Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-475 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, June 24, 2008

507.mariyu mariyu palumAru nIkE - మరియు మరియు పలుమారు నీకే శరణు

Audio link :PSRanganath
Archive link :

Click here to download this kirtana. ragam: saramati ,composer and singer: PS ranganath

మరియు మరియు పలుమారు నీకే శరణు
అరిమురి సకలాంతర్యామీ శరణు

సరుస మూర్తిత్రయశరీరానికి శరణు
నిరుపమ పంచభూతనిలయా శరణూ
పురిగొన్న చరుత్దశ భువనాధారా శరణు
గరిమెనింతకు మూలకారణమా శరణు

పలుకగరాని పరబ్రహ్మమా నీకే శరణు
అలవి మీఱినయట్టి కాలాత్మకా శరణు
విలసిల్ల బొడచూపే విశ్వరూపమా శరణు
సలలిత బ్రహ్మాండజనకా శరణు

దినకర కోటికోటి తేజమా నీకే శరణు
సనకాది యోగీంద్ర సన్నుతా శరణు
మనికైన అలమేలుమంగ విభుడా శరణు
ననుగాచే శ్రీవేంకటనాయకా శరణు


mariyu mariyu palumAru nIkE SaraNu
arimuri sakalAMtaryAmI SaraNu

sarusa mUrtitrayaSarIrAniki SaraNu
nirupama paMchabhUtanilayA SaraNU
purigonna charutdaSa bhuvanAdhArA SaraNu
garimeniMtaku mUlakAraNamA SaraNu

palukagarAni parabrahmamA nIkE SaraNu
alavi mI~rinayaTTi kAlAtmakA SaraNu
vilasilla boDachUpE viSwarUpamA SaraNu
salalita brahmAMDajanakA SaraNu

dinakara kOTikOTi tEjamA nIkE SaraNu
sanakAdi yOgIMdra sannutA SaraNu
manikaina alamElumaMga vibhuDA SaraNu
nanugAchE SrIvEMkaTanAyakA SaraNu

Friday, June 06, 2008

506.meccenoka rAgaMbu mIda - మెచ్చెనొక రాగంబు మీద


Archive/Audio link : 
Click here to watch video of this kriti sung by Rasajhari group, in orlando, composed by Srinivasa Bharadwaj Kishore <lost youtube link>
ప|| మెచ్చెనొక రాగంబు మీద మీద కడు | నిచ్చె నొక రాగంబు యింతులకు నెల్ల ||

చ|| చేసె నొక రాగంబు చెలియెదుట గన్నులనె | మూసె నొక రాగంబు ముదిత మతినె |
పూసె నొక రాగంబు పొలతి పులకలమేన | వ్రాసె నొక రాగంబు వనిత నినుబాసి ||

చ|| పట్టె నొక రాగంబు ప్రాణములపై నలిగి | తిట్టె నొక రాగంబు తిరిగి తిరిగి |
పుట్టె నొక రాగంబు పొలతి డెందమునకును | మెట్టె నొక రాగంబు మెరయుచునె కదలి ||

చ|| కురిసె నొక రాగంబు కొప్పు పువ్వులనె సతి | మురిసె నొక రాగంబు ముంచి మేన |
తిరువేంకటేశ్వరుడ తెలిసికో నినుబొంది | పొరసె నొక రాగంబు పొలతి కుచములనే ||

pa|| meccenoka rAgaMbu mIda mIda kaDu | nicce noka rAgaMbu yiMtulaku nella ||

ca|| cEse noka rAgaMbu celiyeduTa gannulane | mUse noka rAgaMbu mudita matine |
pUse noka rAgaMbu polati pulakalamEna | vrAse noka rAgaMbu vanita ninubAsi ||

ca|| paTTe noka rAgaMbu prANamulapai naligi | tiTTe noka rAgaMbu tirigi tirigi |
puTTe noka rAgaMbu polati DeMdamunakunu | meTTe noka rAgaMbu merayucune kadali ||

ca|| kurise noka rAgaMbu koppu puvvulane sati | murise noka rAgaMbu muMci mEna |
tiruvEMkaTESvaruDa telisikO ninuboMdi | porase noka rAgaMbu polati kucamulanE ||

505.kadisi yAtaDu mammugAcugAka - కదిసి యాతడు మమ్ముగాచుగాక

click here to watch the video of this kirtana, sung by Rasajhari, Orlando, composed by Srinivasa Bharadwaj Kishore
|| కదిసి యాతడు మమ్ముగాచుగాక | అదె యాతనికె శరణంటే నంటినేను ||

చ|| ఎవ్వని వుదరమున నిన్నిలోకములుండు | ఎవ్వని పాదము మోచె నిల యలను |
ఎవ్వడు రక్షకుడాయనీ జంతుకోట్లకు | అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు ||

చ|| సభలో ద్రౌపదిగాచె సర్వేశు డెవ్వడు | అభయ హస్తమొసగె నాతడెవ్వడు |
ఇభ వరదు డెవ్వడు యీతనికి వొడిగట్టి | అభినవముగ శరణంటే నంటి నిప్పుడు ||

చ|| శరణు చొచ్చిన విభీషణు గాచె నెవ్వడు | అరిది యజుని తండ్రి యాతడెవ్వడు |
ఇరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతడితడే | అరిసి యితనికే శరణంటే నంటి నిప్పుడు ||


pa|| kadisi yAtaDu mammugAcugAka | ade yAtanike SaraNaMTE naMTinEnu ||

ca|| evvani vudaramuna ninnilOkamuluMDu | evvani pAdamu mOce nila yalanu |
evvaDu rakShakuDAyanI jaMtukOTlaku | avviBuniki SaraNaMTE naMTi nippuDu ||

ca|| saBalO draupadigAce sarvESu DevvaDu | aBaya hastamosage nAtaDevvaDu |
iBa varadu DevvaDu yItaniki voDigaTTi | aBinavamuga SaraNaMTE naMTi nippuDu ||

ca|| SaraNu coccina viBIShaNu gAce nevvaDu | aridi yajuni taMDri yAtaDevvaDu |
iravai SrIvEMkaTAdri yekki nAtaDitaDE | arisi yitanikE SaraNaMTE naMTi nippuDu ||

Thursday, June 05, 2008

504.rAmuDu lOkAbhirAmuDu vIDigO - రాముడు లోకాభిరాముడు వీడిగోAudio link :G.BalaKrishnaPrasad
Archive link :

రాముడు లోకాభిరాముడు వీడిగో
వేమారు మొక్కుచు సేవించరో జనులు

చెలువపు రూపమున జితకాముడు
మలసీ బిరుదున సమరభీముడు
పొలుపైన సాకేత పురధాముడు
యిలలో ప్రజలకెల్లా హిమధాముడు

ఘనకాంతుల నీలమేఘశ్యాముడు
అనిశము నుతుల సహస్రనాముడు
కనుపట్టు కపినాయకస్తోముడు
తనునెంచితే దేవతాసార్వభౌముడు

సిరులమించిన తులసీదాముడు
కరుణానిధియైన భక్తప్రేముడు
వురుతరమహిమల నుద్దాముడు
గరిమల శ్రివేంకటగిరి గ్రాముడు


rAmuDu lOkAbhirAmuDu vIDigO
vEmAru mokkuchu sEviMcharO janulu

cheluvapu rUpamuna jitakAmuDu
malasI biruduna samarabhImuDu
polupaina sAkEta puradhAmuDu
yilalO prajalakellA himadhAmuDu

ghanakAmtula nIlamEghaSyAmuDu
aniSamu nutula sahasranAmuDu
kanupaTTu kapinAyakastOmuDu
tanuneMchitE dEvatAsArwabhaumuDu

sirulamiMchina tulasIdAmuDu
karuNAnidhiyaina bhaktaprEmuDu
vurutaramahimala nuddAmuDu
garimala SrivEMkaTagiri grAmuDu

Wednesday, June 04, 2008

503.kotta peMDli kUturu koMku - కొత్త పెండ్లి కూతురు కొంకు దేరీ( దేరదు

Click here to listen to this kirtana
కొత్త పెండ్లి కూతురు కొంకు దేరీ( దేరదు
చిత్తగించి నీవైన చేయి వట్టవయ్యా

చిమ్ముచు నీమోము చూచీ సిగ్గుతో దగ్గరదు
కొమ్మసంగడి నీవైన కూచుండవయ్యా
కమ్మి నవ్వులను నవ్వీ కలసి మాటలాడదు
పమ్మి నీవైన నాపెతో పలుకవయ్యా

ఆలవట్టాము విసరే నంటి ముట్టి పెనగదు
తేలించి యాపె వెరపు తెలుపవయ్యా
కాలు దొక్కీ నిన్ను నిట్టె కాకదేర గలయదు
పోళిమి నీవే కాగిట బొదుగవయ్యా

తనలోనే మోహించీ దంటతనము నేరదు
ననుపులే యాకెతోడ నడపవయ్య
యెనసె శ్రీవేంకటేశ యింతి నిన్ను మెల్లనె
మన సిచ్చి యిటులానె మన్నించవయ్యా


kotta peMDli kUturu koMku dErI( dEradu
chittagiMchi nIvaina chEyi vaTTavayyA

chimmuchu nImOmu chUchI siggutO daggaradu
kommasaMgaDi nIvaina kUchuMDavayyA
kammi navvulanu navvI kalasi mATalADadu
pammi nIvaina nApetO palukavayyA

AlavaTTAmu visarE naMTi muTTi penagadu
tEliMchi yApe verapu telupavayyA
kAlu dokkI ninnu niTTe kAkadEra galayadu
pOLimi nIvE kAgiTa bodugavayyA

tanalOnE mOhiMchI daMTatanamu nEradu
nanupulE yAketODa naDapavayya
yenase SrIvEMkaTESa yiMti ninnu mellane
mana sichchi yiTulAne manniMchavayyA