Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, May 26, 2010

తెలుగు పదానికి జన్మదినం - telugu padaniki janmadinam

Audio link from Annamayya movie
ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించినందుకు వేటూరి వారికి జోహార్లు..


తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము , నందనానందకారకము


పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా

పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగుహారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా


2 comments:

Sandeep P said...

భక్తి, వైరాగ్యం - ఈ రెండు రకాల పాటలు వ్రాయడంలో వేటూరిపై అన్నమయ్య ప్రభావం ఉందనిపిస్తుందండి. వాళ్ళిద్దరి పాటలూ కూడా నాకు చాలా ఇష్టం.

చింతా రామ కృష్ణా రావు. said...

చాలా అద్భుతమైన భక్తి గీతాలతో సహృదయు లందరి హృదయాలను నింపాలనే ఈ అమోఘమైన ప్రయత్నం అభినందనీయము.
పరమాత్మ మీకెల్లప్పుడూ అండదండగానుండి ఇలాంటి కార్యక్రమాలను మీ చేత నిరంతరం నిరంతరాయంగా చేయించాలని కోరుకొంటున్నాను.
చింతా రామ కృష్ణా రావు.
http://andhraamrutham.blogspot.com