచున్నాడు. సకల భూతములలోనూ ( సర్వ ప్రాణులలో ) తానే ఆత్మరూపములో పొదలువాడు ( వర్ధిల్లువాడు ).

     జవ్వనులైన గోపకన్నెల మెరుగు ఘన స్తనములపైన కనుపించు కమ్మని కస్తూరిపూత ఇతడే. అలాగని ఈయన కేవలం విలాస పురుషుడా? కానేకాదు. ఉత్తమోత్తములైన తాపసుల చింతాసౌధములలో ( భావనా భవంతులలో ) వెలుగుతున్న సుజ్ఞానమనే దీపము ఈ యోగీశ్వరుడే సుమా!

     జలధికన్య ( క్షీరసాగర తనయ అయిన శ్రీమహాలక్ష్మి ) అపాంగ లలితేక్షణములలో ( అందమైన కడగంటి చూపులలో ) ఉన్న వెలుగులు విరజిమ్ము కజ్జలంబు ( కాటుక ) ఈతడే ( ఈ రమాకాంతుడే ). జలజాసనుని ( బ్రహ్మదేవుని ) ముఖములనే సంద్రముల మధ్య వెలసి అలరుచున్న పరమజ్ఞానామృతము ఈతడే.

     పరిమితులు లేని సంభోగసమాగమములో వధూవరులకు వైభవము నింపుతూ పరవశత్వము కలిగించునది ఎవరనుకున్నారు? ఈ జగన్నాథుడే. ఇదుగో నేడు తిరుమల శిఖరాలపై శ్రీవేంకటేశ్వరుడై తానేయుండి పరిపాలనము చేయుచున్న భారకుడు ( అందరి భారమును వహించేవాడు ) ఈ దేవదేవుడే.
 


Saturday, July 20, 2019

859. aemanavachchunu chelluchunnavive - ఏమనవచ్చును చెల్లుచున్నవివె

Tuned and Sung by Sri Sathiraju Venumadhav : Audio link

ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు    -పల్లవి-


కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే    -ఏమ-
 

శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే    -ఏమ-
 

శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే    -ఏమ-



aemanavachchunu chelluchunnavive yeeSvara neemaayalu gonni
Sreemaadhava nee chittamu kola@Mdi@Mka cheppeDidae@MTiki jeevulaku    -pallavi-
kalidOshaniruharaNa kaivalyaakara hari
tala@Mchinavaaridi naerupu mimu@M dala@Mchanivaaridi naerami
kalushameDali sooryOdayamainaa kaanavukonnijaMtuvulu
telisinavaaralu kaMduru yeetera@Mgalu reMTiki dinamokaTae    -aema-
SaraNaagatarakshaNachatura sarvaaMtaraatmaka yachyuta
sari ninnu@M golichinavaaridi puNyamu chalamuna maanuTae paapamu
sarugana@M gaachaeTi challani chaMdru@MDu jaarachOrulaku@M gaDu vae@MDi
araya@Mga@M galuvalakunu hitu@MDu aMduku niMduku guri yita@MDae    -aema-
SreevaeMkaTagirinilaya SreesateeSa purushOttama
mivoddanuMDitae vaikuMThamu mimmu neDasitae narakamu
bhaavamulOpala neevae vuMDa@Mga bhakti laedu koMdarikaitae
SreevaishNuvulaku nityamu yee chiMtalu reMTiki nee mahimae    -aema-

Monday, May 13, 2019

855. ఏమి నిద్దిరించేవు యెందాఁకాను - Emi niddiriMchEvu yeMdAkAnu

Tuned and sung by Sri . Sattiraju Venumadhav: Youtube link
Amazon Music Link: 

Youtube video lessn by Sri Venumadhav
ఏమి నిద్దిరించేవు యెందాఁకాను
కామించి బ్రహ్మాదులెల్లఁ గాచుకున్నా రిదివో    =పల్లవి=

పులుఁగాలుఁ బచ్చళ్ళు బోనము వెట్టినదిదే
వెలయు ధనుర్మాస వేళయు నిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే
జలజాక్షుఁడ లేచి జలక మాడవయ్యా    =ఏమి=

తోడనే గంధాక్షతలు ధూపదీపా లివిగో
కూడిన విప్రుల వేద ఘోషణ లివే
వాడుదేరఁ బూజించవలెఁ గమ్మఁబువ్వులివె
వీడెమిదె కొలువుకు విచ్చేయవయ్యా    =ఏమి=

చదివేరు వైష్ణవులు సారెఁ దిరువాము డిదె
కదిసి శ్రీసతి ముందే కాచుకున్నది
అదనాయ శ్రీవేంకటాధిప మా చరపిదే
యెదుట నిన్నటిమాపే యియ్యకొంటివయ్యా    =ఏమి=

aemi niddiriMchaevu yeMdaa@Mkaanu
kaamiMchi brahmaadulella@M gaachukunnaa ridivO    =pallavi=

pulu@Mgaalu@M bachchaLLu bOnamu veTTinadidae
velayu dhanurmaasa vaeLayu nidae
balasi saMkeertanaparulu paaDaeridae
jalajaakshu@MDa laechi jalaka maaDavayyaa    =aemi=

tODanae gaMdhaakshatalu dhoopadeepaa livigO
kooDina viprula vaeda ghOshaNa livae
vaaDudaera@M boojiMchavale@M gamma@Mbuvvulive
veeDemide koluvuku vichchaeyavayyaa    =aemi=

chadivaeru vaishNavulu saare@M diruvaamu Dide
kadisi Sreesati muMdae kaachukunnadi
adanaaya SreevaeMkaTaadhipa maa charapidae
yeduTa ninnaTimaapae yiyyakoMTivayyaa    =aemi=
 

Wednesday, May 08, 2019

853. emmekADu gade yIdaevuDu - ఎమ్మెకాఁడు గదె యీదేవుఁడు



Audio Archive link : Sri G. Balakrishnaprasad
ఎమ్మెకాఁడు గదె యీదేవుఁడు
కుమ్మరించీ మేలు గోవిందరాజు    ॥పల్లవి॥

గొల్లెత లిందరు కొలువు సేయఁగ
నల్లదె సరసమాడుచును
తెల్లని కన్నుల తేట చూపులతో
కొల్లున నవ్వీని గోవిందరాజు    ॥॥

పడఁతు లిద్దరు పాదా లొత్తఁగాను
అడరి కుచుము లంటుచును
వెడగుమాటలు వేవే లాడుతాను
కొడుకుఁ గనెను గోవిందరాజు    ॥॥

వూడిగపువారు వొద్దనే వుండఁగ
జూడువలపులు చల్లుచును
వేడుకతో శ్రీవేంకటాద్రిమీఁదఁ
గూడీ నిందరిని గోవిందరాజు    ॥॥

emmekaa@MDu gade yeedaevu@MDu
kummariMchee maelu gOviMdaraaju -pallavi
golleta liMdaru koluvu saeya@Mga
nallade sarasamaaDuchunu
tellani kannula taeTa choopulatO
kolluna navveeni gOviMdaraaju    ==
paDa@Mtu liddaru paadaa lotta@Mgaanu
aDari kuchumu laMTuchunu
veDagumaaTalu vaevae laaDutaanu
koDuku@M ganenu gOviMdaraaju    ==
vooDigapuvaaru voddanae vuMDa@Mga
jooDuvalapulu challuchunu
vaeDukatO SreevaeMkaTaadrimee@Mda@M
gooDee niMdarini gOviMdaraaju    ==

Tuesday, April 16, 2019

851. Emani nutiMchavachchu nitaniroopamu - ఏమని నుతించవచ్చు నితనిరూపము

 ఏమని నుతించవచ్చు నితనిరూపము
భీమవిక్రముఁ డితఁడు పెద్ద హనుమంతుఁడు    ॥పల్లవి॥


వొక్కజంగఁ చాఁచినాఁడు వొగిఁ దూర్పుఁబడమర
తక్కక భుజా లుబ్బించె దక్షిణోత్తరాలు నిండ
మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెత్తెను
పిక్కటిల్లు మహిమతోఁ బెద్ద హనుమంతుఁడు    ॥ఏమ॥


వేడుక వాల మాకాశవీథితోఁ బెనచినాఁడు
యేడుజలధులు చేసె నదె మోకాళ్లబంటి
వోడక పిడికిలించి వుగ్రదైత్యుల తలలు
బేడలుగాఁ జేసినాఁడు పెద్ద హనుమంతుఁడు    ॥ఏమ॥


జళిపించి వలకేలు సకలము మెచ్చ నెత్తె
కులగిరులు తనతొడలసందినే యడఁచె
బలువుఁడు శ్రీవేంకటపతిబంటు మతంగాద్రి-
బిలమువాత నున్నాఁడు పెద్దహనుమంతుఁడు    ॥ఏమ॥


aemani nutiMchavachchu nitaniroopamu
bheemavikramu@M Dita@MDu pedda hanumaMtu@MDu    


vokkajaMga@M chaa@Mchinaa@MDu vogi@M doorpu@MbaDamara
takkaka bhujaa lubbiMche dakshiNOttaraalu niMDa
mikkili brahmalOkamu meeranu Sirasettenu
pikkaTillu mahimatO@M bedda hanumaMtu@MDu  


vaeDuka vaala maakaaSaveethitO@M benachinaa@MDu
yaeDujaladhulu chaese nade mOkaaLlabaMTi
vODaka piDikiliMchi vugradaityula talalu
baeDalugaa@M jaesinaa@MDu pedda hanumaMtu@MDu


jaLipiMchi valakaelu sakalamu mechcha nette
kulagirulu tanatoDalasaMdinae yaDa@Mche
baluvu@MDu SreevaeMkaTapatibaMTu mataMgaadri-
bilamuvaata nunnaa@MDu peddahanumaMtu@MDu 



Rahul Vellal's second performance in the Annamayya Paataku Pattabhishekam. A keertana praising Lord Hanuman by Annamacharya, set to tune in Raaga Reetigowla by Sri Josyabhatla Rajasekhara Sarma (Josyabhatla Rajasekhara SarmaYajushi Sarma). Thanks to all the wonderful musicians who worked on this song

Sunday, April 07, 2019

850. eMdu kaapuramu saetu - ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల

Archive Audio link 

ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే మూఁడు గాలములు ॥పల్లవి॥

తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో తలపోఁత మరి యొక్క లోకము
యెనసిన కలలోని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూఁడు లోకములు ॥ఎందుఁ॥

పంచభూతముల చేతిబంధ మొక్క దేహము
యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము
ముంచె నిదె వొకటిలో మూఁడు దేహములు ॥ఎందుఁ॥

జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు
తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే
శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే
మూవంకల మముఁ గాచె మొక్కితి మాతనికి ॥ఎందుఁ॥

eMdu@M gaa@Mpuramu saetu naedi nija maedi galla
muMdara nokkadinamae moo@MDu gaalamulu pallavi
tanubhOgamula nivae taga noka lOkamu
manasulO talapO@Mta mari yokka lOkamu
yenasina kalalOni didi yokka lOkamu
munupu venakalivae moo@MDu lOkamulu eMdu@M
paMchabhootamula chaetibaMdha mokka daehamu
yeMcha@Mga noorupugaali yidi yokka daehamu
koMchaka triguNamulaguri sookshma daehamu
muMche nide vokaTilO moo@MDu daehamulu eMdu@M
jeevunilOpalivaa@MDu SreevaeMkaTaeSu@MDu
taavai velinunnavaa@MDu taa nokka@MDae
SreevaeMkaTaadrimeeda@M jela@Mginaata@M DeetaDae
moovaMkala mamu@M gaache mokkiti maataniki eMdu@M

Saturday, January 31, 2015

837. enta parama baMdhudavu - ఎంత పరమ బంధుడవు యేమని


Audio Archive Link : Sattiraju Venumadhav
ఎంత పరమ బంధుడవు యేమని నుతింతు మిమ్ము
అంత నిన్ను మరచి నే నపరాధి నైతిని

దురితములే నే జేసి దు:ఖముఁబొందే నాడు
తొరలి నన్ను రోసి తొలగ వైతి
నరకము చొచ్చేనాడు నాకు నంతర్యామి వై
పరుడు వీడేల యని పాయ వైతివిగా

జనని గర్భము నందు చరిఁ బడి వుండేనాడు
వెనుబలమవై నన్ను విడువ వైతి
పెనగి పంచేద్రియాల పిరువీకులయ్యెనాడు
అనుభవింపగఁజేసి అందుకు లోనైతివి

యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుడవై
మెట్టు కొని నా యిచ్చలో మెలగితివి
యిట్టి యీ జన్మమున నన్నేలి శ్రీ వేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి

enta parama baMdhudavu Yemani nutintu mimmu
aMta ninnu marachi nE naparAdhi naitini

duritamulE nE jEsi duhkamu bonde nAdu
torali nannu rOsi tolaga vaiti
narakamu cochchenAdu nAku antaryAmi vai
parudu veedEla yani pAya vaitivigA

janani garbhamu nandu caribaDi undENadu
venubalamvai nannu viduva vaiti
penagi panchendriyaala piruveekulayyenAdu
anubhavimpaga jesi anduku lOnaitivi

yeTTE nE gorina adi ichchi paratantrudavai
meTTukoni nA yichcha lO meligitivi
yitti yee janmamuna naNNEli Sree Venkatesa
paTTi nee dAsulalO dappaka manniMcitivi 


పిరివీకులువెట్టు = అవస్థపెట్టు , రోసించు = ఆగ్రహించు , చరి = సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు (may be stuck without movement) , పరతంత్రుఁడు = one who is dependent on another.,పరాధీనుడు , మన్నించు = అనుగ్రహించు, కటాక్షించు, కనికరించు, కరుణించు, కృపసేయు, దయచేయు.. , ఇచ్చ = [అంతఃకరణము, అంతరంగము, అంతరింద్రియము, అనంగము, ఆతుమ, ఆత్మ, ఆద, ఆస్వనితము, ఆస్వాంతము, ఇచ్చ,] / మనస్సు / కోరిక. --- , మెట్టుకొను = ఒకదానిని ఒకటి తాకు.

Monday, September 08, 2014

826.eduTi nidhaanama veTuchoochina - ఎదుటి నిధానమ వెటుచూచిన


Audio Archive link :
ఎదుటి నిధానమ వెటుచూచిన నీ-
వదె వేంకటగిరి అనంతుడా



సొగసి భాద్రపదశుద్ధ చతుర్ధశి
తగువేడుక నిందరు గొలువ
పగటుసంపదలు బహుళమొసగు నీ-
వగు వేంకటగిరి అనంతుడా


తొలుత సుశీలకు దుశ్శీలవలన
వెలయ సంపదల విముఖుడవై
వలెనని కొలచిన వడి గాచినమా-
యల వేంకటగిరి అనంతుడా


కరుణ గాచితివి కౌండిన్యుని మును
పరగిన వ్రుద్ధ బ్రాహ్మడవై
దొరవులు మావులు ధ్రువముగ గాచిన-
హరి వేంకటగిరి అనంతుడా


eduTi nidhaanama veTuchoochina nee-
vade vaeMkaTagiri anaMtuDaa

sogasi bhaadrapadaSuddha chaturdhaSi
taguvaeDuka niMdaru goluva
pagaTusaMpadalu bahuLamosagu nee-
vagu vaeMkaTagiri anaMtuDaa

toluta suSeelaku duSSeelavalana
velaya saMpadala vimukhuDavai
valenani kolachina vaDi gaachinamaa-
yala vaeMkaTagiri anaMtuDaa

karuNa gaachitivi kauMDinyuni munu
paragina vruddha braahmaDavai
doravulu maavulu dhruvamuga gaachina-
hari vaeMkaTagiri anaMtuDaa

Wednesday, September 03, 2014

825.ENanayanalachoopu leMta - ఏణనయనలచూపు లెంత


Archive Audio link : M Balamuralikrishna
ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు



ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దా నుండు
అడరుసంసారంబు నట్లనే వుండు

చింతాపరంపరల జిత్త మది యెట్లుండు
వంతదొలగని మోహవశము నట్లుండు
మంతనపు బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్లనుండు

దేవుడొక్కడె యనెడితెలివి దనకెట్లుండు
శ్రీ వేంకటేశుకృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణ తది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు

aeNanayanalachoopu leMta sobagaiyuMDu
praaNasaMkaTamulagu panulu naTluMDu

eDalaeniparitaapa maereeti daa nuMDu
aDiyaasakOrikelu naTuvalene yuMDu
kaDalaenidu:khasaMgati yeTla daa nuMDu
aDarusaMsaaraMbu naTlanae vuMDu

chiMtaaparaMparala jitta madi yeTluMDu
vaMtadolagani mOhavaSamu naTluMDu
maMtanapu banulapayi manasu mari yeTluMDu
kaMtuSaramaargamulagati yaTlanuMDu

daevuDokkaDe yaneDitelivi danakeTluMDu
Sree vaeMkaTaeSukRpachaeta laTluMDu
bhaavagOcharamaina pariNa tadi yeTluMDu

kaivalyasaukhyasaMgatulu naTluMDu

Friday, February 28, 2014

808.Emi maMdu gadde yiMtulAla yI - ఏమి మందు గద్దె యింతులాల

Audio/Archive link : Anuradha Sriram, Bullemma
ఏమి మందు గద్దె యింతులాల యీ
రామ కు తిరుపతి రాముడే మందు

వెలసెటి విరహాన వేగేటి యింతికి

చెలియలాల యేమి సేతమే
చలివేడివలపుల చవిగన్న యీపెకు
వలపించిన తనవరుడే మందు

పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు

చెదరక మమమేమి సేతమే
వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగడే మందు

పొల్లవోని యాస బొరలెటి మగువకు

చెల్లఁబోమన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు
నల్లని శ్రీవేంకటనాథుడే మందు

Emi maMdu gadde yiMtulAla yI
rAma ku tirupati rAmuDE maMdu

velaseTi virahAna vEgETi yiMtiki

cheliyalAla yEmi sEtamE
chalivEDivalapula chaviganna yIpeku
valapiMchina tanavaruDE maMdu

podigonna tamakAna@M boraleTi kAMtaku

chedaraka mamamEmi sEtamE
vuduTa@M gOrikala nonareTi yIpeku
madilOpali tanamagaDE maMdu

pollavOni yAsa boraleTi maguvaku

chella@MbOmana mEmi sEtamE
kollagA rati niMti@M gUDinA@M DIpeku
nallani SrIvEMkaTanAthuDE maMdu


807.Emani pogaDudumE yIcheli chakkadanamu - ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము


Archive page : G.Anila kumar
ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర శింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె

బిసములు శంఖమును పెనుచక్రవాకములా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక అలమేలుమంగ మేనై నిలిచె

అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

Emani pogaDudumE yIcheli chakkadanamu
yImETi yalamElmaMga yekkuvaitAniliche

arachaMdruDu@M jakOrAladdAlu saMpegayu
dhara SiMgiNulu SrIlu talirulunu
arudugA@M dummidalu naMdamugA gUDagAnu
marutalli yalamElumaMgamOmai niliche

bisamulu SaMkhamunu penuchakravAkamulA
kasamu nIlapu@MjEru karikuMbhAlu
posaga vivellA noka pODimai niluvagAnu
masalaka alamElumaMga mEnai niliche

anaTulaMpapodulu nabjamulu muttElu
vonari varusa@M gUDi vuMDagAnu
ghanuDaina SrIvEMkaTESunuramumIda
panupaDalalamElmaMga pAdamulai niliche

Interpreataton of Sri Mallina Narasimharao garu in his blog