Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, April 07, 2019

850. eMdu kaapuramu saetu - ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల

Archive Audio link 

ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే మూఁడు గాలములు ॥పల్లవి॥

తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో తలపోఁత మరి యొక్క లోకము
యెనసిన కలలోని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూఁడు లోకములు ॥ఎందుఁ॥

పంచభూతముల చేతిబంధ మొక్క దేహము
యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము
ముంచె నిదె వొకటిలో మూఁడు దేహములు ॥ఎందుఁ॥

జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు
తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే
శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే
మూవంకల మముఁ గాచె మొక్కితి మాతనికి ॥ఎందుఁ॥

eMdu@M gaa@Mpuramu saetu naedi nija maedi galla
muMdara nokkadinamae moo@MDu gaalamulu pallavi
tanubhOgamula nivae taga noka lOkamu
manasulO talapO@Mta mari yokka lOkamu
yenasina kalalOni didi yokka lOkamu
munupu venakalivae moo@MDu lOkamulu eMdu@M
paMchabhootamula chaetibaMdha mokka daehamu
yeMcha@Mga noorupugaali yidi yokka daehamu
koMchaka triguNamulaguri sookshma daehamu
muMche nide vokaTilO moo@MDu daehamulu eMdu@M
jeevunilOpalivaa@MDu SreevaeMkaTaeSu@MDu
taavai velinunnavaa@MDu taa nokka@MDae
SreevaeMkaTaadrimeeda@M jela@Mginaata@M DeetaDae
moovaMkala mamu@M gaache mokkiti maataniki eMdu@M

No comments: