Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, May 07, 2020

873. nIvu galigina jAlu nikkamu annI galavu - నీవు గలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు

Tuned & Sung by Sri Sathiraju Venumadhav, in raga karjamu, 
Youtube link:
(album Nivugaliginachalu

నీవు గలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు
ఆవల మాయాచార్యుఁ డానతిచ్చెనయ్యా

యేలోకమున నున్న యెడయని సొమ్ము నీవె
తాలిమి యెందుఁ బోని ధనము నీవె
కాలము కడా తరగని ధాన్యము నీ వని
ఆలించి మాగురు డిట్టె ఆనతిచ్చెనయ్యా

యెందెందుం దిరిగిన యేలికవు నీవె
నిందలేనియట్టి తోడునీడవు నీవె
ముందువెనుకల నిల్లు మింగిలియు నీవె యని
అందముగ దేశికుడె ఆనతిచ్చెనయ్యా

యెన్నడుఁ గలఁగనట్టి హితుడవు నీవె
పన్నినట్టె వుండె నిచ్చపంటా నీవె
నన్నుఁగాచె శ్రీ వెంకటనాథుడ వని తాళ్ళపా
కన్నమయ్యగారె నాకు నానతిచ్చిరయ్యా



nIvu galigina@M jAlu nikkamu annI@M galavu
Avala mAyAchAryu@M DAnatichchenayyA

yElOkamuna nunna yeDayani sommu nIve
tAlimi yeMdu@M bOni dhanamu nIve
kAlamu kaDA taragani dhAnyamu nI vani
AliMchi mAguru DiTTe AnatichchenayyA

yeMdeMduM dirigina yElikavu nIve
niMdalEniyaTTi tODunIDavu nIve
muMduvenukala nillu miMgiliyu nIve yani
aMdamuga dESikuDe AnatichchenayyA

yennaDu@M gala@MganaTTi hituDavu nIve
panninaTTe vuMDe nichchapaMTA nIve
nannu@MgAche SrI veMkaTanAthuDa vani tALLapA
kannamayyagAre nAku nAnatichchirayyA




No comments: