Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, September 11, 2008

537.EvaM Srutimata - ఏవం శ్రుతిమత మిదమేవ


Audio download link, Balakrishnapradad, in Tilang ragam
Archive link :
ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి

అతుల జన్మభోగాసక్తానాం
హితవైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరి సంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి

బహుళమరణ పరిభవచిత్తానా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి

సంసారదురిత జాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవాం పశ్చాదిహనాస్తి


EvaM Srutimata midamEva ta-
dbhAvayitu mata@hparaM nAsti

atula janmabhOgAsaktAnAM
hitavaibhavasukha midamEva
satataM SrIhari saMkIrtanaM ta-
dwyatiriktasukhaM vaktuM nAsti

bahuLamaraNa paribhavachittAnA-
mihaparasAdhana midamEva
ahiSayanamanOharasEvA ta-
dviharaNaM vinA vidhirapi nAsti

saMsAradurita jADyaparANAM
hiMsAvirahita midamEva
kaMsAMtaka vEMkaTagiripatE@h pra-
SaMsaivAM paSchAdihanAsti


భగవంతుని నిర్మల అంతఃకరణముతో కీర్తించుట మాత్రమే వేద సమ్మతమైన మతము అని స్పష్టంగా అన్నమయ్య ఈ సంకీర్తనలో ఎలుగెత్తి చాటుతున్నాడు!. మనం ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది అని తగవులాడుకుంటూ కాలాన్ని వ్యర్దం చేసుకుంటాం! అలాకాక అన్నమయ్య చెప్పినట్టు ఈ సంకీర్తనామతాన్ని ఆచరిస్తే శ్రీహరి కృపకు సులభంగా పాతృలవుతాం.
1. వ చరణం
అతుల భోగాసక్తానాం = సాటిలేని జన్మభోగములయందు ఆసక్తులైన వారికి
హితవైభవసుఖం = మేలు గూర్చు ఐశ్వర్య సుఖము
ఇదం ఏవ = ఇదియే (అది)
సతతం = ఎల్లప్పుడు
శ్రీహరి సంకీర్తనం = శ్రీ మన్నారాయణుని సంకీర్తనయే
తద్వ్యతిరిక్తసుఖం = దానికంటే వేఱైన సుఖము
వక్తుం = చెప్పుటకు
నాస్తి = లేదు
2. వ చరణం
బహుళ మరణ పరిభవచిత్తానాం = అనేకములైన మరణావమానములతో కూడిన మనస్సుగల వారికి
ఇహపరసాధనం = ఇహలోకమునందున, పరలోకమందును (ఉత్తమగతికి) సాధనమైనది
ఇదం ఏవ = ఇదియే
అహిశయన మనోహరసేవా = శేషశయనుడైన శ్రీహరి యొక్క మనోహరమైన సేవయే
తద్విహరణం వినా = ఆ సేవా విహారము దప్ప
విధిరపి = (మరొక) విధానము గూడ
నాస్తి = లేదు
3. వ చరణం
సంసార దురిత జాడ్యపరాణాం = సంసార పాపమనెడు రోగములకు వశులైన వారికి
హింసావిరహితం = హింసలేనిది
ఇదం ఏవ = ఇదియే (అది)
కంసాంతక వేంకటగిరిపతే = కంసనాశకుడైన శ్రీ వేంకటాచలపతి యొక్క
ప్రశంసా ఏవ = గుణకీర్తనమే
ఇహ = ఈ విషయమునందు
పశ్చాత్ = దీని వెనుక (దీనికంటే)
నాస్తి = (మరొక మేలైన త్రోవ) లేదు

2 comments:

Unknown said...

పాట చాలా బాగుంది.మీ బ్లాగు అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని.మీ ఈ బ్లాగు నాకు చాలా నచ్చిన బ్లాగు.నాకు మీ బ్లాగు ఆదర్శం.మీ బ్లాగు లానే నా బ్లాగులోని సంకీర్తనలకు కూడా ప్రముఖ గాయకుల పాటలను,వీలైతే,దొరికితే కీర్తనల నృత్యాలతో కూడిన వీడియో క్లిప్పింగులను కూడా చేర్చాలని ఎంతో ఎంతో ఆశగానూ,కోరికతోనూ ఉన్నాను.కాని నా కంప్యూటరు పరిజ్ఞానం చాలా చాలా తక్కువవటంవల్ల నాకు చేతకానటం లేదు.మీ వంటి వారి సహాయం లభిస్తే అదృష్టవంతుడనని భావిస్తాను.దయతో word verification తీసివేయండి

Sravan Kumar DVN said...

dhanyavadalu