Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, November 30, 2006

94.PiDikiTa TalaMbrAla PeMDli Kuturu - పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు



పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత - పడమరలి నవీనె పెండ్లి కూతురు

పేరుకల జవరాలె పెండ్లి కూతురు - పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు - విభు పేరుకుచ్చు సిగ్గువడీ పెండ్లి కూతురు

బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర - బిరుదు మగని కంటె బెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి -బెరరేచీ నిదివో పెండ్లి కూతురు

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె - పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను - పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు

Tuesday, November 28, 2006

93.Narayana Ni Namame Gati Yika - నారాయణ నీ నామమెగతి


Video link  : Smt Smitha Madhav
నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు నాకుఁ గొనసాగుటకు॥పల్లవి॥

పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు॥నారా॥

పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది॥నారా॥

కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ -
యందె పరమపద మవల మరేది॥నారా॥

naaraayaNa nee naamame gati yi@Mka
kOrikalu naaku@M gonasaaguTaku pallavi
pai pai muMdaTa bhava jaladhi
daapu venaka@M jiMtaa jaladhi
chaapalamu naDuma saMsaara jaladhi
taepa yaedi yivi teganee@MduTaku naaraa
paMDe neDama@M baapapu raaSi
aMDa@M guDini puNyapuraaSi
koMDanu naDuma@M driguNaraaSi - yivi
niMDa@M guDuchuTaku nilukaDa yaedi naaraa
kiMdi lOkamulu keeDunarakamulu
aMdaeTi svargaalave mee@Mda
cheMdi yaMtaraatma Sree vaeMkaTaeSa nee -
yaMde paramapada mavala maraedi naaraa

Monday, November 27, 2006

92.Telisithe Mokshamu Teliyakunna Bamdhamu - తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము



:pic:Nedunuri Krishnamurthy garu:swarakartha
Audio link :Malladi Brothers
Audio link :Shobharaju
Archive link :
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని

అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి
పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని

తగినయమృతమేది - తలవగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికిని
పగవారనగ వేరి - బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి

వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి
in english:
telisitaemOkshamu - teliyakunna baMdhamu
kalavaMTidi baduku -ghanunikini

anayamu sukhamaeDa -davala du:khamaeDadi
tanuvupai naasalaeni - tatvamatiki
ponigitae baapamaedi -puNyamaedi karmamaMdu
vonara phalamollavi - yOgikini

taginayamRtamaedi - talavaga vishamaedi
tegi niraahaariyaina - dheerunikini
pagavaaranaga vaeri - baMdhulanaga vaeree
vegaTuprapaMchamella - viDichaevivaekiki

vaevaeluvidhulaMdu - ve~rapaedi ma~rapaedi
daivamu namminayaTTi - dhanyunikini
SreevaeMkaTaeSvaruDu - chittamulO nunnavaaDu
yeevalaedi yaavalaedi - yitanidaasuniki
Vivarana : Nallan Chakravartula Krishnamacharyulu garu
తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు।
శరీరము నశించును। ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు
నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విశము లేదు । ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు।
వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు।

విశేషము
మొదటి చరనము రెండవ భాగము యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయసిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే = యోగమందున్న వాడవై ఫలసంగమును విడచి కర్మలను చేయుము।ఫలసిధ్ధికిని అసిధ్ధికిని సముడవై కర్మలను చేయుము। ఈ సముడగుటయే యోగము। ఆ యోగము కలవాడె యోగి।యోగికి పాపమేమున్నది,పుణ్యమేమున్నది?ఏదియు అంటదన్నమాట , ఇది గీతావాక్యము।
అన్నమయ్య ఈతత్వమును చెప్పిరి।

Sunday, November 26, 2006

91.Ade Chudare - అదె చూడరే




Audio link :G.BalaKrishnaPrasad
Audio link : Sri Mangalampalli Balamurali krishna
Audio link : Nedunuri Krishnamurthy
Archive link :
అదె చూడరే మోహన రూపం పది కోట్లుగల భావజ రూపం

వెలయగ పదారువేల మగువలను అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వజ్రము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనిత నెప్పుడు తన ఉర మందు నిలిపిన మోహన రూపం

కందువ భూపతి కౌగిట సొంపుల విందుల మరిగిన వేడుక రూపం

త్రిపురసతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీవేంకటపతి యైయిల ఉపమించగ ఉన్నత రూపం

ade chooDarae mOhana roopaM padi kOTlugala bhaavaja roopaM

velayaga padaaruvaela maguvalanu alamina ghana mOhana roopaM
valachina naMda vajramu golletala kuluku choopulaku guriyagu roopaM

iMdiraa vanita neppuDu tana ura maMdu nilipina mOhana roopaM
kaMduva bhoopati kaugiTa soMpula viMdula marigina vaeDuka roopaM

tripurasatula bOdhiMchi ramiMchina apuroopapu mOhana roopaM
kapurula SreevaeMkaTapati yaiyila upamiMchaga unnata roopaM

90.Anisamu Talacharo Ahobalam - అనిశము దలచరో అహోబలం




అనిశము దలచరో అహోబలం అనంత ఫలదం అహోబలం

హరి నిజనిలయం అహోబలం హరివిరించి నుత అహోబలం
అరుణ మణిశిఖరమహోబలం అరిదైత్యహరణ మహోబలం

అతిశయ శుభదం అహోబలం అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం యతి మత సిద్ధం అహోబలం

అగు శ్రీ వేంకట మహోబలం అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం అగకుల రాజం అహోబలం

89.Emani PogaDudume - ఏమని పొగడుదమే



ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ

తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పాదులివి గదవే
పలుమరు బువ్వుల పానుపులు

తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీవేంకటేశ్వరుని సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన కల్యాణములు

Meaning by Sri GB SankaraRao garu, SujanaRanjani
అమ్మ అలమేల్మంగమ్మ ప్రకృతి స్వరూపిణి! ఆమని సొబగులను (వసంతఋతువులోని ప్రకృతి అందచందాలను) కైవశం చేసుకున్న ఈ జగదేక సుందరి తన తెలికన్నుల వెన్నెల కురిపిస్తూ స్వామివారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. మోసులెత్తిన ఆశల ఊహలే వారిరువురి పూలపాన్పు! అమ్మవారి అధరమధురామృతం అయ్యవారికి తేనె విందు! ఆమె మొలకనవ్వే ఆతనికి తియ్యని తాంబూలం! అమ్మవారి నులివెచ్చని కౌగిలి అయ్యవారికి సిరులనగరు (అంతఃపురం) ఆదిదంపతులైన వారిరువురి తమకాలు లోకకళ్యాణాలు!

ఆమని=వసంతకాలం;
తెలికన్నులు=తెల్లని కన్నులు ;
కప్రపునెరిబాగాలు=కర్పూర తాంబూలం ;
మొలక నవ్వు=చిరునవ్వు ;
తమకము=మోహము

88.AragiMchi KurchunnaDallavaDe - ఆరగించి కూర్చున్నాడల్లవాడె




ఆరగించి కూర్చున్నాడల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు

ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీనల్ల వాడె
చెందిన మాణికముల శేషుని పడెగె మీది
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్ల వాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు

పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము
అండనే పూజ గొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు


aaragiMchi koorchunnaaDallavaaDe
chaeruvanae chooDare lakshmeenaarasiMhuDu

iMdiranu toDameeda niDukoni koluvichchee
aMdapu navvulu challeenalla vaaDe
cheMdina maaNikamula Saeshuni paDege meedi
cheMdi varaalichchee lakshmeenaarasiMhuDu

baMgaaru maeDalOna pachchala gaddiyala meeda
aMganala aaTa choochi nalla vaaDe
raMgagu sommula tODa raajasapu vibhavaala
cheMgaTa nunnaaDu lakshmee naarasiMhuDu

peMDepu paadamu chaachi penachi oka paadamu
aMDanae pooja gonee nallavaaDe
koMDala SreevaeMkaTaadri kOri ahObalamuna
meMDugaanu merasee lakshmeenaarasiMhuDu


87.Govinda Shrita Gokula Brunda -


గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద

జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ
గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ

జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడ తురంగా కారోత్తుంగా శరధి భంగా ఫణిశయనాంగా
కరుణాపాంగా కమల సంగా వర శ్రీ వేంకట గిరిపతి రంగా

gOviMdaaSrita gOkula bRMdaa paavana jayajaya paramaanaMda jagadabhiraama sahasranaama suguNadhaama saMstutanaama gaganaSyaama ghanaripu bheema agaNita raghuvaMSaaMbudhi sOma jananuta charaNaa SaraNyu SaraNaa danuja haraNa lalita svaraNaa anagha charaNaayata bhoobharaNaa dinakara sannibha divyaabharaNaa garuDa turaMgaa kaarOttuMgaa Saradhi bhaMgaa phaNiSayanaaMgaa karuNaapaaMgaa kamala saMgaa vara Sree vaeMkaTa giripati raMgaa

86.Inni Rasula Yuniki - ఇన్ని రాసుల యునికి



ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి 
కన్నె నీరాశికూటమి గలిగిన రాశి 

కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి 
మెలయు మీనాక్షికిని మీనరాశి 
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి 
చెలగు హరిమధ్యకును సింహరాశి 

చిన్ని మకరాంకపు బయ్యెద చేడెకు మకరరాశి 
కన్నెపాయపు సతికి కన్నెరాశి 
వన్నెమై పైడిఁదులతూగువనితకుఁ దులారాశి 
తి
న్ననివాడి గోళ్ళసతికి వృశ్చికరాశి 

ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి 
గామిడి గుట్టుమాటల సతి కర్కాటక రాశి 
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి 
ప్రేమ వేంకటపతిఁ గలసె  ప్రియమిధున రాశి

inni raasulayuniki yiMti cheluvapuraaSi 
kanne neeraaSikooTami galigina raaSi 

kaliki bomaviMDlugala kaaMtakunu dhanuraaSi 
melayu meenaakshikini meenaraaSi 
kuluku kuchakuMbhamula kommakunu kuMbharaaSi 
chelagu harimadhyakunu siMharaaSi 

chinni makaraaMkapu bayyeda chaeDeku makararaaSi 
kannepaayapu satiki kanneraaSi 
vannemai paiDi@Mdulatooguvanitaku@M dulaaraaSi 
ti
nnanivaaDi gOLLasatiki vRSchikaraaSi 

aamukoni norapula merayu nativaku vRshabharaaSi 
gaamiDi guTTumaaTala sati karkaaTaka raaSi 
kOmalapu chigurumOvi kOmaliki maesharaaSi 
praema vaeMkaTapati@M galase  priyamidhuna raaSi

Explanation by Dr.Pappu Venugopalarao & sung by Sri G.Balakrishnaprasad

Saturday, November 25, 2006

85.KolaniDopariki Gobbillo - కొలని దోపరికి గొబ్బిళ్ళో



Ragam : yadukulakambhoji, composer : Nedunuri Krishnamurty

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

kolani dOpariki gobbiLLO yadu kula svaamikini gobbiLLO koMDa goDugugaa gOvula gaachina koMDoka SiSuvunaku gobbiLLO daMDagaMpu daityula kellanu tala guMDu gaMDaniki gobbiLLO paapa vidhula SiSupaaluni tiTTula kOpagaanikini gobbiLLO yaepuna kaMsuni yiDumala beTTina gOpa baaluniki gobbiLLO daMDi vairulanu tarimina danujula guMDe digulunaku gobbiLLO veMDipaiDi yagu vaeMkaTa giripai koMDalayyakunu gobbiLLO

Thursday, November 23, 2006

84.Alara Chamchalamaina - అలర చంచలమైన



Audio link :G.BalaKrishnaPrasad
Audio link :
Archive link :
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల

alara chaMchalamaina aatmalaMduMDa nee yalavaaTu chaese neevuyyaala
palumaaru nuChChvaasa pavanamaMduMDa nee bhaavaMbu delipe nee vuyyaala

udaayaasta SailaMbu lonara kaMbhamulaina buDumaMDalamu mOche nuyyaala
adana aakaaSapadamu aDDaudoolaMbaina akhilaMbu niMDe nee buyyaala

padilamuga vaedamulu baMgaaru chaerulai paTTiverapai tOchenuyyaala
vadalakiTu dharmadaevata peeThamai migula varNiMpa narudaaye vuyyaala

maelu kaTlayi meeku maeghamaNNalamella merugunaku merugaaye vuyyaala
neelaSailamu vaMTi nee maeni kaaMtiki nijamaina toDavaaye vuyyaala

paaliMDlu kadalagaa payyadalu raapaaDa bhaaminulu vaDinoochu vuyyaala
vOli brahmaaNDamulu vorugunO yani bheeti noyya noyyanairi voochiruyyaala

kamalakunu bhoosatiki kadalu kadalaku mimmu kaugaliMpaga jaese nuyyaala
amaraaMganalaku nee haasa bhaava vilaasa maMdaMda choope nee vuyyaala

kamalaasanaadulaku kannulaku paMDugai gaNutiMpa narudaaye vuyyaala
kamaneeya moorti vaeMkaTaSailapati neeku kaDuvaeDukai vuMDe vuyyaala


వివరణ
=====
ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తు ంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే।


సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।


ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।


మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।


స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)


ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।


బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।


priya sisters

83.BaMDi Virichi - బండి విరిచి





బండి విరిచి పిన్న పాపలతో నాడి
దుండగీడు వచ్చె దోబూచి

పెరుగు వెన్నలు బ్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నాదన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి

పడచు గుబ్బెత పరపుపై పోక
ముడి గొంగు నిద్రముంపునను
పడియు దావద్ద బవళించినట్టి
తోడుకు దొంగ వచ్చె దోబూచి

గొల్లెపల్లెలో యిల్లిల్లు చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

82.Vadalavadalavemta Vadevo - వాడవాడల వెంట


Audio link :Yesudas
Audio link :Shobhaaraju
Archive link :
Meaning of this kriti by IV Sitapati garu, Telugubhakti.com

వాడవాడల వెంట వాడివో వాడివో

నీడనుండి చీరలమ్మే నేతబేహారి

పంచభూతములనెడి పలువన్నెనూలు
చంచలపుగంజి వోసి/తోడ చరినేసి
కొంచెపు కండెల నూలిగుణముల నేసి
మంచి మంచి చీరలమ్మే మారుబేహారి

మటమాయముల దనమగువ పసిడినీరు
చిటిపొటియలుకల జిలికించగా
కుటిలంపుజేతలు కుచ్చులుగా గట్టి
పటవాళి చీరలమ్మే బలుబేహారి

మచ్చిక కర్మమనేటి/జీవులపెద్ద మైల సంతలలోన
వెచ్చపు కర్మధనము విలువచేసి
పచ్చడాలుగాగుట్టి బలువేంకటపతి
ఇచ్చకొలదుల నమ్మేయింటిబేహారి

vaaDavaaDala veMTa vaaDivO vaaDivO
neeDanuMDi cheeralammae naetabaehaari

paMchabhootamulaneDi paluvannenoolu
chaMchalapugaMji vOsi/tODa charinaesi
koMchepu kaMDela nooliguNamula naesi
maMchi maMchi cheeralammae maarubaehaari

maTamaayamula danamaguva pasiDineeru
chiTipoTiyalukala jilikiMchagaa
kuTilaMpujaetalu kuchchulugaa gaTTi
paTavaaLi cheeralammae balubaehaari

machchika karmamanaeTi/jeevulapedda maila saMtalalOna
vechchapu karmadhanamu viluvachaesi
pachchaDaalugaaguTTi baluvaeMkaTapati
ichchakoladula nammaeyiMTibaehaari

81.Vedukomdama - వేడుకొందామా



వేడుకొందామా వేంకటగిరి వేంకటేస్వరుని

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు
గొడ్డ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు
అలమేల్మంగా శ్రీవేంకటాద్రినాథుడే


vaeDukoMdaamaa vaeMkaTagiri vaeMkaTaesvaruni

aamaTi mrokkula vaaDe aadidaevuDae vaaDu
tOmani paLyaalavaaDe durita dooruDae

vaDDikaasula vaaDe vanajanaabhuDae puTTu
goDDraaMDraku biDDalichchae gOviMduDae

elimi gOrina varaalichchae daevuDae vaaDu
alamaelmaMgaa SreevaeMkaTaadrinaathuDae

Wednesday, November 22, 2006

80.Namda Namdana Venu naada vinoda - నంద నందన వేణునాద


Audio link : Purnachandra
Archive link :
నందనందన వేణునాద వినోదము కుంద కుంద దంతహాస గోవర్థన ధరా

రామ రామ గోవింద రవిచంద్ర లోచన కామ కామ కలుష వికార విదూరా
ధామ ధామ విభవత్ప్రతాప రూప దనుజని ర్ధూమ ధామ కరుణ చతుర భవభంజనా

కమల కమలవాస కమలా రమణ దేవో త్తమ తమోగుణ సతత విదూర
ప్రమదత్ప్రమదానుభవ భావకరణ సుముఖ సుధానంద శుభరంజనా

పరమ పరాత్పర పరమేశ్వరా వరద వరదామల వాసుదేవ
చిర చిర ఘననగ శ్రీవేంకటేశ్వర నరహరి నామ పన్నగ శయనా

naMdanaMdana vaeNunaada vinOdamu kuMda kuMda daMtahaasa gOvarthana dharaa

raama raama gOviMda ravichaMdra lOchana kaama kaama kalusha vikaara vidooraa
dhaama dhaama vibhavatprataapa roopa danujani rdhooma dhaama karuNa chatura bhavabhaMjanaa

kamala kamalavaasa kamalaa ramaNa daevO ttama tamOguNa satata vidoora
pramadatpramadaanubhava bhaavakaraNa sumukha sudhaanaMda SubharaMjanaa

parama paraatpara paramaeSvaraa varada varadaamala vaasudaeva
chira chira ghananaga SreevaeMkaTaeSvara narahari naama pannaga Sayanaa

79.KaTTeduraa VaikunTamu - కట్టెదుర వైకుంఠము


Audio link : Priyasisters
Archive link :
Ragam : himdolam, composer : Vedavyasa anandabhattar

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులేయేరులైనది
కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ

వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

kaTTedura vaikuMThamu kaaNaachayina koMDa
teTTalaaya mahimalae tirumala koMDa

vaedamulae Silalai velasinadi koMDa
yaedesa buNyaraasulaeyaerulainadi
koMDakaadili brahmaadilOkamulakonala koMDa
SreedaevuduMDaeTi Saeshaadri koMDa

sarvadaevatalu mRgajaatulai chariMchaekoMDa
nirvahiMchi jaladhulae niTTacharulaina koMDa
vurvidapasulae taruvulai nilachina koMDa
poorvaTaMjanaadri yee poDavaaTi koMDa

varamulu koTaarugaa vakkaaNiMchi peMchaekoMDa
parugu lakshmeekaaMtusObanapu goMDa
kurisi saMpadalella guhala niMDina koMDa
virivaina dadivO SreevaeMkaTapu goMDa

priya sisters

78.Aalinchu (Alinchu) Palinchu - ఆలించు పాలించు


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥

గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥

జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకోటేనె
చనవి మనవి శరణుజొచ్చితిమి॥

లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥

77.Rara Chinnanna - రారా చిన్నన్నా



ragam : janjhooti
Archive Page
రారా చిన్నన్నా రారా చిన్నన్నా
రారోరి చిన్నవాడ రారా ముద్దులాడ
రారోరి బాలకృష్ణ రారా , కృష్ణ రారా

రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ

కిందిచూపుల గిలిగించి ఆలమందగొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్ల ఊరవిందవైనయట్టి వేడుక కాడ

కొదలు మాటలనె గొణకుచు భూమి సుదతుల శిగ్గులుచూరాడి
చిదుకు చేష్టలనె చెణకుచూ ముద్దు పెదవిచవులు చూపిన జాణకాడ

కలికితనమునె కరగించి కాచి చెలులకాగిటనె చెలగి
లలనామణి యైన లక్కిమమ్మ గలసుక శ్రీవేంకటనాథు డైనవాడ
(Tappulu undavachchu, vintu type chesinadi)


rArA cinnanna. rAgA: cenjuruTi. Adi tALA.
P: rArA cinnanna rArOri cinnavADa rArA muddu lADa rArOri bAlakrSNa rArA (krSNa rArA)

C
1: kindi cUpula giligilinci Alamanda golletala mariginci sandadi valapinci javarAla Ura
vindavainayaTTi vEDuka kAdA rArA

2: podalu mATalane goNagucu bhUmi sudatula cikkulu cUrADi
ciduku cetalalane ceNakucu muddu pedda vicavulu cUpina jaNakadA rArA

3: kaliki tanamunane karaginci kATSi celula kagiTanE celagi
lalanA maNiyaina lakki mamma galasuka shrI vEnkaTa nAthuDaina vADa

---------------------------------------------------------------------------------
ragam : janjhooti
Audio link : (MS)

Publish Post
Video : MS Subbalakshmi

Chakravarthy Sisters


meaning from sangeetasudha 

rArA chinnanna - jhunjhuTi

PrArA chinnanna rArOri chinnavADA
rArA muddulADa rArOri bAlakrishNa ||
Oh little Krishna, Oh BalakrishNa, come near, I want to fondle you.
C 1kindi choopula giliginchi Alamanda golletala mariginchi
sandaDi valapinchi javarAnDla vooravinda vainaTTi vEDukagADa ||
You tickle us with your mischivous looks. You allure Gopikas. We love your amusing acts. You are the most fascinating boy.
C 2koDalu mATalane goraguchu bhumi sudatulu siggulu choorADi
chiDugu chEtalane chenakuchu muddu pedavi chavulu choopina jANakADA ||
Your words are sweet. You stole the clothes of bathing Gopikas. You brandish a stick teasing us. You smartly steal our kisses.
C 3kalikitanamunane karaginchi kAche chelula kAgiTane chelagi
lalanAmaNiyaina lakimamma kalasuka Sri vEnkaTanAdhuDainavADA ||
Beautiful Gopikas forget themselves in your embrace. Lakshmi the gem among women joins Lord Venkatesa in all sple

Monday, November 20, 2006

76.Nela Minnu Okkataina Ni Bantu - నేల మిన్ను నొక్కటైన నీ బంటు



Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
నేల మిన్ను నొక్కటైన నీ బంటు వొక్క

వేలనే యక్షుని దెగవేసెగా నీ బంటు


ఉంగరమెగరవేసి యుదధిలో బడకుండ

నింగికి జెయిజాచి నీబంటు

చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద

కుంగదొక్కి పదముల గుమ్మెగా నీ బంటు


వెట్టాగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె

నిట్టతాడువంటివాడు నీ బంటు

దిట్టయై మందులకొండ తేజమున నడురేయి

పట్టపగలు దెచ్చె బాపురేనీబంటు



అలరనన్నియు జేసి అజునిపట్టానకు

నిలుచున్నాడదివోనీబంటు

బలువేంకటేశ ఈ పవననందనుడు

కలిగిలోకములెల్ల గాచెగా నీబంటు



naela minnu nokkaTaina nee baMTu vokka

vaelanae yakshuni degavaesegaa nee baMTu


uMgaramegaravaesi yudadhilO baDakuMDa

niMgiki jeyijaachi neebaMTu

chaMguna jaladhidaaTi jaMbumaali nilameeda

kuMgadokki padamula gummegaa nee baMTu


veTTaagaa raavaNu rommuviruga jaetanae gudde

niTTataaDuvaMTivaaDu nee baMTu

diTTayai maMdulakoMDa taejamuna naDuraeyi

paTTapagalu dechche baapuraeneebaMTu


alarananniyu jaesi ajunipaTTaanaku

niluchunnaaDadivOneebaMTu

baluvaeMkaTaeSa ee pavananaMdanuDu

kaligilOkamulella gaachegaa neebaMTu


75.Chandamama Ravo - చందమామ రావో


Audio link : G.BalaKrishnaPrasad
Audio link : 
Archive link :

Raga : Chakravakam, composer : G.Balakrishnaprasad
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥

నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥

సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

Friday, November 17, 2006

74.Ennadu ViJnanamika Naku - ఎన్నడు విజ్ఞానమిక నాకు


Audio link : G.BalaKrishnaPrasad
Audio link : 
Archive link :
Raga : Sivaranjani , Composer : G.Balakrishnaprasad
ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా

బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు

కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు
తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు

ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు

ennaDu vij~naanamikanaaku vinnapamide Sree vaeMkaTanaathaa

baasina baayavu bhavabaMdhamulu aasa ee daehamunnannaaLLu
kOsina tolagavu kOrikalu gaasili chittamu kaliginannaaLLu

kochchina korayavu kOpamulu gachchula guNamulu galiginannaaLLu
tachchina tagalavu tahatahalu rachchalu vishayapu ratulannaaLLu

okaTikokaTikini oDabaDavu akaTa SreevaeMkaTaadhipuDaa
sakalamu neevae saraNaMTae ika vikaTamu laNagenu vaeDuka naaLLu



vivarana by Sri GB Sankararao, sujanaranjani
తత్త్వకీర్తన్! విషయవాంఛలతో, భౌతిక దేహపు వాసనల్తో సతమతమవుతున్న జీవుడి వేదన్ ఇది! ఓ శ్రీ వేంకటేశ్వరా! నాకు ఎప్పుడు జ్ఞానం గలుగుతుంది స్వామీ! నన్ను అంటిపెట్టుకున్న ఈ మమకార, అనురాగాల వల్ల భౌతిక బంధాలు వీడుట లేదు! చిత్తభ్రాంతి ఉన్నన్నాళ్ళు కోరికలు తొలగటం లేదు! ఓ స్వామీ! ఏమిటీ విపరీతం, పోలికలేని విరుద్ధ భావాలు అంటూ జీవుడి దైన్యస్థితిని తెలియజేసిన అన్నమయ్య సంకీర్తనాంతంలో విరుగుడు కూడ తెలియజేసాడు.

ఇటువంటి విరుద్ధ భావాల మధ్య ఎటువంటి పరిస్థితులలోనైనా నీవే శరణంటే కష్టాలు తీరతాయి! శ్రీ వేంకటేశ్వరుణ్ణి శరణు కోరటమే ఈ భవరోగానికి మందు! అప్పుడు ఈ వవికటాలన్నీ అణగి వేడుక (ఉత్సాహం-నందసిద్ధి) కలుగుతుంది.

గాసిలి = బాధ;
వికటము = వంకర్లు (నష్టాలు)
పాసిన పాయవు = విడిపించుకుందామన్న విడువవు;

73.Chi Chi NaruladeTi Jeevanamu - ఛీ ఛీ నరులదేటి జీవనము


Audio link : Purnachandra
Audio link :MangalampalliBalaMuraliKrishna
Archive link :
ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక

అడావిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియైవుండవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా

పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చ్చునా

యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా

72.Chatedanidiye Satyamu sumdo - చాటెద నిదియే సత్యము సుండో


Audio link :G.BalaKrishnaPrasad
Audio link : MangalampalliBalaMuraliKrishna
Archive link :
చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేవించినను

హరినొల్లనివారసురలు సుండో
సుర లీతనిదాసులు సుండో
పరమాత్ముడితడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదికను
చాటె
వేదరక్షుకుడు విష్ణుడు సుండో
సోదించె శుకు డచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాతడు సుండో
యేదెస వెదకిన నితడే ఘనుడు
చాటె
యిహపర మొసగను యీతడె సుండో
వహి నుతించె బార్వతి సుండో
రహస్య మిదివో రహి శ్రీవేంకట
మహిధరంబున మునికై నిలిచె చాటె

Wednesday, November 15, 2006

71.PuttuBhogulamu - పుట్టుభోగులము మేము


Audio link : SP BalaSubrahmanyam
Archive link :
పుట్టుభోగులము మేము భువి హరి దాసులము
నట్టనడిమి దొరలు నాకీయవలెనా? ॥౩॥

పల్లకీలు అందలాలు, పడివాగే తేదీలూ
పెళ్ళి విరి మహాలక్ష్మీవిలాసములు
తల్లిఆకే మగని దైవమని కొలిచేము
ఒల్లగె మాకే సిరులు ఒరులీయవలెనా? పుట్టు॥

గ్రామములు, రత్నములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు అంగభేధాలు
భామిని ఆకే మగనిని ప్రాణధారి లెంకలము
ఓమిమతడే ఇచ్చె ఒరులీయవలెనా పుట్టు॥

పసగల పదవులు బ్రహ్మానిర్మితములు
వెసబ్రహ్మ తండ్రి శ్రీవేంకటేశుడు
వెసగి ఆతడే మమ్ము ఏలీఇన్నియునిచ్చె
ఒసగిన మా సొమ్ములు ఒరులీయవలెనా పుట్టు॥

70.EDavalapEDa Machchika - ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు



ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా

తొలుకారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట నవి నిలిచీనా
పొలతులవలపులు పొలసిపోవుగాక కలకాలం బవి కడతేరీనా

యెండమావులు చూడనేరులైపారుగాక అండకుబోవ దాహ మణగీనా
నిండినట్టిమోహము నెలతలమది జూడ వుండినట్టేవుండుగాక పూతయ్యీనా

కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక మెలకువ జూడ నవి మెరసీనా
అలివేణులమేలు ఆసపాటేకాక తలపు వేంకటపతి దగిలీనా


aeDa valapaeDa machchikaeDa suddulu aaDukonna maaTalella navi nijaalaa

tolukaaru merupulu tOchipOvugaaka nelakoni miMTa navi nilicheenaa
polatulavalapulu polasipOvugaaka kalakaalaM bavi kaDataereenaa

yeMDamaavulu chooDanaerulaipaarugaaka aMDakubOva daaha maNageenaa
niMDinaTTimOhamu nelatalamadi jooDa vuMDinaTTaevuMDugaaka pootayyeenaa

kalalOni sirulella kanukoorkulaekaaka melakuva jooDa navi meraseenaa
alivaeNulamaelu aasapaaTaekaaka talapu vaeMkaTapati dagileenaa

69.Rave Kodala RaTTaDi kODala - రావే కోడల రట్టడి కోడల


Audio link : KondaveetiJyothirmayi
Audio link :
Archive link :
రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును

రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు కోసరు లేని కోడల
పంకజ ముఖినీవు పలుదొడ్ల వారిండ్ల అంకెల దిరిగేవు అత్త య్యా

ఈడాద నలుగురు నేగురు మొగలతో కూడి సిగ్గులేని కోడల
వాడక బదుగురి వలపించు కొని నీవు ఆడాదదిరి గేవు అత్త య్యా

బొడ్డున బుట్టిన పూపనికేనిన్ను గొడ్డేరు తెస్తి నే కోడల
గుడ్డము పయినున్న కోనేటి రాయని నడ్డగించు కుంటి నత్త య్యా

rAvE kODala raTTaDi kODala pOvE pOvE atta yya poMdulu neetO chAlunu

raMkelu vaeyuchu rAjuleduTa nIvu koMku kOsaru lEni kODala
paMkaja mukhinIvu paludoDla vAriMDla aMkela dirigaevu attayyA

IDAda naluguru nEguru mogalatO kUDi siggulEni kODala
vADaka baduguri valapiMchu koni neevu ADAdadiri gEvu atta yyaa

boDDuna buTTina pUpanikEninnu goDDEru testi nE kODala
guDDamu payinunna kOnETi rAyani naDDagiMchu kuMTi natta yyA

Friday, November 10, 2006

68.Uyyala balunuchedaru - ఉయ్యాలా బాలునూచెదరు


Audio link : P.Suseela
Archive link :

ఉయ్యాలా బాలునూచెదరు
కడునొయ్య నొయ్య నొయ్యనుచు

బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరులాలి
లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు


GB Shankar rao gari vivarana , (from sujanaranjani)

బాలకృష్ణుని ఉయ్యాల పాట యిది! గోపకాంతలు లీలామానుష రూపుడైన బాలకృష్ణుని ఉయ్యాలలో పడుకోబెట్టి లాలి, లాలి, లాలెమ్మ అను సొగసైన పదాల లాలిపాటతో కృష్ణుని పరవశింపజేస్తున్నారట. ఆ జవరాండ్లు ఉయ్యాలకు ఇరువైపులా ఉండి ఊపుతున్న సమయంలో వారి నోటినుండి నొయ్యనొయ్యనొయ్య అనే ధ్వని లయబద్ధంగా వెలువడి ఆహ్లాదకర శబ్దాలు ధిమ్మి ధిమ్మి ధిమ్మనగా వేంకటాద్రి కృష్ణుని అందెల రవళులు ఘల్లు ఘల్లని మారుమ్రోగాయట! ఈ పాటలో అన్నమయ్య స్వామివారి ఉయ్యాల క్రీడను అద్భుతంగా ఆవిష్కరించారు.
కనుదమ్ములు = రెండుకళ్ళు;
బల్లిదుడు = బలవంతుడు ;
పమ్ము = వ్యాపించిన;
తమ్మిరేకు = నల్లకలువపూల రేకులు;
కొమ్మలు = స్త్రీలు;
జవరాండ్లు = యవ్వనవతులు
బాలయవ్వనలు = తొలిప్రాయపు జవ్వనలు;
గునుకు = కొద్దిగా పరుగెత్తునట్లు నడచుట (బ్రౌణ్యం);
చల్లుచూపుల జవరాండ్లు = చూపులను చల్లే వయసుగత్తెలు

67.Podagantimayya - పొడగంటిమయ్య


Audio link : G.BalaKrishnaPrasad
Archive link :

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము (రాగం - అట్టతాళం)

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

poDagaMTimayya mimmu purushOttamaa mammu
neDayakavayya kOnaeTi raayaDaa

kOrimammu naelinaTTi kuladaivamaa, chaala
naerichi peddalichchina nidhaanamaa
gaaraviMchi dappideerchu kaalamaeghamaa, maaku
chaeruvajittamulOni SreenivaasuDaa

bhaaviMpa gaivasamaina paarijaatamaa, mammu
chaevadaera gaachinaTTi chiMtaamaNee
kaaviMchi kOrikalichchae kaamadhaenuvaa, mammu
taavai rakshiMchaeTi dharaNeedharaa

cheDaneeka bratikiMchae siddhamaMtramaa, rOgaa
laDachi rakshiMchae divyaushadhamaa
baDibaayaka tirigae praaNabaMdhuDaa, mammu
gaDiyiMchinaTTi Sree vaeMkaTanaathuDaa