Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga:Kalyani. Show all posts
Showing posts with label Raga:Kalyani. Show all posts

Tuesday, August 05, 2008

519.garuDa dhwajambekke kamalAkshu - గరుడ ధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి



Audio link : Dwaram Lakshmi : Ragam Kalyani
Archive link :

గరుడ ధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చె పైపై సేవించను

పాడిరి సో
బాన నదె భారతియ గిరుజయు
ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరగ శ్రీవిభుని పెండ్లికిని

కురిసె పువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభి మోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమై మించిన దేదదేవుని పెండ్లికిని

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల
పోసిరదె తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగ తాను
సేసలు వెట్టిన యట్టి సింగారపు పెండ్లికి


garuDa dhwajambekke kamalAkshu peMDliki
parusha ladivO vachche paipai sEviMchanu

pADiri sObAna nade bhAratiya girujayu
ADiri raMbhAdulaina achcharalella
kUDiri dEvatalella guMpulai SrIvEMkaTAdri
vEDukalu mIraga SrIvibhuni peMDlikini

kurise puvvulavAna kuppalai yeMdu chUchina
morase dEvaduMdubhi mOtalellanu
berase saMpadalella peMTalai SrIvEMkaTAdri
tiramai miMchina dEdadEvuni peMDlikini

vEsiri kAnukalella vEvElu kopperala
pOsirade talabAlu puNyasatulu
Asala SrIvEMkaTESuDalamElumaMga tAnu
sEsalu veTTina yaTTi siMgArapu peMDliki

Friday, June 06, 2008

505.kadisi yAtaDu mammugAcugAka - కదిసి యాతడు మమ్ముగాచుగాక

click here to watch the video of this kirtana, sung by Rasajhari, Orlando, composed by Srinivasa Bharadwaj Kishore
|| కదిసి యాతడు మమ్ముగాచుగాక | అదె యాతనికె శరణంటే నంటినేను ||

చ|| ఎవ్వని వుదరమున నిన్నిలోకములుండు | ఎవ్వని పాదము మోచె నిల యలను |
ఎవ్వడు రక్షకుడాయనీ జంతుకోట్లకు | అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు ||

చ|| సభలో ద్రౌపదిగాచె సర్వేశు డెవ్వడు | అభయ హస్తమొసగె నాతడెవ్వడు |
ఇభ వరదు డెవ్వడు యీతనికి వొడిగట్టి | అభినవముగ శరణంటే నంటి నిప్పుడు ||

చ|| శరణు చొచ్చిన విభీషణు గాచె నెవ్వడు | అరిది యజుని తండ్రి యాతడెవ్వడు |
ఇరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతడితడే | అరిసి యితనికే శరణంటే నంటి నిప్పుడు ||


pa|| kadisi yAtaDu mammugAcugAka | ade yAtanike SaraNaMTE naMTinEnu ||

ca|| evvani vudaramuna ninnilOkamuluMDu | evvani pAdamu mOce nila yalanu |
evvaDu rakShakuDAyanI jaMtukOTlaku | avviBuniki SaraNaMTE naMTi nippuDu ||

ca|| saBalO draupadigAce sarvESu DevvaDu | aBaya hastamosage nAtaDevvaDu |
iBa varadu DevvaDu yItaniki voDigaTTi | aBinavamuga SaraNaMTE naMTi nippuDu ||

ca|| SaraNu coccina viBIShaNu gAce nevvaDu | aridi yajuni taMDri yAtaDevvaDu |
iravai SrIvEMkaTAdri yekki nAtaDitaDE | arisi yitanikE SaraNaMTE naMTi nippuDu ||

Monday, October 15, 2007

319.koluvuDI Bakti koMDalakOnETi- కొలువుడీ భక్తి కొండలకోనేట


Ragam : kalyani , composer : G.Balakrishnaprasad
ప|| కొలువుడీ భక్తి కొండలకోనేటి- | నిలయుని శ్రీనిధి యైనవాని ||
చ|| ఆదిదేవుని నభవుని సామ- | వేదనాద వినోదుని నెర- |
వాది జితప్రియు నిర్మలతత్త్వ- | వాదులజీవనమైన వాని ||
చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ- | భావాతీత స్వభావుని |
శ్రీవేంకటగిరి దేవుడైన పర- | దేవుని భూదేవతత్పరుని ||


pa|| koluvuDI Bakti koMDalakOnETi- | nilayuni SrInidhi yainavAni ||
ca|| AdidEvuni naBavuni sAma- | vEdanAda vinOduni nera- |
vAdi jitapriyu nirmalatattva- | vAdulajIvanamaina vAni ||
ca|| dEvadEvuDaina divyuni sarva- | BAvAtIta svaBAvuni |
SrIvEMkaTagiri dEvuDaina para- | dEvuni BUdEvatatparuni ||

Monday, May 14, 2007

214.koluvai vunnADu-కొలువై వున్నాడు వీడె



Raga : kalyani , composer : G.Balakrishnaprasad 
Audio link :GBKP
Archive link :
ప|| కొలువై వున్నాడు వీడె గోవిందరాజు | కొలకొలనేగి వచ్చె గోవిందరాజు ||
చ|| గొడుగుల నీడల గోవిందరాజు | గుడిగొన్న పడగల గోవిందరాజు |
కుడియెడమ కాంతల గోవిందరాజు | కొడిసాగే పవుజుల గోవిందరాజు ||
చ|| గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు | గుప్పేటి వింజామరల గోవిందరాజు
కొప్పుపై చుంగులతోడి గోవిందరాజు | కుప్పికటారము తోడి గోవిందరాజు ||
చ|| గొరబుసింగరాల గోవిందరాజు | కురులు దువ్వించుకొని గోవిందరాజు |
తిరుపతిలోనను తిరమై శ్రీవేంకటాద్రి | గురిసీ వరములెల్ల గోవిందరాజు ||

pa|| koluvai vunnADu vIDe gOviMdarAju | kolakolanEgi vacce gOviMdarAju ||
ca|| goDugula nIDala gOviMdarAju | guDigonna paDagala gOviMdarAju |
kuDiyeDama kAMtala gOviMdarAju | koDisAgE pavujula gOviMdarAju ||
ca|| goppa goppa pUdaMDala gOviMdarAju | guppETi viMjAmarala gOviMdarAju
koppupai cuMgulatODi gOviMdarAju | kuppikaTAramu tODi gOviMdarAju ||
ca|| gorabusiMgarAla gOviMdarAju | kurulu duvviMcukoni gOviMdarAju |
tirupatilOnanu tiramai SrIvEMkaTAdri | gurisI varamulella gOviMdarAju ||