693.rachchalu sEyaka rAvayyA - రచ్చలు సేయక రావయ్యా
రచ్చలు సేయక రావయ్యా
యిచ్చ యెఱగ నిది యేలయ్యా
జంకెన చూపులు సరసపుమాటలు
లంకెలఁబెట్టీ లలితాంగి
మంకులవొట్లు మాయల అలుకలు
యింకా నీపెతో నేలయ్యా
దొంతులయాసలు దోమటిబాసలు
సంతము సేసీ జవరాలు
పంతపు బిగువులు పాయపుమదములు
యెంతకెంత మరి యేలయ్యా
చనవులసవిగెలు చాయలసన్నలు
పెనవులఁ బెట్టీ ప్రియురాలు
యెనసితి శ్రీవేంకటేశ యీపె నిదె
యినుమడిపరవశ మేలయ్యా
rachchalu sEyaka rAvayyA
yichcha ye~raga nidi yElayyA
jaMkena chUpulu sarasapumATalu
laMkela@MbeTTI lalitAMgi
maMkulavoTlu mAyala alukalu
yiMkA nIpetO nElayyA
doMtulayAsalu dOmaTibAsalu
saMtamu sEsI javarAlu
paMtapu biguvulu pAyapumadamulu
yeMtakeMta mari yElayyA
chanavulasavigelu chAyalasannalu
penavula@M beTTI priyurAlu
yenasiti SrIvEMkaTESa yIpe nide
yinumaDiparavaSa mElayyA
No comments:
Post a Comment