Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, August 17, 2007

294. idigAka sauBAgyamidigAka- ఇదిగాక సౌభాగ్యమిదిగాక


Audio link :GBKP
Audio link :MuraliKrishna
Audio link :
Archive link :

ప|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా ||
చ|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | నితర మోహాపేక్షలిన్నియును విడచె
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||
చ|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి
సరసిజాసన మనోజయమంది యింతలో | సరి లేక మనసు నిశ్చల భావమాయ ||
చ|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |
దేవోత్తముని కౄపాధీనురాలై యిపుడు | లావణ్యవతికి నుల్లంబు తిరుమాయ ||


pa|| idigAka sauBAgyamidigAka tapamu mari | yidigAka vaiBavaM bikanokaTi kaladA ||
ca|| ativa janmamu saPalamai parama yOgivale | nitara mOhApEkShalinniyunu viDace
sati kOrikalu mahASAMtamai yidecUDa | satata vij~nAna vAsana vOle nuMDe ||
ca|| taruNi hRudayamu kRutArthataboMdi viBumIdi | paravaSAnaMda saMpadaku niravAyi
sarasijAsana manOjayamaMdi yiMtalO | sari lEka manasu niScala BAvamAya ||
ca|| SrIvEMkaTESvaruni jiMtiMci paratattva | BAvaMbu nijamu gAbaTTi jeliyAtma |
dEvOttamuni kRupAdhInurAlai yipuDu | lAvaNyavatiki nullaMbu tirumAya ||



అన్నమయ్య ఆధ్యాత్మ, శృంగార రీతులలో సంకీర్తనలు రచించాడు. రాశిలో శృంగార సంకీర్తనలు ఆధ్యాత్మ సంకీర్తనలకు మూడు రెట్లు ఎక్కువ. మధురభక్తి సంప్రదాయంలో ఆత్మార్ధంతో వ్రాసుకున్న ఈ శృంగార సంకీర్తనల పరమార్ధం ఆధ్యాత్మ తత్త్వమే! ఆధ్యాత్మ పద్ధతిలో ఒక యోగి లేక ముని లేక ఋషి నిరంతర భగవత్ చింతనలో ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుణ్ణీ ఆరాధిస్తాడు. చివరకు తపస్సు సిద్ధించి వరుసగా భగవత్ సాలోక్యము, సాయుజ్యము, సామీప్యము, సారూప్యాన్ని పొందుతాడు. (స్థూలంగా భగవంతునిలో ఐక్యమవుతాడు) అలాగే శృంగార సంకీర్తనలో పేర్కొనబడిన నాయిక నిరంతరం అంతరంగ తలపుల తరంగాలలో భగవంతుని నిలుపుకొని తన కోరికల కుసుమములను ఆ భగవంతునికి సమర్పించి, ఆ విధముగా కోరికలు లేని స్థితికి చేరుకుని, నిశ్చల భావంతో పరతత్త్వాన్ని చింతించి చివరకు ఆ భగవంతునిలో ఐక్యమవుతుంది. ఇదీ మధురభక్తి శృంగారం లోని అంతరార్దం. ఈ పాటలోని నిగూఢార్ధం! నిత్యానిత్యవస్తు వివేకః’ ‘ఇహముత్ర ఫల భోగవిరాగః’, ‘శమదమాది సాధన సంపత్తిః’, ‘ముముక్షుత్వం’ అను నాలుగు వేదాంత సోపానాలు అధిరోహించిన ఈ పాటలోని నాయిక గూర్చి పూర్తిగా తెలుసుకొదలచినవారు ‘తాళ్ళపాక పద సాహిత్యం’ (తి.తి.దే. ప్రచురణ) లోని 5వ సంపుటం పీఠికలో కీ.శే. గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు వ్రాసిన విపుల వ్యాఖ్యానాన్ని చదువగలరు.

ఆపేక్ష = కోరిక;
ఉల్లంబు = మనస్సు
తిరము + ఆయ = తిరమాయ = నిశ్చలస్థితికి చేరుకున్నది


No comments: