Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, March 04, 2020

863. ItaDakhilaMbunaku nIsharuMDai - ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల



Audio link: Smt Vani Jayaram
Explanation:  Kiran Mangalampalli
ఈతఁ డఖిలంబునకు నీశ్వరుఁడై సకల-
భూతములలోనఁ దాఁ బొదలు వాఁడితఁడు    ॥పల్లవి॥


గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద
చూపట్టుకమ్మఁ గస్తూరిపూఁత యితఁడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితఁడు    ॥ఈతఁడ॥


జలధికన్యాపాంగ లలితేక్షణములలో
కలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడు
జలజాసనుని వదన జలదిమద్యము నందు
అలర వెలువడిన పరమామృతం బితఁడు    ॥ఈతఁడ॥


పరివోని సురత సంపదల నింపులచేత
వరవధూతతికి పరమమైన యితఁడు
తిరువేంకటాచలధిపుఁడు దానె యుండి
పరిపాలనము సేయ భారకుండితఁడు    ॥ఈతఁడ॥


eeta@M DakhilaMbunaku neeSvaru@MDai sakala-
bhootamulalOna@M daa@M bodalu vaa@MDita@MDu    -pallavi


gOpaaMganala me~ru@Mgu gubbachannulamee@Mda
choopaTTukamma@M gastooripoo@Mta yita@MDu
taapasOttamula chiMtaasaudhamulalOna
deepiMchu suj~naanadeepa mita@MDu    -eeta@MDa-


jaladhikanyaapaaMga lalitaekshaNamulalO
kalasi velu@Mguchu nunna kajjalaM bita@MDu
jalajaasanuni vadana jaladimadyamu naMdu
alara veluvaDina paramaamRtaM bita@MDu    -eeta@MDa-


parivOni surata saMpadala niMpulachaeta
varavadhootatiki paramamaina yita@MDu
tiruvaeMkaTaachaladhipu@MDu daane yuMDi
paripaalanamu saeya bhaarakuMDita@MDu    -eeta@MDa-


భావము :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

     తేనెలూరే అన్నమాచార్య కీర్తనను ఆస్వాదించండి. ఈ పొడవునకు పొడవైన పురుషోత్తముడు సృష్టికంతటికీ ఈశ్వరుడు. ప్రతి ప్రాణిలోనూ తానే ఆత్మ రూపంలో వ్యవహరిస్తుంటాడు. ఆయన భక్తులైన మనందరికోసం ఎన్నో అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి మనందరినీ అలరించాడు. నేడు ఈ మహానుభావుడే తిరువెంకటనాథుడై జగములను పరిపాలిస్తున్నాడు. మనందరి బరువు తానే భరిస్తూ భారకుడని పేరు పొందాడు.

     ఈతడే అఖిలంబునకు ( సమస్తమునకు ) ఈశ్వరుడై ( అధినాథుడై ) వ్యవహరించుచున్నాడు. సకల భూతములలోనూ ( సర్వ ప్రాణులలో ) తానే ఆత్మరూపములో పొదలువాడు ( వర్ధిల్లువాడు ).

     జవ్వనులైన గోపకన్నెల మెరుగు ఘన స్తనములపైన కనుపించు కమ్మని కస్తూరిపూత ఇతడే. అలాగని ఈయన కేవలం విలాస పురుషుడా? కానేకాదు. ఉత్తమోత్తములైన తాపసుల చింతాసౌధములలో ( భావనా భవంతులలో ) వెలుగుతున్న సుజ్ఞానమనే దీపము ఈ యోగీశ్వరుడే సుమా!

     జలధికన్య ( క్షీరసాగర తనయ అయిన శ్రీమహాలక్ష్మి ) అపాంగ లలితేక్షణములలో ( అందమైన కడగంటి చూపులలో ) ఉన్న వెలుగులు విరజిమ్ము కజ్జలంబు ( కాటుక ) ఈతడే ( ఈ రమాకాంతుడే ). జలజాసనుని ( బ్రహ్మదేవుని ) ముఖములనే సంద్రముల మధ్య వెలసి అలరుచున్న పరమజ్ఞానామృతము ఈతడే.

     పరిమితులు లేని సంభోగసమాగమములో వధూవరులకు వైభవము నింపుతూ పరవశత్వము కలిగించునది ఎవరనుకున్నారు? ఈ జగన్నాథుడే. ఇదుగో నేడు తిరుమల శిఖరాలపై శ్రీవేంకటేశ్వరుడై తానేయుండి పరిపాలనము చేయుచున్న భారకుడు ( అందరి భారమును వహించేవాడు ) ఈ దేవదేవుడే.
 


No comments: