Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, March 23, 2020

864. uppavaDamu gaavayyaa uyyaalamaMchamumee@Mda - ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద

Tuned by Sri Ganti Shashank, 
sung by Sri Ganti Shashank, Smt Ganti Padmaja , in ragam: malayamarutam
Video link
ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా    =పల్లవి=

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంక మే నితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీ సతి చూపు నాటిన చిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా    =ఉప్ప=


నిద్దరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దువొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరు సతులు నీకు నేచిన తాళగతుల
గుద్దేటి పాదములతో గోవిందరాజా    =ఉప్ప=


మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా    =ఉప్ప=


uppavaDamu gaavayyaa uyyaalamaMchamumee@Mda
goppagoppa kannula gOviMdaraajaa    =pallavi=

pavvaLiMchae veeDa vachchi paayanineeyalapella
muvvaMka mae nitODa muchchaTa dee~ra
navvaeTi Sree sati choopu naaTina chittapumaena
kruvvanikaluvadaMDai gOviMdaraajaa    =uppa=


niddariMchae veeDa vachchi niluchunnayalapella
prodduvoddunaku@M deera bhOgeeMdrupai
yiddaru satulu neeku naechina taaLagatula
guddaeTi paadamulatO gOviMdaraajaa    =uppa=
 

meMDuga maelukoMTivi miMchina kau@MgiTilOna
koMDukapaayapusiri kOpiMchaMgaa
uMDavayyaa sukhaleela nuDivOnipriyamutO
koMDalakOnaeTiraaya gOviMdaraajaa    =uppa=


No comments: