Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-475 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, December 27, 2007

380.parama sujnAnulaku - పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు

Audio link : rAgam - tODi
పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదనూparama suj~nAnulaku prapannulaku
maruguruni mIdaTa manasuMDavaladA

AkaligonnavAniki annamupai nuMDinaTTu
yEkaTa vuMDavaladA yISwarunipai
kAkala viTulachUpu kAMtalapai nuMDinaTTu
tEkuva nuMDavaladA dEvunimIdaTanu

pasibiDDalaku nAsa pAlachaMTipai nunnaTlu
kosarE bhaktivaladA gOviMdunipai
vesaderuvari tami viDidalapai nunaTTu
vasiyiMcha valadA SrIvallabhumIdanu

veppuna dhanavaMtuDu nidhi kAchiyuMdinaTTu
tappaka SrIvEMkaTESu tagulavaddA
appasamaina bhrama AlajAlAlakunnaTTu
yippuDE vuMDavaladA yItani mIdanU

379.ennaDokO sujnAnamu - ఎన్నడొకో సుజ్ఞానము యీ యాత్మకు

ARchive Audio link
ఎన్నడొకో సుజ్ఞానము యీ యాత్మకు
కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను

హేయములో సుఖము యెంగిలిలో సుఖము
కాయము నమ్మికదా కష్టపడెను
పాయములో చవులు పాపములో చవులు
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను

కల్లలోనిబదుకు కాసువీసపుబదుకు
కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను
యెల్లి నేటి తలపు యింద్రియాల తలపు
కొల్ల సంసారముగూడి గుణమునిట్టాయను

అంగడిబెట్టే సిరులు యలయింపులో సిరులు
దొంగజీవుడు యిట్లానే తొట్రుపడెను
అంగపు శ్రీవేంకటేశుడంతలో మన్నించగాను
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెనుennaDokO suj~nAnamu yI yAtmaku
kannu lediTivi chUchi kAlamu niTTAyanu

hEyamulO sukhamu yeMgililO sukhamu
kAyamu nammikadA kaShTapaDenu
pAyamulO chavulu pApamulO chavulu
mAyalu nammikadA manasUniTTAyanu

kallalOnibaduku kAsuvIsapubaduku
kallari prANAlu nammi kaTTupaDenu
yelli nETi talapu yiMdriyAla talapu
kolla saMsAramugUDi guNamuniTTAyanu

aMgaDibeTTE sirulu yalayiMpulO sirulu
doMgajIvuDu yiTlAnE toTrupaDenu
aMgapu SrIvEMkaTESuDaMtalO manniMchagAnu
muMgilellA mOkshamAya muchchaTE yiTTAyenu

Meaning by Kasturi Sunil garu in Annamacharya Vaibhavam community:
=================================================================
A benevolent view to our failures as humansFor what day is knowledge for this atma (when will it be useful?)It has become like this (degenerated) seeing what is in front of itIt relishes in mean / base / disgusting (Tucchamaina) and in another's body (from sex)This body is but fooled into hard workAn interest in laziness (or house routine duties), and interest in sinsThis poor mind has been but fooled by MayaA dream is this life, Pursuing a few coins (wealth) is this lifeFooled by a trinkets it has been tied downBy the urging of the ? (yellineti) and by urging of the indriyas (sense organs)Due to the influence of Samsara my gunas (abilities / motivations) have become like thisBy the wares in the display in the market, wares displayed to attract attention (impu ga pradarshana lo peetina sirulu) This pretender / thief jeeva (Jeeva is a portion of the atma that is fooled and impacted by the Maya, per Hindu upanishads - the atma is untouched and still longing for union with God) has thus been stumblingWith the pardon granted by Angapu (?) Sri Venkatesha however,In my front yard (mungili) is placed the opportunity to obtain Mokashamu (union with God)(Anga is also literally translated as 3 yards and mungili as space between 2 beams in a house - so conclusion can be translated as the Lord who is 3 yards in lenght has provided me this pardon that now gives me ample room to seek salvation )As long as the Jeeva is enamoured by the trinkets of this World that are served up by Maya, he is tied down. When he can reject these and truly seek God, he is on the path to salvation. Here, Acharya is showing such kindness and understanding to human failures - it is only because we are unable to withstand the pressures and forces of maya we are sinning and never getting out of the Web. Only an unconditional pardon that is granted by the mere presence of Srinivasa is our only chance to salvation despite these human failures

Wednesday, December 26, 2007

378.alavaTapatraSAyivaina - అలవటపత్రశాయివైన

Audio linkAudio link
ప|| అలవటపత్రశాయివైన రూప మిట్టిదని | కొలువై పొడచూపేవా గోవిందరాజా ||
చ|| పడతులిద్దరిమీద పాదములు చాచుకొని | వొడికపురాజసాన నొత్తగిలి |
కడలేనిజనాభికమలమున బ్రహ్మను | కొడుకుగా గంటివిదె గోవిందరాజా ||
చ|| సిరులసొమ్ములతోడ శేషునిపై బవళించి | సొరిది దాసుల గౄప జూచుకొంటాను |
పరగుదైత్యులమీద పామువిషములే నీవు | కురియించితివా గోవిందరాజా ||
చ|| శంకుజక్రములతోడ జాచినకరముతోడ | అంకెల శిరసుకిందిహస్తముతోడ |
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో | కొంకక వరములిచ్చే గోవిందరాజా ||


pa|| alavaTapatraSAyivaina rUpa miTTidani | koluvai poDacUpEvA gOviMdarAjA ||
ca|| paDatuliddarimIda pAdamulu cAcukoni | voDikapurAjasAna nottagili |
kaDalEnijanABikamalamuna brahmanu | koDukugA gaMTivide gOviMdarAjA ||
ca|| sirulasommulatODa SEShunipai bavaLiMci | soridi dAsula gRupa jUcukoMTAnu |
paragudaityulamIda pAmuviShamulE nIvu | kuriyiMcitivA gOviMdarAjA ||
ca|| SaMkujakramulatODa jAcinakaramutODa | aMkela SirasukiMdihastamutODa |
teMkini SrIvEMkaTAdri diguvatirupatilO | koMkaka varamuliccE gOviMdarAjA ||

Click here to listen to this kriti

377.sOdiMchiridiye suralunu munulunu - సోదించిరిదియె సురలును మునులును

Archive Audio link , BKP , ragam : lalita
సోదించిరిదియె సురలును మునులును
ఆదికి అనాది హరినామం

అరిది వేదశాస్త్రార్థసంగ్రహము
అరయగ నొకటే హరినామం
దురితహరము భవదుఃఖనాశనము
అరిభయంకరము హరినామం

సకలపుణ్యఫలసారవిహారము
అకలంకము శ్రీహరినామం
ప్రకటము సులభము పరమపావనము
అకుటిలమిది (శ్రీ)హరినామం

కందువ సదరము కైవల్యపదము
అందరికిదియే హరినామం
యెందును శ్రీవేంకటేశ్వరు కరుణకు-
నందుకోలైన హరినామం


sOdiMchiridiye suralunu munulunu
Adiki anAdi harinAmaM

aridi vEdaSAstrArthasaMgrahamu
arayaga nokaTE harinAmaM
duritaharamu bhavadu@hkhanASanamu
aribhayaMkaramu harinAmaM

sakalapuNyaphalasAravihAramu
akalaMkamu SrIharinAmaM
prakaTamu sulabhamu paramapAvanamu
akuTilamidi (SrI)harinAmaM

kaMduva sadaramu kaivalyapadamu
aMdarikidiyE harinAmaM
yeMdunu SrIvEMkaTESwaru karuNaku-
naMdukOlaina harinAmaM

Monday, December 24, 2007

376.kadiri nRsiMhuDu kaMbhamuna- కదిరి నృసింహుడు కంభమున వెడలే

Audio link : Balakrishnaprasad
Ragam : aTaNA , composer : G.Balakrishnaprasad


ప : కదిరి నృసింహుడు
కంభమున వెడలే

విదితముగా సేవించరో మునులు


చ : ఫాలలోచనము
భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేశరములునూ
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే


చ : ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే

చ : సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
pa : kadiri nRsiMhuDu kaMbhamuna veDalae
viditamugaa saeviMcharO munulu

cha : phaalalOchanamu bhayadOgra mukhamu
jvaalaamaya kaeSaramulunoo
kaalaraudra saMghaTita daMtamulu
haelaagati dhariyiMchuka nilichae

cha : muDivaDu bommalu muMchina oorpulu
gaDagaDa nadareDi kaTamulunoo
niDuta naalukayu nikku karNamulu
naDiyaalapu roopai velasae

cha : sakalaayudhamulu sahasra bhujamulu
vikaTa nakhaMbulu vesaboonee
vekaliyaguchu SreevaeMkaTaeSvaruDu
prakaTapu dushTula bhaMjiMchaenidivO

375.BOgIMdrulunu mIru bOyi raMDu - భోగీంద్రులును మీరు బోయి రండు

Audio link : Balkrishnaprasad , I guess in this kriti, Annamayya gives sendoff to all the gods and asks them to come again for the next tirunallu ( ?)
ప|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||
చ|| హరుడ పోయిరా అజుడ నీవును బోయి | తిరిగిరా మీదటి తిరునాళ్ళకు |
సురలు మునులును భూసురలు బోయిరండు | అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||
చ|| జముడ పోయిరా శశియు నీవును బోయి | సుముఖుడవై రా సురల గూడి |
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు | ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||
చ|| నారద సనక సనందాదులు | భూరివిభవముల బోయిరండు |
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి | జేరి నన్నిట్లనే సేవించుడీ ||


pa|| BOgIMdrulunu mIru bOyi raMDu | vEgaga mIdaTi viBavAlaku ||
ca|| haruDa pOyirA ajuDa nIvunu bOyi | tirigirA mIdaTi tirunALLaku |
suralu munulunu BUsuralu bOyiraMDu | araviri ninnALLu nalasitiri ||
ca|| jamuDa pOyirA SaSiyu nIvunu bOyi | sumuKuDavai rA surala gUDi |
gumulai dikpatulu dikkulaku bOyiraMDu | pramadAna ninnALLu baDalitiri ||
ca|| nArada sanaka sanaMdAdulu | BUriviBavamula bOyiraMDu |
dUramugA bOkiTTE torali vEMkaTagiri | jEri nanniTlanE sEviMcuDI ||

Sunday, December 23, 2007

374.anaMta madhbhuta - అనంత మధ్భుత మాశ్చర్యం


Audio link : Tuned and Sung by Chakrapani
అనంత మధ్భుత మాశ్చర్యం బిది
సనాతనుడ నను సరవిగావవే
బలిమి నసురలకు భయంకరుడవు
అలరి యమరులకు నానందకరుడవు
తలకొని ఋషులకు తపఃఫలదుడవు
పలు నీ మహిమలు పలుకగ వశమా

అరయ వేదముల కాధారంబవు
పరగగ జీవుల ప్రాణనాథుడవు
పరమయోగులకు పరబ్రహ్మమవు
తిరముగ నీమూర్తి దెలియగ వశమా

జగముల కెల్లను సర్వబంధుడవు
తగిలిన శ్రీకాంతకు నివాసమవు
జిగి శ్రీవైష్ణవులకు శ్రీవేంకటపతివి
తగు నీ కత లివి తలచగ వశమా


anaMta madhbhuta mAScharyaM bidi
sanAtanuDa nanu saravigAvavE

balimi nasuralaku bhayaMkaruDavu
alari yamarulaku nAnaMdakaruDavu
talakoni RShulaku tapa@hphaladuDavu
palu nI mahimalu palukaga vaSamA

araya vEdamula kAdhAraMbavu
paragaga jIvula prANanAthuDavu
paramayOgulaku parabrahmamavu
tiramuga nImUrti deliyaga vaSamA

jagamula kellanu sarwabaMdhuDavu
tagilina SrIkAMtaku nivAsamavu
jigi SrIvaiShNavulaku SrIvEMkaTapativi
tagu nI kata livi talachaga vaSamA

Friday, December 21, 2007

373.Emani varNiMchunokO - ఏమని వర్ణించునొకో


Click here to listen to this kriti sung by Balakrishnaprasad
ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి

పాలజలనిధిలోన పలుమారు( దేలగాను
నీలవర్ణమెల్ల( బోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేన నిండ( నించగాను
పోలికె వేరొక్కటాయ పురుషోత్తమునికి

వేడుక కాళింది లోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టపుణుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి

అలమేలుమంగ నురమందునే నిలుపగాను
అలరి బంగారువర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికి


Emani varNiMchunokO iMka purANamulella
vEmAru kottalAya viSwalOkapatiki

pAlajalanidhilOna palumAru( dElagAnu
nIlavarNamella( bOyi niMDu telupainaTTu
mElimi kappurakApu mEna niMDa( niMchagAnu
pOlike vErokkaTAya purushOttamuniki

vEDuka kALiMdi lOna vEmAru nIdagAnu
ADanE kammara nalupainaTTu
tODanE taTTapuNugu toppadOga niMchagAnu
jADa vErokkaTAya sarwESwaruniki

alamElumaMga nuramaMdunE nilupagAnu
alari baMgAruvarNamainaTTu
nalugaDa sommulatO nAnAvarNamulu
niliche SrIvEMkaTanilayamUritiki


372.brahmapUjiMchE raghupati - బ్రహ్మపూజించే రఘుపతి

This kriti beatifully describes SriRangam , click here to listen to this kriti, tuned and sung by Chakrapani

బ్రహ్మపూజించే రఘుపతి విభీషుణు కిచ్చె
బ్రహ్మణ్యుడీ రంగపతి గొలువరో

కావేరీ మధ్య రంగక్షేత్ర మల్లదిగో
శ్రీవిమాన మదిగో శేషపర్యంక మిదె
దేవు(డల్లదె వాడే దేవి శ్రీలక్ష్మి యదె
సేవించరో నాభి( జిగురించె నతడూ

యేడు గోడలు నవిగో యెసగు పూదోపు లవె
కూడి దామోదరపురగోపుర మదె
తోడ వేయిగంబాల దొడ్డమంటప మదిగో
చూడరో పసిడిమించులకంబ మదిగో

ఆళువారులు వారే యంగరంగవిభవమదె
వాలు శ్రీవైష్ణవపు వాడ లవిగో
ఆలీల శ్రీవేంకటేశుడై వర మిచ్చీని
తాలిముల శ్రీరంగ దైవము గొలువరో
brahmapUjiMchE raghupati vibhIShuNu kichche
brahmaNyuDI raMgapati goluvarO

kAVErI madhya raMgakshEtra malladigO
SrIvimAna madigO SEshaparyaMka mide
dEvu(Dallade vADE dEvi SrIlakshmi yade
sEViMcharO nAbhi( jiguriMche nataDU

yEDu gODalu navigO yesagu pUdOpu lave
kUDi dAmOdarapuragOpura made
tODa vEyigaMbAla doDDamaMTapa madigO
chUDarO pasiDimiMchulakaMba madigO

ALuvArulu vArE yaMgaraMgavibhavamade
vAlu SrIvaishNavapu vADa lavigO
AlIla SrIvEMkaTESuDai vara michchIni
tAlimula SrIraMga daivamu goluvarO
Video of Srirangam temple


Thursday, December 20, 2007

371.అపరాధిని నేనైనాను - aparAdhini nEnainAnu

Click here to this kriti sung by Balakrishnaprasad in raga:megharanjani(?)
అపరాధిని నేనైనాను
కృపగలవారికి కపటము లేదు

సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకలలోకేశ్వరా
నిను మరచియున్నాడ నను తెలుపవయా

పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవేయట యెరిగించగదే

దేవోత్తమా శశిదినకర నయనా
పావనచరితా పరమాత్మ
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుడను బుధ్ధిచెప్పగవలయు


aparAdhini nEnainAnu
kRpagalavAriki kapaTamu lEdu

sanAtanA achyutA sarwESwarA
anAdikAraNa anaMtA
janArdanA achala sakalalOkESwarA
ninu marachiyunnADa nanu telupavayA

purANapurushA purushOttamA
charAcharAtmaka jagadISA
parAtparA hari brahmAMDanAyakA
yiravu nIvEyaTa yerigiMchagadE

dEvOttamA SaSidinakara nayanA
pAvanacharitA paramAtma
SrIvEMkaTESA jIvAMtaraMgA
sEvakuDanu budhdhicheppagavalayu

370.anniviBavamula ataDitaDu - అన్నివిభవముల అతడితడు


Click here to listen to this kriti , sung by Balakrishnaprasad
Ragam : Rititgoula , Composer : Dr.Pasupati
ప|| అన్నివిభవముల అతడితడు |
కన్నులువేవేలు గలఘనుడు ||
చ|| వేదాంత కోటులవిభుడు ఇతడు |
నాదబ్రహ్మపు నడుమితడు |

ఆదియంత్యముల కరుదితడు |
దేవుడు సరసిజ నాభుడు ఇతడు ||
చ|| భవములణచు యదుపతి యితడు |
భువనము లన్నిటికి పొడ వితడు |

దివికి దివమైన తిరమితడు |
పవనసుతు నేలిన పతి యితడు ||
చ|| గరుడుని మీదటి ఘనుడితడు |
సిరు లందరి కిచ్చే చెలు వితడు |

తిరు వేంకట నగము దేవు డితడు |
పరమ పదమునకు ప్రభు వితడు ||


pa|| anni vibhavamula ataDitaDu | kannulu vEvElu galaGanuDu ||
ca|| vEdAMta kOTulaviBuDu itaDu | nAdabrahmapu naDumitaDu |
AdiyaMtyamula karuditaDu | dEvuDu sarasija nABuDu itaDu ||
ca|| BavamulaNacu yadupati yitaDu | Buvanamu lanniTiki poDa vitaDu |
diviki divamaina tiramitadu | pavanasutu nElina pati yitaDu ||
ca|| garuDuni mIdaTi ghanuDitaDu | siru laMdari kiccE celu vitaDu |
tiru vEMkaTa nagamu dEvu DitaDu | parama padamunaku praBu vitaDu ||

Friday, December 14, 2007

369.itaramulanniyu naDamaMtramulE - ఇతరములన్నియు నడమంత్రములే

ARchive Audio link
ఇతరములన్నియు నడమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబంధువుడు ఈశ్వరుడొక్కడే ఈతనిమరువకుమీ జీవాత్మ ||

భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే
దివిస్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే
నవనరకంబుల నలగెడినాదు నటనల బాయడితడొకడే
యివలనవల హృదయేశుడు విష్ణుడు ఈతని మరువకుమీ జీవాత్మా ||

పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయని బందుగు డితడొకడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువని బంధువుడితడొకడే
శిశువైనప్పుడు వృద్ధైనప్పుడు చిత్తపుబందుగుడితడొకడే
దశావతారపు విష్ణుడొక్కడే ఈతని తలచుమీ జీవాత్మా ||


భావజకేలిని జొక్కినప్పుడును ప్రాణబంధువుడు ఇతడొకడే
యీవల నావల యిహపరములలో నిన్నిటి బంధువుడితడొకడే
దైవము తానని శరణనీయెడు నను దగ్గరికాచెను ఇతడొకడే
శ్రీవేంకటగిరి నాయకుడితడే చేరి భజించుము జీవాత్మా ||


itaramulanniyu naDamaMtramulE yeMchichUchinanu yiMtAnu
hitavagubaMdhuvuDu ISvaruDokkaDE ItanimaruvakumI jIvAtma ||

bhavakUpaMbula baDaleDinADu pAyani baMdhuvuDu itaDokaDE
diviswargaMbuna tEleDinADu tirugabAyakepu DitaDokaDE
navanarakaMbula nalageDinAdu naTanala bAyaDitaDokaDE
yivalanavala hRdayESuDu viShNuDu Itani maruvakumI jIvAtmA ||

paSumRgAdula voDalettinappuDu pAyani baMdugu DitaDokaDE
viSadapu du@hkhapuvELalanainA viDuvani baMdhuvuDitaDokaDE
SiSuvainappuDu vRddhainappuDu chittapubaMduguDitaDokaDE
daSAvatArapu viShNuDokkaDE Itani talachumI jIvAtmA ||


bhAvajakElini jokkinappuDunu prANabaMdhuvuDu itaDokaDE
yIvala nAvala yihaparamulalO ninniTi baMdhuvuDitaDokaDE
daivamu tAnani SaraNaniiyeDu nanu daggarikAchenu itaDokaDE
SrIvEMkaTagiri nAyakuDitaDE chEri bhajiMchumu jIvAtmA ||

Tuesday, December 11, 2007

368.taruNinIyaluka keMtaTidi - తరుణినీయలుక కెంతటిది

Audio link : Tuned by Nedunuri Krishnamurthy : Sung by Balarksihanprasad

ప|| తరుణినీయలుక కెంతటిది ఇంతి నీవేళ | కరుణించగదర వేంకటశైలనాథ ||
చ|| ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు | ఒకమారు విధిసేతలూహించి పొగడు |
ఒకమారు తనుజూచి వూరకే తలవూచు | నొకమారు హర్షమున నొంది మేమరచు ||
చ|| నినుజూచి నొకమారు నిలువెల్ల పులకించు | తనుజూచి నొకమారు తలపోసి నగును |
కనుదెరచి నినుజూచి కడు సిగ్గుపడి నిలిచి | యిన్నియును తలపోసి యింతలో మరచు ||
చ|| వదలైన మొలనూలు గదియించు నొకమారు | చెదరిన కురులెల్ల చెరగునొకమారు |
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి | చదురుడవునిను బాయ జాలదొకమారు ||


pa|| taruNinIyaluka keMtaTidi iMti nIvELa | karuNiMcagadara vEMkaTaSailanAtha ||
ca|| okamAru saMsAramolla bommani talacu | okamAru vidhisEtalUhiMci pogaDu |
okamAru tanujUci vUrakE talavUcu | nokamAru harShamuna noMdi mEmaracu ||
ca|| ninujUci nokamAru niluvella pulakiMcu | tanujUci nokamAru talapOsi nagunu |
kanuderaci ninujUci kaDu siggupaDi nilici | yinniyunu talapOsi yiMtalO maracu ||
ca|| vadalaina molanUlu gadiyiMcu nokamAru | cedarina kurulella ceragunokamAru |
adanerigi tiruvEMkaTAdhISa poMditivi | caduruDavuninu bAya jAladokamAru ||

Monday, December 10, 2007

367.GOra vidAraNa nArasiMha - ఘోర విదారణ నారసింహ

Click here to listen to this kriti , sung by Balakrishnaprasad, in ragamalika
ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||
చ|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడిపొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||
చ|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||
చ|| గుటగుట రవములు కుత్తిక గులుకుచు | గిటగిట బండ్లు గీటుచును |
తటతట బెదవులు దవడల వణకగ | ఇటువలె నీవపుడెట్లుండితివో ||
చ|| గోళ్ళ మెరుగుల కొంకుల పెదపెద | వేళ్ళ దిక్కులు వెదుకుచును |
నీళ్ళ తీగలు విగుడగ నోరను- | చ్చిళ్ళు గమ్మగ నెట్లుండితివో ||
చ|| హిరణ్యకశిపుని నేపడచి భయం- | కర రూపముతో గడుమెరసి |
తిరు వేంకట గిరి దేవుడ నీవిక | యిరవు కొన్న నాడెట్లుండితివో ||


pa|| GOra vidAraNa nArasiMhanI | nI rUpamutO neTluMDitivO ||
ca|| uDikeDi kOpapuTUrpula goMDalu | poDipoDiyai naBamuna kegaya |
beDidapu ravamuna piDugulu dorugaga | yeDaneDa nIvapuTeTluMDitivO ||
ca|| kAlAnalamulu gakkuna yana | jvAlala nippulu callucunu |
PAlAkShamutO brahmANDa kOTla | kElikavai nEveTuluMDitivO ||
ca|| guTaguTa ravamulu kuttika gulukucu | giTagiTa baMDlu gITucunu |
taTataTa bedavulu davaDala vaNakaga | iTuvale nIvapuDeTluMDitivO ||
ca|| gOLLa merugula koMkula pedapeda | vELLa dikkulu vedukucunu |
nILLa tIgalu viguDaga nOranu- | cciLLu gammaga neTluMDitivO ||
ca|| hiraNyakaSipuni nEpaDaci BayaM- | kara rUpamutO gaDumerasi |
tiru vEMkaTa giri dEvuDa nIvika | yiravu konna nADeTluMDitivO ||

Sunday, December 09, 2007

366.vEDuka vasaMtamu - వేడుక వసంతము వేళనిదే

Audio link : Tuned by Chakrapani
వేడుక వసంతము వేళనిదే
వాడలవాడలవెంట వనిత లాడేరు

కేలు(గేలు( జుట్టుపట్టి -
కెందామర మోములెత్తి
కోల(గోల దాక(జేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి -
జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు
పాలిండ్లు గడల(గ బరువైనతురుముల
చీలుచు సోలుచు( గొంతవెనకకును
మేలిమిపిఱుదులతో మెరయుచు మురియుచు
కోలల( బెడమరలి కోలాటమాడేరు

కది శొండురుమోములు కన్నుల( దేలించి చూచి
పదతాళగతులకు పడతులెల్లా
అదివో శ్రీవేంకటేశు( డలమేలుమంగతోడ
ముదమంది చూడగాను ముందట నాడేడు


vEDuka vasaMtamu vELanidE
vADalavADalaveMTa vanita lADEru

kElu(gElu( juTTupaTTi keMdAmara mOmuletti
kOla(gOla dAka(jEsi guMpuvAyaka
chAlukoni yiddarEsi jaMTalai satulu gUDi
vOli vErokatekOla noDDutA nADEru

pAliMDlu gaDala(ga baruvainaturumula
chIluchu sOluchu( goMtavenakakunu
mElimipi~rudulatO merayuchu muriyuchu
kOlala( beDamarali kOlATamADEru

kadi SoMDurumOmulu kannula( dEliMchi chUchi
padatALagatulaku paDatulellA
adivO SrIvEMkaTESu( DalamElumaMgatODa
mudamaMdi chUDagAnu muMdaTa nADEDu

365.innALu nEDanuMDenO - ఇన్నాళు నేడనుండెనో

Click for Audio : Tuned and sung by Chakrapani in raga : Ahiri
ఇన్నాళు నేడనుండెనో యెవ్వరు నెఱగరు
కన్నులయెదుట నేడు గానబడెగాని

యేమి గావలెనో కాని యీపె నీకు నెదురై
మోముకళలుదేరగ మొక్కె నిపుడు
చేముట్టి యీసతిని జేరి కాగిలించితివి
మీమీచుట్టరికము మేమిదివో కంటిమి

యేవూరోకాని తాను నీ యింటికే వచ్చి బత్తితో
సేవలెల్లా జేసితేను చెలగితివి
భావమెరిగి గందము పైబూసి నవ్వితివి
దోమటి(వన?)మీయిద్దరిపొందులు నేడు గంటిమి

తనపే రేటిదోకాని తగిలి శ్రీవేంకటేశ
చెనకుచు నీపై దాను సేసవెట్టెను
యెనసితి విటు నన్ను యే నలమేలుమంగను
నినుపులమీ ఇంపులు నేడు నేము గంటిమిinnALu nEDanuMDenO yevvaru ne~ragaru
kannulayeduTa nEDu gAnabaDegAni

yEmi gAvalenO kAni yIpe nIku nedurai
mOmukaLaludEraga mokke nipuDu
chEmuTTi yIsatini jEri kAgiliMchitivi
mImIchuTTarikamu mEmidivO kaMTimi

yEvUrOkAni tAnu nI yiMTikE vachchi battitO
sEvalellA jEsitEnu chelagitivi
bhAvamerigi gaMdamu paibUsi navvitivi
dOmaTi(vana?)mIyiddaripoMdulu nEDu gaMTimi

tanapE rETidOkAni tagili SrIvEMkaTESa
chenakuchu nIpai dAnu sEsaveTTenu
yenasiti viTu nannu yE nalamElumaMganu
ninupulamI iMpulu nEDu nEmu gaMTimi

Click here to listen to this kriti : tuned and sung by Chakrpani in raga : Ahiri

Saturday, December 08, 2007

364.rAjapu nIkedurEdi rAmachaMdra - రాజపు నీకెదురేది రామచంద్ర


Click for Audio : Tuned and sung by Chakrapani , in raga:kApi
రాజపు నీకెదురేది రామచంద్ర
రాజీవనయనుడ రామచంద్ర

వెట్టిగాదు నీవలపు వింటి నారికి( దెచ్చితివి
ఱట్టుసేయ పనిలేదు యిట్టె రామచంద్ర
గు(గ)ట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి-
వెట్టు మఱవగవచ్చు నివి రామచంద్ర

బతి(లి)మితోడుత( బైడిపతిమె గైకొటివి
రతికెక్క నీచలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీదుకట్టితివి నాకై
యితరు లేమనగల రిక రామచంద్ర

నావంటిసీతను నాగేటికొన( దెచ్చితి
రావాడితమకముతో రామచంద్ర
యోవేళ శ్రీవేంకటాద్రి నిరవై నన్ను( గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర


rAjapu nIkedurEdi rAmachaMdra
rAjIvanayanuDa rAmachaMdra

veTTigAdu nIValapu viMTi nAriki( dechchitivi
~raTTusEya panilEdu yiTTe rAmachaMdra
gu(ga)TTutODa jalanidhipai goMDalu muDivEsiti-
veTTu ma~ravagavachchu nivi rAmachaMdra

bati(li)mitODuta( baiDipatime gaikoTivi
ratikekka nIchalamu rAmachaMdra
mitimIri javvanamu mIdukaTTitivi nAkai
yitaru lEmanagala rika rAmachaMdra

nAvaMTisItanu nAgETikona( dechchiti
rAvADitamakamutO rAmachaMdra
yOvELa SrIvEMkaTAdri niravai nannu( gUDiti
chEvadEra gaMDikOTa SrIrAmachaMdra

Click here to listen to this kriti , tuned and sung by Chakrapani , in raga:kApi

Friday, December 07, 2007

363.piluvarE kRShNuni - పిలువరే కృష్ణుని

Click for audio : tuned by Chakrapani : sung by Anasuya Murthy :Raga : Brindavani
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు

వెన్నలారగించ(బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువ(గ(బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు

మగువల కా(గిళ్ళ మఱచి నిద్దిరించీనో
సొగిసి యావుల( గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు( జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు( డాడివచ్చె నిదె వేడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు


piluvarE kRShNuni pErukoni yiMtaTAnu
polasi yAragiMchE poddAya nipuDu

vennalAragiMcha(bOyi vIdhulalO dirigInO
yennarAni yamunalO yIdulADInO
sannala sAMdIpanitO chaduva(ga(bOyinADO
chinnavADAkali gone chelulAla yipuDu

maguvala kA(giLLa ma~rachi niddiriMchInO
sogisi yAvula( gAchE chOTa nunnADO
yeguva nuTlakekki yiMtulaku( jikkinADO
sagamu vEDikUralu challanAya nipuDu

cheMdi nemali chuMgula siMgAriMchukonInO
iMdunE dEvaravale iMTanunnADO
aMdapu SrIvEMkaTESu( DADivachche nide vEDe
viMdula mApottuku rA vELAya nipuDu

Click here to listen to this wondeful kriti on Lord Krishna.

tune : Chakrapani
singer : Anasuya Murthy
ragam : Brundavani


Piluvarekrishnuni
Piluvarekrishnuni....
Hosted by eSnips

Another version : Balakrishnaprasad

Thursday, December 06, 2007

362.dEva vAsudEva - దేవ వాసుదేవ

Click for Audio : Tuned and sung by Chakrapani : raga : karna ranjani
దేవ వాసుదేవ
భావయ తాం పాలయ

నరహరే అహో నారాయణరే
మురహర నగధర ముకుంద
తరుణీయం తు తవ విరహేణ
భరితవిచిత్రప్రతిమా జాతా

దివిజవందిత దేవోత్తమ అహో
నవనీతప్రియ నందసుత
తవ సంగమసంతతకామనయా
యువతి ర్జాతా యోగిణీవ

జిత(తి)దానవ అహో శ్రీవేంకటపతే
సతత మాధవ కృష్ణ సర్వేశ
రతిసంగమేన రమణీ యంతు
బతతే విహితాభరణా జాతా

dEva vAsudEva
bhAvaya tAM pAlaya
naraharE ahO nArAyaNarE
murahara nagadhara mukuMda
taruNIyaM tu tava virahENa
bharitavichitrapratimA jAtA
divijavaMdita dEvOttama ahO
navanItapriya naMdasuta
tava saMgamasaMtatakAmanayA
yuvati rjAtA yOgiNIva
jita(ti)dAnava ahO SrIvEMkaTapatE
satata mAdhava kRShNa sarvESa
ratisaMgamEna ramaNI yaMtu
batatE vihitAbharaNA jAtA

Tuesday, December 04, 2007

361.ahO suratavihArOyam - అహో సురతవిహారోయం

Archive Audio link : TP Chakrapani
అహో సురతవిహారోయం - సహజ పరాజయశంకా నాస్తి

యమునాకూలే సుమలతాగృహే - విమలసైకత వివిధస్థలే
రమణీరమణౌ రమతస్తయోః - ప్రమదస్య పరాత్పరం నాస్తి

రజనీ కావా ప్రాతః కింవా - త్యజనం భజనం తత్కింవా
విజయః కోవాపజయః కోవా - భుజపరిరంభ స్ఫుటం నాస్తి

చీనాంశుక రంజిత మేఖలాని - తానే జఘనం తరతిసతి
మానవికలనే మానినీమణే - హీనాధిక పరిహృతిం నాస్తి

కింవా మిళనం కింవా మిళనం - త్వం వాహంవా తన్నాస్తి
సవాదో వా సరసః కోవా - కింవా వాచ్యా క్రియా నాస్తి


ఆదిదేవ పీతాంశుక బుధ్ధా - స్వేద సురభి కాశ్మీరజలం
సాదురుంహ్య లజ్జావివశతయా - ఖేదేన వచః కించిన్నాస్తి

వరకుచాగ్ర సంవ్యానం కరేణా - హరౌ పరం పరిహరతి సతి
సరసలోచనంచల వివశతయా - తరుణ్యాం చైతన్యాం నాస్తి

సురతాంతశ్రమ సుఖం కింవా - వరలజ్జా సావా కావా
పరవశతను వైభవం కింవా - నిరతాం తయో నికృతం నాస్తి

పరిమళ భరిత ప్రచుర సుశీతల- - వరమృదువాయౌ వాతి సతి
తిరువేంకటగిరిదేవ రాధయో- - స్సరసరతి సుఖశ్రాంతిర్నాస్తి


ahO suratavihArOyam - sahaja parAjayaSaMkA nAsti

yamunAkUlE sumalatAgRhE - vimalasaikata vividhasthalE
ramaNIramaNau ramatastayO@h - pramadasya parAtparaM nAsti

rajanI kAvA prAta@h kiMvA - tyajanaM bhajanaM tatkiMvA
vijaya@h kOvApajaya@h kOvA - bhujapariraMbha sphuTaM nAsti

chInAMSuka raMjita mEkhalAni - tAnE jaghanaM taratisati
mAnavikalanE mAninImaNE - hInAdhika parihRtiM nAsti

kiMvA miLanaM kiMvA miLanaM - twaM vAhaMvA tannAsti
savAdO vA sarasa@h kOvA - kiMvA vAchyA kriyA nAsti


AdidEva pItAMSuka budhdhA - svEda surabhi kASmIrajalaM
sAduruMhya lajjAvivaSatayA - khEdEna vacha@h kiMchinnAsti

varakuchAgra saMvyAnaM karENA - harau paraM pariharati sati
sarasalOchanaMchala vivaSatayA - taruNyAM chaitanyAM nAsti

suratAMtaSrama sukhaM kiMvA - varalajjA sAvA kAvA
paravaSatanu vaibhavaM kiMvA - niratAM tayO nikRtaM nAsti

parimaLa bharita prachura suSItala- - varamRduvAyau vAti sati
tiruvEMkaTagiridEVa rAdhayO- - ssarasarati sukhaSrAMtirnAsti

Friday, November 30, 2007

360.AMganaku nIvE akhilasAmrAjyamu - అంగనకు నీవే అఖిలసామ్రాజ్యము


Archive Audio link 
అంగనకు నీవే
అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు
శ్రీసతినిధానము

కమలాలపానుపు
కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు
పాలజలధి
అమరు నీభుజాంతర
మట్టె తీగెపొదరిల్లు
రమణీయ (ప్ర)హారాలు
రత్నాలమేడలు


సతికి నీమెడా రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర

నెమ్మి నలమేల్మంగ నీకౌగిలి పెండ్లిపీట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భోగము


AMganaku nIvE akhilasAmrAjyamu
SriMgArarAya(Da nIku SrIsatinidhAnamu

kamalAlapAnupu kAMtaku nIvuramu
pramadapu nImanasu pAlajaladhi
amaru nIbhujAMtara maTTe tIgepodarillu
ramaNIya (pra)hArAlu ratnAlamEDalu

satiki nImeDA ratisAmu sEsEkaMbamu
pratilEni vayyALi bayalu nIvu
matiMchina kaustubhamaNi niluvuTaddamu
mitilEni SrIvatsamu miMchubaMDArumudra

nemmi nalamElmaMga nIkaugili peMDlipITa
chimmula chaMdanacharcha sEsapAlu
vummaDi meDanULLu vuyyAlasarapaNulu
pammi SrIvEMkaTESa nIbhAvamE bhOgamu

359.Matanga parvatamaada - మతంగ పర్వతామాడ

Archive Audio link: Shobharaju
మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడ

ఈతడా రాముని బంటు ఈతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూలందురు ఆతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన ఆతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి ఇతడ

ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడు ఇతడ
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతముననితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా

చీరజీవి ఈతడ జీతేంద్రీయుడు ఇతడ
సురలకు ఉపకారపు చుట్టము ఈతడ
నిరతి శ్రీ వేంకటాద్రీని వి నగరములో
నరిది వరములిచ్చి అందరికి ఇతడ


Matanga parvatamaada maalyavanthamu needa
Atishayillina pedda hanumanthudu ithada

Eethada raamuni bantu eethada vaayu suthudu
Aathatha balaadhyulanduru aathadithada
Seethanu vedaki vachi cheppina aathadithada
Ghathala lankaloni rakshasa vairi ithada

Anjanaasuthudithada akshamardhanudithada
Sanjeevini konda dechhe saarenithada
Bhanjinche gaalanemini panthamunanithada
Ranjitha prathapa kapiraaja sakhudithada

Chirajeevi eethada jithendriyudu ithada
Suralaku upakaarapu chuttamu eethada
Nirathi sree venkatadrini vijanagaramulo
Naridi varamulichhi andariki ithada

358.nelamUDu SOBanAlu - నెలమూడు శోభనాలు

Archive Audio link
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||


pa|| nelamUDu SOBanAlu nIku natanikidagu | kalakAlamunu niccakalyANamammA
ca|| rAmanAmamatanidi rAmavu nIvaitEnu | cAmana varNamataDu cAmavu nIvu |
vAmanuDaMduratani vAmanayanavu nIvu | prEmapumI yiddariki pErubalamokaTE
ca|| hari pErAtaniki hariNEkShaNavu nIvu | karigAcedAnu nIvu kariyAnavu |
sari jaladhiSAyi jaladhikanyavu nIvu | berasi mIyiddariki bErubalamokaTE ||
ca|| jalaja nABuDataDu jalajamuKivi nIvu | alamElumaMgavu ninnelamedAnu |
ilalO SrIvEMkaTESuDiTu ninnurAnamOce | pilici pEruceppebErubalamokaTE ||

Thursday, November 29, 2007

357.kalaSApuramukADa gaMdhapumAkula - కలశాపురముకాడ గంధపుమాకుల

Archive Audio link 
కలశాపురముకాడ గంధపుమాకుల నీడ
నలరేవు మేలు మేలు హనుమంతరాయ

సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బతికించి
భంజించితి వసురుల బలువిడిని
కంజాప్తకులరాఘవుని మెప్పించితివి
అంజనీతనయ వో హనుమంతరాయ

లంక సాధించితివి వీలావులెల్లా జూపితివి
కొంకక రాముని సీత( గూరిచితివి
లంకెల సుగ్రీవునికి లలి ప్రధానివైతివి
అంకెలెల్లా నీకు జెల్లె హనుమంతరాయ

దిక్కులు గెలిచితివి ధీరత( బూజ గొంటివి
మిక్కిలిప్రతాపాన మెరసితివి
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరుబంట వైతివి
అక్కజపుమహిమల హనుమంతరాయ


kalaSApuramukADa gaMdhapumAkula nIDa
nalarEvu mElu mElu hanumaMtarAya

saMjIvi koMDa techchi saumitri batikiMchi
bhaMjiMchiti vasurula baluviDini
kaMjAptakularAghavuni meppimchitivi
amjanItanaya vO hanumaMtarAya

laMka sAdhiMchitivi vIlAvulellA jUpitivi
koMkaka rAmuni sIta( gUrichitivi
laMkela sugrIvuniki lali pradhAnivaitivi
aMkelellA nIku jelle hanumaMtarAya

dikkulu gelichitivi dhIrata( bUja goMTivi
mikkilipratApAna merasitivi
ikkuvatO SrIvEMkaTESwarubaMTa vaitivi
akkajapumahimala hanumaMtarAya

356.nATiki nADE nAcaduvu - నాటికి నాడే నాచదువు

Archive Audio link
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచదువు |
మనసున నీతిని మరచుటకే పో | పనివడి యిప్పటి ప్రౌఢలచదువు ||
చ|| తెలిసి యితనినే తెలియుటకే పో | తొలుత గృతయుగాదుల చదువు |
కలిగియీతని గాదననే పో | కలియుగంబులో గలిగిన చదువు ||
చ|| పరమై వేంకటపతి గనుటకే పో | దొరలగు బ్రహ్మాదుల చదువు |
సిరుల నితని మరచెడికొరకే పో | విరసపుజీవుల విద్యలచదువు ||


pa|| nATiki nADE nAcaduvu | mATalADucunu maracETicaduvu ||
ca|| enaya nItani neruguTakE pO | venakavAru cadivinacaduvu |
manasuna nItini maracuTakE pO | panivaDi yippaTi prauDhalacaduvu ||
ca|| telisi yitaninE teliyuTakE pO | toluta gRtayugAdula caduvu |
kaligiyItani gAdananE pO | kaliyugaMbulO galigina caduvu ||
ca|| paramai vEMkaTapati ganuTakE pO | doralagu brahmAdula caduvu |
sirula nitani maraceDikorakE pO | virasapujIvula vidyalacaduvu ||

Wednesday, November 28, 2007

355.vEvElacaMdAla vADu - వేవేలచందాల వాడు విఠలేశుడు


Archive Audio link : vani jayaram, parupalli brothers
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు ||
చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి | అతిశయిల్లేటి పరమానందమితడు ||
చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
చ|| వరముతో యశోద వసుదేవాదులకు | పరగిన కన్నుల పండుగీతడు |

సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | నిరతి దాసుల పాలి నిధాన మితడు ||

pa|| vEvElacaMdAla vADu viThalESuDu | BAviMca nalavigAni paramAtmuDitaDu ||
ca|| satatamu rukmiNI satyaBAmala naDuma | ratikekkina siMgAra rAyaDu itaDu |
caturata sanakAdi saMyamIMdrula mati | atiSayillETi paramAnaMdamitaDu ||
ca|| dEvatala kellAnu dikku desai velugoMdi | tAvu konnayaTTi yAdhAra mItaDu |
mUvoMka golletalu munnu sEsina tapamu | kaivasamai PaliMcina GanaBAgya mitaDu ||
ca|| varamutO yaSOda vasudEvAdulaku | paragina kannula paMDugItaDu |
sirula miMcina yaTTi SrI vEMkaTAdri mIdi | nirati dAsula pAli nidhAna mitaDu ||

354.unnatOnnatuDu vuDayavaru-ఉన్నతోన్నతుడు వుడయవరు

Archive Audio link : G Balakrishnaprasad
ఉన్నతోన్నతుడు వుడయవరు
యెన్న ననంతుడే యీ వుడయవరు
సర్వలోకముల శాస్త్రరహస్యము
లుర్వి( బొడమె నీ యుడయవరు
పూర్వపు వేదాంత పుణ్యశాస్రములు
నిర్వహించె నన్నిటా నుడయవరు
వెక్కస(పు శ్రీవిష్ణుభక్తియే
వొక్కరూపమే వుడయవరు
చక్కనైన సుజ్ఞానమున కిరవై
వుక్కు మీఱెనిదె వుడయవరు
కదినె మోక్షసాకారము దానై
వుదుటున నిలిచె నీ వుడయవరు
యిదిగో శ్రీవేంకటేశ్వరు యీ(నీ)డై
పొదలుచు నున్నాడు భువి నుడయవరు


unnatOnnatuDu vuDayavaru
yenna nanaMtuDE yI vuDayavaru

sarwalOkamula SAstrarahasyamu
lurvi( boDame nI yuDayavaru
pUrwapu vEdAMta puNyaSAsramulu
nirwahiMche nanniTA nuDayavaru

vekkasa(pu SrIvishNubhaktiyE
vokkarUpamE vuDayavaru
chakkanaina suj~nAnamuna kiravai
vukku mI~renide vuDayavaru

kadine mOkshasAkAramu dAnai
vuduTuna niliche nI vuDayavaru
yidigO SrIvEMkaTESwaru yI(nI)Dai
podaluchu nunnADu bhuvi nuDayavaru

Monday, November 26, 2007

353.sarvAMtarAtmuDavu - సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను

ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||

చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||

చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||

చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||

sarvAMtarAtmuDavu (Raagam: ) (Taalam: )
pa|| sarvAMtarAtmuDavu SaraNAgatuDa nEnu | sarvAparAdhinaiti cAlujAlunayyA ||

ca|| vUrakunnajIvuniki vokkokka svataMtramicci | kOrETiyaparAdhAlu konni vEsi |
nErakuMTE narakamu nEricitE svargamaMTU | dUruvEsEviMtEkAka dOShamevvaridayyA ||

ca|| manasu cUDavalasi mAyalu nIvE kappi | janulaku viShayAlu cavulucUpi |
kanugoMTE mOkShamicci kAnakuMTe karmamicci | Ganamu sEsEviMdu kartalevvarayyA ||

ca|| vunnAru prANulellA nokkanIgarBamulOnE | kannakanna BramatalE kalpiMci |
yinniTA SrIvEMkaTESa yElitivi mammu niTTe | ninnu nannu neMcukuMTE nIkE teliyunayyA ||


Saturday, November 24, 2007

352.jayalakshmI varalakshmI - జయలక్ష్మీ వరలక్ష్మీ


Archive Audio link : G Balakrishnaprasad
Meaning : Tadepalli Patanjali
యలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ

పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ

చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ


jayalakshmI varalakshmI saMgrAma vIralakshmi
priyurAlavai hariki( berasiti vamma

pAlajalanidhilOni pasanaina mIgaDa
mElimi tAmeralOni miMcu vAsana
nIlavarNunuramupai niMDina nidhAnamavai
ElEvu lOkamulu mammElavamma

chaMdurutODabuTTina saMpadala meraguvO
kaMduva brahmalagAchE kalpavallivO
aMdina gOviMduniki aMDanE tODu nIDai
vuMdAnavu mA yiMTanE vuMDavammA

padiyAru vannelatO baMgAru patima
chedarani vEdamula chiguru bODi
eduTa SrIvEMkaTESu nillAlavai nIvu
nidhula nilichE talli nIvAramamma

Friday, November 23, 2007

351.paripUrNagaruDAdripaMcAnanaM- పరిపూర్ణగరుడాద్రిపంచాననం

Archive Audio link : G Balakrishnaprasad , D Pasupati
ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
చ|| కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం | పారీణచక్రధర పంచాననం |
వీరపంచాననం విజయపంచాననం | భారభూభారహరపంచాననం ||
చ|| దివిజపంచాననం తీవ్రనఖకాననం | భవనాశినీతీరపంచాననం |
కువలయాకాశసంఘోషపంచాననం | పవిశబ్దదంతరవపంచాననం ||
చ| శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం | పావనం పంచముఖపంచాననం |
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం | భావితం శ్రీయుక్తపంచాననం ||


pa|| paripUrNagaruDAdripaMcAnanaM | paramaM sEvE paMcAnanaM ||
ca|| kRUradaMShTrAgnikaNaGOrapaMcAnanaM | pArINacakradhara paMcAnanaM |
vIrapaMcAnanaM vijayapaMcAnanaM | BAraBUBAraharapaMcAnanaM ||
ca|| divijapaMcAnanaM tIvranaKakAnanaM | BavanASinItIrapaMcAnanaM |
kuvalayAkASasaMGOShapaMcAnanaM | paviSabdadaMtaravapaMcAnanaM ||
ca| SrIvEMkaTAKya GanaSiKaripaMcAnanaM | pAvanaM paMcamuKapaMcAnanaM |
sEvitaprahlAdasiddhipaMcAnanaM | BAvitaM SrIyuktapaMcAnanaM ||

Tuesday, November 20, 2007

350.pUjalaMdaru jEsEdE pushpayAgamu - పూజలందరు జేసేదే పుష్పయాగము


Archive Audio link : G Balakrishnaprasad
పూజలందరు జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము

మొదల శ్రీసతి చేతి మోహన కమలమే
పొదల నీకెపుడును పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు
పొదిగి పూజించిన పుష్పయాగము

మాలాకారుడిచ్చిన మధురలో పూదండా
పోలింప నీకు నదె పుష్పయాగము
కేలితో నారదుడొసగిన పారిజాతము
భుఊలోకమున నీకు పుష్పయాగము

తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీవురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ నీకు
పొరిపొరి జేసేరు పుష్పయాగము
pUjalaMdaru jEsEdE pushpayAgamu
Aji narjunuDu chEsinadi pushpayAgamu

modala SrIsati chEti mOhana kamalamE
podala nIkepuDunu pushpayAgamu
gudigona mimmiddari gUDimchE maruvirulu
podigi pUjiMchina pushpayAgamu

mAlAkAruDichchina madhuralO pUdaMDA
pOliMpa nIku nade pushpayAgamu
kElitO nAraduDosagina pArijAtamu
bhuUlOkamuna nIku pushpayAgamu

torali alamElmaMga turumuna virulE nIku
porasi nIvuramupai pushpayAgamu
sirulatO munulella SrIvEMkaTAdrISa nIku
poripori jEsEru pushpayAgamu

349.paTTamu gaTTitiviMka - పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా


Audio link : Balakrishnaprasad
Archive Audio link: G Balakrishnaprasad
ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
చ|| అలమేలు మంగకు సింహాసనము నీవురము | కలిత హారములే సింగారపు దండలు |
తొలుత నీహస్తములే తోరణ గంభములు | చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||
చ|| పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు | మెరుగు గౌస్తుభమణి మించుటద్దము |
గరిమ నీసొబగులు కప్పములు గానికలు | సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా ||
చ|| సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు | వింత రతి భోగములు వినోదాలు |
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి | చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా ||


pa|| paTTamu gaTTitiviMka bratukarayyA | ciTTakAlu lEvu mIku SrI vEMkaTESuDA ||
ca|| alamElu maMgaku siMhAsanamu nIvuramu | kalita hAramulE siMgArapu daMDalu |
toluta nIhastamulE tOraNa gaMBamulu | celi rAjyamE nIvu SrI vEMkaTESuDA ||
ca|| paragu tulasIdaMDa pacca tOraNamApeku | merugu gaustuBamaNi miMcuTaddamu |
garima nIsobagulu kappamulu gAnikalu | sirulu nI kUrimalu SrI vEMkaTESuDA ||
ca|| saMtatamaina viMdulu sAre nImOvi tEnelu | viMta rati BOgamulu vinOdAlu |
koMta niyyArunu boDDu kuMceyu gALANi | ceMtalanannI namare SrI vEMkaTESuDA ||