Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, May 20, 2020

878. nerabirudinniTAnu nee baMTu - నెరబిరుదిన్నిటాను నీ బంటు


Archive link : Tuned and Sung by Sri G.Balakrishnaprasad
నెరబిరుదిన్నిటాను నీ బంటు
వొరసె గగనమదివో నీ బంటు   

ముంచిన చుక్కలు మొలపూసలుగాఁ
బెంచె మేను పెళపెళనార్చి
అంచులు మోవఁగ నబ్జభవాండము
నించె నార్భటము నీ బంటు

గగనలోకములు గడగడ వణఁకఁగ
నెగసె హుటాహుటి నీ బంటు
మగటిమి మెరయఁగ మందులకొండకు
నిగిడి కోయనుచు నీ బంటు   

ఇమ్ముల రఘుపతి హితుఁడై సీతకు
నెమ్మన మలరిన నీ బంటు
కమ్మర నిదె వేంకటేశ నీచే
నిమ్మపండైన నీ బంటు    


nerabirudinniTaanu nee baMTu
vorase gaganamadivO nee baMTu   

muMchina chukkalu molapoosalugaa@M
beMche maenu peLapeLanaarchi
aMchulu mOva@Mga nabjabhavaaMDamu
niMche naarbhaTamu nee baMTu

gaganalOkamulu gaDagaDa vaNa@Mka@Mga
negase huTaahuTi nee baMTu
magaTimi meraya@Mga maMdulakoMDaku
nigiDi kOyanuchu nee baMTu   

immula raghupati hitu@MDai seetaku
nemmana malarina nee baMTu
kammara nide vaeMkaTaeSa neechae
nimmapaMDaina nee baMTu    


భావము:

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

      "నెర బిరుదు" అంటే అతిశయించిన సమర్ధుడు అని అర్థం. అదిగో నీ బంటు వొరసె గగనము (ఆకాశము తాకినాడు) అంటున్నారు అన్నమయ్య. హనుమంతుడు శ్రీవేంకటేశ్వరుని నమ్మిన బంటు అని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుని చేతినిమ్మపండట అంటే కరతలామలకము అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడతాడు. నీ బంటు హుటాహుటి యెగయగా గగనమునవుండే లోకములన్నియు గడగడవణకినవట. ఆయన మందులకొండ దగ్గరకు వెళ్ళి 'కో' యని దాన్ని తెచ్చాడట.

     ఓ శ్రీవేంకటేశ్వరా! నీ నమ్మినబంటు అయిన ఈ హనుమంతుడున్నాడే, ఆయన నీ “నెర బిరుదు" బంటు (అతిశయించిన సమర్థుడైన) బంటు. అదిగో ఆకాశంలో నీబంటు ఎలా మెరసిపోతున్నాడో చూడు స్వామీ!

1. ఆయన గగనసీమలో యెగురుటకు తనకాయాన్ని అమితంగా పెంచివేశాడు. అప్పుడు గగనమున కిక్కిరిసిన చుక్కలు (నక్షత్రాలు) ఆయన మొలనూలు వలె (రత్నాలమొలత్రాటివలె) తళతళలాడింది. పెళపెళనార్చి (పెళ పెళమని బొబ్బలు పెట్టి) ఈయన తన కాయమును పెంచాడు. అట్టి భవాండము (బ్రహ్మాండమంతా) పెద్ద ఆర్భాటముతో (మ్రోతతో) నింపివేశాడు.  అప్పుడు ఆయన శరీరం బ్రహ్మాండము అంచులు మోసింది.

2. అది చూచి గగనము పైనున్న లోకములన్నీ గడగడ వణికినవి. ఆ లోకములు ఆశ్చర్యంతో చూస్తుండంగానే హుటాహుటి (అతివేగముగా) ఎగిరాడు. మగటిమి మెరయగ (తన వీరత్వము ద్యోతకమవుతుండగా) మందుల కొండకు నిగిడి (వ్యాపించి) "కో"యని అరచినాడు నీ నమ్మినబంటు హనుమంతుడు.

3. ఇమ్ముల (ఇంపుగా) రఘుపతికి హితుడై సీతాదేవి నెమ్మనము (మనశ్శాంతిని) అలరించిన మహానుభావుడే నీ బంటు. కమ్మర (అటుపైన) ఓ శ్రీవేంకటేశ్వరా! నీచే (నీచేతిలోని) నిమ్మపండైనవాడు నీ బంటు. (పూర్వకాలంలో ఎక్కడికన్నా దూరప్రయాణాలు చేయాలంటే దాహానికి వుపశమనంగా నిమ్మకాయ నీళ్ళు తాగేవారు. నిమ్మపండు మన చేతుల్లోనే వుంటే దిగులే లేదు కదా! అప్పటికప్పుడు వాడుకోగలవాటిని 'కరతలామలకం' అంటారు.

No comments: