Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, November 27, 2006

92.Telisithe Mokshamu Teliyakunna Bamdhamu - తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము



:pic:Nedunuri Krishnamurthy garu:swarakartha
Audio link :Malladi Brothers
Audio link :Shobharaju
Archive link :
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని

అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి
పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని

తగినయమృతమేది - తలవగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికిని
పగవారనగ వేరి - బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి

వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి
in english:
telisitaemOkshamu - teliyakunna baMdhamu
kalavaMTidi baduku -ghanunikini

anayamu sukhamaeDa -davala du:khamaeDadi
tanuvupai naasalaeni - tatvamatiki
ponigitae baapamaedi -puNyamaedi karmamaMdu
vonara phalamollavi - yOgikini

taginayamRtamaedi - talavaga vishamaedi
tegi niraahaariyaina - dheerunikini
pagavaaranaga vaeri - baMdhulanaga vaeree
vegaTuprapaMchamella - viDichaevivaekiki

vaevaeluvidhulaMdu - ve~rapaedi ma~rapaedi
daivamu namminayaTTi - dhanyunikini
SreevaeMkaTaeSvaruDu - chittamulO nunnavaaDu
yeevalaedi yaavalaedi - yitanidaasuniki
Vivarana : Nallan Chakravartula Krishnamacharyulu garu
తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు।
శరీరము నశించును। ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు
నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విశము లేదు । ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు।
వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు।

విశేషము
మొదటి చరనము రెండవ భాగము యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయసిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే = యోగమందున్న వాడవై ఫలసంగమును విడచి కర్మలను చేయుము।ఫలసిధ్ధికిని అసిధ్ధికిని సముడవై కర్మలను చేయుము। ఈ సముడగుటయే యోగము। ఆ యోగము కలవాడె యోగి।యోగికి పాపమేమున్నది,పుణ్యమేమున్నది?ఏదియు అంటదన్నమాట , ఇది గీతావాక్యము।
అన్నమయ్య ఈతత్వమును చెప్పిరి।

2 comments:

SashikanthMeduri said...

https://www.youtube.com/watch?v=wF92JUJ-LSE&feature=youtu.be

Vinay Ranuva said...

Perfectly transferred into tatwa saram
GITA in simple words 🙏