704.vedakavO chittamA vivEkiMchi nIvu - వెదకవో చిత్తమా వివేకించి నీవు
Audio link : Smitha Madhav , album : nandakam
3-415
వెదకవో చిత్తమా వివేకించి నీవు
అదన తదియ్య సేవ అంతకంటే మేలు
చూపులెన్నైనా గలవు సూర్యమండలముదాకా
చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని
తీపులెన్నైనా గలవు తినదిన నాలికెకు
తీపు శ్రీహరిపదార్ధమని కోరదు
మాటలెన్నైనా గలవు మరిగితే లోకమందు
మాటలు శ్రీహరినామము మరపగ్ వలె
తేటలెన్నైనా గలవు తీరని చదువులందు
తేటగా రామానుజులు తేరిచె వేదములలో
చేట లెన్నైనా గలవు సేసేమంటే భూమి
చేతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను
వ్రాతలెన్నైనా గలవు వనజభవునిముద్ర
వ్రాతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు
vedakavO chittamA vivEkiMchi nIvu
adana tadiyya sEva aMtakaMTE mElu
chUpulennainA galavu sUryamaMDalamudAkA
chUpulu SrIharirUpu chUDa dorakadu gAni
tIpulennainA galavu tinadina nAlikeku
tIpu SrIharipadArdhamani kOradu
mATalennainA galavu marigitE lOkamaMdu
mATalu SrIharinAmamu marapaga vale
tETalennainA galavu tIrani chaduvulaMdu
tETagA rAmAnujulu tEriche vEdamulalO
chETa lennainA galavu sEsEmaMTE bhUmi
chEtala SrIvEMkaTESu sEva sEyavalenu
vrAtalennainA galavu vanajabhavunimudra
vrAtalu chakrAMkitAle vahikekkE mudralu
No comments:
Post a Comment