853. emmekADu gade yIdaevuDu - ఎమ్మెకాఁడు గదె యీదేవుఁడు
Audio Archive link : Sri G. Balakrishnaprasad
ఎమ్మెకాఁడు గదె యీదేవుఁడు
కుమ్మరించీ మేలు గోవిందరాజు ॥పల్లవి॥
గొల్లెత లిందరు కొలువు సేయఁగ
నల్లదె సరసమాడుచును
తెల్లని కన్నుల తేట చూపులతో
కొల్లున నవ్వీని గోవిందరాజు ॥॥
పడఁతు లిద్దరు పాదా లొత్తఁగాను
అడరి కుచుము లంటుచును
వెడగుమాటలు వేవే లాడుతాను
కొడుకుఁ గనెను గోవిందరాజు ॥॥
వూడిగపువారు వొద్దనే వుండఁగ
జూడువలపులు చల్లుచును
వేడుకతో శ్రీవేంకటాద్రిమీఁదఁ
గూడీ నిందరిని గోవిందరాజు ॥॥
emmekaa@MDu gade yeedaevu@MDu
kummariMchee maelu gOviMdaraaju -pallavi
golleta liMdaru koluvu saeya@Mga
nallade sarasamaaDuchunu
tellani kannula taeTa choopulatO
kolluna navveeni gOviMdaraaju ==
paDa@Mtu liddaru paadaa lotta@Mgaanu
aDari kuchumu laMTuchunu
veDagumaaTalu vaevae laaDutaanu
koDuku@M ganenu gOviMdaraaju ==
vooDigapuvaaru voddanae vuMDa@Mga
jooDuvalapulu challuchunu
vaeDukatO SreevaeMkaTaadrimee@Mda@M
gooDee niMdarini gOviMdaraaju ==
No comments:
Post a Comment