27.Lalanuchu nucheru - లాలనుచు నూచేరు
Archive Page
Youtube link : Priya sisters
కృష్ణయ్య కు లాలి పాడుతున్న గోపికలను, అన్నమయ్య ఈ కీర్తనలో ఎంత చక్కగా వర్ణిస్తున్నడో చూదండి
లాలనుచు నూచేరు లలనలిరుగడల - బాలగండవీర గోపాలబాల..
ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ -పదరి కంకణరవము బహుగతులమ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ -ముదురు చెమటల నళికములు తొప్పదోగ..
సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక - మలయ రవళులకు బహుమాఱును బెళంక
కొలది కోవిగములు క్రోలుమదనాంక -ములగ్రేణిసేయ రవములు వడిదలంక..
సరుస పదములు జంగ చాపుచేబాయ - గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ
కరమూలములు కాంతి కడుజాయజేయు - సరస నురుకుసుమ వాసనలెదురుడాయ..
కొలది నునుమేనుల కూనలసి యాడ -మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ -అలరి యెల్లరు మోహనాకృతులు చూడ..
లలిత తాంబూల రసకలితంబులైన -తళుకు దంతములు కెంపుల గుంపులీన
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన - చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన..
మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ
పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ..
లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప
..to listen :
another version : P.Suseela in album Krishnam vande jagadgurum
laalanuchu noochaeru lalanalirugaDala - baalagaMDaveera gOpaalabaala
..
uduTa gubbala sarasamu luyyaala looga -padari kaMkaNaravamu bahugatulamrOga
vodigi cheMpala koppu lokkiMta veega -muduru chemaTala naLikamulu toppadOga
..
solapu teligannugava choopuliruvaMka - malaya ravaLulaku bahumaa~runu beLaMka
koladi kOvigamulu krOlumadanaaMka -mulagraeNisaeya ravamulu vaDidalaMka
..
sarusa padamulu jaMga chaapuchaebaaya - guruleela meegaLLa guchcheLLaraaya
karamoolamulu kaaMti kaDujaayajaeyu - sarasa nurukusuma vaasanaleduruDaaya
..
koladi nunumaenula koonalasi yaaDa -melakuvatOnokarokari mechchi sariyaaDa
talaloochi chokki chittaru bommalaaDa -alari yellaru mOhanaakRtulu chooDa
..
lalita taaMboola rasakalitaMbulaina -taLuku daMtamulu keMpula guMpuleena
molaka vennela Daalu musuru konitOna - chelagi selavula muddu chirunavvulaana
..
malaya maaruta gatulu maaTiki jelaMga -paluku gapurapu taavi paipai melaMga
palugaanalahari yiMpula raalgaraMgaa - balasi vinuvaari chevi baDalika dolaMga
..
lalanaa janaapaaMga lalita sumachaapa -jalajalOchana daeva sadguNa kalaapa
talapu lOpala melagu tatvapradeepa -bhaLira gaMDaparaeSa paramaatmaroopa కృష్ణయ్య కు గోపికలు లాలి పాడుతున్న సన్నివేశన్ని అన్నమయ్య ఈ కీర్తనలో కళ్ళకు కట్టినట్టుగా ఎంత చక్కగా వర్ణిస్తున్నడో చూడండి
vivarana - Nallani chakravartula Krishnamacharyulu
ఓ బాలవరగండ గోపాల ! స్త్రీలు రెండు వైపుల నుంచి లాలి లాలి యనుచు నిన్ను ఊచుచున్నరు।
c1.
అప్పుడు వారు ధరించిన హారములు చనులపై అసియాడుచున్నవి। చేతులకు ధరించిన కంకణములు వివిధ గతులతో మ్రోగుచున్నవి। కొప్పులు వదులై చెంపలపై జారి పడుచున్నవి।నుదుట చెమటగారుచున్నది।
c2,3,4
చుట్టుప్రక్కల మ్రోగే ధ్వనుల చేత బెదురు చూపులగుచున్నవి।అంగలు వేయుచు పాటపాడుటలో చీర కుచ్చిళ్ళు రాచుకుంటున్నయి।ఊచుటలో వారి చేతి కాంతులు ప్రసరిస్తు న్నాయి।కొప్పులలో దాల్చిన మరువపు వాసనలు దిక్కులలో వ్యాపిస్తున్నాయి।మెత్తని వారి దేహలతలు అసియాడుచున్నవి। ఒకరినొకరు మెచ్చుకొనుచు సరిగా కలసి ఊపుచున్నరు। ఊపే ఊయెలకు కట్టిన బొమ్మలు తలలూచి ఎగురుచున్నవి। అందరు నీ మోహనాకృతిని చూచుచు ఊపుచున్నారు।
c4(lalita tambularasa kalitambulaina, talukudamtamulu kempula gumpuleena...)
వారు వేసుకొనిన తాంబూలము చేత దంతములు ఎర్రబారి ఉన్నవి।లోపలి ఆనందముతో పైకి వచ్చే వారి వారి చిరునవ్వులు చిరు వెన్నెలలను చిమ్ముచున్నవి।
c5.
మలయమారుతము వీచుచున్నది।కర్పూరపు పరిమళము చిమ్ముచున్నది। వారు పాడె పాటలకు రాళ్ళు కరుగుచున్నవి। వినే వారి చెవి బాధలు పోవుచున్నవి।
c6.
చివరి చరణమతయు కృష్ణుని పిలుచుటయే।