854. arudu nIcharitramu hari nEnidiyE - అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
Archive Audio link
Tune By : Sri Phani Narayana
Sung By: Sri Sathiraju Venumadhav
అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు -పల్లవి-
పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి
కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి
అరసి ద్రౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి
శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి -అరు-
మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి
అనాథనాథుడవు నీ వగుట సుగ్రీవునందుఁ గంటిమి
పెనఁగి నిరుహేతుకప్రేమ పరీక్షితునందుఁ గంటిమి
నినుఁ గింకరాధీనుఁడని ప్రహ్లాదునియందేఁ గంటిమి -అరు-
గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి
భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి
దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట
తావైన నీకొనేటిదండ నొసఁగేయందే కంటిమి -అరు-
arudu neecheritramu hari nae nidiyae tala@Mchukoni
SaraNaMTi@M gaavu midiya vinnapamu sarilaeru neeku -pallavi-
paraga neeyakaaraNabaMdhutva mahalyayaMdu@M gaMTimi
kariyaMdu naartarakshakatvamu meraya@Mga@M gaMTimi
arasi draupadiyaMdu naapaduddhaarakatvamu gaMTimi
SaraNaMTe@M gaachuTa dhara vibheeshuNunaMdu@M gaMTimi -aru-
munu bhaktavatsalatvamu neeku SabariyaMdu@M gaMTimi
anaathanaathuDavu nee vaguTa sugreevunaMdu@M gaMTimi
pena@Mgi niruhaetukapraema pareekshitunaMdu@M gaMTimi
ninu@M giMkaraadheenu@MDani prahlaaduniyaMdae@M gaMTimi -aru-
gOvardhanamaMdu sarvajeevadayaaparatvamu gaMTimi
bhaaviMchi saaMdeepunaMdu pratij~naapaalakatvamu gaMTimi
daeva SreevaeMkaTaeSvara neevu drishTavaradu@MDavaguTa
taavaina neekonaeTidaMDa nosa@MgaeyaMdae kaMTimi -aru-
No comments:
Post a Comment