శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, October 04, 2006

18.Chalada harinama - చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లను నొసగ
..
ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ

మదినొకటె హరినామ మింతైన జాలదా పదివేల నరక కూపముల వెడలించ
..
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగుమని దారిద్ర్యదోషంబు చెఱచ

తెలివొకటి హరినామదీప మది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల
...
తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భూజంబు వలెనుండ

సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను నున్నతమెపుడు జూప
listen to this song:
By Shobharaju garu:-