325.nAkunjeppare valapu-నాకు(జెప్పరె వలపు
అన్నమయ్య, ఈ విరహ గీతం లో జంటపదాలని ఎంత అద్భుతాంగా వాడారో చూడండి. "ఎగ్గో సిగ్గో" "పొగయో వగయో".... అద్భుతం...!
ఈ కీర్తనని శ్రీరంగం గోపాలరత్నంగారి గాత్రంలొ వినండి
Archive Audio link నాకు(జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవ(గరాదు నుయ్యో కొండో
పొలతి మరునికి వెరవ పులియో యెలువో
వులుకుతుమ్మిదమోత వురుమో మెరుమో
తిలకింప చందనము తేలో పామో
యెలమి కోవిలకూత యేదోపోదో(రేకు : యేటోపోటో )
పొదలిన చలిగాలి పొగయో వగయో
వదలిన కన్నీరు వాగో వంతో
వుదరమున పన్నీరు వుడుకో మిడుకో
యెదుట తలవంచుకొనుట ఎగ్గో సిగ్గో
అసమశరునిపై పరపుటదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదోపాదో(రేకు : ఆటోపాటో)
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో
nAku(jeppare valapu nalupO telupO
nUki pOva(garAdu nuyyO koMDO
polati maruniki verava puliyO yeluvO
vulukutummidamOta vurumO merumO
tilakiMpa chaMdanamu tElO pAmO
yelami kOvilakUta yEdOpOdO
podalina chaligAli pogayO vagayO
vadalina kannIru vAgO vaMtO
vudaramuna pannIru vuDukO miDukO
yeduTa talavaMchukonuTa eggO siggO
asamaSarunipai parapuTadanO padanO
pasagalavAnimOvi paMchadArO tEnO
asamagati vAnirAka AdOpAdO
rasiku vEMkaTESu poMdu rAjyamO lakshmO
Explanation by Kalaprapoorna Dr. Balantrapu Rajanikanta Rao garu
1 comment:
చక్కని పాట సోదరా! బాలాంత్రపు రజినీకాంతరావుగారి దస్తూరి చూడగలగడం కళాపిపాసుల అదృష్టం అనే చెప్పాలి. ఇందులో "సందేహాలంకారం" విరివిగా వాడబడింది.
Post a Comment