Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, May 17, 2019

856. tatigAni yIpATu daivamA - తతిగాని యీపాటు దైవమా

Audio link : Sri G. Anila Kumar
Audio Archive link 
తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమ    =పల్లవి=


తుటుములై భూసురుల తుండెములు మొండెములు
యిటువలె భూతములు యెట్టు మోఁచెనో
అటు బాలుల రొదలు ఆకాశమె ట్టోరిచెనో
కట కటా యిట్లాయఁ గలి కాల మహిమ    =పల్లవి=


అంగలాచే కామినుల యంగ భంగపు దోఁపు
లింగితాన మింట సూర్యఁ డెట్టుచూచెనో
పొంగు నానాజాతిచేత భువనమెట్లానెనో
కంగి లోకమిట్లాయఁ కలికాలమహిమ    =పల్లవి=


అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలావ
సరి ధర్మదేవతెట్టు సమ్మతించెనో
పరధన చూరకెట్టు పట్టాయనో లక్ష్మి
కరుణ యెందణఁగెనో కలికాలమహిమ    =పల్లవి=


దేవాలయాలు నానాదేశములెల్లాఁ జొచ్చి
దేవఁగా నెట్లుండిరో దేవతలు
తావులేలే రాజులకు దయ గొంత వుట్టదాయ
కావరమే ఘనమాయఁ గలి కాలమహిమ    =పల్లవి=


నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను
తెరల కెట్టుండిరో దిక్పాలులు
విరసవర్తనలుండే విపరీతకాలమున
గరువాలుఁ గపటాలే కలికాలమహిమ    =పల్లవి=


వుపమించి దంపతులు వొకరొకరినిఁ జూడ
చపల దుఃఖములతో సమయఁగాను
తపములు జపములు ధర్మము లెందణఁగెనో
కపురుఁబాపాలు నిండెఁ గలికాలమహిమ    =పల్లవి=


తలలు వట్టీడువఁగా తల్లులు బిడ్డలవేయ
తలఁపెట్టుండెనో యంతర్యామికి
మలసి ముక్కలుగోయ మరుఁడెట్టు వోరిచెనో
కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమ    =పల్లవి=


దీనత లోఁబడి గుండెదిగు లసురుసురులు
వానినెట్లు లోఁగొనో వాయుదేవుఁడు
గూను వంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ
గానఁబడె నింతేసి కలికాలమహిమ    =పల్లవి=


పలుమారు నమ్మించి ప్రాణములు గొనఁగాను
యిలఁ దమలోఁ బ్రాణాలెట్లుండెనో
నెలవై శ్రీ వేంకటేశ నీవే యెరుఁగుదువు
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమ    =పల్లవి=


tatigaani yeepaaTu daivamaa vichaariMchavae
katalaaya@M jeppa nae@MDu kalikaalamahima    =pallavi=
tuTumulai bhoosurula tuMDemulu moMDemulu
yiTuvale bhootamulu yeTTu mO@MchenO
aTu baalula rodalu aakaaSame TTOrichenO
kaTa kaTaa yiTlaaya@M gali kaala mahima    =pallavi=
aMgalaachae kaaminula yaMga bhaMgapu dO@Mpu
liMgitaana miMTa soorya@M DeTTuchoochenO
poMgu naanaajaatichaeta bhuvanameTlaanenO
kaMgi lOkamiTlaaya@M kalikaalamahima    =pallavi=
arudu gOhatyalu saeya@Mga dooDa laMgalaava
sari dharmadaevateTTu sammatiMchenO
paradhana choorakeTTu paTTaayanO lakshmi
karuNa yeMdaNa@MgenO kalikaalamahima    =pallavi=
daevaalayaalu naanaadaeSamulellaa@M jochchi
daeva@Mgaa neTluMDirO daevatalu
taavulaelae raajulaku daya goMta vuTTadaaya
kaavaramae ghanamaaya@M gali kaalamahima    =pallavi=
niraparaadhula@M jaMpi netturu vaariMcha@Mgaanu
terala keTTuMDirO dikpaalulu
virasavartanaluMDae vipareetakaalamuna
garuvaalu@M gapaTaalae kalikaalamahima    =pallavi=
vupamiMchi daMpatulu vokarokarini@M jooDa
chapala du@hkhamulatO samaya@Mgaanu
tapamulu japamulu dharmamu leMdaNa@MgenO
kapuru@Mbaapaalu niMDe@M galikaalamahima    =pallavi=
talalu vaTTeeDuva@Mgaa tallulu biDDalavaeya
tala@MpeTTuMDenO yaMtaryaamiki
malasi mukkalugOya maru@MDeTTu vOrichenO
kala@Mkalae ghanamaaya@M galikaalamahima    =pallavi=
deenata lO@MbaDi guMDedigu lasurusurulu
vaanineTlu lO@MgonO vaayudaevu@MDu
goonu vaMchi talli chooDa@M goDuku@M guttika gOya@M
gaana@MbaDe niMtaesi kalikaalamahima    =pallavi=
palumaaru nammiMchi praaNamulu gona@Mgaanu
yila@M damalO@M braaNaaleTluMDenO
nelavai Sree vaeMkaTaeSa neevae yeru@Mguduvu
kalushamae ghanamaaya@M galikaalamahima    =pallavi=


No comments: