912. oorakaitE ninnu gAnamu - ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
ragam : revati (రేవతి) composed & sung by Sri Sattiraju Venumadhav garu
॥పల్లవి॥ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు ॥చ1॥అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే అసురలు బాధింతు రమరులను పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము ॥చ2॥అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు వెడఁగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే ॥చ3॥నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు పైకొని వారున్నచోటఁ బాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత నీకథలు విని విని నే మీడేరితిమిpallavioorakaitae ninnu@M gaana mokakaaraNaana@M gaani
poorijeevulamu, neevu purushOttamu@MDavu
cha1asuralu bhuvi@M buTTuTadi vupakaaramae
asuralu baadhiMtu ramarulanu
posa@Mga vaariki@Mgaanu poonukavachchi neevu
vasudha janiMchitaenu vaDi ninnu@M gaMdumu
cha2aDari dharmamu cheDi yadharmamainaa maelu
veDa@Mgu munulu vinnaviMturu neeku
taDavi dharmamu nilpa dharaNi@M buTTudu neevu
baDi ninnu saeviMchi bradukudu mapuDae
cha3neekaMTae maaku@M jooDa needaasulae maelu
paikoni vaarunnachOTa@M baayakuMduvu
chaekoni SreevaeMkaTaeSa cheppa@Mgaanae vaarichaeta
neekathalu vini vini nae meeDaeritimi
--------taaLlapaaka annamaachaarya aadhyaatma saMkeertana
(raagamu: saamaMtaM,raeku: 0138-02,saMpuTamu: 2-161)
ragam : revati (raevati)
composed & sung by Sri Sattiraju Venumadhav garu
No comments:
Post a Comment