319.koluvuDI Bakti koMDalakOnETi- కొలువుడీ భక్తి కొండలకోనేట
Ragam : kalyani , composer : G.Balakrishnaprasad
ప|| కొలువుడీ భక్తి కొండలకోనేటి- | నిలయుని శ్రీనిధి యైనవాని ||చ|| ఆదిదేవుని నభవుని సామ- | వేదనాద వినోదుని నెర- |
వాది జితప్రియు నిర్మలతత్త్వ- | వాదులజీవనమైన వాని ||
చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ- | భావాతీత స్వభావుని |
శ్రీవేంకటగిరి దేవుడైన పర- | దేవుని భూదేవతత్పరుని ||
pa|| koluvuDI Bakti koMDalakOnETi- | nilayuni SrInidhi yainavAni ||
ca|| AdidEvuni naBavuni sAma- | vEdanAda vinOduni nera- |
vAdi jitapriyu nirmalatattva- | vAdulajIvanamaina vAni ||
ca|| dEvadEvuDaina divyuni sarva- | BAvAtIta svaBAvuni |
SrIvEMkaTagiri dEvuDaina para- | dEvuni BUdEvatatparuni ||
No comments:
Post a Comment