560.chUDudiMdariki sulabhuDu hari - చూడుదిందరికి సులభుడు హరి

Audio link :GBKP
Archive link :
Kirtana on Annamacharya's guru , Adivan Satagopayati,
to know more about Satagopayati , click here..
చూడుడిందరికి సులభుడు హరి
తోడు నీడయగు దొరముని యితడు
కైవల్యమునకు కనకపు తాపల-
త్రోవై శ్రుతులకు తుదిపదమై
పావన మొకరూపంబై విరజకు
నావై నున్నాడిదె యితడు
కాపాడగ లోకములకు సుజ్ఞాన
దీపమై జగతికి తేజమై
పాపాలడపగ భవపయోధులకు
తేపై యున్నాడిదే యితడు
కరుణానిధి రంగపతికి కాంచీ-
వరునకు వేంకటగిరిపతికి
నిరతి నహోబలనృకేసరికి త-
త్పరుడగు శఠగోపముని యితడూchUDudiMdariki sulabhuDu hari
tODu nIDayagu doramuni yitaDu
kaivalyamunaku kanakapu tApala-
trOvai Srutulaku tudipadamai
pAvana mokarUpaMbai virajaku
nAvai nunnADide yitaDu
kApADaga lOkamulaku suj~nAna
dIpamai jagatiki tEjamai
pApAlaDapaga bhavapayOdhulaku
tEpai yunnADidE yitaDu
karuNAnidhi raMgapatiki kAMchI-
varunaku vEMkaTagiripatiki
nirati nahObalanRkEsariki ta-
tparuDagu SaThagOpamuni yitaDU
No comments:
Post a Comment