Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga : tODi. Show all posts
Showing posts with label Raga : tODi. Show all posts

Tuesday, March 11, 2008

415.sugrIva nArasiMha - సుగ్రీవ నారసింహ సులభుడ


Audio Archive link : Balakrshnaprasad
ప|| సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి | అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||

చ|| సనకాదులొకవంక జయవెట్టుచున్నారు | ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు |
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు | అనుపమాలంకార అవధారు దేవ ||

చ|| గంగాది నదులెల్ల కడిగి నీపాదములు | పొంగుచు సప్తర్షులు పూజించేరు |
సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ | అంగజ కోటిరూప అవధారు దేవ ||

చ|| పరగ నారదాదులు పాడేరు నీచరిత | పరమ యోగీంద్రులు భావించేరు |
సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద | అరుదుగ నున్నాడవు అవధారు దేవ ||


pa|| sugrIva nArasiMha sulaBuDa vaMdariki | agrEsaruDa nIvu avadhAru dEva ||

ca|| sanakAdulokavaMka jayaveTTucunnAru | enasi suralu cEtuletti mokkEru |
munu lirumElanuMDi munukoni nutiMcEru | anupamAlaMkAra avadhAru dEva ||

ca|| gaMgAdi nadulella kaDigi nIpAdamulu | poMgucu saptarShulu pUjiMcEru |
saMgati vAyudEvuDu sari nAlavaTTamiDI | aMgaja kOTirUpa avadhAru dEva ||

ca|| paraga nAradAdulu pADEru nIcarita | parama yOgIMdrulu BAviMcEru |
sirulu miMcinayaTTi SrIvEMkaTAdrimIda | aruduga nunnADavu avadhAru dEva ||

Thursday, December 27, 2007

380.parama sujnAnulaku - పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు

Audio link : rAgam - tODi
పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదనూ



parama suj~nAnulaku prapannulaku
maruguruni mIdaTa manasuMDavaladA

AkaligonnavAniki annamupai nuMDinaTTu
yEkaTa vuMDavaladA yISwarunipai
kAkala viTulachUpu kAMtalapai nuMDinaTTu
tEkuva nuMDavaladA dEvunimIdaTanu

pasibiDDalaku nAsa pAlachaMTipai nunnaTlu
kosarE bhaktivaladA gOviMdunipai
vesaderuvari tami viDidalapai nunaTTu
vasiyiMcha valadA SrIvallabhumIdanu

veppuna dhanavaMtuDu nidhi kAchiyuMdinaTTu
tappaka SrIvEMkaTESu tagulavaddA
appasamaina bhrama AlajAlAlakunnaTTu
yippuDE vuMDavaladA yItani mIdanU

Monday, December 25, 2006

108.okkaDE EkAMga viiruDurviki - ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి



ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము

ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము

చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము

జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము

in English:
okkaDE EkAMga viiruDurviki daivamaunaa
yekkaDA hanumaMtuni keduraa lOkamu

muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu
aMdaru daityulachaMpi haripErainaaDu
aMdi rudraviiryamu taanai haruDainaaDu
yeMdunaa hanumaMtuni keduraa lOkamu

chukkalu mOva perigi suuryuDu taanainaaDu
chikku paataaLamu duuri SEshuDainaaDu
gakkana vaayujuDai jagatpraaNuDainaaDu
ekkuva hanumaMtuni keduraa lOkamu

jaladhi puTamegasi chaMdruDu taanainaaDu
malasi mErupupoMta siMhamainaaDu
balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi
ila ii hanumaMtuni keduraa lOkamu

meaning by GB Sankar Rao garu in sujanaranjani
ఆంజనేయుని ప్రతాపానికి ఈ ఇలలో తిరుగులేదు! బ్రహ్మపట్టాన్ని పొందిన ధీరుడితడు!
రాక్షసులను సంహరించి హరి పేరుకు మారుగా నిలిచాడు. శివుని ఆత్మజుడు ఈ హనుమంతుడు! ఆకాశాన్ని ఆక్రమించి సూర్యుణ్ణి అందుకున్నవాడు! పాతాళము చొచ్చి శేషుడైనాడు! వాయురూపంలో జగతికి ప్రాణమైనాడు! ఇన్ని విశిష్టతలు కల ఈ హనుమంతుడు కలియుగంలో బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరునికి దాసుడైనాడు అని అన్నమాచార్యులవారు ఆంజనేయుని శౌర్య పరాక్రమాన్ని తెలియజేస్తున్నాడు.

ఉర్వి = భూమి;
దైత్యులు = రాక్షసులు;
మేరువు పొంత = మేరు పర్వతం దగ్గర;
ఏకాంగ వీరుడు = విష్ణుముర్తి;
మంగాంబుధి = ఒక ఊరు