55.RamachandruDithaduRaghuVirudu-రామచంద్రుడితడు రఘువీరుడు
Youtube link : Nedunuri Krishnamurthy
Audio link : P.Suseela, Sri Nedunuri Krishnamurthy, Sri Nedunuri Krishnamurthy
Explanation by Sri Nalinikanth
Audio link : P.Suseela, Sri Nedunuri Krishnamurthy, Sri Nedunuri Krishnamurthy
Explanation by Sri Nalinikanth
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
Listen to this kriti by Susheela garu
Video link : Sung by Prasanth & Sriram, tuned by Sangeetha Kalanidhi Sri.Nedunuri Krishnamurthy garu
Video link : G BalakrishnaPrasad
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
Listen to this kriti by Susheela garu
Video link : Sung by Prasanth & Sriram, tuned by Sangeetha Kalanidhi Sri.Nedunuri Krishnamurthy garu
Video link : G BalakrishnaPrasad
6 comments:
రామచంద్రుడితడు = రామచంద్రుడు ఇతడు
రఘువీరుడు = రఘు వంశానికి చెందిన వీరుడు
కామిత = కోరుకున్న
ఫలములీయ = ఫలములివ్వ
గలిగెనిందరికి = గలిగెను + ఇందరికి
గౌతము = గౌతమ ముని
భార్య = భార్య
పాలిటి
కామధేనువితడు = కామధేనువు + ఇతదు
కామధేనువు = కోరిన కోర్కెలు తీర్చువాడు
ఇతడు = ఈ శ్రీ రామ చంద్రుడు
ఘాతల =
కౌశికుపాలి = కౌశిక మహా మునికి
కల్పవృక్షము = కల్ప వృక్షము (కోరిన కోర్కెలు తీర్చు వృక్షము)
సీతాదేవి పాలిటి = సీతా దేవికి
చింతామణి = చింతామణి (కోరిన కోర్కెలు తీర్చు మణి)
యితడు = ఈ శ్రీరామ చంద్రుడు
యీతడు = ఈ శ్రీరామ చంద్రుడు
దాసుల పాలిటి = దాసులకు
యిహపర = ఇహమునందూ (ఈ లోకమునందూ) పరమునందూ (పరలోకమునందు)
దైవము = దేవుడు
పరగ =
సుగ్రీవుపాలి = సుగ్రీవునకు
పరమ = గొప్ప
బంధువితడు = చుట్టము
సరి =
హనుమంతుపాలి = హనుమంతునకు
సామ్రాజ్యము = రాజ్యము
నిరతి =
విభీషణునిపాలి = విభీషనుకు
నిధానము
యీతడు = ఈ శ్రీరామ చంద్రుడు
గరిమ
జనకు పాలి = జనక మహా రాజునకు
ఘనపారిజాతము = గొప్ప పారిజాతము (సాటిలేని పుష్పము)
తలప
శబరిపాలి = శబరికి
తత్వపు = తత్వపు
రహస్యము = రహస్యము
అలరి
గుహునిపాలి = గుహునికి
ఆదిమూలము = తొలి మూలము (అన్నింటికీ కారణమైనవాడు )
కలడన్నవారిపాలి = కలడు అన్నవారికి
కన్నులెదుటి = కన్నుల ఎదుటి
మూరితి = మూర్తి (విగ్రహము)
వెలయ
శ్రీవేంకటాద్రి విభుడితడు = శ్రీ వేంకటాద్రిపై దేవుడితడు
Great comment. Now I understand teh meaning of the kriti more.
మా ఆవిడ పాడుతుంటే మళ్లీ ఈ కీర్తన వైపు మనసు మళ్లింది. చాలా చక్కని బాణి కట్టారు నేదునూరి గారు. ఇక అన్నమయ్య సాహిత్యం గురించయితే చెప్పక్కర్లేదు.
పాదాల విభజనలో చిన్న సవరణ...
--------------------
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము
"యీతడు"గరిమజనకు పాలి ఘనపారిజాతము
--------------------
సరిచేసాక....
--------------------
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
--------------------
కీర్తన అందించినందుకు కృతఙ్ఞతలు
Thanks Harsha ! corrected now.
Thanks Nalini Kanth garu for the comment.
శ్రవణ్ గారు,
మీకు పెక్కు ధన్యవాదములు - మీకు ఎన్ని సార్లు ధన్యవాదములు తెలిపినా సరిపోదండి.
నాకు సంగీతం రాదు - కానీ మీ blog పుణ్యమా అని, చక్కగా కీర్తనను చూస్తూ వింటూ కొద్దో గొప్పో ఆ దేవుడి దయ వలన కీర్తనలు నేర్చుకుంటున్నాను.
ఖఛ్చితంగా ఆ వెంకటేశుడి దయ వలెనే నాకు మీ blog గురించి తెలిసింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి.
మీకు మళ్ళీ మరొక్కమారు ధన్యవాదములు శ్రవణ్ గారు
Post a Comment