915. vaTTi laMpaTamu vadala nEradu gAna - వట్టి లంపటము వదల నేరదు గాన
Youtube link : Sri P Ranganath, in raga Malayamarutam
॥పల్లవి॥వట్టి లంపటము వదల నేరదు గాన
పుట్టించిన హరి బుద్దిలోనె కాఁడా ॥చ1॥దేహాభిమానములు తెగి విడిచినఁ గాని యీహల దేవుఁడు తన్ను నేల మెచ్చీనీ సాహసించి కోరికెల సంగము మానకుండితే వోహో పరమపద మూర కేల కలుగు ॥చ2॥నిచ్చలును వైరాగ్యనిష్ఠుడు గాకుండితేను యెచ్చిన జన్మాదు లెల్ల యేల కడచు కొచ్చి కొచ్చి తనలోని కోపముడుగ కుండితే అచ్చపు బ్రహ్మానంద మది యేల కలుగు ॥చ3॥శ్రీ వేంకటాద్రి మీఁది శ్రీపతిఁ గొల్వకుండితే సోవల నా దేవుఁ డిట్టె సులభుఁడవునా భావించి తనలోని భక్తి నిలుపకుండితే తావుల నన్నిటాను సంతత పుణ్యుఁ డవునా (రాగము: భూపాళం,రేకు: 0027-03,సంపుటము: 15-155) ---తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన




.jpg)








A wonderful composition by Sri TP Chakrapani in vivadi. , the tune is so apt for the kirtana, you can see sri krishna allari in the tune... 