727.EmigaladiMdu eMtapenaginavRthA - ఏమిగలదిందు ఎంతపెనగినవృథా
ఏమిగలదిందు ఎంతపెనగినవృథా
కాముకపు మనసునకు కడమొదలు లేదు
వత్తిలోపలినూనె వంటిది జీవనము
విత్తుమీదటిపొల్లు విధము దేహంబు
బత్తిసేయుటయేమి పాసిపోవుట యేమి
పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక
ఆకాశపాకాశ మరుదైనకూటంబు
లోకరంజనము తమలోనిసమ్మతము
చాకిమణుగులజాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదరిననునేమి
గాదెబోసినకొలుచు కర్మిసంసారంబు
వేదువిడువనికూడు వెడమాయబతుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరునికృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట
EmigaladiMdu eMtapenaginavRthA
kAmukapu manasunaku kaDamodalu lEdu
vattilOpalinUne vaMTidi jIvanamu
vittumIdaTipollu vidhamu dEhaMbu
battisEyuTayEmi pAsipOvuTa yEmi
pottulasukhaMbulaku poraluTalugAka
AkASapAkASa marudainakUTaMbu
lOkaraMjanamu tamalOnisammatamu
chAkimaNugulajADa chaMchalapu saMpadalu
chEkoninanEmi yivi chedarinanunEmi
gAdebOsinakoluchu karmisaMsAraMbu
vEduviDuvanikUDu veDamAyabatuku
vEdanala neDateguTa vEMkaTESwarunikRpA-
mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa
2 comments:
శ్రవణ్ గారు
మంచి కీర్తన పరిచయం చేసారు
విన్నంత సేపూ భక్తి వైరాగ్యాలు ఆవరించి ఆనక భక్తి మిగిలి, వైరాగ్యం పోతోంది
అందుకే అన్నమయ్య చెప్పిన "కాముకపు మనసునకు కడమొదలు లేదు"
నిజం
ధన్యవాదములు
Aunu nijame!
Thanks for the comment Atreya garu !
Post a Comment