538.kolichitE rakShiMchE - కొలిచితే రక్షించే గోవిందుడితడు

Audio link :SPB
Archive link :
కొలిచితే రక్షించే గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు
గోవర్థనమెత్తినట్టి గోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు
కౄరకాళింగ మర్దన గోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు
కుందనపు కాశతోడి గోవిందుడితడు
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు
kolichitE rakShiMchE gOviMduDitaDu
yilaku lakshmiki magaDI gOviMduDitaDu
gOvarthanamettinaTTi gOviMduDitaDu
vEvElu golletala gOviMduDitaDu
kOviduDai AlagAchE gOviMduDitaDu
Avala kaMsu(jaMpina AgOviMduDitaDu
kRUrakALiMga mardana gOviMduDitaDu
vIra chakrAyudhapu gOviMduDitaDu
kOri samudrAlu dATE gOviMduDitaDu
ArIti bAlura (dechchE yAgOviMduDitaDu
kuMdanapu kASatODi gOviMduDitaDu
viMdula rEpalle gOviMduDitaDu
poMdi SrIvEMkaTAdripai posaga tirupatilO
aMdamai pavvaLiMchina A gOviMduDitaDu
4 comments:
బొమ్మ, సంకీర్తన వ్రాసిన విధానం బాగున్నాయి.కాని Temporary audio link పనిచేయుట లేదు.
శ్రవణ్ గారు,
మీ collection చాలా బాగుంది.ఇందులో నాకు ఒక 15,20 పాటలు మాత్రమే వచ్చేమో?good job
చాలా సంతోషం:)
ఫణిబాల గారు,
నమస్కారం.
మీకు 15-20 కీర్తనలే తెలుసు అంటే నమ్మబుధ్ధి కావటంలేదు.
మీ బ్లాగ్ పేరు చాలా బాగుంది.
-శ్రవణ్
శ్రవణ్ గారు,
నమస్కారం ముందుగా ధన్యవాదాలు నా బ్లాగ్ పేరు బాగుందన్నందుకు,మీకు ఇక్కడే తేడా తెలియాలే??? మీరు కీర్తనలు అంటే నేను పాటలు అని రాశాను:) సో....???????
కాని విన్నవి చాలానే వున్నాయి లేండి:)
Post a Comment