Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, September 25, 2006

8.Tiruvidhula merasi - తిరువీధుల మెరసీ



Audio link : BKP
తిరువీధుల మెరసీ దేవదేవుడు - గరిమల మించిన సింగారములతోడను
.....
తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు - సిరుల రెండవనాడు శేషుని మీద
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద - పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను
........
గ్రక్కుననైదవనాడు గరుడునిమీద - యెక్కెనునారవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను - యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు
.......
కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు - పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో - వనితల నడుమను వాయనాలమీదను....
in english:
pa|| tiruvIdhula merasI dEvadEvuDu | garimala miMcina siMgAramulatODanu ||
ca|| tirudaMDalapai nEgI dEvuDide tolunADu | sirula reMDavanADu SEShuni mIda |
muripAla mUDavanADu mutyAla paMdirikriMda | porinAlugavanADu puvvu gOvilalOnu ||
ca|| grakkuna naidavanADu garuDunimIda | yekkenu nAravanADu yEnugumIda |
cokkamai yEDavanADu sUryapraBalOnanu | yikkuva dErunu gurramenimidavanADu ||
ca|| kanakapuTaMdalamu kadisi tommidavanADu | penaci padOnADu peMDlipITa |
yenasi SrIvEMkaTESu DiMti yalamElmaMgatO | vanitala naDumanu vAhanAlamIdanu ||

listen to this song:

1 comment:

Anonymous said...

శ్రవణ్, మీ comments కి కృతజ్ఞతలు. మీ బ్లాగు చాల బావుంది. మీరు అన్నట్టే "తిరువీధుల"..." లొ 10 వహనాల వర్ణన చాల చక్క గా ఉంది. "డోలాయాంచల..." లో దశావతారాల గురించి నేనూ ఒక blog post చేద్దాం అనుకుంటున్నా.
"హరి రసమా విహారి" కీర్తన కి నాకు తెలిసిన ఒకే ఒక్క మంచి version ఇది -
http://www.musicindiaonline.com/p/x/aqC2PdY9Rt.As1NMvHdW/

ఈ కీర్తన మరొక బాలమురళీకృష్ణ album లొ కూడా ఉంటుంది కాని ఇదే అద్భుతమైన version.