Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, May 06, 2010

694.sadAnaMdamu sarwESvarA - సదానందము సర్వేశ్వరా

Audio link : G.Janakiramana(?)

సదానందము సర్వేశ్వరా
నీ పదారవిందముపై భక్తి

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీ సాకారము
నయమగు శ్రవణానందము వినినను
క్రియగలిగిన నీ కీర్తనము


చెలగి అందరికి జిహ్వానందము
పలుమరుఁ గొను నీ ప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు


ధర పరమానందము నీ దాస్యము
గరిమల శ్రీవేంకటవిభుడా
నరహరి నిత్యానందము నినుఁ దగ -
నరవిరి జేయు సమారాధనము


sadAnaMdamu sarwESvarA
nI padAraviMdamupai bhakti


nayanAnaMdamu narulaku suralaku
jayamagu hari nI sAkAramu
nayamagu SravaNAnaMdamu vininanu
kriyagaligina nI kIrtanamu


chelagi aMdariki jihvAnaMdamu
palumaru@M gonu nI prasAdamu
nalugaDa dEhAnaMdamu budhulaku
balunIpAda praNAmamulu


dhara paramAnaMdamu nI dAsyamu
garimala SrIvEMkaTavibhuDA
narahari nityAnaMdamu ninu@M daga -
naraviri jEyu samArAdhanamu


Get this widget | Track details | eSnips Social DNA

2 comments:

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...

తిరువీధుల మెరసీని దేవదేవుడు
వీధుల వీధుల విభుడేగీనిదె
ఇటువంటి నగరసంకీర్తనలకుపయోగించే ఇంకొన్ని అన్నమయ సంకీర్తనలని సూచించగలరా దయచేసి. విజయవాడ ప్రోగ్రాంలో నగర సంకీర్తన కోసము అడుగుతున్నాను.

adi said...

plz provide ragam and swaram for this lyrics then we can learn easy