915. vaTTi laMpaTamu vadala nEradu gAna - వట్టి లంపటము వదల నేరదు గాన
Youtube link : Sri P Ranganath, in raga Malayamarutam
॥పల్లవి॥వట్టి లంపటము వదల నేరదు గాన
పుట్టించిన హరి బుద్దిలోనె కాఁడా ॥చ1॥దేహాభిమానములు తెగి విడిచినఁ గాని యీహల దేవుఁడు తన్ను నేల మెచ్చీనీ సాహసించి కోరికెల సంగము మానకుండితే వోహో పరమపద మూర కేల కలుగు ॥చ2॥నిచ్చలును వైరాగ్యనిష్ఠుడు గాకుండితేను యెచ్చిన జన్మాదు లెల్ల యేల కడచు కొచ్చి కొచ్చి తనలోని కోపముడుగ కుండితే అచ్చపు బ్రహ్మానంద మది యేల కలుగు ॥చ3॥శ్రీ వేంకటాద్రి మీఁది శ్రీపతిఁ గొల్వకుండితే సోవల నా దేవుఁ డిట్టె సులభుఁడవునా భావించి తనలోని భక్తి నిలుపకుండితే తావుల నన్నిటాను సంతత పుణ్యుఁ డవునా (రాగము: భూపాళం,రేకు: 0027-03,సంపుటము: 15-155) ---తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తనvaTTi laMpaTamu vadala naeradu gaana
puTTiMchina hari buddilOne kaa@MDaa
daehaabhimaanamulu tegi viDichina@M gaani
yeehala daevu@MDu tannu naela mechcheenee
saahasiMchi kOrikela saMgamu maanakuMDitae
vOhO paramapada moora kaela kalugu
nichchalunu vairaagyanishThuDu gaakuMDitaenu
yechchina janmaadu lella yaela kaDachu
kochchi kochchi tanalOni kOpamuDuga kuMDitae
achchapu brahmaanaMda madi yaela kalugu
Sree vaeMkaTaadri mee@Mdi Sreepati@M golvakuMDitae
sOvala naa daevu@M DiTTe sulabhu@MDavunaa
bhaaviMchi tanalOni bhakti nilupakuMDitae
taavula nanniTaanu saMtata puNyu@M Davunaa
No comments:
Post a Comment