916. పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము - paramAtma ninnu golchi bradikEmu
Ragam : sahana (శహన)Composer & Singer Smt.Seshulata : Youtube link
॥పల్లవి॥పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడనోపము ॥చ1॥మగఁడు విడిచినా మామ విడువనియట్లు నగి నామనసు రోసినా లోకులు మానరు తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగమోటలను నేను మోసపోవనోపను ॥చ2॥పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు విసిగి నే విడిచినా విడువరు లోకులు కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడల నేనోపను ॥చ3॥నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను (రాగము: ముఖారి,రేకు: 0238-05,సంపుటము: 3-220) ------తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
No comments:
Post a Comment