Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label OnAnnamacharya. Show all posts
Showing posts with label OnAnnamacharya. Show all posts

Friday, January 01, 2021

900. arimuri judabOtE - అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను

Audio link : sung by Sri Sathiraju Venumadhav, in Dharmavati ragam
అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను
మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా

నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక-
అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య
పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము
మన్నించవయ్య వో మధుసూదనా    

సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య
అంకెల నీసన్నిధినే అదిగోవయ్య
అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా-
సంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా

పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు
ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య
యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను
నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా  
 

a~rimu~ri@M jooDa@MbOtae naj~naani naenu
ma~ra@Mgu chochchiti meeku mahilO naaraayaNaa

ninnu dhyaanamu saeseeni nichchanichcha@M daaLlapaaka-
annamayya@Mgaa reduTa nadigOvayya
panni yaataninae choochi paatakulamaina mammu
manniMchavayya vO madhusoodanaa   

saMkeertanalu saesee saare@M daaLlapaakannayya
aMkela neesannidhinae adigOvayya
aMkiMchi nae vaarivaa@MDanani dushTuDanainaa naa-
saMke deera@M gaavavayya sarvaeSvaraa

paadaalaM dunnaa@MDu daaLlapaakannamayya meeku
aadaraana muktu@MDai adigOvayya
yeedesa SreevaeMkaTaeSa yeesammaMdhaananae nannu
needayapeTTi rakshiMchu nemmadi bhooramaNaa  
 


Thursday, May 07, 2020

873. nIvu galigina jAlu nikkamu annI galavu - నీవు గలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు

Tuned & Sung by Sri Sathiraju Venumadhav, in raga karjamu, 
Youtube link:
(album Nivugaliginachalu

నీవు గలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు
ఆవల మాయాచార్యుఁ డానతిచ్చెనయ్యా

యేలోకమున నున్న యెడయని సొమ్ము నీవె
తాలిమి యెందుఁ బోని ధనము నీవె
కాలము కడా తరగని ధాన్యము నీ వని
ఆలించి మాగురు డిట్టె ఆనతిచ్చెనయ్యా

యెందెందుం దిరిగిన యేలికవు నీవె
నిందలేనియట్టి తోడునీడవు నీవె
ముందువెనుకల నిల్లు మింగిలియు నీవె యని
అందముగ దేశికుడె ఆనతిచ్చెనయ్యా

యెన్నడుఁ గలఁగనట్టి హితుడవు నీవె
పన్నినట్టె వుండె నిచ్చపంటా నీవె
నన్నుఁగాచె శ్రీ వెంకటనాథుడ వని తాళ్ళపా
కన్నమయ్యగారె నాకు నానతిచ్చిరయ్యా



nIvu galigina@M jAlu nikkamu annI@M galavu
Avala mAyAchAryu@M DAnatichchenayyA

yElOkamuna nunna yeDayani sommu nIve
tAlimi yeMdu@M bOni dhanamu nIve
kAlamu kaDA taragani dhAnyamu nI vani
AliMchi mAguru DiTTe AnatichchenayyA

yeMdeMduM dirigina yElikavu nIve
niMdalEniyaTTi tODunIDavu nIve
muMduvenukala nillu miMgiliyu nIve yani
aMdamuga dESikuDe AnatichchenayyA

yennaDu@M gala@MganaTTi hituDavu nIve
panninaTTe vuMDe nichchapaMTA nIve
nannu@MgAche SrI veMkaTanAthuDa vani tALLapA
kannamayyagAre nAku nAnatichchirayyA




Wednesday, May 22, 2019

857. suralaku narulaku soridi vinavina - సురలకు నరులకు సొరిది వినవిన

from wikisource
tuned and Sung by Sri Sattiraju Venumadhav garu: Youtube Link 
సురలకు నరులకు సొరిది వినవిన
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు ||పల్లవి

చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ !
నక్కజపుమాఁతువజ్రాలై మెఱసీని
నిక్కుటద్దములై మానిలువు నీడలుచూపీ !
నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు ||సురl| 1

పన్నీరై పైఁబూసీఁ గప్రంబై చలువ రేఁచీ
మిన్నగల ముత్యము లై మెయినిండీని 1
వెన్ను బలములై మావెంట వెంటఁ దిరిగీని
అన్నిట తాళ్ళపాకాన్నమయ్య పదములు ||సురl| 2

నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ !
పుట్టుతోనె గురువులై బోధించీని 1
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ !
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు ||సురil 3 ==> శేషా, వ్రాఁతప్రతి,



suralaku narulaku soridi vinavina
arudu taaLLapaaka annamayya padamulu ||pallavi

chakkerai chavichoopee jaalai taavi challee !
nakkajapumaa@Mtuvajraalai me~raseeni
nikkuTaddamulai maaniluvu neeDaluchoopee !
nakkara taaLLapaaka annamayya padamulu ||sural| 1

panneerai pai@Mboosee@M gapraMbai chaluva rae@Mchee
minnagala mutyamu lai meyiniMDeeni 1
vennu balamulai maaveMTa veMTa@M dirigeeni
anniTa taaLLapaakaannamayya padamulu ||sural| 2

neTTana vaedaaMtamulai nityamulai poDachoopee !
puTTutOne guruvulai bOdhiMcheeni 1
gaTTi varaalichchae SreevaeMkaTanaathuni meppiMchee !
naTTe taaLLapaaka annamayya padamulu ||surail 3 ==> Saeshaa, vraa@Mtaprati,


Tuned and Sung by  Sri Sattiraju Venumadhav:


Another version:

Sunday, May 10, 2009

612.IItaDE muktidOva ItaDE mA - ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు

Archive Audio Link
Audio link sung by Balakrishnaprasad
ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు
ఈతడు గలుగబట్టి ఇందరు బదికిరి

అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు
యిదెవీడె శ్రీవేంకటేశునెదుట
వెదవెట్టి లోకములో వేదములన్నియు మంచి -
పదములు చేసి పాడి పావనము సేసెను

అలరుచు తాళ్ళపాక అన్నమాచార్యులు
నిలిచి శ్రీవేంకటనిధియే తానై
కలిదోషములు వాప ఘనపురాణములెల్ల
పలుకులు నించి నించి పాడినాడు హరిని

అంగవించె తాళ్ళపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీవేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకటరమణుని యలమేలు-
మంగను యిద్దరి పాడి మమ్ము గరుణించెను
IItaDE muktidOva ItaDE mA AchAryuDu
ItaDu galugabaTTi iMdaru badikiri

adivO tALLapAka annamAchAryulu
yidevIDe SrIvEMkaTESuneduTa
vedaveTTi lOkamulO vEdamulanniyu maMchi -
padamulu chEsi pADi pAvanamu sEsenu

alaruchu tALLapAka annamAchAryulu
nilichi SrIvEMkaTanidhiyE tAnai
kalidOshamulu vApa ghanapurANamulella
palukulu niMchi niMchi pADinADu harini

aMgaviMche tALLapAka annamAchAryulu
baMgAru SrIvEMkaTESu pAdamulaMdu
raMgumIra SrIvEMkaTaramaNuni yalamElu-
maMganu yiddari pADi mammu garuNiMchenu

Thursday, May 15, 2008

500.hari yavatAramE AtaMDitaDu - హరి యవతారమే ఆత(డితడు

Archive Link : Balakrishnaprasad

హరి యవతారమే ఆత(డితడు
పరమ(ము?) సంకీర్తన ఫలములో నిలిపె

వున్నాడు వైకుంఠమున నున్నాడు ఆచార్యునొద్ద
వున్నతోన్నతమహిమ అన్నమయ్య
వున్నవి సంకీర్తనలు వొట్టుక లోకములందు
పన్నిన నారదాదులు పైపై పాడగాను

చరియించు నొకవేళ సనకాదిమునులలో
హరి(బాడు తాళ్ళపాక అన్నమయ్య
తిరమై యాళువారల తేజము తానైయుండు
గరుడానంత ముఖ్య ఘనులసంగడిని

శ్రీవేంకటాద్రి మీద శ్రీపతి కొలువునందు
ఆవహించె
తాళ్ళపాక అన్నమయ్య
దేవతలు మునులును దేవుడని జయవెట్ట
కోవిదుడై తిరుగాడీ కోనేటిదండను
hari yavatAramE Ata(DitaDu
parama(mu?) saMkIrtana phalamulO nilipe

vunnADu vaikuMThamuna nunnADu AchAryunodda
vunnatOnnatamahima annamayya
vunnavi saMkIrtanalu voTTuka lOkamulaMdu
pannina nAradAdulu paipai pADagAnu

chariyiMchu nokavELa sanakAdimunulalO
hari(bADu tALLapAka annamayya
tiramai yALuvArala tEjamu tAnaiyuMDu
garuDAnaMta mukhya ghanulasaMgaDini

SrIvEMkaTAdri mIda SrIpati koluvunaMdu
AvahiMche tALLApAka annamayya
dEvatalu munulunu dEvuDani jayaveTTa
kOviduDai tirugADI kOnETidaMDanu