Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, November 26, 2006

89.Emani PogaDudume - ఏమని పొగడుదమే



ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ

తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పాదులివి గదవే
పలుమరు బువ్వుల పానుపులు

తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీవేంకటేశ్వరుని సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన కల్యాణములు

Meaning by Sri GB SankaraRao garu, SujanaRanjani
అమ్మ అలమేల్మంగమ్మ ప్రకృతి స్వరూపిణి! ఆమని సొబగులను (వసంతఋతువులోని ప్రకృతి అందచందాలను) కైవశం చేసుకున్న ఈ జగదేక సుందరి తన తెలికన్నుల వెన్నెల కురిపిస్తూ స్వామివారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. మోసులెత్తిన ఆశల ఊహలే వారిరువురి పూలపాన్పు! అమ్మవారి అధరమధురామృతం అయ్యవారికి తేనె విందు! ఆమె మొలకనవ్వే ఆతనికి తియ్యని తాంబూలం! అమ్మవారి నులివెచ్చని కౌగిలి అయ్యవారికి సిరులనగరు (అంతఃపురం) ఆదిదంపతులైన వారిరువురి తమకాలు లోకకళ్యాణాలు!

ఆమని=వసంతకాలం;
తెలికన్నులు=తెల్లని కన్నులు ;
కప్రపునెరిబాగాలు=కర్పూర తాంబూలం ;
మొలక నవ్వు=చిరునవ్వు ;
తమకము=మోహము

No comments: