705.dEva nI pakshapAtamO tirigE - దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
3-422
Audio link : in raga sindubhairavi
దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా
దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా
విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే
మునిగేటిజాతిబేధము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే
పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా
అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా
dEva nI pakshapAtamO tirigE lOkula veltO
SrIvibhuDa nIvEkAdA chittamulOnayyA
divamulu sariyE dinarAtrulunu sarE
yivala sukhadu@hkhAlu hechchukuMdulElayyA
bhavamulu sariyE prANamulu sariyE
bhuvi puNyapApamula bhOgamu vErElayyA
vini kiMdiri kokaTE vishayAlu nokarItE
munigETijAtibEdhamu livElayyA
anayamu@M jUpokkaTE Akaliyu nokaTE
penagETi guNamulu pekkujADa lElayyA
aMtarAtma nIvokkaDa vanniTA SrIvEMkaTESa
chiMtalu vEvElaina silugElayyA
yiMtasEsI nImAya liMdukE nISaraNaMTE
kAMtuDa nanniMdukE kAchitivi nEDayyA
1 comment:
అన్నమయ్య పాటల్లో ఉన్న సాంఘికప్రస్తావనలకు ఇది ఒక మచ్చుతునక. ఆయన కేవలం ఆధ్యాత్మికంగానే కాక, సమాజంలోని విషయాలను కూడా పట్టించుకున్నాడు అనడానికి ఇది మఱొక ఋజువు. చక్కని పాటను గురించి చెప్పావు సోదరా. నీకు నా ధన్యవాదములు.
Post a Comment