Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword)
to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
Audio section under Maintanance
Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9
Youtube link Annamayya pataku pattabhishekam, tuned by Sri Ramachari, Singer Sri Mruduravali ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య యేలితివి నాఁడెనాఁడె యెరుఁగుదుమయ్యా
యిరవైన దైవకృపయేలదొరుకును తమకు పరమైన కర్మంబు పరిపాటిగాక యెరవైన పెనుబంధ మేలవీడెడు నాత్మ( తిరువేంకటేశుకృప తిరమైనగాకEdi chUchina tamaku yinniyunu iTuvalene vEduviDichina kUDu vedakinanu lEdu
భగవంతుని నిర్మల అంతఃకరణముతో కీర్తించుట మాత్రమే వేద సమ్మతమైన మతము అని స్పష్టంగా అన్నమయ్య ఈ సంకీర్తనలో ఎలుగెత్తి చాటుతున్నాడు!. మనం ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది అని తగవులాడుకుంటూ కాలాన్ని వ్యర్దం చేసుకుంటాం! అలాకాక అన్నమయ్య చెప్పినట్టు ఈ సంకీర్తనామతాన్ని ఆచరిస్తే శ్రీహరి కృపకు సులభంగా పాతృలవుతాం.
1. వ చరణం
అతుల భోగాసక్తానాం = సాటిలేని జన్మభోగములయందు ఆసక్తులైన వారికి
హితవైభవసుఖం = మేలు గూర్చు ఐశ్వర్య సుఖము
ఇదం ఏవ = ఇదియే (అది)
సతతం = ఎల్లప్పుడు
శ్రీహరి సంకీర్తనం = శ్రీ మన్నారాయణుని సంకీర్తనయే
తద్వ్యతిరిక్తసుఖం = దానికంటే వేఱైన సుఖము
వక్తుం = చెప్పుటకు
నాస్తి = లేదు
2. వ చరణం
బహుళ మరణ పరిభవచిత్తానాం = అనేకములైన మరణావమానములతో కూడిన మనస్సుగల వారికి
ఇహపరసాధనం = ఇహలోకమునందున, పరలోకమందును (ఉత్తమగతికి) సాధనమైనది
ఇదం ఏవ = ఇదియే
అహిశయన మనోహరసేవా = శేషశయనుడైన శ్రీహరి యొక్క మనోహరమైన సేవయే
తద్విహరణం వినా = ఆ సేవా విహారము దప్ప
విధిరపి = (మరొక) విధానము గూడ
నాస్తి = లేదు
3. వ చరణం
సంసార దురిత జాడ్యపరాణాం = సంసార పాపమనెడు రోగములకు వశులైన వారికి
హింసావిరహితం = హింసలేనిది
ఇదం ఏవ = ఇదియే (అది)
కంసాంతక వేంకటగిరిపతే = కంసనాశకుడైన శ్రీ వేంకటాచలపతి యొక్క
ప్రశంసా ఏవ = గుణకీర్తనమే
ఇహ = ఈ విషయమునందు
పశ్చాత్ = దీని వెనుక (దీనికంటే)
నాస్తి = (మరొక మేలైన త్రోవ) లేదు